విషయసూచిక:- 27:1,2, 27:3, 27:4 , 27:5 , 27:6,7 , 27:8 ,27:9 , 27:10-17 , 27:18 , 27:19 , 27:20 , 27:21.
నిర్గమకాండము 27:1,2
మరియు అయిదు మూరల పొడుగు అయిదు మూరల వెడల్పుగల బలిపీఠమును తుమ్మకఱ్ఱతో నీవు చేయ వలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను; దాని యెత్తు మూడు మూరలు. దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను; దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను; దానికి ఇత్తడి రేకు పొదిగింప వలెను.
25,26 వ అధ్యాయాలలో ప్రత్యక్షగుడారం మరియు అందులో ఉంచవలసిన వస్తువుల గురించి వాటి తయారీవిధానం గురించి వివరించిన దేవుడు ఈ అధ్యాయంలో ఆ ప్రత్యక్షగుడారపు ఆవరణ నిర్మాణం గురించీ ఆ ఆవరణంలో ఉంచవలసిన వస్తువుల తయారీవిధానం గురించి వివరిస్తున్నట్టు మనం చూస్తాం. 9వ వచనం ప్రకారం, ఇక్కడ మనకు కనిపిస్తున్న బలిపీఠం ప్రత్యక్షగుడారపు ఆవరణంలోనే ఉంచబడుతుంది. ఈ బలిపీఠం ఐదుమూరల పొడవు అనగా సుమారు 225 సెంటీమీటర్ల పొడవుతో, అంతే వెడల్పుతో, మూడు మూరలు అనగా 135 సెంటీమీటర్ల ఎత్తుతో, యాజకులు దానికుందు నిలవబడి దానిపై బలి అర్పించడానికి అనువుగా ఉంటుంది.
ప్రత్యక్ష గుడారపు ఆవరణంలో ఉంచవలసిన ఈ బలిపీఠం తుమ్మకర్రతో తయారు చేయబడి దానిపై ఇత్తడిరేకు పొదిగించబడుతుంది. ఇది తయారు చేయబడకముందు, ప్రత్యక్ష గుడారం నిర్మించబడకముందు ఇశ్రాయేలీయులు కేవలం మంటితో తయారు చెయ్యబడిన బలిపీఠంపై మాత్రమే బలులు అర్పించాలని ఆయన ఆజ్ఞాపించాడు (నిర్గమకాండము 20:24). ఇప్పుడైతే దానిస్థానంలో తుమ్మకర్రతో తయారు చేయబడి ఇత్తడి రేకు పొదిగించబడిన బలిపీఠాన్ని ఆయన ప్రవేశపెడుతున్నాడు. తరువాత కాలంలో 20 మూరల పొడవుతో అంతే వెడల్పుతో, పది మూరల ఎత్తుతో సొలొమోను ద్వారా మరో బలిపీఠం తయారు చెయ్యబడింది (2దినవృత్తాంతములు 4:1). యాజకులు దానిపైకి మెట్లగుండా వెళ్ళి బలులు అర్పించారు. ఆ బలిపీఠం కూడా దేవుడు దావీదుకు బయలుపరచిన ప్రకారంగానే తయారు చెయ్యబడింది.
ఈ బలిపీఠం గురించి మనం మరింతగా ఆలోచిస్తే, ఇది ప్రత్యక్షగుడారపు ఆవరణంలో ఉంటుంది. దానిపై బలులు అర్పించిన తరువాతే ప్రధానయాజకుడు ఆ రక్తంతో ప్రత్యక్షగుడారంలోకి ప్రవేశిస్తాడు, కరుణపీఠంపై ఆవరించిన ఆయన మహిమను చూస్తాడు. ఈవిధంగా ఈ బలిపీఠం దేవునిసన్నిధికి మనల్ని చేర్చే క్రీస్తు బలియాగానికి సాదృష్యంగా ఉంది (హెబ్రీ 10:20). ఈ బలిపీఠం ఎలాగైతే ప్రత్యక్షగుడారపు ఆవరణంలో ఉండి, దానిపై అర్పించబడిన బలిరక్తం ద్వారా ఆ గుడారంలోకి వెళ్ళే అవకాశం కల్పిస్తుందో, అలాగే క్రీస్తు కూడా మనల్ని దేవునిసన్నిధికి చేర్చడానికి గవిని వెలుపల బలిగా అయ్యాడు.
హెబ్రీయులకు 13:12 కావున యేసుకూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను.
ఈ బలిపీఠం తుమ్మకర్రతో చేయబడి దానిపై ఇత్తడి రేకు పొదిగించబడుతున్నట్టు మనం గమనిస్తాం. దానిపై దహన బలులు అర్పిస్తారు కాబట్టి, ఆ మంటకు తుమ్మకర్ర కాలిపోకుండా ఈ ఇత్తడి రేకు సహాయంగా ఉంటుంది. ఈవిధంగా ఆ బలిపీఠం దైవోగ్రతకు సాదృష్యమైన బలి మంటను తట్టుకుని కాలిపోకుండా ఉంటుంది. దీనినే మనం క్రీస్తు బలియాగంలో కూడా చూస్తాం. ఆయన కూడా సిలువలో బలిగా మారినప్పుడు ఆయనపై దేవుడు మోపిన మన పాపసంబంధమైన ఉగ్రతను సంపూర్ణంగా భరించాడు (యెషయా 53:6). మనల్ని నీతిమంతులుగా తీర్చి, దేవుని సన్నిధిలోకి ప్రవేశించగలిగే భాగ్యాన్ని ప్రసాదించాడు.
ఇక ఈ బలిపీఠానికి నాలుగు మూలలా నాలుగు కొమ్ములు చెయ్యబడుతున్నట్టు మనం చూస్తాం. ఈ కొమ్ములు అనేవి బలిపీఠానికి అలంకరణగా బలిపశువులను వాటికి కట్టే విధంగా ఉంటాయి (కీర్తనల గ్రంథము 118:27).
నిర్గమకాండము 27:3
దాని బూడిదె ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉప కరణములన్నియు ఇత్తడితో చేయవలెను.
ఈ వచనంలో బలిపీఠంపై అర్పించబడే దహనబలుల యొక్క బూడిదను ఎత్తడానికి చెయ్యవలసిన ఉపకరణాల గురించి మనం చూస్తాం. ఇవి పూర్తిగా ఇత్తడితో చేయాలి. గరిటలతో బూడిదను కుండలలోకి ఎత్తి ఇశ్రాయేలీయులు నివసించే పాళెం దగ్గర దానిని పారబోయాలి (లేవీకాండము 4:12). ఇక ముండ్ల కొంకు అనేది బలిపీఠంపై దహనబలి అర్పించబడుతున్నప్పుడు మాంసం సరిగా కాలేలా దానిని త్రిప్పడానికి సహాయపడుతుంది.
నిర్గమకాండము 27:4
మరియు వలవంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను.
ఈ వచనంలో ఇత్తడి జల్లెడ గురించి మనం చూస్తాం. దీనిని ఇత్తడి రేకుకు బెజ్జాలు పెట్టడం ద్వారా తయారుచేస్తారు. దీని ఉపయోగం ఏంటో క్రింది వచనంలో మనం చదువుతాం.
నిర్గమకాండము 27:5
ఆ వలమీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమివరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను.
8 వ వచనం ప్రకారం బలిపీఠం అనేది నాలుగు పలకలుగా చేయబడి మధ్యలో కాలీగా ఉంటుంది. ఆ మధ్యకాలిలో ఈ ఇత్తడి జల్లెడను మధ్యవరకూ అమర్చుతారు. బలిపీఠం మధ్యలో ఇత్తడి జల్లెడపై దహనబలులు అర్పించబడతాయి. అప్పుడు జల్లెడకు ఉండే బెజ్జాల ద్వారా బూడిద బలిపీఠం క్రిందకు చేరుతుంది. దానినే గరిటల సహాయంతో కుండలలోకి ఎత్తి పాళెం వెలుపల పారబోస్తారు. ఇక ఇత్తడి జల్లెడకు కూడా నాలుగు ఉంగరాలు చేయబడుతున్నట్టు మనం చూస్తాం. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం ఎప్పటికి అప్పుడు స్థలాలు మారుతూ ఉంటుంది కాబట్టి, దానికి సంబంధించిన ఉపకరణాలన్నీ మోతకర్రలతో మోయబడేలా ఈ ఉంగరాలు చేయబడుతున్నాయి.
నిర్గమకాండము 27:6,7
మరియు బలిపీఠముకొరకు మోతకఱ్ఱలను చేయవలెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకఱ్ఱలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకఱ్ఱలు దాని రెండుప్రక్కల నుండవలెను.
ఈ వచనాలలో ఇత్తడి బలిపీఠానికి సంబంధించిన మోతకర్రల గురించి మనం చూస్తాం. నేను పై వచనంలో వివరించినట్టుగా ప్రత్యక్ష గుడారపు స్థలం మారినప్పుడల్లా అక్కడికి ఈ బలిపీఠాన్ని తీసుకువెళ్ళడానికే ఈ మోతకర్రలు.
నిర్గమకాండము 27:8
పలకలతో గుల్లగా దాని చేయవలెను; కొండమీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను.
నేను 5 వచనంలో వివరించినట్టుగా బలిపీఠం నాలుగుపలకలుగా మధ్యలో కాలీ ఉండేలా చెయ్యబడుతుంది. ఆ కాలీలోనే ఇత్తడి జల్లెడపై దహనబలులు అర్పించబడతాయి. అదేవిధంగా ఇక్కడ "కొండమీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను" అనేమాటలు మనం చదువుతున్నాం. ఇవే మాటలు 25,26 అధ్యాయాలలో ప్రత్యక్ష గుడారం విషయంలోనూ, మందసం విషయంలోనూ, దీపవృక్షం విషయంలోనూ కూడా మనం గమనిస్తాం. దేవుడు మోషేకు ప్రత్యక్షగుడారాన్ని దాని ఉపకరణాలను ఎలా తయారు చెయ్యాలో చెప్పడమే కాదు, వాటి రూపం ఏవిధంగా ఉండాలో కూడా చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మోషేకు ఆజ్ఞాపిస్తున్న ఈ నిర్మాణమంతా ఎంతో సంక్లిష్టమైనది. అలాంటి సంక్లిష్టమైనవాటిని మోషే కేవలం దేవుని మాటలను బట్టి నిర్మింపచెయ్యడం అతని సామర్థ్యానికి అసాధ్యం. ఉదాహరణకు ఏదైనా ఒక గొప్ప భవంతిని నిర్మించాలంటే ఇంజీనీర్ తాపీమేస్త్రులకు తన మనసులో ఉన్న ప్రణాళికను (డిజైన్ ను) వివరిస్తే సరిపోదు. దానిని ఎలా నిర్మించాలో ఎక్కడ ఏది ఉండాలో అని వివరంగా గీసిన ప్లేన్ ను వారికి చూపించాలి. అప్పుడు మాత్రమే వారికి దానిని సరిగా, సులభంగా నిర్మించడం సాధ్యమౌతుంది. దేవుడు కూడా మోషేకు ప్రత్యక్షగుడారాన్ని దాని ఉపకరణాలను ఎలా నిర్మించాలో చెప్పి వదిలెయ్యడం లేదు. కళ్ళకు వాటి రూపాలను కూడా చూపిస్తున్నాడు. అప్పుడు మాత్రమే మోషే తాను చూసినదానిని మనసులో పెట్టుకుని కచ్చితంగా వాటిని తయారుచేయించగలడు.
కాబట్టి మన దేవుడు కేవలం ఇలా చేయండని ఆజ్ఞాపించేవాడు మాత్రమే కాదని, ఆ ఆజ్ఞల ప్రకారం మనం కచ్చితంగా ప్రవర్తించేలా సహాయం చేసే దేవుడు కూడా అని మనం గుర్తించాలి. మనం బలహీనులమని, మనలోని పతనస్వభావం మనల్ని దైవాజ్ఞలను మీరేలా ప్రేరేపిస్తూనే ఉంటుందని ఆయనకు తెలుసు. అందుకే ఆ పతనస్వభావంతో పోరాడి తన ఆజ్ఞలను నెరవేర్చేలా ఆయన మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. అయితే ఆ సహాయం కోసం మనం "యెహోవా, హృదయపూర్వకముగా నేను మొఱ్ఱ పెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనునట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను నీ శాసనములచొప్పున నేను నడుచుకొనునట్లు నన్ను రక్షింపుము" (కీర్తనలు 119:145,146) "యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచు కొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము" (కీర్తనలు 86:11) అని దావీదులా ఆయనను వేడుకోవాలి, ఆయన ఆజ్ఞలను నెరవేర్చాలనే ఆసక్తితో ఆయనపై ఆధారపడాలి. ఆయనను దావీదులా పూర్ణహృదయంతో ప్రేమించినవారందరూ ఇదే వైఖరిని కలిగియుంటారు.
నిర్గమకాండము 27:9
మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్న నార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.
ఇంతవరకూ మనం ప్రత్యక్షగుడారం చుట్టూ ఉండే ఆవరణంలో ఉండవలసిన బలిపీఠం గురించి చూస్తే, ఈ వచనం నుండి 18వ వచనం వరకూ ఆ అవరణం ఎలా నిర్మించాలో అనేదానిగురించి చూస్తాం. ప్రత్యక్షగుడారం ఒక నివాసం (బిల్డింగ్) అనుకుంటే, ఈ ఆవరణం ఆ నివాసం చుట్టూ ఉండే ప్రహారీగోడగా మనం ఊహించుకోవచ్చు. కాదంటే, ప్రత్యక్ష గుడారం వెనుక, ఇరువైపులా కొంచెం స్థలం కాలీగా ఉండేలా, యెదుట ఇంకా ఎక్కువ స్థలం కాలీగా ఉండేలా, పొడవైన తెరలతో ఇది నిర్మించబడుతుంది. ప్రత్యక్ష గుడారానికి యెదుట ఉన్న కాలీస్థలంలోనే బలిపీఠం, మరియు ఇత్తడి గంగాళం, దహనబలుల కోసం తీసుకువచ్చిన బలిపశువులు ఉంచబడతాయి.
నిర్గమకాండము 27:10-17
దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి; ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడుగుగల యవనికలుండ వలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దులును వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏబది మూరల యవనికలుండవలెను; వాటి స్తంభ ములు పది వాటి దిమ్మలు పది. తూర్పువైపున, అనగా ఉదయదిక్కున ఆవరణపు వెడల్పు ఏబది మూరలు. ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు. రెండవ ప్రక్కను పరునైదుమూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలును మూడు. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల యిరువది మూరల తెర యుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను; వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు. ఆవరణముచుట్టున్న స్తంభములన్నియు వెండి పెండెబద్దలు కలవి; వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి.
ఈ వచనాలలో ప్రత్యక్షగుడారం చుట్టూ ఆవరణాన్ని ఎలా నిర్మించాలో వివరించబడడం మనం చూస్తాం. అది ఒక స్తంభం నుంచి మరో స్తంభానికి తెరలతో అమర్చబడుతుంది. ఆ స్తంభాలు ఎప్పటికి అప్పుడు తొలగించి, వేరొక చోటికి మార్చబడేలా వాటికి దిమ్మలు ఉంటాయి. ఈ ఆవరణం 30 మూరల పొడవు ఉన్న ప్రత్యక్షగుడారానికి ఇరువైపులా వంద మూరల పొడవుతో (మూర అనగా 45 సెంటీమీటర్లు) 10 మూరల వెడల్పు ఉన్న ప్రత్యక్షగుడారం వెనుక యాబై మూరల వెడల్పుతో, ప్రత్యక్ష గుడారానికి ముందు కూడా అంతే వెడల్పుతో నిర్మించబడుతుంది (ప్రత్యక్ష గుడారపు కొలతలు 26 వ అధ్యాయంలో వివరించబడ్డాయి). ప్రత్యక్ష గుడారానికి ముందు ఇరువైపులా 15 మూరలచొప్పున స్తంభాలతో నిర్మించబడి మధ్యలో 20 మూరల ప్రవేశద్వారం ఉంటుంది (మన ప్రహారీకి గేట్ వలే). ఆ ప్రవేశద్వారానికి కూడా స్తంభాలు ఉండి ఒక ప్రత్యేకమైన తెర అమర్చబడి ఉంటుంది. ఈవిధంగా వెండికొంకులు, వెండి పెండెబద్దులును కలిగి, ఇత్తడి దిమ్మలపై అమర్చబడిన 60 స్తంభాల సహాయంతో ఈ ఆవరణం నిర్మించబడుతుంది. దీనిపొడవు 100 మూరలు, వెడల్పు 50 మూరలు. "యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి" (కీర్తనలు 84:2) అని కీర్తనాకారుడు పలుకుతుంది ఈ ఆవరణం గురించే. ఇశ్రాయేలీయులకు నియమించబడిన పండుగల సమయంలో వారు ఈ ఆవరణంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు. యాజకుల ద్వారా తమ బలులను అర్పింపచేస్తారు. అయితే ఈ ఆవరణం యొక్క పరిధిని బట్టి అందరూ ఒకేసమయంలో దీనిలోకి ప్రవేశించలేరు. అందుకే ప్రదేశం కాలీ అయినప్పుడల్లా కొందరు కొందరు చొప్పున ఇందులో ప్రవేశించేవారు, మిగిలినవారు ఆవరణం చుట్టుపక్కల నివసించేవారు.
ఈవిధంగా ఈ ఆవరణం నేటి సంఘానికి సాదృష్యంగా ఉంది. ఈ ఆవరణం ఏర్పడడానికి సహాయంగా ఉన్న స్తంభాలు సంఘపెద్దలకు సాదృష్యంగా ఉన్నాయి (గలతీ 2:9). మన ప్రభువు "జయించువానిని నా దేవుని ఆలయములో స్తంభముగా చేసెదనని" (ప్రకటన 3:12) వాగ్దానం చేసింది కూడా ఈ ఆవరణ, ప్రత్యక్షగుడారపు స్తంభాలను ఉదహరించే. ఈ స్తంభాలు ఎలాగైతే ఎల్లప్పుడూ దేవుని ఆలయంలోనే ఉండి ఆయన మహిమలో నివసిస్తాయో అలానే మనమూ పరలోకంలో ఆయనతో నిత్యమైన సహవాసం కలిగియుంటామని ఆ మాటల భావం.
నిర్గమకాండము 27:18
ఆవరణపు పొడుగు నూరు మూరలు; దాని వెడల్పు ఏబదిమూరలు దాని యెత్తు అయిదు మూరలు; అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడివి.
ఈ వచనంలో ఆవరణం యొక్క పొడవు వెడల్పులను ఎత్తును వివరించడం మనం చూస్తాం. నిర్గమకాండము 26వ అధ్యాయం ప్రకారం; ప్రత్యక్ష గుడారం 30 మూరల పొడవుతో 10 మూరల వెడల్పుతో 10 మూరల ఎత్తుతో ఉంటుంది. దానిచుట్టూ నిర్మించబడిన ఈ ఆవరణం యొక్క పొడవు వెడల్పులు ఎక్కువగానే ఉన్నప్పటికీ ఎత్తుమాత్రం ఐదు మూరలే ఉండి, ప్రత్యక్ష గుడారం ఎత్తుకంటే ఐదుమూరల ఎత్తు తక్కువ ఉంటుంది. ఈవిధంగా ప్రత్యక్షగుడారం చుట్టూ ఐదుమూరల ఎత్తైన ఆవరణం ఉన్నప్పటికీ అందులో పదిమూరల ఎత్తుతో ఉన్న ప్రత్యక్షగుడారం ఆవరణానికి దూరంగా నివసిస్తున్నవారికి కూడా కనిపించేవిధంగా ఉంటుంది (ఆవరణ పరిధిని బట్టి లక్షల సంఖ్యంలో ఉన్న ఇశ్రాయేలీయులంతా ఒకే సమయంలో లోపల ఉండలేరు). అప్పుడే ప్రత్యక్షగుడారంపై నివసిస్తున్న దేవుని మహిమను ఆవరణంలో ఉన్నవారు మాత్రమే కాకుండా ఆవరణానికి దూరంగా ఉన్నవారు కూడా చూడడం సాధ్యమౌతుంది. అందుకే ఆయన ఆవరణపు ఎత్తును ఐదుమూరలు తక్కువగా నియమించాడు.
ఒకవిధంగా ఇది సంఘానికి వెలుపల ఉన్నవారికి కూడా ఆయన చేస్తున్న మేలులకు సాదృష్యంగా ఉంది. ఆవరణానికి వెలుపల దూరంగా ఉన్న ప్రజలు కూడా ప్రత్యక్షగుడారంపై నిలుస్తున్న ఆయన మహిమను ఎలా చూడగలిగారో అలానే నేడు సంఘానికి వెలుపల ఉన్నవారు కూడా మన దేవునిచేత ఎన్నో మేలులు పొందుకుంటున్నారు.
కీర్తనలు 145:9 యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి.
ప్రసంగి 2:25 ఆయన సెలవులేక భోజనముచేసి సంతోషించుట ఎవరికి సాధ్యము?
మత్తయి 5:45 ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.
అదేవిధంగా సంఘం ద్వారా సమాజంలో జరుగుతున్న మేలులు, సంస్కరణలు కూడా దీనికి సాక్ష్యంగా ఉన్నాయి. క్రైస్తవ మిషనరీలు బైబిల్ ఆధారంగా చేసిన సంస్కరణల వల్లే నేటి ప్రపంచంలో సమానత్వం నెలకొందని, ఎన్నో దురాచారాలు రూపుమాపబడ్డాయి అనేది చరిత్ర తెలిసినవారు ఎవరూ ఎదిరించలేని సత్యం.
ప్రత్యక్ష గుడారంపై నివసిస్తున్న దేవుని మహిమ ఆవరణానికి దూరంగా ఉన్నవారు కూడా చూసేలా ఈ ఆవరణం యొక్క ఎత్తు తక్కువగా ఉండి వారికి సహాయం చేస్తుండడాన్ని బట్టి సంఘానికి ఉన్న ప్రాముఖ్యమైన బాధ్యతను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ ఆవరణం లానే సంఘం దేవుని మహిమను (ప్రేమను) లోకానికి చూపేదిగా ఉండాలి, సువార్తను ప్రకటించాలి. సంఘసభ్యులు తాము చేస్తున్న ఘన కార్యాల విషయంలో తమను తాము దేవుని ముందు తగ్గించుకుంటూ ఆయన హెచ్చింపబడేలా ప్రవర్తించాలి.
మత్తయి సువార్త 5:16 మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.
మొదటి పేతురు 2:9,14 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
లేదో "నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు" (ప్రకటన 3:1,2) అని ప్రభువు చేత గద్దించబడవలసి ఉంటుంది. అందుకే పౌలు ఇలా అంటున్నాడు.
తీతుకు 3:14 మన వారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్‌క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను.
నిర్గమకాండము 27:19
మందిరసంబంధమైన సేవోపకరణములన్నియు మేకులన్నియు ఆవరణపు మేకులన్నియు ఇత్తడివై యుండవలెను.
ఈ వచనంలో మందిర సేవోపకరణాలు, దానిని నిర్మించడానికి ఉపయోగించే మేకులు ఇత్తడివైయుండాలని ఆయన ఆజ్ఞాపించడం మనం చూస్తాం. సాధారణంగా గుడారాలను ఏర్పరచడానికి ఇనుప మేకులను ఉపయోగిస్తారు. కానీ ప్రత్యక్షగుడారం ఆవరణం విషయంలో ఇనుముయొక్క ప్రస్తావన మనకు ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఇనుము తుప్పుపట్టే (చెడిపోయే) స్వభావం కలది. అటువంటి చెడిపోయే స్వభావానికి దేవుని ఆలయంలో చోటు ఉండదు. దానివల్ల మందిరనిర్మాణమే పాడౌతుంది. ఒకవిధంగా ఇది మనం మారుమనస్సు పొంది సంఘంలో ప్రవేశించాక మన స్వభావం ఎలా ఉండాలో అనేదాని విషయమై మంచి ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తుంది. మన స్వభావాన్ని దేవుని పరిశుద్ధ స్వభావానికి తగినట్టుగా మనల్ని ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా సరిచేసుకుంటూ ఉండాలి.
కీర్తనలు 86:11 యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచు కొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.
నిర్గమకాండము 27:20
మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీ యుల కాజ్ఞాపించుము.
ఈ వచనంలో ప్రత్యక్ష గుడారంలో వెలిగించవలసిన దీపం (దీపవృక్షం నిర్గమకాండము 25:31) గురించి మనం చూస్తాం. ఆ దీపవృక్షాన్ని "దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె" తో వెలిగించాలి. అంటే స్వచ్చమైన ఒలీవల నూనె అని అర్థం. ఒలీవలను ఎక్కువగా దంచకుండా ఉన్నప్పుడు మాత్రమే స్వచ్చమైన నూనె వస్తుంది. ఎక్కువగా దంచితే వచ్చే నూనెలో ఒలీవల పొట్టు (చెత్త) కూడా చేరిపోతుంది. దానిని ఎంత ఒడగట్టినా ఆ ప్రభావం ఉంటుంది. అందుకే దీపవృక్షాన్ని వెలిగించే ఆ నూనె విషయంలో ఆయన అది స్వచ్చంగా ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన వాక్యం స్వచ్చమైనది. దానికి సాదృష్యంగా ఉన్న ఆ దీపం కూడా స్వచ్చమైన నూనెతోనే వెలగాలి.
నిర్గమకాండము 27:21
సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులును సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములవరకు నిత్యమైన కట్టడ.
ఈ వచనంలో ఆయన అహరోను కుమారులు అనగా యాజకులు ఆ దీపవృక్షాన్ని ఎప్పటినుండి ఎప్పటివరకూ వెలిగించాలో తెలియచెయ్యడం మనం చూస్తాం. ఇంకా చీకటిపడకముందు (సాయంకాలం) నుండే ఆ దీపవృక్షాన్ని వెలిగించాలి. వెలుగైయున్న దేవుడు నివసించే ప్రత్యక్షగుడారం చీకటిగా ఉండడానికి వీలులేదు. ఇది ప్రభువు యొక్క సేవకులు వాక్యం ద్వారా సంఘాన్ని (దేవుడు నివసిస్తున్న మన హృదయాన్ని) ఆయనకు తగినట్టుగా వెలిగించడానికి (నడిపించడానికి) సాదృష్యంగా ఉంది. ప్రకటన గ్రంథపు ప్రత్యక్షతల్లో మన ప్రభువు తన సంఘాలకు సాదృష్యంగా ఉన్న దీపస్తంభాల మధ్యన సంచరిస్తున్నట్టు మనం గమనిస్తాం. అంటే, ఆయనే తన సేవకుల ద్వారా ఆ దీపస్తంభాలను వెలిగిస్తున్నాడని (సంఘానికి వాక్యాన్ని బోధింపచేస్తున్నాడని) అర్థం. దీనిని బట్టి కూడా ఎవరు ఆయన సేవకులో ఎవరు ఆయన సేవకులు కారో మనం గుర్తించగలం. సంఘంలో వాక్యమనే వెలుగును నింపకుండా, చీకటిగల హృదయాలలో వాక్యమనే వెలుగును ప్రసరింపచెయ్యడానికి ప్రయాసపడని ఎవడైనా ఆయన సేవకుడు కాడు.
అదేవిధంగా యాజకులు దీపవృక్షాన్ని వెలిగించినప్పుడు దేవుడు నివసించే ప్రత్యక్షగుడారం వెలుగుమయమౌతుంది. వెలుగుయొక్క స్వభావమే చీకటిని అంతం చెయ్యడం. ఈ వెలుగును మన రక్షణతో పోల్చుకుంటే మనం నిజంగా రక్షించబడితే నిజంగా మనం దేవుడు నివసించే ప్రత్యక్షగుడారం (ఆలయం) ఐతే మన జీవితంలో కూడా వెలుగు ప్రసరిస్తూనే ఉంటుంది. అనగా రక్షణకు రుజువులుగా ఉన్న నీతిక్రియలు మనలో ప్రత్యక్షపరచబడుతూనే ఉంటాయి. (అపో.కా 26:20). కొండమీద ఉండే పట్టణం మరుగైనుండనేరదు కదా! అందుకే యోహాను ఇలా అంటున్నాడు.
మొదటి యోహాను 1:6,7
ఆయనతో కూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.
ఇలాంటి వైఖరి మన జీవితంలో లేకపోతే మనం దీపవృక్షంతో వెలుగుమయమయ్యే ప్రత్యక్షగుడారం (దేవుని ఆలయం) కాదని, అంటే అసలు మనం రక్షించబడనే లేదని అర్థం
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
నిర్గమకాండము అధ్యాయం 27

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"