గ్రంథపరిచయం;,5:1, 5:2, 5:3 , 5:4 , 5:5 , 5:6-9 , 5:10-14 , 5:15-19 , 5:20,21 , 5:22,23
నిర్గమకాండము 5:1
తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి.
ఈ వచనంలో, దేవుడు తమకు ఆజ్ఞాపించిన దానిప్రకారం మోషే అహరోనులు ఫరో వద్దకు వెళ్ళి, ఇశ్రాయేలీయుల తమ దేవునికి చెయ్యవలసిన సేవ (ఉత్సవం) నిమిత్తం, వారిని విడుదల చెయ్యాలని కోరడం మనం చూస్తాం. ఉత్సవం అంటే, బలి అర్పించి ఆయనను ఆరాధించడమని తరువాత సందర్భాలలో మనకు అర్థమౌతుంది. ఇక్కడ మోషే అహరోనులు ఎటువంటి భయానికీ మొహమాటానికీ తావివ్వకుండా ఫరో ముందు దేవుడు సెలవిచ్చిన మాటలను ధైర్యంగా మాట్లాడుతున్నారు. దేవుని ప్రత్యక్షతలను పొందిన ప్రవక్తలందరూ ఇటువంటి వైఖరినే కలిగియున్నట్టు బైబిల్ చరిత్రలో మనకు కనిపిస్తుంటుంది. ఉదాహరణకు ఏలీయా, యిర్మియా, దానియేలు.
ముఖ్యంగా మన ప్రభువైన యేసుక్రీస్తు బోధలలో ఈ వైఖరిని మనం మరింత అధికంగా గమనిస్తాం. అందుకే ఆయన బోధలను గురించి, ఆయనను ఏమాత్రం అంగీకరించని పరిసయ్యులు కూడా ఏమని సాక్ష్యమిస్తున్నారో చూడండి.
మత్తయి 22: 16 బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, "నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు" ఎరుగుదుము.
కాబట్టి విశ్వాసులమైన మనమందరం దేవుని మాటలను ఉన్నవి ఉన్నట్టుగా ప్రకటించడానికి, ఎవరి విషయంలోనూ భయానికి కానీ మొహమాటానికి కానీ తావివ్వకూడదు.
యిర్మియా 1: 17 కాబట్టి నీవు నడుముకట్టు కొని నిలువబడి నేను నీకాజ్ఞాపించునదంతయు వారికి ప్రకటనచేయుము; భయపడకుము లేదా నేను వారి యెదుట నీకు భయము పుట్టింతును.
యెహేజ్కేలు 2: 6,7 నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్లతుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు; అయినను ఆ జనులకు భయ పడకుము.
అదేవిధంగా మోషే అహరోనులు ఫరోతో పలికిన ఈ మాటలను కొందరు ఆధారం చేసుకుని, వారు ఫరోముందుకు వెళ్ళినపుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి శాశ్వతంగా పంపివెయ్యమని అసలు విషయం అడగకుండా, వారిని కేవలం ఉత్సవం చెయ్యడానికి మాత్రమే పంపమంటూ అబద్ధం చెబుతున్నారని, ఈవిధంగా అబద్ధం చెప్పమని దేవుడే వారికి ఆజ్ఞాపించాడని ఆరోపిస్తుంటారు. కానీ ఇక్కడ మోషే అహరోనులు ఫరోతో, తమ ప్రజలైన ఇశ్రాయేలీయులను ఉత్సవం చెయ్యడానికి పంపమన్నపుడు, ఆ ఉత్సవం అయిపోగానే మరలా తిరిగి వస్తామని చెప్పడం లేదు. సీయోను పర్వతంపై వారు చెయ్యవలసిన ఉత్సవం (బలి అర్పణలు) ముగిసాక వారు అక్కడినుండి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. కాబట్టి ఇక్కడ మోషే అహరోనులు ఫరోతో చెబుతున్న అబద్ధం ఏమీలేదు. ఒకవేళ ఫరో మరలా ఎన్ని రోజులకు తిరిగివస్తారని ప్రశ్నించియుంటే అప్పుడు వారు మళ్ళీ రామని కచ్చితంగా చెప్పేవారు.
నిర్గమకాండము 5:2
ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయననెను.
ఈ వచనాలలో ఫరో, మోషే అహరోనులు తనతో పలికిన మాటలకు ప్రతిస్పందనగా "యెహోవా ఎవరు, నేను ఆయనను ఎరుగను" అని పలకడం మనం చూస్తాం. ఒకవేళ నిజంగానే ఫరోకు యెహోవా ఎవరో తెలియక ఆ విధంగా మాట్లాడియుంటే అది దైవధిక్కారంగా ఎంచబడేది కాదు. కానీ ఫరోకు యెహోవా ఎవరో తెలిసే అహంకారంతో ఈవిధంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే, యోసేపు ఆ యెహోవా దేవుడు బయలుపరచిన కలలభావాన్ని బట్టే ఐగుప్తును కరువుకాలం నుండి కాపాడాడు, దానిని అతను బాహాటంగా ప్రకటించాడు (ఆదికాండము 41:16). కాబట్టి అ చరిత్ర ఈ ఫరోకు తెలియకుండా ఉండడం అసాధ్యం.
ఇక్కడ మనం ఫరోయొక్క పతనస్వభావాన్ని గమనిస్తాం. పతనస్వభావంలో ఉన్న మనిషి ఈవిధంగానే అహంకారం కలిగి, దేవుడు ఎవరో తమకు తెలియదు అన్నట్టుగా, ఆయన ఆజ్ఞలకు విరుద్ధంగా ప్రవర్తిస్తాడు.
యోబు 21: 15 "మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు?" మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుటచేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు.
అందుకే దేవుడు ఇక్కడ తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి బయటకు పంపమని ఆజ్ఞాపిస్తుంటే దానికి ఫరో "నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను" అని బదులిస్తున్నాడు. దీనినిబట్టి దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా ప్రవర్తించేవారంతా ఫరోవలే పతనస్వభావంలో కూరుకుపోయినవారిగా మనం అర్థం చేసుకోవాలి. అయితే నేటి సంఘాలలో దేవునిపిల్లలుగా చలామణి అయ్యేవారు కూడా ఇలాంటి వైఖరినే కలిగియుండడం చాలా విచారకరం. ఒకవిధంగా వీరు ఫరోకంటే దుష్టత్వంలో ఉన్నవారిగా మనం భావించాలి. ఎందుకంటే ఫరో ఇక్కడ "నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను" అని నేరుగా చెబుతున్నాడు. కానీ వీరు మాత్రం పైకి దేవుణ్ణి ఎంతో ప్రేమించేవారిగా కనబడుతూ దేవుని ఆజ్ఞలవిషయంలో మాత్రం వ్యతిరేకత చూపిస్తుంటారు.
తీతుకు 1: 16 దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.
నిర్గమకాండము 5:3
అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైన యెడల మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము; లేనియెడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి.
ఈ వచనంలో ఫరో పలికిన అహంకారపు మాటలకు మోషే అహరోనుల ప్రతిస్పందన మనం చూస్తాం. వారు ఇక్కడ ఫరో తమతో "యెహోవా ఎవరో నాకు తెలియదని" అహంకారంతో మాట్లాడినప్పటికీ ఆ విషయంలో అతనితో వాదించే ప్రయత్నం చెయ్యడం లేదు. ఎందుకంటే ఫరో కావాలనే అలా మాట్లాడాడని వారికి అర్థమైంది కాబట్టి, మరలా ఆ విషయంలో వాదనపెట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే వారు నిజంగానే దేవుణ్ణి ఎరుగని వ్యక్తికి పరిచయం చేస్తున్నట్టుగా "హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను" అని ప్రస్తావిస్తున్నారు. పైగా "సెలవైన యెడల" మేము బలి అర్పించడానికి వెళ్తామంటూ తగ్గింపుతోనే ఫరో అనుమతి కోరుకుంటున్నారు. ఈ విషయంలో మోషే అహరోనుల యుక్తి మనకు కనిపిస్తుంది. వారు ఫరోను అడుగుతున్న విధానంలోనే లోపముందని ఎవరూ ఆరోపించకుండా వారిక్కడ జాగ్రత పడుతున్నారు. అందుకే "దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేసాడనే కారణంతో రాజుయొక్క స్థాయిని తూలనాడేలా ప్రవర్తించడం లేదు". దీనికారణంగా దేవుని న్యాయస్థానం ముందు ఫరోకు తనను సమర్థించుకునే అవకాశం లభించదు. వారు మర్యాదపూర్వకంగా, ఎంతో తగ్గింపుతో అనుమతిని కోరుకున్నప్పటికీ దానిని తిరస్కరించినందుకు అతను మరింత శిక్షకు అర్హుడౌతాడు. కాబట్టి దేవునిపిల్లలు దేవునిపక్షంగా లోకాధికారులతో మాట్లాడుతున్నపుడు ఇటువంటి వైఖరినే అనుసరించాలి. దీనికారణంగా వారిలో కొందరు మన అభ్యర్థనకు అనుకూలంగా స్పందించే అవకాశం ఉండగా, అలా కానివారు మరింత శిక్షకు గురయ్యేలా వారిపై నేరం మోపబడుతుంది.
అదేవిధంగా ఇక్కడ మోషే అహరోనులు, తమకు దేవుడు ఆజ్ఞాపించినవిధంగా ఆయనకు బలి అర్పించకపోతే "ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో" అని పలకడం మనం గమనిస్తాం. ఇక్కడ కూడా వారు మమ్మల్ని పంపకపోతే ఆయన నీ మీద తెగులుతోనైనా ఖడ్గముతోనైనా పడతాడని" బెదిరించడం లేదు కానీ, తమ దేవుని ఆజ్ఞలను అనుసరించకపోతే వారు ఎటువంటి పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందో అది మాత్రమే చెబుతున్నారు. ఎందుకంటే ఏ కారణం చేతనైనా ఆయన ఆజ్ఞలకు విముఖత చూపడం ఆయన దృష్టికి అంగీకారం కాదు. కాబట్టి ఈమాటలు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన ఆజ్ఞల విషయంలో రాజీపడకూడదనే హెచ్చరికను మనకు బోధిస్తున్నాయి. అయితే ఈమాటలు నీవు కనుక మమ్మల్ని బలి అర్పణకు పంపకపోతే మాకంటే మరింత అధికంగా నీవే శిక్షించబడతావని ఫరోను కూడా హెచ్చరిస్తున్నాయి. ఎందుకంటే వారు ఆ విధంగా చెయ్యకపోవడానికి ఫరోయే కారణం కాబట్టి, వారిని అడ్డగించినందుకు అతను మరింత తెగులుకూ ఖడ్గానికీ లోనౌతాడు. దీనినిబట్టి, ఒక వ్యక్తిని దేవుని ఆజ్ఞలను పాటించకుండా అడ్డుకోవడం ఎంతటి తీవ్రమైన శిక్షకు గురిచేసే పాపమౌతుందో అది కూడా మనం గ్రహించాలి. ఈరోజు విశ్వాసుల ఆరాధనను ఆటంకపరుస్తూ, సువార్తను అడ్డగించే మతోన్మాదులందరూ ఇటువంటి పాపానికే ఒడిగడుతున్నారు.
(ఇక్కడ మోషే ఫరోతో ఎటువంటి అబద్దమూ చెప్పడం లేదు "నిర్గమకాండము 3:18 వ్యాఖ్యానం చూడండి)
నిర్గమకాండము 5:4
అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోనూ, ఈ జనులు తమ పనులను చేయకుండ మీరేల ఆపు చున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను.
ఈ వచనంలో ఫరో, మోషే అహరోనుల మాటలను లక్ష్యపెట్టకుండా, మీరు ఈ ప్రజలను పని చెయ్యనివ్వకుండా ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించడం మనం చూస్తాం. ఒకవిధంగా ఇతను మోషే అహరోనులపై రాజాజ్ఞ ధిక్కరణ ఆరోపణ మోపుతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల ప్రజలు ఫరో ఆజ్ఞ చొప్పున బానిససేవ చెయ్యడాన్ని వీరు అడ్డుకుంటూ వారిని ఐగుప్తునుండి బయటకు పంపమని వేడుకుంటున్నారు. ఈకారణం చేతనే వారు రాజాజ్ఞకు వ్యతిరేకులుగా గుర్తించబడుతున్నారు. ఇదేవిధంగా సంఘచరిత్రను కూడా మనం పరిశీలించినప్పుడు, అన్యాయంగా బంధకాల్లో ఉన్న ప్రజలను విడిపించడానికి ప్రయత్నించి, సమాజంలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రయాసపడిన దేవుని బిడ్డలందరిపైనా రాజద్రోహం, దేశద్రోహం ఆరోపణలే మోపబడి హింసించబడినట్టు మనం గమనిస్తాం. అయినప్పటికీ వారు దేవుడు బయలుపరచిన నైతిక ప్రమాణం చొప్పున సమాజాన్ని సంస్కరించి, బంధకాలలో ఉన్నవారిని విడిపించే విషయంలో వెనుకడుగు వెయ్యలేదు. మనం కూడా అటువంటి ఆశయంతోనే ముందుకు సాగాలి.
అదేవిధంగా ఇక్కడ మోషే అహరోనులు ఏ బరువులనుండైతే తమ ప్రజలను విడిపించడానికి ప్రయత్నిస్తున్నారో, అవే బరువులను ఫరో మోషే అహరోనులపై కూడా పెట్టాలని అనుకుంటున్నాడు. అందుకే "మీ బరువులు మోయుటకు పొండని" వారిని బలవంతపెడుతున్నాడు. కాబట్టి ఈలోకంలో మనం దేవుని నైతిక ప్రమాణం చొప్పున ఏ అన్యాయానికైతే వ్యతిరేకంగా పోరాడతామో, కొన్నిసార్లు దానికే బానిసలమయ్యేలా శోధించబడతాం. ఉదాహరణకు; సంఘచరిత్రలో ఎంతోమంది భక్తులు జీవము కలిగిన దేవుణ్ణి విశ్వసించి విగ్రహాలను విసర్జించినందుకు ఆయా ప్రభుత్వాల చేత, రాజుల చేత, ఆ విగ్రహాలనే పూజించేలా, వాటివెనుకున్న అనైతిక జీవితాన్ని అన్వయించుకునేలా బలవంతపెట్టబడ్డారు, హింసించబడ్డారు. ఆ విషయంలో మనమందరమూ జాగ్రత కలిగి, తెగింపుతో ప్రవర్తించగలగాలి.
నిర్గమకాండము 5:5
మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించియున్నది; వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను.
ముందటి వచనానికి కొనసాగింపుగా ఈ వచనంలో కూడా ఫరో, మోషే అహరోనులను వారు తీసుకువచ్చిన అభ్యర్థన విషయమై నిందించడం మనం చూస్తాం. ఇక్కడ అతను "ఈ జనము ఇప్పుడు విస్తరించియున్నది; వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని" ప్రస్తావించడం వెనుక ఇశ్రాయేలీయుల జాతిని అంతరించిపోయేలా చెయ్యాలనే కుయుక్తి దాగియుంది. ఎందుకంటే మొదటి అధ్యాయంలో మనం చూసినట్టుగా ఇశ్రాయేలీయులు అనారోగ్యం పాలై అంతరించిపోవాలనే ఉద్దేశంతోనే అప్పటి ఫరో వారి శక్తికి మించిన పనుల భారాన్ని వారిపై మోపాడు. అయినప్పటికీ ఆ జాతి మరింతగా విస్తరించేసరికి మగపిల్లలను నీటిలో పడెయ్యాలనే ఆజ్ఞను జారీచేసాడు. ప్రస్తుతం ఈ ఫరో కూడా అదే వైఖరిని అనుసరిస్తూ, గత ఫరోలా వారి మగపిల్లలను చంపనప్పటికీ (దానికి కొన్ని కారణాలు ఉండొచ్చు), ఆ జాతి క్రమక్రమంగా అంతరించిపోవాలనే కోరికతో అదే పనుల భారాన్ని వారిపై కొనసాగిస్తున్నాడు. కానీ ఇప్పుడు కూడా వారి విస్తరణ ఆగకపోయేసరికి ఆందోళనలో ఉన్న ఇతనికి మోషే అహరోనులు తీసుకువచ్చిన అభ్యర్థన మరింత ఆందోళన కలిగించింది.
అందుకే మోషే అహరోనుల మాటల కారణంగా ఆ ప్రజలు తమ పనులను ఆపివేసి, తీరికగా ఉండి మరింతగా ఎక్కడ విస్తరిస్తారో అనే ఆలోచనతో ఈవిధంగా మాట్లాడుతున్నాడు.
నిర్గమకాండము 5:6-9
ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను ఇటుకలు చేయుటకు మీరు ఇకమీదట ఈ జనులకు గడ్డి ఇయ్య కూడదు, వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇదివరకు చేసిన యిటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు; వారు సోమరులు గనుకమేము వెళ్లి మా దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మొఱ పెట్టుచున్నారు.
ఆ మనుష్యులచేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపుమాటలను వారు లక్ష్యపెట్టకూడదనెను.
నిర్గమకాండము 1:11వ వచనం ప్రకారం అప్పటి ఫరో ఇశ్రాయేలీయులను తమ పనుల విషయంలో బాధపెట్టి వారిపై మరింత భారం మోపడానికి ఐగుప్తీయులైన కొందరు అధికారులను వారిపై నియమించాడు. ఈ వచనాలలో ఆ పరంపరలో నియమించబడిన అధికారులతోనే ప్రస్తుత ఫరో మాట్లాడుతూ, మోషే అహరోనులు తీసుకువచ్చిన అభ్యర్థనను బట్టి వారిని మరింతగా కష్టపెట్టమనడం మనం చూస్తాం. ఇదివరకూ ఇశ్రాయేలీయులు చేస్తున్న ఇటుకల పనిలో ఆ అధికారులు కనీసం గడ్డినైనా అందించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా ఫరో చేస్తున్నాడు. దీనివల్ల ఇశ్రాయేలీయులకు అప్పటివరకూ ఉన్న విశ్రాంత సమయం కూడా లేకుండా చెయ్యాలనేది ఫరో కుట్రపూరితమైన ఉద్దేశం.
ఫరో అలా చెయ్యడానికి ఇక్కడ రెండు కారణాలను ప్రస్తావిస్తున్నాడు. మొదటిది "వారు సోమరులు గనుక మేము వెళ్లి మా దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మొఱ పెట్టుచున్నారు". ఇది దుష్టులకు ఉండే సహజ లక్షణం. వీరు ఎల్లప్పుడూ దేవుని సేవనూ, ఆయనను విశ్వసించడాన్ని సోమరులు (పనీపాట లేనివారు) చేసేపనిగా ఆరోపించి వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. చరిత్రలో దీనికి ఎన్నో ఆధారాలు మనకు లభ్యమౌతాయి.
రెండు, "అబద్ధపుమాటలను వారు లక్ష్యపెట్టకూడదనెను" ఇక్కడ ఫరో, మోషే అహరోనులు చెబుతున్న దేవుని మాటలను అబద్ధాలుగా భావించి, అదే భావన ప్రజల్లో కూడా కలిగి ఇకపై వాటిని వారు నమ్మకుండా చెయ్యడానికి వారిని కష్టపెట్టమంటున్నాడు. అందుకే అతను అంతవరకూ ఇశ్రాయేలీయులు పొందుకున్న సహాయాన్ని (గడ్డి) కూడా రద్దుచేస్తున్నాడు. ఎందుకంటే చాలామంది వారు నమ్ముతున్న దేవునిమాటలను బట్టి కష్టాలు పడవలసివచ్చినప్పుడు ఆ మాటలు నిజంగా దేవునివేనా అనే సందేహానికి గురౌతుంటారు.
దేవుని పిల్లలు, ఆ దేవునిమాటలను విశ్వసించకుండా చెయ్యడానికి అపవాది కల్పించే కుతంత్రాలు ఈవిధంగానే ఉంటాయి (వారిని కష్టపెట్టాలి). ప్రస్తుతం దేవునిపిల్లలకు న్యాయబద్ధంగా అందవలసిన ప్రభుత్వ సహాయాలు, మినహాయింపుల విషయంలో నిషేధాలు తలెత్తుతుంది కూడా ఇందుకే. అయినప్పటికీ "అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును" (మత్తయి 24:13) అని యేసుక్రీస్తు పలికిన మాటలను మనం ఎల్లప్పుడూ స్మరించుకోవాలి. నిజమైన దేవునిపిల్లలందరూ తప్పకుండా అంతం వరకూ సహిస్తారు.
నిర్గమకాండము 5:10-14
కాబట్టి ప్రజలు కార్య నియామకులును వారి నాయకులును పోయి ప్రజలను చూచినేను మీకు గడ్డి ఇయ్యను; మీరు వెళ్లి మీకు గడ్డి యెక్కడ దొరకునో అక్కడ మీరే సంపాదించు కొనుడి, అయితే మీ పనిలో నేమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెననిరి. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్య కాలు కూర్చుటకు ఐగుప్తు దేశమం దంతటను చెదిరి పోయిరి. మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటివలెనే యేనాటిపని ఆనాడే ముగించుడనిరి. ఫరో కార్య నియామకులు తాము ఇశ్రాయేలీయులలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టిఎప్పటివలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏల చేయించలేదని అడుగగా-
ఈ వచనాలలో ఫరో ఆజ్ఞాపించినట్టుగానే ఆ కార్యనియామకులు ఇశ్రాయేలీయుల పట్ల ప్రవర్తించినప్పుడు, వారు కట్టెలద్వారా ఇటుకలను కాల్చడానికి ప్రయత్నించడం, అయినప్పటికీ ముందటి సంఖ్యలో ఇటుకలను తయారు చెయ్యలేకపోవడంతో, ఆ అధికారుల చేతిలో ఇశ్రాయేలీయుల ప్రజల పక్షంగా ఉన్న నాయకులు (పని విషయంలో జవాబుదారులు) శిక్షించబడడం మనం చూస్తాం. ఇది ఇశ్రాయేలీయులకు సంభవించిన ఒక పరీక్షగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాగ్దానాలను సులభంగానే పొందేసుకుంటామని ఎవరూ ఊహించుకోకూడదు. ఆ మధ్యలో లోకం నుండి ఎదుర్కోవలసిన శ్రమలూ, దానితో చెయ్యవలసిన పోరాటాలు చాలానే ఉంటాయి. ఈ విషయాన్ని మనం కూడా మన వాగ్దానం విషయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి.
అపో.కార్యములు 14: 22 శిష్యుల మనస్సులను దృఢపరచివిశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.
నిర్గమకాండము 5:15-19
ఇశ్రాయేలీయుల నాయకులు ఫరో యొద్దకు వచ్చితమ దాసుల యెడల తమ రెందుకిట్లు జరిగించుచున్నారు? తమ దాసులకు గడ్డినియ్యరు అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు; చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు; అయితే తప్పిదము తమరి ప్రజలయందే యున్నదని మొఱపెట్టిరి. అందుకతడుమీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్లి యెహోవాకు బలినర్పించుటకు సెలవిమ్మని మీరడుగు చున్నారు. మీరు పొండి, పనిచేయుడి, గడ్డి మీకియ్య బడదు, అయితే ఇటుకల లెక్క మీరప్పగింపక తప్పదని చెప్పెను. మీ ఇటుకల లెక్కలో నేమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవియ్యగా, ఇశ్రాయేలీయుల నాయకులు తాము దురవస్థలో పడియున్నట్లు తెలిసికొనిరి.
ఈ వచనాలలో ఇశ్రాయేలీయుల (వారి నాయకుల) తొందరపాటు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు మోషే అహరోనులను వారియొద్దకు పంపి వారి నిర్గమం గురించి ప్రకటించినప్పుడు, అక్కడ చెయ్యబడిన అద్భుతాల ఆధారంగా వారందరూ ఆ మాటలను విశ్వసించి ఎంతగానో సంతోషపడి ఆయనను స్తుతించారు (నిర్గమకాండము 4:30,31). మోషే అహరోనులు వారికి ప్రకటించిన మాటలలో "దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడం" గురించి కూడా ఉంది. ఈ కారణంగా ఫరో, తమపై ఉన్న పనులభారాన్ని అధికం చేసినప్పుడు, ఆ పరిణామం దేవుడు అతని గురించి ప్రకటించినదానికి (కఠినపరుస్తాను) రుజువని భావించకుండా, ఈ శ్రమ వెనుకే మన విడుదల కూడా ఉందని సహించకుండా, ఆ ఫరో వద్దకే పరుగెత్తారు. కనీసం ఈ విషయంలో మోషే అహరోనులను కూడా సంప్రదించలేకపోయారు. ఫలితంగా వారికి ఫరోవద్ద అవమానం తప్ప మరే ప్రయోజనమూ కలుగలేదు. దీనిని బట్టి మనం, దేవుడు ముందే హెచ్చరించిన కీడు జరుగుతున్నపుడు, ఆయనపై ఆధారపడడం మానేసి, ఆ కీడును తప్పించుకోవడానికి లోకాన్నే ఆశ్రయించాలని చూస్తే అవమానం తప్ప మరే ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోవాలి. పైగా ఇక్కడ ఇశ్రాయేలీయులు తామేదో కొత్తగా శ్రమలపాలైనట్టు "తాము దురవస్థలో పడియున్నట్లు" భావిస్తున్నారు. అది ఇంతకాలం వారు అనుభవించిన దురవస్థకు ముగింపు అని మాత్రం ధైర్యపడడం లేదు.
1పేతురు 5: 10 తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు, "కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట" తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును.
నిర్గమకాండము 5:20,21
వారు ఫరో యొద్దనుండి బయలుదేరి వచ్చుచు, తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలిసికొని యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చును గాక; ఫరో యెదుటను అతని దాసుల యెదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారిచేతికి ఖడ్గ మిచ్చితిరని వారితో అనగా-
ఈ వచనాలలో ఇశ్రాయేలీయులు దేవుని ప్రతినిధులైన మోషే అహరోనులకు వ్యతిరేకంగా మాట్లాడడం మనం చూస్తాం. పైగా వీరు ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమ అంతటికీ మోషే అహరోనులే కారణమైనట్టు "మమ్ము చంపుటకై వారిచేతికి ఖడ్గ మిచ్చితిరని" నిందలు కూడా వేస్తున్నారు. నేడు సంఘాన్ని వాక్యభిన్నమైన బోధలు, ఆచారాల నుండి విడిపించడానికి ప్రయాసపడే సేవకులపైన కూడా ఇదేవిధంగా "మీ వల్లే అన్యులముందు దేవుని నామం చులకన అయిపోతుంది", "మీరు చేస్తున్న వాదనల కారణంగానే సువార్త ప్రకటనకు ఆటంకం కలుగుతుంది" వంటి అన్యాయపు విమర్శలు చెయ్యబడుతుంటాయి. కానీ ఈ విషయంలో ఎవరూ కూడా మనస్తాపానికి గురై దేవుడు సంఘం విషయంలో అప్పగించిన బాధ్యతల నుండి వైదొలగిపోకూడదు.
నిర్గమకాండము 5:22,23
మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లిప్రభువా, నీవేల ఈ ప్రజలకు కీడు చేసితివి? నన్నేల పంపితివి?నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటినుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదనెను.
ఈ వచనాలలో ప్రజలమాటలను బట్టి మనస్తాపానికి గురైన మోషే, దేవుడు తనతో ముందుగా చెప్పిన విషయాన్ని మరచిపోయి, ఆ ప్రజలలానే ఆయనను నిందించేవిధంగా ప్రార్థించడం మనం చూస్తాం. దేవుడు ఈ మోషేను ఐగుప్తుకు పంపేముందే "నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనియ్యడు" ( నిర్గమకాండము 4:21) అని వివరంగా చెప్పి పంపించాడు. అయినప్పటికీ మోషే ఇక్కడ "నీ జనులను నీవు విడిపింపను లేదని" ప్రార్థిస్తున్నాడు. దీనిని బట్టి మోషేయైనా ఏలియాయైనా మనవంటి స్వభావం గల మనుషులే అని, వారిలో కూడా లోపాలు ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు కృప చూపించకపోతే వారు కూడా ఆయన ప్రవక్తలుగా ఉండడానికి అనర్హులు.
అదేవిధంగా నేను పైన చెప్పినట్టు మోషే ఈవిధంగా ప్రవర్తించడానికి ఆ ప్రజల మాటలను బట్టి మనస్తాపానికి గురవ్వడమే కారణం. లేకపోతే ఫరో వద్దనుండి వెళ్ళగానే లేక, ఫరో ఇశ్రాయేలీయులపై భారాన్ని అధికం చెయ్యగానే ఈ ప్రార్థన చేసేవాడు. కానీ ఆ ప్రజలు నిందించిన తరువాతే ఇలా ప్రార్థించడాన్ని బట్టి దానికి కారణం వారి మాటలను బట్టి మనస్తాపం చెందడమే అని మనకు అర్థమౌతుంది. కాబట్టి దేవుని పక్షంగా నిలిచిన మనం ఎప్పుడైతే ప్రజలనుండి వచ్చే నిందలను లక్ష్యపెట్టడం ప్రారంభిస్తామో, వాటివల్ల మనస్తాపానికి గురై మోషేలానే దేవునిపై నిందలు వేసే స్థితికి చేరుకుంటామని గుర్తుంచుకోవాలి. అందుకే నిందలను పట్టించుకోవడం మానేసి ప్రభువు ఆదేశాలను పాటించడానికి ప్రయాసపడాలి.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
నిర్గమకాండము అధ్యాయము 5

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"