లిబ్నా
2 రాజులు 8:22

అయితే నేటి వరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదా వారికి లోబడకయే యున్నారు. మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరుగబడెను .

యెహొషువ 10:29

యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును మక్కేదానుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధముచేసిరి.

యెహొషువ 12:15

అదుల్లాము రాజు, మక్కేదా రాజు,

యెహొషువ 15:42

లిబ్నా ఎతెరు ఆషాను యిప్తా అష్నా నెసీబు

లాకీషు
2 రాజులు 18:14

యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజు నొద్దకు దూతలను పంపి నావలన తప్పు వచ్చినది;నాయొద్దనుండి తిరిగి నీవు వెళ్లిపోయినయెడల నామీద నీవు మోపినదానిని నేను భరించుదునని వర్తమానముచేయగా, అష్షూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు ఆరు వందల మణుగుల వెండియు అరువది మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను .

యెహొషువ 12:11

లాకీషు రాజు, ఎగ్లోను రాజు,

యెహొషువ 15:39

లాకీషు బొస్కతు ఎగ్లోను

యెషయా 37:8

అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను .

యెషయా 37:9

అంతట కూషు రాజైన తిర్హాకా తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియా యొద్దకు దూతలను పంపి యీలాగు ఆజ్ఞ ఇచ్చెను.

మీకా 1:13

లాకీషు నివాసులారా , రథములకు యుద్ధపు గుఱ్ఱములను కట్టుడి ; ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీయందు కనబడినవి అది సీయోను కుమార్తె పాపమునకు ప్రథమకారణముగా ఉండును.