రాజునకు వినబడి నప్పుడు
1 సమూయేలు 23:27

ఇట్లుండగా దూత యొకడు సౌలు నొద్దకు వచ్చి -నీవు త్వరగా రమ్ము , ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశములో చొరబడియున్నారని చెప్పగా

యెషయా 37:9

అంతట కూషు రాజైన తిర్హాకా తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియా యొద్దకు దూతలను పంపి యీలాగు ఆజ్ఞ ఇచ్చెను.

పంపి
2 రాజులు 18:17

అంతట అష్షూరు రాజు తర్తానును రబ్సారీసును రబ్షాకేను లాకీషు పట్టణమునుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియామీదికి బహు గొప్ప సమూహముతో పంపెను . వారు యెరూషలేముమీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా