బైబిల్

  • 2 కొరింథీయులకు అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • మత్తయి
  • మార్కు
  • లూకా
  • యోహాను
  • అపొస్తలుల కార్యములు
  • రోమీయులకు
  • 1 కొరింథీయులకు
  • 2 కొరింథీయులకు
  • గలతీయులకు
  • ఎఫెసీయులకు
  • ఫిలిప్పీయులకు
  • కొలొస్సయులకు
  • 1 థెస్సలొనీకయులకు
  • 2 థెస్సలొనీకయులకు
  • 1 తిమోతికి
  • 2 తిమోతికి
  • తీతుకు
  • ఫిలేమోనుకు
  • హెబ్రీయులకు
  • యాకోబు
  • 1 పేతురు
  • 2 పేతురు
  • 1 యోహాను
  • 2 యోహాను
  • 3 యోహాను
  • యూదా
  • ప్రకటన
Hebrew/Greek Numbers
TSK References
1

కాబట్టి పరిచర్య పొందినందున కరుణింపబడినవారమై అధైర్యపడము.

2

అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము

3

మా సువార్త మరుగుచేయబడిన యెడల నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయబడియున్నది.

4

దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.

5

అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.

6

గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించుకొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.

7

అయినను బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదైయుండునట్లు మంటి ఘటములలో ఐశ్వర్యము మాకు కలదు.

8

ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములోనున్నను కేవలము ఉపాయములేనివారము కాము;

9

తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.

10

యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొనిపోవుచున్నాము.

11

ఏలయనగా, యేసుయొక్క జీవముకూడ మా మర్త్యశరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము.

12

కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి.

13

కృప యెక్కువమంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్తమైనవి మీకొరకై యున్నవి.

14

కాగా విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై,

15

ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మునుకూడ లేపి, మీతోకూడ తన యెదుట నిలువబెట్టునని యెరిగి,మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము.

16

కావున మేము అధైర్యపడము; మా బాహ్యపురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు.

17

మేము దృశ్యమైనవాటిని చూడ అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది.

18

ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.