1
హిజ్కియాH2396 వినిH8085 తన బట్టలుH899 చింపుకొనిH7167 గోనెపట్టH8242 కట్టుకొనిH3680 యెహోవాH3068 మందిరమునకుH1004 పోయిH935
2
గృహH1004నిర్వాహకుడగుH5921 ఎల్యాకీమునుH471, శాస్త్రిH5608 షెబ్నానుH7644, యాజకులలోH3548 పెద్దలనుH2205, ఆమోజుH531 కుమారుడునుH1121 ప్రవక్తయునైనH5030 యెషయాH3470యొద్దకుH413 పంపెనుH7971.
3
వీరు గోనెపట్ట కట్టుకొని అతనియొద్దకుH413 వచ్చి అతనితో ఇట్లనిరిH559 హిజ్కియాH2396 సెలవిచ్చునదేమనగాH559 ఈH2088 దినముH3117 శ్రమయుH6869 శిక్షయుH8433 దూషణయుH5007 గల దినముH3117;పిల్లలుH1121 పుట్టH4866వచ్చిరిH935 గాని కనుటకుH3205 శక్తిH3581 చాలదుH369.
4
జీవముగలH2416 దేవునిH430 దూషించుటకైH2778 అష్షూరుH804 రాజైనH4428 తన యజమానునిచేతH113 పంపబడినH7971 రబ్షాకేH7262 పలికిన మాటH1697లన్నియుH3605 నీ దేవుడైనH430 యెహోవాH3068 ఒకవేళ ఆలకించిH8085, నీ దేవుడైనH430 యెహోవాకుH3068 వినబడియున్నH8085 ఆ మాటలనుబట్టిH1697 ఆయన అష్షూరురాజును గద్దించునేమో కాబట్టి నిలిచినH4672 శేషముకొరకుH7611 నీవు హెచ్చుగాH5375 ప్రార్థనH8605 చేయుము.
5
రాజైనH4428 హిజ్కియాH2396 సేవకులుH5650 యెషయాH3470యొద్దకుH413 రాగాH935
6
యెషయాH3470 వారితో ఇట్లనెనుH559 మీ యజమానునికిH113 ఈ మాట తెలియజేయుడిH559 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 అష్షూరుH804రాజుH4428 పనివారుH5288 నన్ను దూషింపగాH1442 నీవు వినినH8085 మాటలకుH1697 భయపడH3372వద్దుH408.
7
అతనిలో ఒక యాత్మనుH7307 నేను పుట్టింతునుH5414, అతడు వదంతిH8052 వినిH8085 తన దేశమునకుH776 వెళ్ళి పోవునుH7725; తన దేశమందుH776 కత్తిచేతH2719 అతని కూలచేయుదునుH5307.
7
అతనిలో ఒక యాత్మనుH7307 నేను పుట్టింతునుH5414, అతడు వదంతిH8052 వినిH8085 తన దేశమునకుH776 వెళ్ళి పోవునుH7725; తన దేశమందుH776 కత్తిచేతH2719 అతని కూలచేయుదునుH5307.
8
అష్షూరుH804రాజుH4428 లాకీషుH3923 పట్టణమును విడిచిH5265 వెళ్లి లిబ్నాH3841 మీదH5921 యుద్ధముH3898 చేయుచుండగా రబ్షాకేH7262 పోయిH7725 అతని కలిసికొనెనుH4672.
9
అంతట కూషుH3568రాజైనH4428 తిర్హాకాH8640 తనమీదH854 యుద్ధముH3898 చేయుటకు వచ్చెననిH3318 అష్షూరు రాజునకు వినబడినప్పుడుH8085, అతడు ఇంకొకసారిH7725 హిజ్కియాH2396యొద్దకుH413 దూతలనుH4397 పంపిH7971 యీలాగు ఆజ్ఞH559 ఇచ్చెను.
10
యూదాH3063రాజగుH4428 హిజ్కియాతోH2396 ఈలాగుH3541 చెప్పుడిH559 యెరూషలేముH3389 అష్షూరుH804రాజుH4428చేతికిH3027 అప్పగింపH5414బడదనిH3808 చెప్పి నీవుH859 నమ్ముకొనిH982 యున్న నీ దేవునిచేతH430 మోసH5377పోకుముH408.
11
ఇదిగోH2009 అష్షూరుH804 రాజులుH4428 సకలH3605 దేశములనుH776 బొత్తిగా నశింపజేసినH2763 సంగతి నీకు వినబడినదిH8085 గదా నీవుమాత్రముH859 తప్పించుకొందువాH5337?
12
నా పితరులు నిర్మూలముచేసిన గోజానువారు గాని హారాను వారు గాని, రెజెపులు గాని, తెలశ్శారులో నుండిన ఏదె నీయులు గాని తమ దేవతల సహాయమువలన తప్పించు కొనిరా?
13
హమాతు రాజు ఏమాయెను? అర్పాదురాజును సెపర్వియీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి?
14
హిజ్కియా దూతలచేతిలోనుండి ఆ ఉత్తరము తీసికొని చదివి, యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి
15
యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెనుయెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యా కాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోక మందున్న సకల రాజ్యములకు దేవుడవైయున్నావు.
16
యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము; యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము; జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపినవాని మాటలను చెవిని బెట్టుము.
17
యెహోవా, అష్షూరురాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి
18
వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి.
19
యెహోవా మా దేవా; లోక మందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడ వైన యెహోవావని తెలిసికొనునట్లుగా అతనిచేతిలోనుండి మమ్మును రక్షించుము.
20
అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెనుఇశ్రాయేలీయుల దేవు డగు యెహోవా సెలవిచ్చు నదేమనగా అష్షూరురాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట చేసిన ప్రార్థననేను అంగీకరించియున్నాను.
21
అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట యేదనగాసీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణచేయుచున్నది; నిన్ను అపహాస్యము చేయు చున్నది; యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచు చున్నది.
22
నీవు ఎవనిని తిరస్కరించితివి? ఎవనిని దూషించితివి? నీవు గర్వించి యెవనిని భయపెట్టితివి?
23
ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినేగదా నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవేగదా.నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకునులెబానోను పార్శ్వములకును ఎక్కియున్నానుఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసి యున్నానువాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికినికర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించి యున్నాను.
24
నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్నిటిని ఎండిపో జేసియున్నాను.
25
నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతనకాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నావలననే సంభవించినది.
26
కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.
27
నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి.
28
నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.
29
మరియు యెషయా చెప్పినదేమనగాహిజ్కియా, నీ కిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము అనుభవించుదురు.
30
యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును.
31
శేషించు వారు యెరూషలేములోనుండి బయలుదేరుదురు;తప్పించు కొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్యముల కధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెర వేర్చును.
32
కాబట్టి అష్షూరు రాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడిదిబ్బ కట్టడు.
33
ఈ పట్టణములోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును; ఇదే యెహోవా వాక్కు.
34
నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.
35
ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష యెనుబది యయిదు వేలమందిని హతముచేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృతకళేబరములై యుండిరి.
36
అష్షూరురాజైన సన్హెరీబు తిరిగి పోయి నీనెవె పట్టణమునకు
37
వచ్చి నివసించిన తరువాతఒఅతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరెజెరును ఖడ్గముతో అతని చంపి అరా రాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి; అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.