విషయసూచిక:- 24:1, 24:2, 24:3 , 24:4,5, 24:6 , 24:7 ,24:8 , 24:9,10 , 24:11 , 24:12 , 24:13 , 24:14 , 24:15-17 , 24:18
నిర్గమకాండము 24:1
మరియు ఆయన మోషేతో ఇట్లనెనునీవును, అహరోనును, నాదాబును, అబీహును, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి.
ఈ వచనంలో దేవుడు మోషేకు తనతో పాటుగా అహరోను, నాదాబు, అబీహు అనేవారినీ మరియు ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందిని తీసుకుని ఆయనవద్దకు ఎక్కివచ్చి దూరంగా సాగిలపడాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. 19-23 అధ్యాయాల ప్రకారం; ఆయన సీనాయి పర్వతంపైకి దిగివచ్చి మోషేతో మాట్లాడాడు. కాబట్టి ఈ సందర్భంలో వారిని రమ్మంటుంది ఆ సీనాయి పర్వతంపైకే. ఇక ఈ వచనాలలో మనకు కనిపిస్తున్న నాదాబు, అబీహులు అహరోను కుమారులు (నిర్గమకాండము 6:23). మిగిలిన 70మంది పెద్దలు ఇశ్రాయేలీయుల గోత్రాలకు ప్రతినిధులుగా నియమించబడినవారు.
నిర్గమకాండము 19-11-25 వచనాల ప్రకారం; గతంలో ఆయన మోషేను తప్ప ఎవర్నీ ఆ పర్వతంపైకి రమ్మనలేదు. ఎవరైనా ఆ పర్వతాన్ని సమీపిస్తే మరణశిక్ష విధించమన్నాడు. కానీ ఇప్పుడైతే ఆయన మోషేతో పాటు అహరోనునూ అతను ఇద్దరు కుమారులనూ, ఇశ్రాయేలీయుల పెద్దలు 70 మందినీ కూడా ఆ పర్వతంపైకి ఎక్కిరమ్మంటున్నాడు. కాబట్టి ఎవరైనా సరే దేవుని సన్నిధిని సమీపించాలంటే; ఆయన ఆజ్ఞ ప్రకారమే సమీపించగలమని మనం అర్థం చేసుకోవాలి. ఆయన సెలవు లేనిదే ఎవరూ కూడా ఆయన సన్నిధిని సమీపించే అర్హతను పొందుకోలేరు.
అదేవిధంగా ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన సన్నిధికి సమీపించివారు, ఆయన మాటలకు విధేయత చూపించడం తప్పనిసరి. అలా లేకుండా ఆయననుండి కఠినమైన శిక్షను పొందుకోక తప్పదు. ఉదాహరణకు; ఈ సందర్భంలో మోషేతో పాటు ఆ పర్వతంపైకి ఎక్కిపోయిన అహరోను కుమారులైన నాదాబు అబీహులు దేవునిమాటలకు అవిధేయత చూపించిన కారణంగా దారుణంగా చనిపోయారు (లేవీకాండము 10:1,2). ఇశ్రాయేలీయుల పెద్దలైన ఆ 70మంది కూడా, ప్రజల ప్రతినిధులుగా తమ బాధ్యతను విస్మరించినందుకు ఉరితీయబడ్డారు (సంఖ్యాకాండము 25:4). కాబట్టి ఈరోజు యేసుక్రీస్తును బట్టి దేవుని సన్నిధిలోకి ప్రవేశిస్తున్న మనమందరం ఆయన ఆజ్ఞల విషయంలో జాగ్రత్తకలిగి నడుచుకోవాలి. ఆయనను సమీపిస్తేనే సరిపోదు. ఆయనకు అన్ని విషయాలలోనూ విధేయత చూపించాలి.
నిర్గమకాండము 24:2
మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు.
ఈ వచనంలో మోషే మాత్రమే యెహోవాను సమీపించాలని ఆజ్ఞాపించబడడం మనం చూస్తాం.
మోషేతో పాటు పర్వతంపైకి ఎక్కిన అహరోను మరియు అతని ఇద్దరు కుమారులు, పెద్దలు 70 మందీ ఆ పర్వతంపైకి ఎక్కి దూరంగా సాగిలపడాలే తప్ప మోషేతో పాటు దేవుణ్ణి సమీపించకూడదు (దేవుడు దిగివచ్చే ఆ ప్రత్యేకమైన స్థలానికి చేరుకోకూడదు). ప్రజలైతే అసలు ఆ పర్వతంపైకే ఎక్కకూడదు. ఇక్కడ కూడా మనకు దేవుని సార్వభౌమ అధికారం కనిపిస్తుంది. ఆయనకు అత్యంత దగ్గరగా ఎవరు సమీపించాలని ఆయన పిలుచుకుంటాడో వారు మాత్రమే ఆయనను సమీపించగలరు.
నిర్గమకాండము 24:3
మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరుయెహోవా చెప్పినమాట లన్నిటి ప్రకారము చేసెదమని యేక శబ్దముతో ఉత్తరమిచ్చిరి.
ఈ వచనంలో మోషే యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలకు వివరించడం, అప్పుడు వారంతా దానికి సానుకూలంగా స్పందించడం మనం చూస్తాం. నిర్గమకాండము 20:17 వచనాల ప్రకారం; దేవుడు సీనాయి పర్వతంపైకి దిగివచ్చి ప్రజలంతా వినేలా తన పది ఆజ్ఞలను తన నోటితో పలికాడు. అప్పుడు ప్రజలంతా ఆ స్వరానికి భయకంపితులై మోషేను వేడుకున్నారు.
నిర్గమకాండము 20:18,19 ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడిన యెడల మేము చనిపోవుదుము.
20:21 వ వచనం ప్రకారం; అప్పుడు మోషే ఒకడే దేవుణ్ణి సమీపించి, ఆయన ఆజ్ఞలను విన్నాడు. నిర్గమకాండము 20:22వ వచనం నుండి, ఈ అధ్యాయం మొదటి రెండు వచనాలలో (24:1,2) రాయబడిన మాటలన్నీ ఆయన మోషేకు ఆజ్ఞాపించాడు. ఈ వచనంలో మోషే ఆ పర్వతంనుండి దిగివచ్చి ఇప్పటివరకూ దేవుడు పలికిన ఆ మాటలనూ విధులనూ ప్రజలకు వివరించాడు. ఆ మాటలూ విధులూ విన్న ప్రజలంతా ఈ వచనంలో "యెహోవా చెప్పినమాట లన్నిటి ప్రకారము చేసెదమని యేక శబ్దముతో ఉత్తరమిస్తున్నారు".
నిర్గమకాండము 24:4,5
మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి ఇశ్రాయేలీయులలో యౌవనస్థులను పంపగా వారు దహనబలుల నర్పించి యెహోవాకు సమా ధానబలులగా కోడెలను వధించిరి.
ఈ వచనాలలో మోషే ఇప్పటివరకూ యెహోవా చెప్పినమాటలన్నీ రాసి, కొండ దిగువున ఒక బలిపీఠం కట్టి, ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల లెక్కచొప్పున పన్నెండు స్థంబాలను నిలువబెట్టి, కొందరు యవ్వనస్తుల చేత ఆ బలిపీఠంపై బలులను అర్పింపచెయ్యడం మనం చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు దేవుడు వ్రాతపూర్వకంగా ఆ ప్రజలతో నిబంధన చెయ్యబోతున్నాడు. ఆ నిబంధన చెయ్యబడే ముందు ఆయనకు బలులను అర్పించడం తప్పనిసరి. ఉదాహరణకు; నోవహు దేవునికి బలి అర్పించిన తరువాత ఆయన అతనితో అతని సంతానంతో ఒక నిబంధన చేసాడు (ఆదికాండము 8:20,21, 9:8,9,10). అబ్రాహాము కూడా ఆయనకు బలి అర్పించిన తరువాత ఆయన అతనితో నిబంధన చేసాడు (ఆదికాండము 15:9-21). కాబట్టి నిబంధన చెయ్యబడే ముందు ఆయనకు బలి అర్పించడం తప్పనిసరి. ఇప్పుడు ఆయన ఇశ్రాయేలీయులతో కూడా నిబంధన చెయ్యబోతున్నాడు కాబట్టి ఆయనకు మోషే బలులను అర్పింపచేసాడు.
ఐతే; ఆయన నోవహుతో చేసిందీ, అబ్రాహాముతో చేసిందీ షరతులు లేని నిబంధన. ఈ విషయం నేను ఆయా సందర్భాలలో వివరించాను (ఆదికాండము 8,9,15 వ్యాఖ్యానాలు చూడండి). కానీ ప్రస్తుతం ఇశ్రాయేలీయులతో చెయ్యబడుతుంది మాత్రం షరతులతో కూడిన నిబంధన. అందుకే ఆయనకు బలి అర్పించే బలిపీఠం దగ్గర ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల లెక్కచొప్పున పన్నెండు స్థంబాలను మోషే నిలువబెట్టించాడు. 8వ వచనం ప్రకారం; మోషే బలి అర్పించబడిన రక్తాన్ని ప్రజలపై కూడా చల్లాడు. దానిప్రకారం; ప్రజలు కూడా దేవుడు చెయ్యబోతున్న ఆ నిబంధనకు విధేయులుగా నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ నిబంధన కొనసాగుతుంది.
నిర్గమకాండము 24:6
అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠముమీద ప్రోక్షించెను.
ఈ వచనంలో మోషే బలిగా అర్పించబడినవాటి రక్తాన్ని సగం బలిపీఠం మీద ప్రోక్షించడం మనం చూస్తాం. నేను పైన వివరించినట్టుగా ఇది నిబంధనకు సంబంధించిన రక్తం. ఈరోజు మనతో చెయ్యబడిన క్రొత్త నిబంధనకు కూడా రక్తమే కారణం. ఆ రక్తం మరెవరిదో కాదు ప్రభువైన యేసుక్రీస్తుదే. ఆయన చిందించిన రక్తం ద్వారానే దేవుడు మనతో క్రొత్తనిబంధన చేసాడు.
1కోరింథీయులకు 11:25 ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
నిర్గమకాండము 24:7
అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి.
ఈ వచనంలో మోషే అప్పటివరకూ రాసిన దేవుని కట్టడలను (నిబంధన గ్రంథాన్ని) ప్రజలకు వినిపించడం ప్రజలంతా ఆ మాటలకు సానుకూలంగా స్పందించడం మనం చూస్తాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. మోషే బలిపీఠంపై రక్తాన్ని ప్రోక్షించిన తరువాత ఆ నిబంధనా గ్రంథాన్ని ప్రజలకు వినిపిస్తున్నాడు. అంతకుముందే వారు ఆ మాటలన్నీ విన్నారు. కానీ ఇప్పుడు ఆ మాటలు గ్రంథంలో రాయబడిన తరువాత అతను మరలా అతను చదివి వినిపిస్తున్నాడు. ఎందుకంటే చిందించినబడిన రక్తాన్ని బట్టి ఆ మాటలు దేవునికి నిబంధన పరిథిలోకి వస్తున్నాయి. అప్పటినుండి ఆ మాటలు నిబంధనకు షరతులుగా ఉంటాయి.
నిర్గమకాండము 24:8
అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించిఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను.
ఈ వచనంలో మోషే దేవునికి బలిగా అర్పించబడినవాటి రక్తాన్ని ప్రజలపై కూడా చల్లి, అది నిబంధన రక్తమని చెప్పడం మనం చూస్తాం. మొదటిగా అతను బలిగా అర్పించబడినవాటి సగం రక్తాన్ని బలిపీఠంపై ప్రోక్షించాడు. ఇప్పుడు మిగిలిన ఆ సగాన్ని ప్రజలపై ప్రోక్షిస్తున్నాడు. ఈవిధంగా ఆ రక్తాన్ని బట్టి, దేవునికీ ఇశ్రాయేలీయులకూ మధ్యలో షరతులతో కూడిన నిబంధన చెయ్యబడింది. అదే మోషే ధర్మశాస్త్రం (పాతనిబంధన). ఈ క్రమాన్ని హెబ్రీ గ్రంథకర్త కూడా తన పుస్తకంలో ప్రస్తావించాడు.
హెబ్రీయులకు 9:18-20 ఇందుచేత మొదటి నిబంధనకూడ రక్తములేకుండ ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్రప్రకారము మోషే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పినతరువాత, ఆయన నీళ్లతోను, రక్తవర్ణముగల గొఱ్ఱెబొచ్చుతోను, హిస్సోపుతోను, కోడెలయొక్కయు మేకలయొక్కయు రక్తమును తీసికొని దేవుడు మీకొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు, గ్రంథముమీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను.
ఇది దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులతో చేసిన పాతనిబంధన ఐతే, అదే దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో క్రొత్తనిబంధన చేసాడు. ఈ నిబంధనలో చిందించబడిన రక్తం కూడా స్వయంగా ఆయనదే (1కోరింథీయులకు 11:25).
నిర్గమకాండము 24:9,10
తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు ఎక్కి పోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాద ములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశ మండలపు తేజమువంటిదియు ఉండెను.
ఈ వచనాలలో దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మోషే అహరోను మరియు అతని ఇద్దరి కుమారులు, ఇశ్రాయేలీయుల పెద్దలు 70మంది సీనాయి పర్వతంపైకి ఎక్కిపోయి, దేవుణ్ణి చూసినట్టు మనం చూస్తాం. మొదటిగా; ఇశ్రాయేలీయుల ప్రజలతో నిబంధన చెయ్యబడింది, రక్తం చిందించబడింది. ఆ తరువాత వీరు ఆ పర్వతంపైకి ఎక్కివెళ్ళి దేవుణ్ణి చూడగలిగారు. ఆ నిబంధనను బట్టే వీరికి ఆ ధన్యతదక్కింది. అలాగే యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనతో చెయ్యబడిన క్రొత్త నిబంధన కారణంగానే మనం దేవుణ్ణి సమీపించగలం.
హెబ్రీయులకు 10:20 ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది.
అదేవిధంగా; పర్వతంపైకి ఎక్కిపోయినవారు "ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి" అని ఇక్కడ చదువుతున్నాం. ఆ ప్రత్యక్షతలో "ఆయన పాద ములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశ మండలపు తేజమువంటిదియు ఉండెను" అని కూడా చదువుతున్నాం. కొందరు "ద్వితియోపదేశకాండము 4:12" లో రాయబడిన "యెహోవా ఆ అగ్ని మధ్యనుండి మీతో మాటలాడెను. మాటలధ్వని మీరు వింటిరిగాని యే స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి" అనే మాటలను ఇక్కడ ప్రస్తావించి, పై వచనంలోనేమో "ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి" అని రాయబడింది. ఇక్కడేమో "యే స్వరూపమును మీరు చూడలేదు" అని రాయబడిందేంటని సందేహపడుతుంటారు. కానీ ఇవి రెండూ వేరు వేరు సందర్భాలు. ద్వితియోపదేశకాండము 4:12 లో రాయబడిన "యెహోవా ఆ అగ్ని మధ్యనుండి మీతో మాటలాడెను. మాటలధ్వని మీరు వింటిరిగాని యే స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి" అని చెప్పబడింది ఈ సందర్భం గురించి కాదు, నిర్గమకాండము 19,20 అధ్యాయాలలో జరిగిన సంఘటన గురించి.
నిర్గమకాండము 19:16-19 మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వ తముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెము లోనుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరముచేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను.

ఇది ఇశ్రాయేలీయుల ప్రజలందరికీ ఎదురైన అనుభవం. దీనిగురించే మోషే ద్వితియోపదేశకాండము 4:12 లో మాట్లాడుతున్నాడు. కానీ మనం చూస్తున్న సందర్భంలో మాత్రం, మోషే అహరోను అతని ఇద్దరు కుమారులు మరియు పెద్దలు 70మంది. దేవుణ్ణి నిజంగానే చూసారు. ఇక్కడ దేవుణ్ణి చూడడం అన్నప్పుడు మనం ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. వీరు మాత్రమే కాదు, భక్తులు చాలామంది దేవుణ్ణి చూసారు.
ఉదాహరణకు;
దానియేలు 7:9 ఇంక సింహాసనములను వేయుట చూచితిని; మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱెబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్రములు అగ్నివలె ఉండెను.
యెహేజ్కేలు 1:28 వర్ష కాలమున కనబడు ఇంద్ర ధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను.
అయితే దేవుడు ఆత్మ మరియు అనంతుడు. ఆత్మయైన, అనంతుడైన దేవుణ్ణి పరిమితి కలిగిన మనం చూడలేము. అందుకే నూతననిబంధనలో దేవుణ్ణి ఎవరూ చూడలేదని రాయబడిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. కానీ ఆ దేవుడు మానవులకు అర్థమయ్యే రూపంలో తనను తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు భక్తులు ఆయనను చూసారు, ఆయన ఆ విధంగా ప్రత్యక్షమైన విధానాన్ని "anthropomarpism" అంటారు. ఇది మానవులకు అర్థమయ్యే రూపంలో ఆయనను ఆయన ప్రత్యక్షపరచుకోవడం. ఉదాహరణకు; మనం చూసిన ఆ సందర్భంలో "ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశ మండలపు తేజమువంటిదియు ఉండెను" అని చదువుతున్నాం. ఆత్మయైన దేవునికి మనవలే పాదాలు ఉండవు కదా! కానీ భక్తులకు అర్థమయ్యే రూపంలో ఆయన ఆ విధంగా కనపరచుకున్నాడు. అదేవిధంగా అక్కడ "ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశ మండలపు తేజమువంటిదియు ఉండెను" అని రాయబడింది. ఈమాటలు ఆకాశానికి పైగా ఆయన సింహాసనం ఉందని మనకు తెలియచేస్తున్నాయి.
కీర్తనల గ్రంథము 103:19 యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు.
నిర్గమకాండము 24:11
ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు; వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి.
ఈ వచనంలో ఇశ్రాయేలీయుల ప్రధానులు దేవుణ్ణి చూసినప్పటికీ ఆయన వారికి ఏ హానీ చెయ్యకపోవడం, వారు దేవుణ్ణి చూసి కూడా అన్నపానాలు పుచ్చుకున్నట్టు మనం చూస్తాం. వాస్తవానికి పరిశుద్ధుడైన దేవుణ్ణి, పాపియైన నరుడు చూసి బ్రతకడం అసాధ్యం. ఈ విషయాన్ని స్వయంగా దేవుడే మోషేకు చెప్పినట్టు మనం చూస్తాం.
నిర్గమకాండము 33:20 మరియు ఆయననీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను.
కానీ ఇప్పుడు దేవుడు ఆ ప్రజలతో నిబంధన చేసాడు కాబట్టి, వారు ఆయనను చూసినప్పటికీ వారికి ఏ హానీ చెయ్యలేదు. ఆయన ఇతర భక్తులకు ప్రత్యక్షమైనప్పుడు కూడా వారు ఆయనను చూసి బ్రతకడానికి కేవలం ఆయన కనికరం, నిబంధనలే కారణం. ప్రస్తుతం మనం కూడా యేసుక్రీస్తు ద్వారా చెయ్యబడిన క్రొత్తనిబంధనను బట్టే దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం. భవిష్యత్తులో ఆయనను చూడబోతున్నాం. లేదంటే మనమందరం కూడా కేవలం ఆయన ఉగ్రతకు మాత్రమే పాత్రులం (ఎఫెసీయులకు 2:3, రోమీయులకు 5:10).
ఇక వారు "వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి" అన్నప్పుడు వారు దేవుణ్ణి చూసాక చనిపోకుండా ఉండడం మాత్రమే కాదు. ఎలాంటి బలహీనతలకూ లోనవ్వకుండా పర్వతం నుండి క్రిందకు దిగివచ్చి అందరితో పాటే ఆహారం తీసుకున్నారు. వారు అన్నపానాలు పుచ్చుకుంది పర్వతంపైన కాదు క్రిందనే. ఆ విషయం మనకు క్రింది వచనాలలో అర్థమౌతుంది.
నిర్గమకాండము 24:12
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా-
ఈ వచనంలో దేవుడు పర్వతం నుండి క్రిందికి దిగి వచ్చేసిన మోషేతో మరలా ఆ పర్వతంపైకి రమ్మనడం, అప్పుడు ఆయన వారికి బోధించవలసిన ఆజ్ఞలనూ రాతిపలకలనూ ఇస్తాననడం మనం చూస్తాం. 20వ అధ్యాయంలో ఆయన తన పది ఆజ్ఞలనూ ప్రజలంతా వినేలా పలికాడు. ఇప్పుడు అవే పది ఆజ్ఞలను ఆయన రాతిపలకలపై రాసి ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆ పది ఆజ్ఞలూ మొత్తం ధర్మశాస్త్రానికీ ప్రవక్తల బోధలకూ ఆధారంగా ఉన్నాయి, ఈ విషయం నేను 20వ అధ్యాయపు వ్యాఖ్యానంలో వివరించాను. అదేవిధంగా ఆయన ఇప్పుడు మోషేకు ప్రత్యక్షగుడార నిర్మాణంతో సహా మరి కొన్ని విధులను బోధించబోతున్నాడు.
నిర్గమకాండము 24:13
మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండమీదికి ఎక్కెను.
ఈ వచనంలో దేవుడు మోషేను పర్వతంపైకి రమ్మని ఆజ్ఞాపించగానే మోషే ఆ పర్వతంపైకి ఎక్కివెళ్ళడం మనం చూస్తాం. ఈ క్రమంలో అతనితో పాటు యెహోషువా కూడా లేచినట్టు రాయబడింది. ఇతను మోషేకు పరిచారకుడిగా మాత్రమే కాదు అతని వారసుడిగా కూడా ఉండబోతున్నాడు కాబట్టి, మోషేతో కలసి ఆ పర్వతంపైకి వెళ్ళే ధన్యతను పొందుకున్నాడు. మోషే నలబై రాత్రింపగళ్ళు దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఇతను కూడా ఆ పర్వతంపైనే దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాడు. మోషే మాత్రమే దేవుణ్ణి సమీపించాడు. ఇతను మోషేతో పాటు ఆ పర్వతంపైకి వెళ్ళాడని "నిర్గమకాండము 32:17,18" వచనాలను బట్టి మనం అర్థం చేసుకుంటాం. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. మోషే ఆ నలబై రోజులూ దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ఆకలి దప్పికలు లేకుండా ఆయనతో గడిపాడు. మరి యెహోషువా పరిస్థితి ఏంటి? దీనికి సమాధానం ఏంటంటే; మోషే యెహోషువాలు ప్రవేశించిన సీనాయి పర్వతం చాలా పెద్దది. మోషే ఆ పర్వతం శిఖరాన దేవుడు దిగివచ్చిన ప్రదేశంలోకి వెళ్తే, యెహోషువా ఆ పర్వతంపైనే ఎక్కడో మోషేకు అందుబాటులో ఉన్నాడు. పర్వతంపై సహజంగానే తినడానికి అవసరమైన పళ్ళు లాంటివి ఉంటాయి, నీటి ఊటలు కూడా ఉంటాయి కాబట్టి యెహోషువ వాటిని తీసుకుంటూనే ఆ నలబై రోజులు జీవించాడు.
నిర్గమకాండము 24:14
అతడు పెద్దలను చూచిమేము మీ యొద్దకు వచ్చువరకు ఇక్కడనే యుండుడి; ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు; ఎవనికైనను వ్యాజ్యెమున్నయెడల వారియొద్దకు వెళ్లవచ్చునని వారితో చెప్పెను.
ఈ వచనంలో మోషే సీనాయి పర్వతంపైకి వెళ్తూ, అంతకుముందు తనతో పాటు సీనాయిపర్వతంపైకి వచ్చి దేవుణ్ణి చూసిన పెద్దలతో పలికిన మాటలను మనం చూస్తాం. వారు దేవుణ్ణి చూడగానే సజీవంగా క్రిందకు దిగివచ్చి అన్నపానములు పుచ్చుకున్నవారిగా పేరు సంపాదించుకున్నవారు. మోషే ఇక్కడ ఇశ్రాయేలీయుల బాధ్యతను వారికి అప్పగిస్తూ, ఆ ప్రజల్లో కలిగే వ్యాజ్యాలు ఏవైనా వారు పరిష్కరించలేనివిగా ఉంటే అహరోనునూ హూరునూ సంప్రదించమని ఆజ్ఞాపిస్తున్నాడు.
పౌలు కూడా సంఘానికి లేఖను రాస్తూ సంఘస్తుల మధ్య కలిగే వ్యాజ్యాలు సంఘపెద్దల పరిథిలో పరిష్కరించబడాలని సూచించాడు (1 కొరింథీ 6:1-7).
నిర్గమకాండము 24:15-17
మోషే కొండమీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచెను; మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను; ఏడవ దినమున ఆయన ఆ మేఘములోనుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరముమీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్ను లకు కనబడెను.
ఈ వచనాలలో దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే సీనాయి పర్వతంపైకి చేరుకోవడం, యెహోవా మహిమ ఆ పర్వతంపైకి దిగివచ్చి ప్రజలందరికీ కనిపించడం, ఏడవ దినాన ఆయన మోషేను పిలవడం మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించవలసిన రెండు విషయాలు ఏమిటంటే; మోషే దేవుని ప్రత్యక్షతను పొందుకోవడానికి ఆరు రోజుల వరకూ వేచియుండవలసి వచ్చింది. ఇది దేవుని సార్వభౌమ నిర్ణయాన్ని మనకు తెలియచేస్తుంది. ఆయన అనుకున్న సమయంలో భక్తులకు ప్రత్యక్షమౌతాడు. అనుకున్న సమయంలోనే మేలు చేస్తాడు. అప్పటివరకూ ఆయన చేత పిలవబడినవారు వేచియుండవలసిందే.
అదేవిధంగా ఇక్కడ దేవుని సీనాయి పర్వతంపైకి దిగివచ్చి ప్రజలందరికీ అది కనిపించడం మనం చూస్తాం. మోషే పలుకుతున్న మాటలు ఆయనవే అని ప్రజలు నమ్మేందుకే ఆయన తన మహిమను ప్రజలందరికీ కూడా కనిపించేలా చేసాడు. కొందరు అబద్ధ ప్రవక్తలు రాసుకున్న గ్రంథాలలా, మోషే ధర్మశాస్త్రం ఏదో ఒక గుహలో దేవదూతను కనిపించి చెబితే రాసుకున్నది కాదు. ధర్మశాస్త్రం దేవుడే ఇచ్చాడనేందుకు సాక్ష్యంగా అది ఇస్తున్నప్పుడు ప్రజలు కూడా ఆయన మహిమను చూసారు, ఆయన స్వరాన్ని విన్నారు.
నిర్గమకాండము 24:18
అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండమీదికి ఎక్కెను. మోషే ఆ కొండమీద రేయింబవళ్ళు నలుబది దినములుండెను.
ఈ వచనంలో ఎప్పుడైతే ఆ పర్వతంపై మేఘం కమ్ముకుందో, అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి, 40 రాత్రింపగళ్ళు ఆ పర్వతంపై ఉన్నట్టు మనం చూస్తాం. ఆ సమయంలో దేవుడు తన విధులన్నిటినీ, ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణం గురించీ మోషేకు వివరించాడు. వాటన్నిటినీ తరువాత అధ్యాయం నుండి మనం చూడబోతున్నాం. మోషే తనకు ముందున్న చరిత్రను (ఆదికాండము) రాయడానికి కూడా అతనికి అదంతా దేవుడు బోధించడమే కారణం. ఆయన బోధించినదానినే అతను పరిశుద్ధాత్మ ప్రేరణతో గ్రంథాలుగా లిఖించాడు.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
నిర్గమకాండము అధ్యాయం 24

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"