విషయసూచిక:- 40:1, 40:2, 40:3 , 40:4, 40:5 , 40:6 ,40:7 , 40:8 , 40:9-11 , 40:12-15 , 40:16 , 40:17 , 40:18-33 , 40:34 , 40:35 , 40:36-38 .
నిర్గమకాండము 40:1
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను
ప్రస్తుతం మోషే దేవుడు ఆజ్ఞాపించినవిధంగా ప్రత్యక్షగుడారాన్నీ మరియు దాని సంబంధిత సేవా వస్తువులనూ తయరు చేయించాడు (నిర్గమకాండము 39:42,43). ఆ పనియంతా పూర్తియైన తర్వాత ఈ వచనం నుండి దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు.
నిర్గమకాండము 40:2
మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను.
ఈ వచనంలో దేవుడు మొదటినెల మొదటి దినాన ప్రత్యక్షపు గుడారాన్ని నిలబెట్టాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇప్పటివరకూ ఆ ప్రత్యక్షగుడారం నిలబెట్టడానికి అవసరమైన దిమ్మలు, స్థంబాలు, తెరలు, మొదలైనవన్నీ తయారుచెయ్యబడ్డాయి. ఇప్పుడు వాటితో ఆ ప్రత్యక్షగుడారం నిలబెట్టబడాలి. దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 26 వ్యాఖ్యానం చూడండి). ఈ కార్యక్రమం మొదటినెలలో మొదటి దినాన జరగాలి. ఇశ్రాయేలీయులకు వారు ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన అబీబు నెల మొదటినెలగా నిర్ణయించబడింది (నిర్గమకాండము 12:2, 13:4). వారు అబీబు నెల 14వ తారీఖు రాత్రి ఐగుప్తునుండి బయలుదేరివస్తే (నిర్గమకాండము 12:7,41). సరిగ్గా 15 రోజుల తక్కువ సంవత్సరం తరువాత అనగా అబీబు నెల మొదటితారీఖున ఈ మందిరం నిలబెట్టబడుతుంది (నిర్గమకాండము 40:17).
నిర్గమకాండము 40:3
అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డ తెరతో కప్పవలెను.
ఈ వచనంలో దేవుడు నిలబెట్టబడిన ప్రత్యక్షగుడారంలో మందసం ఉంచి దానిని అడ్డతెరతో కప్పాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఆ అడ్డతెర ద్వారా ప్రత్యక్షగుడారం పరిశుద్ధస్థలం మరియు అతిపరిశుద్ధ స్థలంగా విభజించబడుతుంది. మందసం అతిపరిశుద్ధస్థలంలో ఉంటుంది (నిర్గమకాండము 26:33,34, హెబ్రీ 9:3,4). ప్రధానయాజకుడికి కూడా ఈ అతిపరిశుద్ధస్థలంలోకి ప్రవేశించే అనుమతి సంవత్సరానికి ఒకేఒక్కసారి మాత్రమే అనగా పాపపరిహారార్థ దినాన మాత్రమే లభిస్తుంది (లేవీకాండము 16:2, హెబ్రీ 9:7). దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 25:10-22, 26:33,34 వ్యాఖ్యానాలు చూడండి).
నిర్గమకాండము 40:4
నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసినవాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను.
ఈ వచనంలో దేవుడు బల్లనూ దీపవృక్షాన్నీ ప్రత్యక్షగుడారంలోకి తీసుకువచ్చి బల్లపై ఉంచవలసిన వాటిని అనగా సన్నిధిరొట్టెలను, పాత్రలను దానిపై ఉంచి (నిర్గమకాండము 25:29,30), దీపవృక్షాన్ని వెలిగించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ప్రస్తుతం మోషేనే ఆ పని చెయ్యాలి. తరువాత నుండి అహరోనుకు ఆ బాధ్యత అప్పగించబడుతుంది. అలానే ఈ బల్ల గురించీ దీపవృక్షం గురించీ ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 25:23, 31 వ్యాఖ్యానాలు చూడండి). ఇవన్నీ మందసం ఉంచబడిన తెర ఇతవల అనగా పరిశుద్ధస్థలంలో ఉంచబడతాయి (నిర్గమకాండము 25:35).
నిర్గమకాండము 40:5
సాక్ష్యపు మందసము నెదుట ధూపము వేయు బంగారు వేదికను ఉంచి మందిరద్వారమునకు తెరను తగిలింపవలెను.
ఈ వచనంలో దేవుడు పరిశుద్ధస్థలంలో దీపవృక్షం, సముఖపు రొట్టెలు ఉండే బల్లనే కాకుండా ధూపం వేసే ధూపవేదికను కూడా అక్కడ ఉంచి మందిర ద్వారాన్ని తెరతో మూసివెయ్యాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఈ ధూపవేదిక మరియు ధూపం గురించి ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 30:1-9 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 40:6
ప్రత్యక్షపు గుడారపు మందిరద్వారము నెదుట దహన బలిపీఠ మును ఉంచవలెను.
ఇంతవరకూ దేవుడు ప్రత్యక్షగుడారం మరియు దానిలోపల ఉంచవలసిన వస్తువుల క్రమం గురించి ఆజ్ఞాపిస్తే ఈ వచనం నుండి ఆయన ప్రత్యక్షగుడారపు ఆవరణంలో ఉంచవలసిన వాటి క్రమం గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అందులో మొదటిది ఇత్తడి బలిపీఠం. ఇది ఆవరణ ద్వారానికి సమీపంలో ఉంటుంది. దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 27:1-8 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 40:7
ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను.
ఈ వచనంలో దేవుడు ఇత్తడి గంగాళాన్ని ఎక్కడ ఉంచాలో ఆజ్ఞాపించడం మనం చూస్తాం. బలిపీఠం మందిర ఆవరణ ద్వారానికి సమీపంలో ఉంటే ఇది బలిపీఠానికీ ప్రత్యక్షగుడారపు ద్వారానికీ మధ్యలో ఉంటుంది. యాజకులు ప్రత్యక్షగుడారంలోకి వెళ్ళేటప్పుడల్లా ఇందులోని నీటితో తమ కాళ్ళూ చేతులూ కడుక్కునేవెళ్ళాలి. దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 30:17-21 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 40:8
తెరలచుట్టు ఆవరణమును నిలువబెట్టి ఆవరణద్వారముయొక్క తెరను తగిలింపవలెను.
ఈ వచనంలో దేవుడు ప్రత్యక్షగుడారపు ఆవరణం గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఈ ఆవరణం ప్రత్యక్షగుడారం చుట్టూ ప్రహారీగోడలా ఉంటుంది. దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 27:9-18 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 40:9-11
మరియు నీవు అభిషేకతైలమును తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలిపీఠమునకు అభిషేకముచేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతిపరిశుద్ధ మగును. ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలెను.
ఈ వచనంలో దేవుడు అభిషేక తైలంతో ప్రత్యక్షగుడారానికీ దానిసంబంధమైన వస్తువులనూ అభిషేకించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఈ అభిషేకం గురించి ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 29:36,37, 30:26-29 వ్యాఖ్యానాలు చూడండి) అలాగే ఈ అభిషేక తైలం ఎలా తయారు చెయ్యాలో నిర్గమకాండము 30:22-25 వచనాల్లో రాయబడిండి.
నిర్గమకాండము 40:12-15
మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొనివచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకముచేసి అతని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అతని కుమారులను తోడుకొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను.
ఈ వచనాల్లో దేవుడు అహరోనునూ అతని కుమారులనూ యాజకులుగా ఎలా ప్రతిష్టించాలో ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 29 వ్యాఖ్యానం చూడండి). ఐతే ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఇప్పటివరకూ దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనం చూసినవన్నీ 25వ అధ్యాయం నుండీ ఆయన మోషేకు చెప్పినవే. అలాంటప్పుడు ఆయన మళ్ళీ అతనికి ఇంత వివరంగా చెప్పకుండా గతంలో నేను చెప్పినట్టుగా చెయ్యి అని చెబితే సరిపోను. కానీ ఆయన తన మహిమ నిలిచే ప్రత్యక్షగుడారం విషయంలో చిన్నపాటి మానవతప్పిదానికి కూడా చోటు ఉండకూడదని మరలా ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు. ఈవిధంగా లేఖనాల్లో ఆయన ఆజ్ఞలు పదే పదే జ్ఞాపకం చెయ్యబడడానికి వాటి విషయంలో తన పిల్లలు ఎంతమాత్రమూ తప్పిపోకూడదనే ఆయన కోరికే కారణం. కాబట్టి ఆయనపిల్లలమైన మనం ఆయన కోరిక విషయంలో తప్పిపోకుండా ప్రవర్తించాలి.
1పేతురు 1:16 మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.
నిర్గమకాండము 40:16
మోషే ఆ ప్రకారము చేసెను; యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, ఆలాగుననే చేసెను.
ఈ వచనంలో మోషే దేవుడు ఆజ్ఞాపించినట్టుగా చేసాడని రాయబడడం మనం చూస్తాం. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. దేవుడు ఇలా ఆజ్ఞాపించడానికి ముందే ప్రత్యక్షగుడారాన్ని ప్రతిష్టించడానికి అవసరమైన వస్తువులన్నీ తయారుచెయ్యబడ్డాయి. అయినప్పటికీ మోషే కానీ ఇశ్రాయేలీయుల పెద్దలు కానీ దేవుడు చెప్పడానికంటే ముందు ఆ మందిరప్రతిష్ట చెయ్యడానికి తొందరపడలేదు. దేవుడు చెప్పేంతవరకూ ఎదురుచూసారు. ఎందుకంటే అక్కడ జరుగుతుంది దేవునికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఆయనమాటను బట్టి కాకుండా తమంతట తాముగా నిర్ణయాలు తీసుకుంటే ఆయన దృష్టికి దోషులు ఔతామని వారికి తెలుసు. అందుకే వారు అలా చెయ్యలేదు. కాబట్టి సంఘం ఆయన మాట (వాక్యం) ను బట్టే సమాజంలో తన ఉనికిని చాటుకోవాలి. సంఘానికి స్వంతంగా ఆరాధనా పద్దతులను కానీ పండుగలను కానీ కల్పించుకునే అధికారం ఆయన మొదటినుండీ ఇవ్వలేదు. ఈ విషయంలో పౌలు ఏమని హెచ్చరిస్తున్నాడో చూడండి.
2థెస్సలొనికయులకు 2:15 కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి.
నిర్గమకాండము 40:17
రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను.
ఈ వచనం ప్రకారం; రెండవ వచనంలో నేను వివరించినట్టుగా అబీబు నెల మొదటి తారీఖున మందిరం నిలబెట్టబడింది. ఇశ్రాయేలీయులందరూ ఆరోజు కూడా చాలా ప్రయాసపడ్డారు. అందుకే ఒక్కరోజులోనే ఆ పనియంతా పూర్తి కావడం సాధ్యమైంది.
నిర్గమకాండము 40:18-33
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువ బెట్టి దాని దిమ్మలనువేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండె బద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి మందిరముమీద గుడారమును పరచి దాని పైని గుడారపు కప్పును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసికొని మందసములో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను. మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరముయొక్క ఉత్తర దిక్కున, అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడుప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల యెదుట దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డ తెరయెదుట బంగారు ధూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహనబలిపీఠమును ఉంచి దానిమీద దహనబలి నర్పించి నైవేద్యమును సమర్పించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళ మును ఉంచి ప్రక్షాళణకొరకు దానిలో నీళ్లు పోసెను. దానియొద్ద మోషేయు అహరోనును అతని కుమారులును తమ చేతులును కాళ్లును కడుగుకొనిరి. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడున బలిపీఠమునకు సమీపించు నప్పుడును కడుగుకొనిరి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టు ఆవరణమును ఏర్పరచి ఆవరణద్వారపు తెరను వేసెను. ఆలాగున మోషే పని సంపూర్తి చేసెను.
ఈ వచనాల్లో మోషే ప్రత్యక్షగుడారం మరియు యాజకత్వ నియామకం విషయంలో దేవుడు చెప్పినదంతా పూర్తిచేసినట్టు మనం చూస్తాం. ఇక్కడ మరలా మరలా "మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు" అనే మాటలు మనం చదువుతుంటాం. ఎందుకంటే ప్రత్యక్షగుడారం విషయంలో జరిగిందంతా దేవుని ఆజ్ఞ ప్రకారంగానే జరిగిందని నొక్కిచెప్పడానికి మోషే ఈ మాటలు మరలా మరలా ప్రస్తావించాడు. దీనివల్ల ప్రత్యక్ష గుడారం విషయంలో ప్రజల విశ్వాసం మరింతగా బలపడుతుంది. ఈమాదిరి చొప్పున బోధకులైన వారు తమ సంఘానికి ఈ క్రైస్తవసంఘ ఆవిర్భవం విషయంలో దేవుడు ప్రారంభంనుండీ కలిగియున్న ప్రణాళికను, దానికోసం ఆయన చేసిన ఘనమైన కార్యాలను పదే పదే జ్ఞాపకం చేస్తూ ఆ సంఘాన్ని బలపరిచేవారిగా, దాని ఔన్యత్యాన్ని దానికి గుర్తుచేసేవారిగా ప్రయాసపడాలి. ఈవిషయంలో పౌలు తన బాధ్యతను ఎంత చక్కగా నెరవేరుస్తున్నాడో చూడండి.
ఎఫెసీయులకు 3:8-12 దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున, పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘము ద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి,
శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆయనయందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగియున్నవి.
నిర్గమకాండము 40:34
అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను.
ఈ వచనంలో ప్రత్యక్షగుడారం ఏర్పడగానే దేవుని మహిమ అనగా అప్పటివరకూ వారిని నడిపించిన మేఘం (36,37,38) ఆ మందిరంపైకి దిగడం మనం చూస్తాం. ఆయన ఇలా తన మహిమను ఆ మందిరంలో నింపడం ద్వారా మోషే చేయించిన ఆ ప్రత్యక్షపు గుడారపు సమస్తపని విషయంలో తన ఆమోదాన్ని తెలుపుతున్నాడు. అలాగే ఆయన "నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను" (నిర్గమకాండము 25:8) అని వాగ్దానం చేసినట్టుగా వారు ఆ పరిశుద్ధస్థలాన్ని నిర్మించగానే వారిమధ్య నివాసం చెయ్యడానికి దిగివచ్చాడు. సొలొమోను బంగారు దేవాలయం విషయంలో కూడా దీనిని మనం గమనిస్తాం (1 రాజులు 8:10,11).
నిర్గమకాండము 40:35
ఆ మేఘము మందిరముమీద నిలుచుటచేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండెను.
ఈ వచనంలో దేవునిమహిమయైన ఆ మేఘం మందిరంలో నింపబడడాన్ని బట్టి మోషే కూడా అందులోకి వెళ్ళలేకపోవడం మనం చూస్తాం. అప్పటివరకూ అతను ప్రత్యక్షగుడారంలోనే ఉండి ఆ వస్తువులన్నిటినీ క్రమబద్ధంగా సర్ధించాడు. కానీ ఎప్పుడైతే దేవుని మహిమ అందులోకి దిగిందో ఇక అతను లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం గమనించండి. ఈ మోషే గతంలో దేవుని మహిమను ఎంతో సమీపంగా చూసాడు. ఆ మహిమలో 40+40-80 రోజుల పాటు నివసించాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆ మహిమ నిలిచిన ప్రత్యక్షగుడారంలోకి వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే ఆయన ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసించే దేవుడు (1 తిమోతీ 6:16), ఆయన మహిమ అగ్నివలే మండుతుంది (నిర్గమకాండము 19:18, 24:17). కానీ ఆయన తాను కోరుకున్నవారిని ఆయన అనుకున్న సమయంలో తన మహిమలో నివసించడానికి అనుమతించాడు. ఆ అనుమతి లేకుండా మోషేయైనా సరే ఎవరూ ఆయన మహిమను సమీపించలేరు. అయితే ఇప్పుడు ఆ మందిరంపై దిగింది కూడా ఆయన పరిమిత మహిమేనని మనం అర్థం చేసుకోవాలి. ఆయన సంపూర్ణమైన మహిమను యేసుక్రీస్తు తప్ప ఎవరూ చూడలేదు, ఆ సంపూర్ణ మహిమ యేసుక్రీస్తులో తప్ప లోకంలో ముందెప్పుడూ నివసించలేదు. దీనిగురించి చివరి వచనాల్లో మాట్లాడతాను.
అలానే దేవునిమహిమ ఆ మందిరంపైకి దిగివచ్చి మోషేనే అందులోకి ప్రవేశించలేకపోతే, మరి అందులో యాజకులు ఎలా పరిచర్య చేసారనే సందేహం మనకు కలుగుతుంది. కానీ ఈ మహిమ మందిర ప్రతిష్టదినాన, ఆయన ఆమోదాన్ని తెలియచేస్తూ అధికంగా దిగివచ్చిన మహిమగా మనం అర్థం చేసుకోవాలి. సొలొమోను దేవాలయ ప్రతిష్టలో కూడా ఇదే జరిగిందని ఇప్పటికే మనం చూసాం (1 రాజులు 8:10,11). తరువాత కాలంలో ఆయన మహిమ అందులో నివసించినప్పటికీ అది ఇంత స్థాయిలో కాకుండా, కేవలం మందిరంపై మేఘంలా ఆవరించి కరుణాపీఠంపై కేరూబుల మధ్య నివసించేది (నిర్గమకాండము 30:6), అందుకే ఆ మందసం ఉంచబడిన అతిపరిశుద్ధస్థలంలోకి ఒక్క ప్రధానయాజకుడికి తప్ప ఎవరికీ అనుమతి లేదు. అతనికి కూడా అది సంవత్సరానికి ఒక్కసారే ఆ అనుమతి లభిస్తుంది (లేవీకాండము 16:2, హెబ్రీ 9:7). కాబట్టి ఆ మహిమవల్ల యాజకపరిచర్యకు ఎలాంటి ఇబ్బందీ లేదు.
నిర్గమకాండము 40:36-38
మేఘము మందిరముమీదనుండి పైకి వెళ్లునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమై పోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘముపైకి వెళ్లనియెడల అది వెళ్లు దినమువరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరముమీద ఉండెను. రాత్రివేళ అగ్ని దానిమీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను.
ఈ వచనాల్లో దేవుడు తన మహిమమయమైన మేఘం ద్వారా ఇశ్రాయేలీయులను నడిపించడం మనం చూస్తాం. ఈవిధంగా ఆయన బంగారుదూడ పాపం విషయంలో వారితో సమాధానపడి వారిని మరలా నడిపించడం ప్రారంభించాడు. "వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను" అనంటే వారు కనానుకు చేరుకునేవరకూ అని అర్థం. అప్పటివరకూ ఆయన తన మేఘం ద్వారా వారిని నడిపించి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ఆయన చేసిన ప్రమాణం నెరవేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన తన మహిమను ప్రత్యక్షగుడారంలోని రెండు కేరూబుల మధ్యమాత్రమే పరిమితం చేసాడు (నిర్గమకాండము 25:22)[/simple_tooltip. సొలొమోను దేవాలయంలో కూడా ఇదే జరిగింది.
అయితే నేను పైన చెప్పినట్టుగా ఆయన ఇలా ప్రత్యక్షగుడారంలో నివసించిందీ, సొలొమోను బంగారు దేవాలయంలో నివసించిందీ పరిమిత మహిమలో ఛాయగా మాత్రమే. నిజానికి దేవుడు తన ప్రజలమధ్యలో సంపూర్ణంగా నివసించింది యేసుక్రీస్తులో మాత్రమే. అందుకే "ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది" (కొలస్సీ 2:9) అనీ, "ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను, తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి" (యోహాను 1:14) అనీ రాయబడింది. రూపాంతర కొండమీద యేసుక్రీస్తులో శిష్యులు చూసింది, ఆయనలో నివసిస్తున్న ఆ దేవునిమహిమనే [simple_tooltip content='1. ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట బెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను. 2. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.'](మత్తయి 17:1,2). ఈవిధంగా "సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇదే యెహోవా వాక్కు" (జెకర్యా 2:10) అనే ప్రవచనం నెరవేరింది.
ఈ వ్యాఖ్యానం రాయడానికి సహాయపడిన వనరుల జాబితా:
Commentary on exodus Dr.John gill
Commentary on exodus Adam Clark
Commentary on exodus Matthew Henry
The Ten commandments by a.w pink
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
నిర్గమకాండము అధ్యాయం 40

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"