విషయసూచిక: 13:1,2, 13:3,4, 13:5 , 13:6,7, 13:8 , 13:9 ,13:10 , 13:11-13 , 13:14-16 , 13:17,18 , 13:19 , 13:20-22.
నిర్గమకాండము 13:1,2 మరియు యెహోవా మోషేతో ఈలాగు సెల విచ్చెను. ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువులయొక్కయు ప్రథమ సంతతి, అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము; అది నాదని చెప్పెను.
ఈ వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయులు తమకు పుట్టిన ప్రథమసంతానాన్ని ఆయనకు ప్రతిష్టించాలని ఆజ్ఞాపించడడం మనం చూస్తాం. వాస్తవానికి "భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే" (కీర్తనలు 24: 1) "అడవి మృగములన్నియు వేయి కొండల మీది పశువులన్నియు" ఆయనవే (కీర్తనలు 50: 10). మరి మరలా ఆయనకు ప్రథమ సంతానాన్ని ఎందుకు ప్రతిష్టించమంటున్నాడంటే ఇది ఐగుప్తులో ఆయన చేసిన తొలిచూలు పిల్లల వధకు జ్ఞాపకంగా జారీ చెయ్యబడుతున్న ఆజ్ఞ.
నిర్గమకాండము 13:14,15 ఇక మీదట నీ కుమా రుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనియ్యకుండ తన మనస్సును కఠినపరచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తుదేశములో తొలి సంతాన మంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగ దైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును; అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలెను.
దేవునికి ప్రతిష్టించడం అంటే దేవుని కొరకు ప్రత్యేకించడం అని అర్థం. ఇలా ప్రతిష్ట చెయ్యబడిన పశువులను యాజకుల వశం చెయ్యాలి, అవి బలులకు ఉపయోగించబడతాయి. ఐతే అపవిత్ర జంతువులను మాత్రం ప్రతిష్టించకుండా దానికి బదులుగా ఒక గొర్రెపిల్లనూ ఐదు తులాల వెండినీ చెల్లించాలి (సంఖ్యాకాండము 18:16, నిర్గమకాండము 13:13). ఎవరైనా అలా చెయ్యలేని పక్షంలో ఆ అపవిత్ర జంతువు వారికి కూడా పనికిరాకుండా దాని మెడను విరగదియ్యాలి (నిర్గమకాండము 13:13). అపవిత్ర జంతువులు పవిత్ర జంతువులు అనే విభజన దేవునికి అర్పించేవి, అర్పించకూడనివి అనే జాబితాను బట్టి జరుగుతుంది. దేవునికి బలిగా అర్పించబడేవి పవిత్ర జంతువులు (గోవులు, గొర్రెలు, మేకలు), అర్పించకూడనివి అపవిత్ర జంతువులు (ఆదికాండము 7:2 వ్యాఖ్యానం చూడండి ).
ఇక ప్రతిష్ట చెయ్యబడిన మనుషుల విషయానికి వస్తే మగపిల్లలను మాత్రమే ప్రతిష్టించాలి, ఎందుకంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల మగపిల్లలను నదిలో పడవేయించి చంపించినదానికి ప్రతీకారంగా ఆయన వారి తొలిచూలు పిల్లలను వధించాడు కాబట్టి వారంతా మగపిల్లలే అయ్యుంటారు. దానికి జ్ఞాపకంగానే ఈ ప్రతిష్ట ఆచారం నియమించబడింది. అందువల్ల మగపిల్లను మాత్రమే ప్రతిష్టించాలి (నిర్గమకాండము 13:12). అలా ప్రతిష్టించబడిన పిల్లలను ఐదు తులాల వెండి ఇచ్చి విడిపించాలి (సంఖ్యాకాండము 18:15,16, నిర్గమకాండము 13:13).
అయితే గమనించండి; ఇది ఇశ్రాయేలీయులకు మాత్రమే చెందిన కట్టడ. క్రైస్తవులమైన మనం దీనిని పాటించకూడదు ఎందుకంటే మనందరమూ దేవునికి ప్రతిష్టించబడినవారమే (రోమా 12:1). దీనిప్రకారం మనమంతా ఆయన సేవకొరకై ఆయన చిత్తానుసారంగా వినియోగించబడాలి తప్ప మన స్వార్థం కోసం కాదు.
నిర్గమకాండము 13:3,4 మోషే ప్రజలతో నిట్లనెను మీరు దాసగృహమైన ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన దినమును జ్ఞాప కము చేసికొనుడి. యెహోవా తన బాహు బలముచేత దానిలోనుండి మిమ్మును బయటికి రప్పించెను; పులిసిన దేదియు తినవద్దు. ఆబీబనునెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరిగదా.
ఈ వచనాలలో మోషే ఇశ్రాయేలీయులకు దేవుడు వారిని ఐగుప్తు నుండి విడిపించిన దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, పులిసినపిండితో చేసిన రొట్టెలను తినకూడదని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే; ఇశ్రాయేలీయులు తమ విడుదలను దేవుడు ఆజ్ఞాపించిన విధంగా వారు బయలు దేరివచ్చిన అబీబు నెల 15వ తారీఖును (ఆ పండుగ సమయంలో) జ్ఞాపకం చేసుకుని దానిని ఆచరించాలి. ఆ ఆచారాన్ని ఎప్పుడు బడితే అప్పుడు ఆచరించకూడదు. దేవుడు చెప్పిన సమయంలో ఆయన ఆదేశించిన పద్ధతిలోనే దానిని పాటించాలి. కాబట్టి దేవుని ఆరాధనకు సంబంధించిన విషయాలలో ఆయన మాటకు విరుద్ధంగా ఏమీ చెయ్యకూడదు. అది ఆయన సహించడు. మనం కూడా ప్రభువును ఆయన ఆజ్ఞాపించిన విధంగా ప్రభువు బల్లను తీసుకోవడం ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి తప్ప ఏవేవో పండుగలను ప్రవేశపెట్టుకుని కాదు (లూకా 22:19).
అదేవిధంగా ఇశ్రాయేలీయులు పస్కా పండుగలో పులియని రొట్టెలను ఎందుకు తినకూడదో ఇప్పటికే వివరించాను (నిర్గమకాండము 12:15,34,36 వచనాల వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 13:5 యెహోవా నీ కిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు, కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు హివ్వీయులకు యెబూసీయు లకు నివాసస్థానమై యుండు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను.
ఈ వచనంలో మోషే ఇశ్రాయేలీయులకు పస్కా (పులియని రొట్టెల పండుగ) పండుగను ఆబీబు నెలలోనే జరుపుకోవాలని మరలా జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. అలానే వారికి కనాను దేశం అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన ప్రమాణం కారణంగానే స్వాధీనం చెయ్యబడుతుంది తప్ప వారి నీతిని బట్టి కాదు (ద్వితీయోపదేశకాండము 4:37,38, ద్వితియోపదేశకాండము 9: 5 ).
అదేవిధంగా ఇక్కడ మనకు "కనానీయులు హిత్తీయులు అమోరీయులు హివ్వీయులు యెబూసీయులు" అనే ఐదు జాతుల పేర్లు ప్రస్తావించబడ్డాయి. వాస్తవానికి వారు పది జాతులు "కేనీయులు కనిజ్జీయులు కద్మోనీయులు హిత్తీయులు పెరిజ్జీయులు రెఫాయీయులు అమోరీయులు కనానీయులు గిర్గాషీయులు యెబూసీయులు" (ఆదికాండము 15:19-21). అయితే మోషే ఆయా సందర్భాలలో ఆ జాతులలోని ప్రాముఖ్యమైన జాతుల పేర్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండము 7:1 లో మోషే ఏడు జాతుల పేర్లను పరిగణలోకి తీసుకున్నాడు. అపో.కార్యములు 13:19 లో కూడా ఆ ఏడు జాతులప్రజలనే దేవుడు నాశనం చేసినట్టు చెప్పబడింది. ఈ జాతులన్నిటికీ మూలపురుషుడు నోవహు కుమారుడైన హాము కుమారుడైన కానాను. అతనిని బట్టే ఆ దేశానికి కనాను అనే పేరూ అతని సంతానం అంతటికీ కనానీయులు అనే పేరూ వచ్చింది. అయితే ఆ ఒకే కనానీయులలో కొన్ని గుంపులు వేరే పేర్లతో పిలవబడ్డాయి, ఉదాహరణకు అమోరీయులు పెరజ్జీయులు.
ఇక కనాను దేశం పాలుతేనెలు ప్రవహించు దేశం అంటే అక్కడ పాలిచ్చే పశువులూ తేనె సమృద్ధిగా లభిస్తుందని అర్థం. ఆ ప్రాంతంలో పచ్చిక (గడ్డి) విస్తారంగా ఉంటుంది కాబట్టి పశువులు బలంగా తయారయ్యి ఎక్కువగా పాలిచ్చేవి. తేనె కూడా అంతే. సౌలు కుమారుడైన యోనాతాను యుద్ధం చేసే సమయంలో అక్కడ తేనె కాలువను కనుగొన్నట్టు కూడా మనం చూస్తాం (1సమూయేలు 14:25-27).
నిర్గమకాండము 13:6,7 ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను, ఏడవ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. పులియని వాటినే యేడు దినములు తినవలెను. పులిసినదేదియు నీయొద్దకనబడ కూడదు. నీ ప్రాంతము లన్నిటిలోను పొంగినదేదియు నీయొద్ద కనబడకూడదు.
ఈ వచనాలలో మోషే మరలా పులియని రొట్టెల పండుగ గురించి జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం (నిర్గమకాండము 12:15,34,36 వచనాల వ్యాఖ్యానం చూడండి ). కొందరు బైబిల్ పండితుల వివరణ ప్రకారం యూదులు ఈ విషయంలో చాలా నిష్టకలిగి తమ గృహంలో ఎక్కడైనా పులిసింది ఏదైనా ఉందేమో అని చాలా వెదికేవారంట. కానీ వారు ఈ ఆచారం వెనుకున్న దేవుని కార్యాన్ని గుర్తించి ఆయనకు విధేయులుగా ఉండలేకపోయారు. మనం కూడా ఈ విషయంలో యూదుల వలే ఉండకుండా జాగ్రత్త కలిగియుండాలి. ఆచారాలు పాటిస్తే సరిపోదు, వాటివెనుకున్న పరమార్థాన్ని గుర్తించి అనుసరించాలి. ఈ రోజు క్రైస్తవ సంఘాలలో చాలామంది బాప్తీస్మం ప్రభువు బల్ల వంటి ఆచారాలను పాటిస్తున్నారు తప్ప వాటివెనుకున్న పరమార్థాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు. అలాంటివారు ఆ ఆచారాలను పాటించడం వల్ల దేవునితీర్పులో మరింత ఉగ్రతకు లోనవ్వడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు.
ఉదాహరణకు; బాప్తీస్మం అంటే ప్రభువుతో చనిపోయి ఆయనతో తిరిగి లేవడమని అర్థం (కొలస్సీ 2: 12). అలా తిరిగిలేచిన వారు ఈ లోకంలో ఇక క్రీస్తులానే నడుచుకోవాలని రాయబడింది (1 యోహాను 2: 6). బాప్తీస్మం ఆచరించినవారిలో అలాంటి పరిశుద్ధతే కనుక లేకుంటే ఆ ఆచారాన్ని ఆచరించిన కారణంతో మరింత ఉగ్రతకు లోనవ్వకతప్పదు.
నిర్గమకాండము 13:8 మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తు లోనుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసినదాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను.
ఈ వచనంలో మోషే ఇశ్రాయేలీయులకు పులియని రొట్టెల ఆచారం ఎందుకు నియమించబడిందో తమ కుమారులకు వివరించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దీనినిబట్టి దేవుడు నియమించే ప్రతీ ఆచారమూ భవిష్యత్తు తరాలకు బోధగా ఉండేందుకు కూడా నియమించబడుతుందని మనం గుర్తుంచుకోవాలి. మనం కూడా మన పిల్లలకు ప్రభువు బల్ల గురించి బోధించేవారిగా ఉండాలి, ప్రభువు బల్ల తీసుకునే ప్రతీ ఒక్కరూ ఆయన మరణాన్ని ప్రచురించాలనే బాధ్యతను కలిగియున్నారు (నిర్గమకాండము 12:26,27 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 13:9 యెహోవా ధర్మ శాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులోనుండి నిన్ను బయటికి రప్పించెననుటకు, ఈ ఆచారము నీ చేతిమీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును.
ఈ వచనంలో మోషే ఇశ్రాయేలీయుల విడుదలకు సూచనగా పస్కా పండుగ (పులియని రొట్టెల పండుగ) ఆచారం వారి కన్నుల మధ్య, చేతిమీద జ్ఞాపకార్థంగా ఉంచుకోవాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇవే మాటలు మనకు 16వ వచనంలోనూ ద్వితీయోపదేశకాండము 6:7 వచనంలో కూడా రాయబడ్డాయి. కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం, ఇవి ఇశ్రాయేలీయుల తమ చేతి క్రియల్లోనూ తలంపుల్లోనూ ఆ ఆచారం వెనుకున్న దేవునికార్యాన్ని గుర్తు చేసుకోవాలని అలంకారంగా చెప్పబడిన మాటలు. కానీ తర్వాత కాలంలో యూదులు (శాస్త్రులు, పరిసయ్యులు) వాటిని అక్షరార్థంగా తీసుకుని, తమ చేతి క్రియల్లోనూ తలంపుల్లో మాత్రం దేవుని కార్యాలను మరచిపోయారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు "మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; "తమ రక్షరేకులు వెడల్పుగాను" తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు; విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందన ములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు" (మత్తయి 23:5-7) అని వారిని తీవ్రంగా గద్దించాడు.
నిర్గమకాండము 13:10 కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను.
ఈ వచనంలో మోషే పులియని రొట్టెల పండుగ గురించి ఇశ్రాయేలీయులకు మరోసారి జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. ఆ పండుగ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికే ఇలా మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నాడు.
నిర్గమకాండము 13:11-13 యెహోవా నీతోను నీ పితరులతోను ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత ప్రతి తొలి చూలుపిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగసంతానము యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొఱ్ఱెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని యెడల దాని మెడను విరుగదీయ వలెను. నీ కుమారులలో తొలిచూలియైన ప్రతి మగ వానిని వెలయిచ్చి విడిపింపవలెను.
ఈ వచనాలలో తొలిచూలు పిల్లల ప్రతిష్ట గురించి వివరించబడడం మనం చూస్తాం. దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (1&2 వచనాల వ్యాఖ్యానం చూడండి). ఇక్కడ అపవిత్ర జంతువుల విషయంలో అతను ఉదాహరణగా గాడిదను తీసుకున్నాడు, ఆ నియమం అన్ని అపవిత్ర జంతువులకూ వర్తిస్తుంది.
నిర్గమకాండము 13:14-16 ఇకమీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనియ్యకుండ తన మనస్సును కఠినపరచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తుదేశములో తొలి సంతాన మంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును; అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలెను. బాహు బలముచేత యెహోవా మనలను ఐగుప్తులోనుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతిమీద సూచన గాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను.
ఈ వచనాలలో మోషే ఇశ్రాయేలీయులు తొలిచూలు పిల్లల ప్రతిష్ట గురించి తమ పిల్లలకు ఏం బోధించాలో ఐగుప్తులో జరిగిన చరిత్ర అంతటినీ వివరించడం మనం చూస్తాం. విశ్వాసులమైన మనకు ఈమాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే వారు ఎలాగైతే తమ పిల్లలను ప్రతిష్ట చేసే ఆచారం వెనుకున్న చరిత్రను వివరించాలో అలానే మనం కూడా మనపిల్లలకు ప్రార్థన నేర్పిస్తున్నప్పుడూ వాక్య ధ్యానం చేయిస్తున్నప్పుడూ వాటి ప్రాముఖ్యతను వివరించగలగాలి. లేకపోతే వారు ప్రార్థనలనూ వాక్యధ్యానాన్ని కేవలం ఆచారంగా భావిస్తారు తప్ప వాటివెనుకున్న శక్తిని గుర్తించి, ఆశ్రయించలేరు. ఈరోజు ఎంతోమంది విశ్వాసుల పిల్లలు ప్రార్థననూ వాక్యధ్యానాన్నీ అశ్రద్ధ చెయ్యడానికి తల్లితండ్రుల బోధనా వైఫల్యమే ప్రధాన కారణం.
అదేవిధంగా ఈ వచనాలలో "దేవుని బాహుబలం" గురించి రెండుసార్లు ప్రస్తావించబడడం మనం చూస్తాం. ఈ మాటలు ఐగుప్తుపైకి ఆయన రప్పించిన పదితెగుళ్ళను సూచిస్తున్నాయి.
నిర్గమకాండము 13:17,18 మరియు ఫరో ప్రజలను పోనియ్యగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని, ఫిలిష్తీయులదేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎఱ్ఱసముద్రపు అరణ్యమార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోనుండి వచ్చిరి.
ఈ వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయులను కనాను దగ్గరదారియైన ఫిలిష్తీయుల దేశానికి సమీపంగా కాకుండా ఎర్రసముద్రం మీదుగా చుట్టుదారిలో నడిపించడం మనం చూస్తాం. దీనికి కారణం:
"ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని" ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల దేశం గుండా ప్రయాణిస్తే వారితో తప్పకయుద్ధం కలుగుతుంది. అప్పుడు వీరు భయపడి వెనక్కు అనగా ఐగుప్తుకు మరలే అవకాశం ఉంది. ఎందుకంటే వారు మానసికంగా అస్థిరులు, దేవునికి సంపూర్ణంగా లోబడినవారు కారు (ద్వితియోపదేశకాండము 9: 24 ). అందుకే ఆయన వారిని చుట్టుదారిలో నడిపిస్తున్నాడు.
అయితే దీనివెనుక దేవుని సార్వభౌమత్వం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులను ఆయన ఎఱ్ఱసముద్రం వైపు నడిపించాడు కాబట్టే ఫరోనూ అతని సేనలనూ ఆ సముద్రంలో ముంచివేసి వారిపై తన తుది తీర్పును నెరవేర్చుకున్నాడు (కీర్తనలు 136:15). అలానే ఆయన మోషేకు మొదట ప్రత్యక్షమైనప్పుడు "నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడు కొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరు" (నిర్గమకాండము 3:12) అని పలికాడు. అది ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి బయలుదేరిన మూడవ నెల మొదటిరోజున నెరవేరింది (నిర్గమకాండము 19:1). ఇశ్రాయేలీయులు కనుక ఫిలిష్తీయుల దేశం గుండా ప్రయాణిస్తే సీనాయి అరణ్యానికి అనగా మోషేకు ఆయన ప్రత్యక్షమైన పర్వతానికి చేరుకోలేరు, అక్కడ ధర్మశాస్త్రం పొందుకోలేరు. ఎందుకంటే ఆ దారిలో సీనాయి అరణ్యం ఎదురుకాదు, చుట్టుదారిలో వెళ్తేనే ఎదురౌతుంది.
కాబట్టి మానవుడు వేసే ప్రతీ అడుగూ అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే చివరికి దేవుని సార్వభౌమత్వాన్నే నెరవేరుస్తుంది. అందుకే "నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు" (కీర్తనలు 76: 10) అని రాయబడింది. ఉదాహరణకు; ఇస్కరియోతు యూదా ధనాశతో యేసుక్రీస్తును అమ్మివేసాడు, కానీ యేసుక్రీస్తు సిలువమరణం దేవుని నిర్ణయం (అపో.కార్యములు 2:23). యోసేపు సహోదరులు అతడిని అక్కసుతో ఐగుప్తుకు అమ్మివేసారు, కానీ అతను ఐగుప్తుకు వెళ్ళాలన్నది దేవుని నిర్ణయం (కీర్తనలు 105:17). యాకోబు ఇస్సాకు వద్దనుండి మోసంతో ఆశీర్వాదాలను పొందుకున్నాడు, కానీ అతనే ఆశీర్వదించబడాలి అన్నది దేవుని నిర్ణయం (ఆదికాండము 25:23). ఇలా మనిషి చేసే ప్రతీదీ దేవుని సార్వభౌమ నిర్ణయాన్నే నెరవేరుస్తుంది. ఐతే ఆ వ్యక్తులు తమ మనసులో ఉన్న దురాశలను బట్టి అలా చేస్తారు కాబట్టి దానికి వారే బాధ్యులు, శిక్షకు అర్హులు. అందుకే యూదా యేసుక్రీస్తును అమ్మివేసి దోషిగా తీర్చబడ్డాడు. ఈ అంశం గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ లింకుల ద్వారా సూచించిన వ్యాఖ్యానాలు, వ్యాసాలు చదవండి.
ఆదికాండము 3వ అధ్యాయపు వ్యాఖ్యానం
ఆదికాండము 27వ అధ్యాయపు వ్యాఖ్యానం
దేవుణ్ణి పాపానికి కర్తగా చూపిస్తుంది ఎవరు?
దేవుని సార్వభౌమత్వం
నిర్గమకాండము 13:19 మరియు మోషే యోసేపు ఎముకలను తీసికొని వచ్చెను. అతడుదేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును; అప్పుడు మీరు నా ఎముక లను ఇక్కడనుండి తీసికొని పోవలెనని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని యుండెను.
ఈ వచనంలో మోషే ఆదికాండము 50:25లో యోసేపు చేయించుకున్న ప్రమాణం చొప్పున అతని ఎముకలను కనానులో భూస్థాపితం చెయ్యడానికి తీసుకుని రావడం మనం చూస్తాం. వాస్తవానికి అపో.కార్యములు 7:15,16 ప్రకారం పితరులందరూ చనిపోయి కనానులోనే సమాధి చెయ్యబడ్డారు. అదంతా యోసేపు బ్రతికియుండగా జరిగియుండవచ్చు. కానీ యోసేపు చనిపోయేటప్పుడు మాత్రం "నిశ్చయముగా దేవుడు మిమ్మును దర్శించును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడినుండి తీసుకుని వెళ్ళాలని ప్రమాణం చేయించుకున్నాడు" (ఆదికాండము 50:25). ఎందుకంటే ఇశ్రాయేలీయులను ఐగుప్తుకు రప్పించింది యోసేపే కాబట్టి "మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోరు నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దర్శించి ఇక్కడినుండి తీసుకుని వెళ్తాడు" అని వారికి ధైర్యం చెప్పడానికే అప్పటివరకూ నా దేహాన్ని ఇక్కడే పాతిపెట్టి అప్పుడే నా ఎముకలను తీసుకుని వెళ్ళండని చెప్పియుండవచ్చు.
నిర్గమకాండము 13:20-22 వారు సుక్కోతునుండి ప్రయాణమై పోయి, అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియుప్రయాణము చేయునట్లుగా యెహోవాత్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజలయెదుటనుండి తొలగింపలేదు.
ఈ వచనాలలో దేవుడు అరణ్యమార్గంలో ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలీయులకు పగలు ఎండదెబ్బ కానీ రాత్రి చీకటివల్ల ఎలాంటి ఇబ్బందీ కానీ కలగకుండా అగ్నిస్థంభంగా మేఘస్థంభంగా వారికి ముందుగా నడవడం మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు ఆ మేఘస్థంభం అగ్ని స్థంభాలను బట్టే తమ ప్రయాణాన్ని కొనసాగించేవారు (సంఖ్యాకాండము 9: 17-21). వారు కనాను దేశపు సరిహద్దులకు చేరేంతవరకూ ఇలానే జరిగింది. వారు కనాను దేశపు సరిహద్దులకు చేరగానే దేవుని వాక్యం భద్రపరచబడిన నిబంధన మందసాన్ని బట్టి మాత్రమే వారి ప్రయాణం ముందుకుసాగింది (యెహొషువ 3:3-11). అదేవిధంగా పాతనిబంధనలోనూ అపోస్తలీయ కాలంలోనూ ఆయన ప్రత్యక్షతలనూ అద్భుతాలనూ అనుగ్రహించి తన ప్రజలను నడిపించాడు, వాక్యాన్ని స్థిరపరిచాడు (మార్కు 16:20). కాబట్టి ప్రస్తుతం ఆయన మనల్ని నడిపించేది సంపూర్ణమై మనకు అందించబడిన వాక్యం ద్వారా మాత్రమే. ఇశ్రాయేలీయులు మరలా మేఘస్థంభం, అగ్నిస్థంభం కోసం వేచిచూడకుండా మందసాన్ని బట్టి ప్రయాణం చేసినట్టు మనం కూడా అద్భుతాలు, ప్రత్యక్షతలకోసం అపేక్షించకుండా అలాంటి సాక్ష్యాలు చెప్పేవారిని విశ్వసించకుండా వాక్యాన్ని బట్టి ముందుకు సాగాలి.
కీర్తనలు 119: 105 నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.
యెహొషువ 1:8 ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపో కూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
నిర్గమకాండము అధ్యాయము 13

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"