నిర్గమకాండము 39:1-31
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధస్థలములో అహరోను చేయు సేవనిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణములుగల సేవావస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్ర ములను కుట్టిరి. మరియు అతడు బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను ఏఫోదును చేసెను. నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను సన్ననారతోను చిత్రకారుని పనిగా నేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగెలుగా కత్తిరించిరి. దానికి కూర్చు భుజఖండములను చేసిరి, దాని రెండు అంచులయందు అవి కూర్పబడెను. దానిమీదనున్న దాని విచిత్రమైన దట్టి యేకాండమై దానితో సమమైన పని గలిగి బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతోను చేయబడెను; అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు బంగారు జవలలో పొదిగిన లేతపచ్చలను సిద్ధ పరచిరి. ముద్రలు చెక్కబడునట్లు ఇశ్రాయేలీయుల పేళ్లు వాటిమీద చెక్కబడెను. అవి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏఫోదు భుజములమీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఏఫోదుపనివలె బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పంక్తులతోను సన్ననార తోను చిత్రకారునిపనిగా పతకమును చేసెను. అది చచ్చౌకముగా నుండెను. ఆ పతకమును మడతగా చేసిరి. అది మడవబడినదై జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలది. వారు దానిలో నాలుగు పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది; పద్మరాగ నీల సూర్యకాంత మణులుగల పంక్తి రెండవది; గారుత్మతకము యష్మురాయి ఇంద్రనీలమునుగల పంక్తి మూడ వది; రక్తవర్ణ పురాయి సులిమానిరాయి సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది; వాటివాటి పంక్తులలో అవి బంగారుజవలలో పొదిగింపబడెను. ఆ రత్నములు ఇశ్రాయేలీ యుల పేళ్ల చొప్పున, పండ్రెండు ముద్రలవలె చెక్కబడిన వారి పేళ్ల చొప్పున, పండ్రెండు గోత్రముల పేళ్ళు ఒక్కొక్కదానిమీద ఒక్కొక్క పేరు చెక్కబడెను. మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లికపనియైన గొలుసులు చేసిరి. వారు రెండు బంగారు జవలు రెండు బంగారు ఉంగరములును చేసి ఆ రెండు ఉంగరములును పతకపు రెండు కొనలను ఉంచి అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను పతకపు కొనలనున్న రెండు ఉంగరములలోవేసి అల్లబడిన ఆ రెండు గొలుసుల కొనలను ఆ రెండుజవలకు తగిలించి ఏఫోదు భుజ ఖండములమీద దాని యెదుట ఉంచిరి. మరియు వారు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని రెండు కొనలకు వాటిని వేసిరి. మరియు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని రెండవ కూర్పు నొద్దనున్న దాని యెదుటి ప్రక్కను, ఏఫోదు రెండు భుజఖండములకు దిగువను వాటిని వేసిరి. ఆ పత కము ఏఫోదు విచిత్రమైన దట్టికిపైగా నుండునట్లును అది ఏఫోదు నుండి విడిపోకుండునట్లును ఆ పతకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలిసూత్ర ముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లికపనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్య నున్న రంధ్రము కవచరంధ్రమువలె ఉండెను. అది చినుగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టు ఒక గోటు ఉండెను. మరియు వారు చొక్కాయి అంచులమీద నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి. మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మపండ్ల మధ్యను, అనగా ఆ చొక్కాయి అంచులమీద చుట్టునున్న దానిమ్మపండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవచేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మపండును ఆ చొక్కాయి అంచులమీద చుట్టు ఉంచిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేతపనియైన సన్న నార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన సన్ననార కుళ్లాయిలను పేనిన సన్ననార లాగులను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో బుటాపనియైన నడికట్టును చేసిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధకిరీట భూషణము చేసిచెక్కిన ముద్రవలె దానిమీదయెహోవా పరిశుద్ధుడు అను వ్రాత వ్రాసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి.
ఈ వచనాల్లో ప్రధానయాజకుడి వస్త్రాలు, బంగారు ఎఫోదు, కిరీటం, మరియు యాజకుల వస్త్రాల తయారీగురించి రాయబడడం మనం చూస్తాం. వీటిగురించి మరియు ఇవి ఎవరికి ఛాయగా ఉన్నాయో కూడా ఇప్పటికే నేను స్పష్టంగా వివరించాను (నిర్గమకాండము 28 వ్యాఖ్యానం చూడండి). అదేవిధంగా మోషే ఎందుకు మరలా ఇంతవివరంగా రాస్తున్నాడో కూడా నేను వివరించాను (నిర్గమకాండము 36:8-38 వ్యాఖ్యానం చూడండి). అయితే యాజకవస్త్రాలలో ఇక్కడ మనకు ఊరీము తుమ్మీమము ప్రస్తావన కనిపించదు. కానీ అవి పతకంలో ఉంచబడేవని 28వ అధ్యాయంలో అతను వివరించి, ఆ పతకం గురించి ఇక్కడ మరలా ప్రస్తావించాడు కాబట్టి, అలానే 43వ వచనంలో ఇశ్రాయేలీయులు మోషే చెప్పినదంతా చేసారని రాయబడింది కాబట్టి, తరువాత యాజకులు వాటి ద్వారా తీర్పు చెప్పిన సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి, ఇశ్రాయేలీయులు వాటిని చెయ్యలేదేమో అనే సందేహానికి చోటులేదు. అలానే ఈ యాజకవస్త్రాలు సేవా వస్త్రాలుగా పిలవబడ్డాయి. ఎందుకంటే వారు వాటిని ప్రత్యక్షగుడారంలో సేవ చేసేటప్పుడు ప్రత్యేకంగా ధరించడానికి ఉద్దేశించబడ్డాయి. కానీ ఈరోజు కొందరు బోధకులు ఇతరులకంటే మేమేదో గొప్పవారం అన్నట్టుగా ప్రత్యేకమైన వస్త్రాలను ధరిస్తున్నారు. నూతననిబంధనలో అలాంటి ప్రత్యేకమైన వస్త్రధారణ ఏమీలేదని నిర్గమకాండము 28 వ్యాఖ్యానంలో వివరించాను.
నిర్గమకాండము 39:32
ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేసిరి.
ఈ వచనంలో మోషే ఇశ్రాయేలీయులంతా దేవుడు తనకు ఆజ్ఞాపించినట్టుగానే, అనగా ఆయన మాట చొప్పున తాను వారికి ఆజ్ఞాపించినట్టుగానే ప్రత్యక్షగుడారం మరియు దానిసంబంధమైన వస్తువులను తయారుచేసారని రాయడం మనం చూస్తాం. ఈమాటల ప్రకారం బెసలేలు అహోలీయాబులు మాత్రమే కాదు వారి నిర్వహణ క్రిందపని చేస్తున్న ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుడు ఆజ్ఞాపించినట్టుగానే పనిచేసారు. అలానే వారు దేవుడు ఆజ్ఞాపించినట్టుగా కానుకలను కూడా ఇచ్చారు. చూడండి, ఇశ్రాయేలీయులు బంగారు దూడను తయారుచేసుకున్నప్పుడూ మరియు ఇతర సందర్భాల్లో దేవుణ్ణి శోధించినప్పుడూ లేఖనం వారికి వ్యతిరేకంగా సాక్షం చెప్పింది. ఎందుకంటే వారు ఆయా సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. కానీ ఇప్పుడు వారు దేవుని ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించగానే అవే లేఖనాలు వారిని ప్రశంసిస్తూ సాక్ష్యమిస్తున్నాయి. లేఖనం చెబుతున్న ఈ రెండు సాక్ష్యాలలోనూ ఇశ్రాయేలీయులకు ఏది మేలుకరం, అంటే వారు దేవుని ఆజ్ఞలను అనుసరించడాన్ని బట్టి పలకబడిన ఈ సాక్ష్యమే అని మనందరికీ అర్థమైంది. అందుకే 43వ వచనంలో ఒకప్పుడు వారిపై ఆగ్రహించిన మోషే ఇప్పుడు వారిని దీవిస్తున్నట్టుగా మనం చదువుతాం. కాబట్టి దేవుని ఆజ్ఞలకు అనుకూలమైన మనసు మాత్రమే మనకు మేలుచేసేదిగా లేక దీవెనకరంగా ఉంటుందని గ్రహించి ఆ ఆజ్ఞలను మనస్పూర్తిగా హత్తుకోవాలి.
ద్వితియోపదేశకాండము 5:29 వారికిని వారి సంతాన మునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు.
యిర్మియా 6:16 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమార్గ ములలో నిలిచి చూడుడి, పురాతనమార్గములనుగూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి.
నిజానికి ఇప్పుడు నేను చెబుతుంది మనందరికీ సాధారణంగా తెలిసిన విషయమే, అయినప్పటికీ ఒకోసారి మనం మనకు మేలుచేసే ఆయన ఆజ్ఞలను విడిచి ఆయనయెదుట విపరీతంగా ప్రవర్తిస్తుంటాం. ఇది మనపై మరింత భారాన్ని మోపుతుంది కాబట్టి ఆ విషయంలో మనమంతా జాగ్రత్తగా ఉండాలి. అందుకే యాకోబు ఇలా అంటున్నాడు.
యాకోబు 4:17 కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.
నిర్గమకాండము 39:33-41
అప్పుడు వారు మందిరమును గుడారమును దాని ఉప కరణములన్నిటిని దాని కొలుకులను, పలకలను, కమ్ములను, స్తంభములను, దిమ్మలను, ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును, సముద్రవత్సల తోళ్ల పైకప్పును, కప్పు తెరను, సాక్ష్యపు మందసమును దాని మోత కఱ్ఱలను, కరుణాపీఠమును, బల్లను, దాని ఉపకరణములన్నిటిని, సముఖపు రొట్టెలను, పవిత్ర మైన దీపవృక్షమును, సవరించు దాని ప్రదీపములను, అనగా దాని ప్రదీపముల వరుసను దాని ఉపకరణములన్నిటిని దీపముకొరకు తైలమును బంగారు వేదికను అభిషేక తైలమును పరిమళ ధూప ద్రవ్యములను శాలాద్వారమునకు తెరను ఇత్తడి బలిపీఠమును దానికుండు ఇత్తడి జల్లెడను దాని మోతకఱ్ఱలను దాని ఉపకరణములన్నిటిని, గంగాళమును దాని పీటను ఆవరణపు తెరలు దాని స్తంభములను దాని దిమ్మలను ఆవరణద్వారమునకు తెరను దాని త్రాళ్లను దాని మేకులను ప్రత్యక్షపు గుడారములో మందిర సేవకొరకైన ఉపకర ణములన్నిటిని, పరిశుద్ధస్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను, అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసికొని వచ్చిరి.
ఈ వచనాల్లో మోషే ఇశ్రాయేలీయులు ఇప్పటివరకూ చేసిన వస్తువులనన్నిటినీ ప్రస్తావించడం మనం చూస్తాం. ఇవే ప్రత్యక్షగుడారం మరియు దాని పరిచర్య సంబంధమైన వస్తువులు. వీటన్నిటి గురించీ నేను 25-30 అధ్యాయాల వ్యాఖ్యానాల్లో వివరించాను. ఐతే ఇక్కడ చివరిలో బెసలేలు మరియు అతని బృందం వారు చేసినవాటన్నిటినీ తీసుకువచ్చి మోషేకు చూపిస్తున్నట్టు మనం చూస్తాం. ఎందుకంటే వారు అవన్నీ సరిగానే చేసారా లేదా అని వాటిని పర్యవేక్షించవలసిన బాధ్యత ఇప్పుడు మోషేది. అతను అలా వాటన్నిటినీ పరీక్షించిన తరువాతే క్రిందివచనంలో "యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి" అని రాస్తున్నాడు.
నిర్గమకాండము 39:42,43
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీ యులు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి; ఆలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను.
ఈ వచనాల్లో మోషే ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలప్రకారంగా పని చెయ్యడాన్ని చూసి వారిని దీవించడం మనం చూస్తాం. దీనిగురించి పై సందర్భంలో నేను వివరించాను. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు గమనిద్దాం.
1. తన ప్రజల మధ్య ప్రత్యక్షగుడారం నిర్మించబడి అందులో నివసించాలన్నది దేవుని సంకల్పం. దానికోసం ఆయన బెసలేలునూ అతని బృందాన్నీ సాధనాలుగా వాడుకుని తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. ఆయన సంకల్పం ఎప్పటికీ విఫలం కాదు.
యెషయా 46:10 నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.
2. బెసలేలు మరియు అతని బృందం కష్టపడి పని చేసినందుకు మోషే వారికి జీతం ఇచ్చినట్టుగా మనం చదవము. అతను కేవలం వారిని దీవిస్తున్నాడు అంతే. ఎందుకంటే ప్రస్తుతం ఇశ్రాయేలీయులు ఆహారాన్ని కొనుక్కోవలసిన అవసరం కానీ వస్త్రాలు కొనుక్కోవలసిన అవసరం కానీ లేదు. దేవుడు వారిని మన్నాతో పోషిస్తున్నాడు, అలానే వారి వస్త్రాలు కూడా పాతగిల్లకుండా కాపాడుతున్నాడు (ద్వితీయోపదేశకాండము 8:3,4). అలాంటప్పుడు వారు చేసిన పనికి జీతంగా ధనం ఇచ్చినప్పటికీ వారికి అది నిరుపయోగం. పైగా వారున్నది ధనంతో ఏమీ కొనుక్కునే అవకాశం లేని ఎడారిప్రాంతం. అందుకే మోషే ద్వారా ఆయన ధనంకంటే విలువైన దీవెనను అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవునిసేవలో అన్నిసార్లూ ధనమే మనకు జీతంగా ఉండదు.
3. మోషే వారిని ఏమని దీవించాడో ఇక్కడ రాయబడలేదు కానీ యూదుల సాంప్రదాయం ప్రకారం ఈ మోషే దీవెనే తరువాత కాలంలో యజమానులు తమ దాసులను దీవించే ఆనవాయితీగా మారింది. ఇది బోయజు విషయంలో మనం గమనిస్తాం (రూతు 2:4).
4. నాయకుడైన మోషే చూపించిన మాదిరి. ఇశ్రాయేలీయులు బంగారుదూడను చేసుకున్నప్పుడు అతను వారిపై ఆగ్రహించి, దేవుని పది ఆజ్ఞలూ వారికి దక్కకుండా పగలగొట్టాడు. వారిలో కొందరికి మరణశిక్షను విధింపచేసాడు. కానీ ఇప్పుడు చూడండి. వారు దేవుని ఆజ్ఞల ప్రకారంగా పనిచేయగానే వారిని దీవిస్తున్నాడు. దేవునిపక్షంగా వారిని దీవిస్తున్నాడు. కాబట్టి సంఘనాయకులు లేక ఆత్మీయ కుటుంబ యజమానులు ఇలాంటి రెండువిధాలైన వైఖరినీ కలిగియుండాలి. వారు తమకు అప్పగించబడినవారు దారి తప్పినప్పుడు ఒకవైపు క్రమశిక్షణ చేస్తూనే, వారి సక్రమమైన ప్రవర్తన విషయంలో దీవించేవారిగా లేక ఇంకా ప్రోత్సహించేవారిగా కూడా తమ బాధ్యతను నిర్వర్తించాలి.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
నిర్గమకాండము అధ్యాయం 39

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"