బైబిల్

  • యెషయా అధ్యాయము-25
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1
యెహోవా, నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించె దను నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుస రించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి
2
నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారముగల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండ నీవు చేసితివి అది మరల ఎన్నడును కట్టబడకుండ చేసితివి.
3
భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగుల కుండ నీడగాను ఉంటివి.
4
కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు భీకరజనముల పట్టణస్థులు నీకు భయపడుదురు.
5
ఎండిన దేశములో ఎండ వేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి మేఘచ్ఛాయవలన ఎండ అణచివేయబడునట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును.
6
ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును nమూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.
7
సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును
8
మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగుననియెహోవా సెలవిచ్చియున్నాడు.
9
ఆ దినమున జనులీలాగు నందురు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని యున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.
10
యెహోవా హస్తము ఈ పర్వతముమీద నిలుచును పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడునట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు.
11
ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణచివేయును.
12
మోయాబూ, నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన క్రుంగగొట్టును వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలుచేయును.
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.