| ప్రపంచములో ఎక్కువ మంది ప్రజలు క్రైస్తవులు. అయినా క్రిస్టియానిటీ ఇండియాలో మాత్రమే ఉన్న నిమ్న (మాల, మాదిగ) కులాల వారిది అనే అపోహ మన దేశ ప్రజలలో ప్రబలంగా ఉంది. ఇది నిజమా?
మానవజీవిత పరమార్థమును గుర్తుచేస్తూ, ప్రగతిపథంలో నడిపించుటకై రూపొందించబడినవి ఆచారములు. మంచిపద్దతులతో మిళితమైయున్న ఆ ఆచారములను ఆచరణలో పెడుతూ భావితరాలవారికి అందించడమే వాటిని పాటించుటలోని ముఖ్యోద్దేశం.
అంత్య దినాలలో నేనే క్రీస్తునని చెప్పుకునే అనేకమంది అబద్ధ క్రీస్తులు వస్తారని బైబిల్ హెచ్చరించింది .
యేసు వారితో ఇట్లనెను. ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు. (మత్తయి 24:4-5).
క్రైస్తవులమని చెప్పుకునే మనం అప్రమత్థంగా ఉండాలి. మోసగించబడకుండా మనం ఎంతో జాగ్రత్త వహించాలి. నిజమైన క్రీస్తును మాత్రమే నమ్మి, ప్రేమించి, వెంబడించటానికి మనం పిలువబడ్డాము.
ఈ మధ్య కాలంలో నిత్యజీవానికి సంబంధించిన సువార్తను, 'చచ్చిపోయి పరలోకం పోతే చాలు' అనుకునే సువార్తగా హేళన చేసే కొందరు కుహానా సువార్తికులు బయలుదేరారు. ప్రవీణ్ పగడలగారు దినికి నాయకత్వం వహిస్తున్నారు
ఏదైనా ఒక భావజాలాన్ని విమర్శించాలంటే, దానిని ఉన్నది ఉన్నట్టుగా వివరిస్తూ విమర్శించాలన్నది వాదనలపై కనీస అవగాహన ఉన్నవారికి తెలిసిన విషయమే; ఈ విషయంలో సోదరులు ప్రవీణ్ పగడాలగారు పక్కదారి పట్టి వాక్యపునాది అనే తన వెబ్ సైట్ లో వక్రీకరణ పునాది వేసే ప్రయత్నం చేస్తున్నారు.
వాక్యపునాదా, వక్రపునాదా అనే ఈ సిరీస్ యొక్క 3వ భాగంలో, ప్రవీణ్ పగడాలగారి వక్రీకరణబోధను, విషం నిండిన ఆలోచనలను సంఘం ముందు మరోసారి బయటపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నాం.
కాల్వినిజాన్ని దుర్బోధగా చిత్రీకరించి, అందరిచేత దాన్ని ఛీకొట్టించటానికి పగడాలగారు వాక్యాన్ని ఎన్ని విధాలుగా వక్రీకరిస్తున్నారో పాఠకులకు గత మూడు భాగాలలో నిరూపించాం. ఈ క్రమంలోనే కాల్వినిజం దేవునిని పాపానికి కర్తగా చేసే బోధ అని అందరినీ నమ్మించే ప్రయత్నమే ఇతని ఎత్తుగడలలో అత్యంత హాస్యాస్పదమైన ప్రయోగమని చెప్పుకోవచ్చు. కాల్వినిస్టుల వాక్యపరిణతిని ఎదిరించే సత్తా తన వక్ర వ్యాఖ్యానాలకు లేవని తెలుసు కాబోలు, అందుకే పేరెన్నికగల కాల్వినిస్టుల మాటలకయినా కొంత రంగు పులమగలిగితే, అదైనా, కనీసం కొందరి దృష్టినైనా మరల్చదా అని ఈ స్కెచ్ వేసినట్టున్నారు.
కాల్వినిజం పేరుతో పిలవబడుతున్న దేవుని సార్వభౌమత్వాన్ని చాటిచెప్పే వాక్యానుసారమైన బోధపై విషం కక్కేందుకు కొంతకాలంగా అహర్నిశలూ కష్టపడుతున్న ప్రవీణ్ పగడాలగారు, ఆ క్రమంలో భాగంగా వాక్యాలను వక్రీకరించడమే కాకుండా మరొక వాదనను కూడా తెరపైకి తీసుకువచ్చారు.
వాక్యానుసారమైన TULIP సిద్ధాంతాలను తెలుగు క్రైస్తవుల్లో తప్పుగా చిత్రీకరించేందుకు మన ప్రవీణ్ పగడాలగారు మరియు అతని బృందమూ కలసి, వారి హద్దుల్లేని వక్రీకరణ నైజాన్ని వాక్యపునాది అనే వెబ్ సైట్ లో ప్రచురిస్తూ వస్తున్నారని మనకు తెలిసిందే; ఆ వక్రీకరణలలో కొన్ని అంశాలను బహిర్గతం చేస్తూ ఇప్పటికే ఐదుభాగాలను మీ ముందుకు తీసుకుని వచ్చాం. ఈ ఆరవభాగంలో కూడా అదే చేయబోతున్నాం.
ఈమధ్యకాలంలో వాక్యపు అవగాహన లేని కొన్ని గుంపులు బయలుదేరి దేవుని సార్వభౌమత్వాన్ని చాటిచెప్పే బోధ (calvinism) ప్రకారం దేవుడే పాపానికి కర్త ఔతున్నాడని బురదచల్లడం ప్రారంభించారు. అందుకే దేవుణ్ణి పాపానికి కర్తగా చూపిస్తుంది దేవుని సార్వభౌమత్వాన్ని ప్రకటించేవారా లేక మానవ స్వేచ్చా సిద్ధాంతం (Free will) ను ప్రకటించేవారా అనేది వాక్యానుసారంగా వివరిస్తూ ఈ వ్యాసం రాయడం జరిగింది. చదివి సత్యమేంటో మీరే అర్థం చేసుకోండి.
“మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టెదము" (2కొరింథీయులకు 10:5).
ప్రపంచములో అతి ప్రాచీన కాలం నుండి అనగా సుమారు 3000 వేల సంవత్సరాలనుండి వ్యాప్తిలో ఉండి మధ్య ఆసియా, ఈజిప్టు, కొన్ని ఐరోపా దేశాలు మరియు భారత ఉప ఖండాలలో మానవ జీవితాలను ప్రభావితం చేస్తున్న అంశం జ్యోతిష్య శాస్త్రం. దీని పునాది పూర్వం బబులోను సామ్రాజ్యంలో నుండి ఉద్భవించిదంటారు. ఆ తరువాత ఈజిప్టుకు వ్యాపించింది. తరువాత కాలంలో అలెగ్జాండర్ యొక్క ఆక్రమణలో ఆనియా అంతటా వ్యాప్తి చెందింది.....
© 2024. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.