విషయసూచిక:- 36:1 , 36:2, 36:3 , 36:4-7 , 36:8-38 .
నిర్గమకాండము 36:1
పరిశుద్ధస్థలముయొక్క సేవనిమిత్తము ప్రతివిధమైన పనిచేయ తెలిసికొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞావివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరును యెహోవా ఆజ్ఞాపించిన అంతటిచొప్పున చేయుదురనెను.
గత అధ్యాయంలో ప్రత్యక్షగుడారం మరియు దాని పరిచర్య సంబంధమైన వస్తువుల తయారికీ కావలసిన వెండి బంగారం వజ్రాలు మొదలైన వస్తువులనన్నిటినీ ఇశ్రాయేలీయులు మనస్పూర్తిగా మోషే యొద్దకు తీసుకువచ్చినట్టు మనం చూసాం. ఇక ఈ అధ్యాయం నుండి అలా తీసుకువచ్చిన వస్తువులతో బెసలేలు మరియు అతని బృందం కలసి ప్రత్యక్షగుడారాన్ని నిర్మించడం దానిసంబంధమైన వస్తువులను తయారు చెయ్యడాన్ని మనం చూస్తాం. ఇక్కడ బెసలేలు మరియు అతని బృందం తమ తయారీకి కావసిన వస్తువులు సమకూడగానే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా పని ప్రారంభిస్తున్నారు. ఈ ప్రారంభసంఘం చూపిస్తున్న మాదిరి మన నూతనసంఘానికి ఎంతో మాదిరికరం. మనం కూడా తన పనికి అవసరమైన తలాంతులను, వనరులను ఆయన అనుగ్రహించగానే ఆ పనిని త్వరపడి ప్రారంభించాలి.
2తిమోతికి 4:5 శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.
తీతుకు 3:14 మన వారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్‌క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను.
కాబట్టి ప్రస్తుత సంఘాల్లో తలాంతులు వనరులు ఉండి కూడా వాటిద్వారా పని జరగట్లేదంటే వారు పని చెయ్యట్లేదని అర్థం. ఇలా ఉండకూడదు. దానివల్ల దేవుడిచ్చిన తలాంతులనూ వనరులనూ గొయ్యితీసి కప్పెట్టినట్టు ఔతుంది, మరి ఆయన వాటికోసం లెక్క అడిగినప్పుడు మనమేం చెబుతాం? ఆయన వాటిని వడ్డీతో చెల్లించమంటే మనమేం చెల్లిస్తాం? (మత్తయి 25:14-30).
నిర్గమకాండము 36:2
బెసలేలును అహోలీ యాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారి నందరిని మోషే పిలిపించెను.
ఈ వచనంలో మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టుగా బెసలేలును అహోలీయాబును మరియు వారి బృందాన్ని తన యొద్దకు పిలిపించడం మనం చూస్తాం. ఈ ఇద్దరి గురించీ నేను గత అధ్యాయంలోనూ అలానే 31వ అధ్యాయంలోనూ వివరించాను (నిర్గమకాండము 31:1-6 వ్యాఖ్యానం చూడండి). ఇక్కడ జరుగుతుంది గమనించండి. మోషేకు దేవుడు బెసలేలు మరియు అహోలీయాబుల గురించి తెలియచెయ్యగానే మోషే వారిని పిలిపిస్తున్నాడు. బెసలేలు మరియు అహోలీయాబులను దేవుడు ప్రత్యక్షగుడారం మరియు దాని పరిచర్య సంబంధమైన వస్తువులను తయారుచేసేవారిపై నాయకులుగా నిర్ణయించి వారిని తన ఆత్మతో నింపాడు. మోషే ఆ సమాజమంతటికీ నాయకుడిగా ఉన్నాడు. అందుకే అతను బెసలేలును మరియు అతని బృందాన్ని పిలిపించి వారికి పని అప్పగిస్తున్నాడు. కాబట్టి సంఘం మరియు సంఘ నాయకులు తమ నాయకత్వం క్రింద ఉన్నవారిలో ఎవరు ఎలాంటి తలాంతులను కలిగియున్నారో ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారికి పరిచర్య పనులను అప్పగిస్తూ ఉండాలి. మోషేకు దేవుడు చెబితేనే కానీ బెసలేలును ఆయన జ్ఞానాత్మతో నింపినట్టు తెలియకపోవచ్చు, కానీ సంఘం మరియు సంఘ నాయకులు తమ నాయకత్వం క్రింద ఉన్నవారిని వ్యక్తిగతంగానూ శ్రద్ధగానూ గమనిస్తున్నప్పుడు దేవుడు వారిలో ఎవరికి ఎలాంటి తలాంతులను అనుగ్రహించాడో గుర్తించడం సాధ్యమే. కాబట్టి వెంటనే ఆ తలాంతులు కలిగినవారిని ప్రోత్సహిస్తూ ఆ తలాంతులకు తగిన పనుల్లో వారిని నియమించాలి. ఇది సంఘం మరియు సంఘ నాయకులపై ఉన్న బాధ్యత. ప్రారంభసంఘంలో కూడా ఆత్మతో నింపబడిన ఏడుగురు మనుష్యులను ఎన్నుకునే బాధ్యతను అపోస్తలులు ఆ సంఘంపైనే పెట్టినట్టు మనం చదువుతాం (అపో.కా 6:1-6).
నిర్గమకాండము 36:3
ఆ పని చేయుటకై వారు పరిశుద్ధస్థలముయొక్క సేవకొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటిని మోషేయొద్ద నుండి తీసికొనిరి. అయినను ఇశ్రాయేలీయులు ఇంక ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి.
ఈ వచనంలో బెసలేలు మరియు అతని బృందం ఇశ్రాయేలీయులు తీసుకువచ్చిన అర్పణలను మోషేయొద్దనుండి తీసుకోవడం మనం చూస్తాం. అలానే ఆ ప్రజలు తమ అర్పణలను ఏదో ఒకసారి ఇచ్చేసి ఆగిపోకుండా మళ్ళీ మళ్ళీ తీసుకువస్తున్నారు. బహుశా వారు మోషే చెప్పినప్పుడు బంగారం వెండి ఇత్తడి వంటివి వెంటనే ఇచ్చేసియుండవచ్చు. కానీ చర్మాలు మరియు సన్నపునార, అడవులనుండి కొట్టుకురావలసిన తుమ్మకర్ర వంటివి ఒకేసారి ఇవ్వలేరు కాబట్టి, వాటిని వారు రోజూ కొంచెం కొంచెంగా ఇస్తూవచ్చారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవునికి ఇచ్చే విషయంలో మనందరికీ ఎంతో మాదిరికరంగా ప్రవర్తిస్తున్నారు. వారు ప్రతీరోజూ ఇస్తున్నారు, ఆ ఇచ్చేవాటికోసం ప్రతీరోజూ కష్టపడుతున్నారు కూడా. కాబట్టి మనం కూడా దేవునికోసం ఏదో కొంత చేసి అంతా అయిపోయిందిలే, మా బాధ్యత తీరిపోయిందిలే అనుకోకుండా ఆయన మనకు సమృద్ధిని అనుగ్రహిస్తున్న కొద్దీ ఇచ్చేవారిగా ఉండాలి, శారీరక శక్తినీ మరియూ జ్ఞానాన్నీ దయచేస్తున్న కొద్దీ ఆయనకోసం పని చేసేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు చెబుతున్న ఈ మాటలు పరిశీలించండి.
లూకా సువార్త 17:7-10 దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైన ఒక దాసుడుండగా, వాడు పొలములోనుండి వచ్చి నప్పుడునీవు ఇప్పడే వెళ్లి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాకనేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి, నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొనువరకు నాకు పరిచారము చేయుము; అటుతరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా? అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాతమేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.
నిర్గమకాండము 36:4-7
అప్పుడు పరిశుద్ధస్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయుపని విడిచివచ్చి మోషేతోచేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవకొరకు ప్రజలు కావలసిన దానికంటె బహు విస్తారము తీసికొని వచ్చుచున్నారని చెప్పగా మోషే పరిశుద్ధస్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీయైనను ఇకమీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను గనుక పాళె మందంతటను ఆ మాట చాటించిరి; ఆ పని అంతయు చేయునట్లు దానికొరకు వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసికొనివచ్చుట మానిరి.
ఈ వచనాల్లో ఇశ్రాయేలీయులు అత్యధికంగా తమ అర్పణలు తేవడం, అది చూసిన బెసలేలు బృందం మోషేకు విన్నవించుకున్నప్పుడు మోషే ఇక ఎవరూ అర్పణలు తేవద్దని చాటింపు వేయించడం మనం చూస్తాం. ఇక్కడ బెసలేలు బృందం ప్రజలు వస్తువుల తయారీకంటే ఎక్కువగా అర్పణలు తీసుకువస్తున్నప్పుడు ఆ మిగిలినవి మనం తీసుకుందాంలే, ఎలాగూ మనం చాలా కష్టపడుతున్నాము కదా అని ఆలోచించలేదు. వెంటనే మోషేతో చెప్పారు. నాయకుడిగా ఉన్న మోషే కూడా ఆ అర్పణల్లో మిగిలినవి తను కొంచెం తీసుకుందామని కానీ లేక వాటితో వేరే ఇంకేవో తయారు చేయిద్దామని కానీ ఆలోచించలేదు వెంటనే ఇంక ఎవరూ అర్పణలు తేవొద్దని చాటింపు వేయించాడు. ఇక్కడ మోషే మరియు బెసలేలు బృందం తమ పతనస్వభావాన్ని అధిగమిస్తూ ఇలాంటి నిజాయితీని కనుపరిచారు. ఎందుకంటే సాధారణంగానే పతనస్వభావులమైన మనలో విస్తారమైన ధనాన్ని చూసినప్పుడు కొంత దాచుకుందామని కానీ లేకపోతే దానితో ఇతర పనులు చేద్దామని కానీ ఆలోచనలు కలగడం సహజం. మోషే మరియు బెసలేలు బృందాలు కనుక ఇలానే ఆలోచించియుంటే దేవునిదృష్టిలో దురాశపరులుగా, తన పరిచర్యను అడ్డుపెట్టుకుని అమాయకప్రజలను దోచుకున్నవారిగా గద్దించబడేవారు.
కాబట్టి ప్రారంభ సంఘ నాయకులైన మోషే మరియు బెసలేలులు చూపించిన ఈమాదిరి మన సంఘనాయకులు కూడా చూపిస్తే వారికి ఎంతో మేలు కలుగుతుంది. ఇశ్రాయేలీయులు కనుక మోషేను కానీ బెసలేలును కానీ మేము ఇచ్చిన అర్పణలను ఎలా ఉపయోగించారని అడిగితే వారు వెంటనే లెక్కలు చెప్పగలరు. మరి అలాంటి పారదర్శకత మన సంఘనాయకులు చూపించగలుగుతున్నారా?
1కోరింథీయులకు 4:2 మరియు గృహనిర్వా హకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము.
లేదంటే పరిచర్యకోసం కానుకలు ఇస్తున్న ప్రతీఒక్కరూ ఇప్పుడే వారిని ప్రశ్నించండి. ఎందుకంటే సంఘనాయకులు సంఘానికి ప్రతీవిషయంలోనూ జవాబుదారులుగా ఉండాలి. అలాలేని సంఘనాయకులు మీకు ఎంత చక్కగా వాక్యం బోధిస్తున్నప్పటికీ ఆ విషయంలో కఠినంగా సరిచెయ్యబడవలసిందే. ఇందులో ఎలాంటి మొహమాటానికీ తావులేదు. సంఘం దేవునిది. ఆయన సంఘనాయకుల్ని నియమించింది సేవకులుగానే తప్ప స్వలాభంకోసం పన్నులు వసూలు చేసే ప్రభువులుగా కాదు.
1 పేతురు 5:1-3 తోటిపెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్ట పూర్వకముగాను, దుర్లాభా పేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి.
కాబట్టి మీరు ఇచ్చిన కానుకల విషయంలో జవాబుదారులుగా లేని సంఘనాయకులను ప్రశ్నించడం, సరిచెయ్యడం సంఘంగా ప్రభువు మీకు అప్పగించిన బాధ్యత. ఈవిషయంలో మీరు విఫలం కావొద్దు.
నిర్గమకాండము 36:8-38
ఆ పని చేసినవారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును పది తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేసెను. ప్రతి తెరపొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు; ఆ తెరలన్నిటి కొలత ఒక్కటే. అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్చెను; మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలినూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను. ఒక తెరలో ఏబది కొలుకులను చేసెను, రెండవ కూర్పునున్న తెర అంచున ఏబదికొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒక దానితో ఒకటి సరిగా నుండెను. మరియు అతడు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒక దానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను. మరియు మందిరముమీద గుడారముగా మేకవెండ్రుక లతో తెరలను చేసెను; వాటిని పదకొండు తెరలనుగాచేసెను. ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగుమూరలు; ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే. అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చెను. మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబదికొలుకులను చేసెను. మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబది కొలుకు లను చేసెను. ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు ఏబది యిత్తడి గుండీలను చేసెను. మరియు ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను. మరియు అతడు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేసెను. పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర. ప్రతి పలకకు ఒకదాని కొకటి సమదూరముగల కుసులు రెండు ఉండెను. అట్లు మంది రముయొక్క పలకలన్నిటికి చేసెను. కుడివైపున, అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను. ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, ఆ యిరువది పలకల క్రింద నలుబది వెండి దిమ్మలను చేసెను. మందిరముయొక్క రెండవ ప్రక్కకు, అనగా ఉత్తర దిక్కున ఇరువది పలకలను వాటి నలుబది వెండి దిమ్మలను, అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మ లను చేసెను. పడమటి దిక్కున మందిరముయొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేసెను. వెనుకప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేసెను. అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరముదాక ఒక దానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు రెండు మూలలలో ఆ రెండు పలకలు చేసెను. ఎనిమిది పలక లుండెను; వాటి వెండి దిమ్మలు పదునారు దిమ్మలు; ప్రతి పలక క్రింద రెండు దిమ్మలుండెను. మరియు అతడు తుమ్మ కఱ్ఱతో అడ్డకఱ్ఱలను చేసెను. మందిరముయొక్క ఒకప్రక్క పలకకు అయిదు అడ్డ కఱ్ఱలను మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను, పడమటివైపున మందిరము యొక్క వెనుక ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను చేసెను. పలకల మధ్యనుండు నడిమి అడ్డకఱ్ఱను ఈ కొననుండి ఆ కొనవరకు చేరియుండ చేసెను. ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకు బంగారు రేకులను పొదిగించెను. మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణములుగల అడ్డతెరను పేనిన సన్ననారతో చేసెను, చిత్రకారునిపనియైన కెరూబులుగలదానిగా దాని చేసెను. దాని కొరకు తుమ్మకఱ్ఱతో నాలుగు స్తంభములనుచేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి, వాటికొరకు నాలుగు వెండి దిమ్మలను పోతపోసెను. మరియు అతడు గుడారపు ద్వారముకొరకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో బుటా పనియైన అడ్డ తెరను చేసెను. దాని అయిదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను; వాటి అయిదు దిమ్మలు ఇత్తడివి.
ఈ వచనాల్లో ప్రత్యక్షగుడార నిర్మాణపనిని మనం చూస్తాం. వీటిగురించి నేను ఇప్పటికే వివరించాను (నిర్గమకాండము 26 వ్యాఖ్యానం చూడండి). అక్కడ దేవుడు ఏం చెయ్యమన్నాడో రాయబడితే, ఇక్కడ ఏం చెయ్యబడుతున్నాయో రాయబడుతున్నాయి. ఈవిషయంలో నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను పంచుకుంటాను. ఎందుకంటే కొందరు మోషే గతంలో రాసినవాటినే మరలా ఇక్కడినుండి రాయడాన్ని బట్టి ఈ అధ్యాయాలను చదవడానికి ఇబ్బందిపడుతుంటారు. ఇక్కడినుంచి ఏమీ లేదులే అన్నట్టుగా దాటవేస్తుంటారు. అందుకే ఈ విషయాలు చదవవండి.
1. నిర్గమకాండము రాస్తుంది మోషే. రాయడమంటే ఆ కాలంలో మనకులా పెన్నులు, పేపర్లు లేవు. వారు చర్మపు కాగితాలపై కానీ పైపారస్ పై కానీ దీపపు బూడిదను ఇంకుగా చేసి సూదివంటి దానితో అందులో ముంచుతూ రాసేవారు. ఆ క్రమంలో ఒక అక్షరం రాయడానికే వారికి కొన్ని సెకన్ల సమయం పట్టవచ్చు. అంటే అలా రాయడం చాలా ప్రయాసతో కూడుకున్న పని అన్నమాట. అయితే ఈ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు బెసలేలు బృందం చేసినట్టుగా వివరించబడుతున్నవన్నీ గతంలో దేవుడు చెప్పినప్పుడు మోషే వివరంగా రాసినవే. అలాంటప్పుడు మోషే ప్రయాసపడుతూ మరలా ఇంత వివరంగా రాయకుండా సులభంగా దేవుడు చెప్పినవన్నీ (గతంలో నేను రాసినవన్నీ) వారు చేసేసారని ముగించేస్తే సరిపోను. అతను ఒకవైపు ఆ పనులను పర్యవేక్షిస్తూ, ప్రజలకు తీర్పులు తీరుస్తూ మరలా ఇవన్నీ రాయడమంటే కనీసం అతను సరిగా నిద్రపోయికూడా ఉండేవాడు కాదేమో. కానీ మళ్ళీ ఎందుకు ఇలా వివరంగా రాస్తున్నట్టు? ఎందుకంటే, అతను ఇలా రాయడం ద్వారా దేవుడు తనతో ఏమైతే, ఎలాగైతే చెయ్యాలని ఆజ్ఞాపించాడో వాటినే నేను చేయించాను, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఏ పనీ చెయ్యించలేదని రుజువుచెయ్యాలి అనుకున్నాడు. ఉదాహరణకు; అతనికి దేవుడు నలబైవీసల బంగారంతో దీపవృక్షాన్ని చెయ్యమని ఆజ్ఞాపించాడు, ఎలా చెయ్యాలో కూడా తెలియచేసాడు (నిర్గమకాండము 25:31-39). ఇప్పుడు మోషే దేవుడు చెప్పిన అంతే బంగారంతో అదేరూపంలో దానిని తయారుచేయించాడు (నిర్గమకాండము 37:17-24). ఈవిధంగా అతను దేవుని ఆజ్ఞలకు కొంచెమైనా విరుద్ధంగా పని చెయ్యని దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన సేవకుడని మరోసారి నిరూపించుకున్నాడు. ఈరోజు దేవునిసంఘంలో కూడా ఈ మాదిరే మనకు అనుసరణీయం. మోషే ప్రత్యక్షగుడారంలో చేసిన వస్తువులూ నియమించిన సేవలూ కచ్చితంగా దేవుడు ఆజ్ఞాపించినవే అయినట్టుగా మనం కూడా సంఘపరిచర్యను ఆయన పూర్తి ఆజ్ఞల పరిధిలో కొనసాగించాలి. జీవముగల దేవుని సంఘంలో మనకు మనంగా క్రొత్త పద్ధతులను కల్పించుకోకూడదు.
2. పరిశుద్ధ లేఖనాల్లో వీటి వివరాలు మరలా ప్రస్తావించబడడం ద్వారా, దేవుడు చెప్పిందే ప్రత్యక్షగుడారం విషయంలో జరిగిందని ఇశ్రాయేలీయుల ప్రజలకు మరింత నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఇశ్రాయేలీయుల చరిత్రలో సామన్య ప్రజలెవరూ ప్రత్యక్షగుడారంలో ప్రవేశించి మోషే దేవుడు ఆజ్ఞాపించినవన్నీ అలానే చేయించాడా, లేక ఎక్కడైనా పొరపాటు చేసాడా (ఏదైనా మర్చిపోయాడా) అని పరీక్షించుకునే అవకాశం ఉండదు. కానీ అతను మరలా వాటిని స్పష్టంగా రాయడం ద్వారా దేవుడు ఆజ్ఞాపించిన వస్తువులన్నీ ఆయన చెప్పినవిధంగానే మోషే తయారుచేయించాడని వారికి స్పష్టత లభిస్తుంది. ఒకవేళ అతను పొరపాటున దేవుడు చెప్పినదానికి వ్యతిరేకంగా ఏమన్నా చేయించియుంటే అతను అబద్ధికుడు కాదు కాబట్టి, ఆ విషయం ప్రజలకు బాగా తెలుసు కాబట్టి దేవుడు చెప్పిందే అతను చేయించినట్టుగా రాయలేడు కదా!. కాబట్టి ప్రజలకు మరింత నమ్మకం కలగడానికే అవి ఇలా రాయబడ్డాయి. ఈవిధంగా ఆలోచించినప్పుడు మన దేవుడు నూతననిబంధనలో ఒకే యేసుక్రీస్తు చరిత్రను నలుగురు చేత రాయించింది కూడా ఇందుకే అని మనం అర్థం చేసుకోవాలి. ఆ రచయితలు వేరువేరు కోణాల్లో ఆయన కార్యాలను లేక చరిత్రను లిఖించినప్పటికీ వాటి సందేశం మాత్రం ఒకటే. సువార్తల విషయంలో మాత్రమే కాదు, మిగిలిన లేఖనాల్లో కూడా ఒకేవిధమైన మాటలు మరలా మరలా ప్రస్తావించబడిన కారణం వాటియొక్క యధార్థతను నొక్కిచెప్పడం మరియు మనల్ని వాటి విషయంలో మరింత నమ్మకంగా ఉండేలా చెయ్యడమే. ఉదాహరణకు ఈ వాక్యభాగాలు చూడండి.
ఫిలిప్పీయులకు 3:1 మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము.
2పేతురు 1:12 కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను.
3. లేఖనాలు రాసింది మనుషులే అయినప్పటికీ వారు రాసేలా ప్రేరేపించింది మాత్రం పరిశుద్ధాత్ముడే అని మనందరికీ తెలుసు (2 తిమోతీ 3:16,17, 2 పేతురు 1:21). ఇప్పుడు మోషే చేత రాయిస్తుంది కూడా ఆయనే. ఆ కోణంలో ఆలోచించినప్పుడు మోషే చేత దేవుడు తాను ఆజ్ఞాపించినవాటిని ఎంత వివరంగా రాయించాడో, ఆ ఆజ్ఞల ప్రకారంగా వారు పని చేస్తున్నప్పుడు కూడా అంతే వివరంగా రాయించాడు. ఇది ఆయన ఆజ్ఞలప్రకారం పని చేస్తున్నవారికి లేక నడుచుకుంటున్నవారికి ఆయన ఇస్తున్నటువంటి గొప్ప విలువగా మనం భావించవచ్చు. మనం కూడా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటున్నప్పుడు ఆయన దృష్టిలో అంతే విలువను పొందుకుంటాం. కాబట్టి వాటి విషయంలో ఎక్కడా తొలగిపోకుండా జాగ్రత్తవహించాలి. గమనించండి, బెసలేలు మరియు అతని బృందం ముందు దేవుడు ఆజ్ఞాపించిన ఎంతో సంక్లిష్టమైన కష్టతరమైన పనులు ఉన్నప్పటికీ వారు వాటిని చేసేవిషయంలో ఎక్కడా పొరపాటు చెయ్యలేదు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసి చూపించారు. ఎందుకంటే వారికి ఆయన ఆజ్ఞానుసారమైన ఆ పనులపట్ల అంత ఆసక్తి ఉంది, ముఖ్యంగా దేవుడు వారిని తన ఆత్మతో జ్ఞానంతో నింపాడు. అలాంటప్పుడు మనం కూడా నిజంగా ఆయన ఆత్మచేత నడిపించబడుతుంటే, ఆయన ఆజ్ఞలపట్ల ఆసక్తి కలిగియుంటే మనం వాటిని అలానే అనుసరించగలం. కొన్నిసార్లు అవి మన పతనస్వభావాన్ని బట్టి కష్టతరంగా అనిపించినప్పటికీ అనుసరించగలం (ఆయన పరిచర్య కోసం పనిచెయ్యగలం).
1యోహాను 5:3 మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
నిర్గమకాండము అధ్యాయం 36

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"