ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును ఆయన కెరూబులమీద ఆసీనుడై యున్నాడు భూమి కదలును.
2
సీయోనులో యెహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు.
3
భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించె దరు. యెహోవా పరిశుద్ధుడు.
4
యథార్థతనుబట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచియున్నావు యాకోబు సంతతిమధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు.
5
మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి ఆయన పరిశుద్ధుడు.
6
ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి ఆయన నామమునుబట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి కుత్తరమిచ్చెను.
7
మేఘస్తంభములోనుండి ఆయన వారితో మాట లాడెను వారు ఆయన శాసనముల ననుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి
8
యెహోవా మా దేవా, నీవు వారికుత్తరమిచ్చితివి వారిక్రియలను బట్టి ప్రతికారము చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడ వైతివి.
9
మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి.