విషయసూచిక:- 38:1-7, 38:8, 38:9-20 , 38:21, 38:22 , 38:23 ,38:24 , 38:25,26 , 38:27,28 , 38:29-31 .
నిర్గమకాండము 38:1-7
మరియు అతడు తుమ్మకఱ్ఱతో దహనబలిపీఠమును చేసెను. దాని పొడుగు అయిదు మూరలు దాని వెడల్పు అయిదు మూరలు, అది చచ్చౌకమైనది. దాని యెత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి; దానికి ఇత్తడిరేకు పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్ని టిని, అనగా దాని బిందెలను దాని గరిటె లను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటిని ఇత్తడితో చేసెను ఆ బలిపీఠము నిమిత్తము దాని జవక్రింద దాని నడిమివరకు లోతుగానున్న వలవంటి ఇత్తడి జల్లెడను చేసెను. మరియు అతడు ఆ యిత్తడి జల్లెడయొక్క నాలుగు మూలలలో దాని మోతకఱ్ఱలుండు నాలుగు ఉంగరములను పోతపోసెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మ కఱ్ఱతో చేసి వాటికి రాగిరేకులు పొదిగించెను. ఆ బలి పీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆమోతకఱ్ఱలు చొనిపెను; పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను.
ఈ వచనాల్లో బెసలేలు ఇత్తడి బలిపీఠం మరియు దానిసంబంధమైన వస్తువులను తయారు చెయ్యడం మనం చూస్తాం. వాటి యొక్క ఉపయోగమేంటో అలానే ఆ బలిపీఠం దేనికి ఛాయగా ఉందో ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 27:1-8 వ్యాఖ్యానం చూడండి). అదేవిధంగా మోషే గతంలో తాను వివరంగా రాసినవాటినే మరలా ఇక్కడ ఎందుకు రాయవలసి వచ్చిందో కూడా నేను వివరించాను (నిర్గమకాండము 36:8-38 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 38:8
అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళ మునుదాని ఇత్తడి పీటను చేసెను.
ఈ వచనంలో బెసలేలు ఇత్తడి గంగాళాన్ని తయారు చెయ్యడం మనం చూస్తాం. దానియొక్క ఉపయోగమేంటో అలానే ఆ గంగాళం దేనికి ఛాయగా ఉందో ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 30:17-21 వ్యాఖ్యానం చూడండి ).
అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ఈ ఇత్తడి గంగాళం అంతా "గుడారముయొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో" చెయ్యబడినట్టు మనం చదువుతున్నాం. అంటే పురుషులు మందిరసంబంధమైన పనులు చేస్తున్నప్పుడు కొందరు స్త్రీలు వారికి సహకారులుగా ఉండేవారు. ఇక్కడ వారినే లేఖనం "సేవకురాండ్రు" అని సంబోధిస్తుంది. కాబట్టి సంఘంలో పురుషులు సేవకులుగా ఉన్నప్పుడు స్త్రీలు కూడా సేవకురాండ్రుగా వాక్యపరిథిలో తమ బాధ్యతలను నిర్వర్తించాలి. ఈ విషయం మరింత స్పష్టంగా ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 35:22-29 వ్యాఖ్యానం చూడండి).
ఈ స్త్రీలు మందిరసంబంధమైన పనుల్లో (నూలు ఒడకడం వంటివి) సహకారులుగా ఉండడమే కాదు, తమ విలువైన అద్దాలను కానుకలుగా కూడా ఇచ్చారు. సాధారణంగా అప్పటి చాలామట్టుకు అద్దాలు గాజువి కాకుండా మెరిసేటి ఇత్తడి, ఇతర లోహాల పళ్ళాలుగా ఉండేవి. అందులోనే వారు తమ మొహాలను చూసుకునేగారు. లేదా గాజు అద్దానికి చుట్టూ ఇత్తడివంటి విలువైన లోహాల అంచులు (frame) అమర్చబడేవి. ఇప్పుడు వాటితోనే ఇత్తడిగంగాళం దానిపీట తయారుచెయ్యబడింది. అంటే ఆ స్త్రీలు ఒకవైపు పనీ చేస్తున్నారు మరలా కానుకలు కూడా ఇస్తున్నారు. ఈవిధంగా మనకు సామర్థ్యం ఉన్నప్పుడు కానుకలనూ ఇవ్వాలి అలానే పనికూడా చెయ్యాలి. మనపై ఈ రెండు బాధ్యతలూ ఉన్నాయని ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 35:10 వ్యాఖ్యానం చూడండి ). ఇక్కడ మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే; యూదుల రచనల ప్రకారం ఇశ్రాయేలీయులు మాటిమాటికీ తమ ముఖాలను అద్దంలో చూసుకుంటూ ఆ అద్దాలను తమకు విలువైనవిగా భావించేవారు. ఇప్పుడు వాటిని వారు ఇత్తడి గంగాళంకోసం కానుకలుగా ఇచ్చేస్తున్నారు. అంటే వారు తమకు విలువైన వాటిని దేవునికి ఇస్తున్నారు. మాటిమాటికీ తమ అందాన్ని చూసుకోవడం కంటే దేవునిమందిరంలో తమ కానుక వినియోగించబడాలని ఆశపడుతున్నారు. దేవుని విలువను మనం అర్థం చేసుకున్నప్పుడు ఇలానే ఆయనకోసం మనకు విలువైనవాటిని ఆయనకు అర్పిస్తాం. ముఖ్యంగా విలువైన మన దేహాన్ని ఆయనకు సజీవయాగంగా సమర్పించి (రోమా 12:1), దానిని ఆయన సేవా సాధనంగా వినియోగిస్తాం. అలానే పవిత్రమైన సేవలో వినియోగించబడుతున్న ఆ దేహానికి ఎలాంటి పాపమాలిన్యం అంటకుండా కాపాడుకుంటుంటాం.
నిర్గమకాండము 3:9-20
మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున, అనగా దక్షిణ దిక్కున నూరు మూరల పొడుగు గలవియు పేనినసన్ననారవియునైన తెరలుండెను. వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది. ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి. ఉత్తర దిక్కున నున్న తెరలు నూరు మూరలవి; వాటి స్తంభములు ఇరువది, వాటి యిత్తడి దిమ్మలు ఇరువది, ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి. పడమటి దిక్కున తెరలు ఏబది మూరలవి; వాటి స్తంభములు పది, వాటి దిమ్మలు పది, ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి. తూర్పువైపున, అనగా ఉదయపు దిక్కున ఏబది మూరలు; ద్వారముయొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు. అట్లు రెండవ ప్రక్కను, అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదునైదు మూరల తెరలు ఉండెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు. ఆవరణము చుట్టునున్నదాని తెరలన్నియు పేనిన సన్ననారవి. స్తంభముల దిమ్మలు రాగివి, స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి. వాటి బోదెలకు వెండిరేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నియు వెండి బద్దలతో కూర్పబడెను. ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడి నదియునైన బుటాపనిది. దాని పొడుగు ఇరువది మూరలు; దాని యెత్తు, అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా, అయిదు మూరలు. వాటి స్తంభములు నాలుగు, వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు. వాటి వంకులు వెండివి. వాటి బోదెలకు వెండిరేకు పొదిగింప బడెను, వాటి పెండె బద్దలు వెండివి, మందిరమునకును దాని చుట్టునున్న ఆవరణమునకును చేయబడిన మేకు లన్నియు ఇత్తడివి.
ఈ వచనాల్లో బెసలేలు మందిర ఆవరణాన్ని తయారు చెయ్యడం మనం చూస్తాం. ఈ ఆవరణం యొక్క ఉపయోగం ఏంటో, అలానే అది దేనికి ఛాయగా ఉందో ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 27:9-18 వ్యాఖ్యానం చూడండి).
అదేవిధంగా మోషే గతంలో తాను వివరంగా రాసినవాటినే మరలా ఇక్కడ ఎందుకు రాయవలసి వచ్చిందో కూడా నేను వివరించాను (నిర్గమకాండము 36:8-38 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 38:21
మందిరపదార్థముల మొత్తము, అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయులచేత మోషే మాటచొప్పున లెక్క పెట్టించెను.
ఈ వచనంలో మోషే మందిరనిర్మాణానికి సమకూర్చబడిన వనరులను లెక్కింపచెయ్యడం మనం చూస్తాం. ఇక్కడ ప్రజలు మందిరనిర్మాణం కోసం ఇచ్చిన కానుకల విషయంలో మోషే తాను మాత్రమే ప్రాతినిధ్యం వహించకుండా అహరోను కుమారుడైన ఈతామారును కూడా అందులో పాలిభాగస్తుడిగా నిర్ణయించాడు. అతను కూడా లేవీయుల చేత వాటిని లెక్కింపచేస్తున్నాడు. ఇది సంఘానికి మంచి మాదిరికరంగా ఉంది. ఇలా ఎక్కువమంది ఆ కానుకల విషయంలో బాధ్యతకలిగి, లేక జవాబుదారులుగా ఉన్నప్పుడు ఆ వనరులు ఏ ఒక్కరిద్వారానూ దుర్వినియోగం కాకుండా, దేనినిమిత్తం అవి సమకూర్చబడ్డాయో వాటికే వినియోగించబడతాయి.
నిర్గమకాండము 38:22
యూదా గోత్రికుడైన హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయుచేసెను.
ఈ వచనంలో బెసలేలు మోషే ఆజ్ఞాపించినట్టుగా తన పనిని పూర్తి చేసినట్టు మనం చూస్తాం. ఈవిధంగా అతను దేవుడు తనను ఎందుకైతే తన జ్ఞానాత్మతో నింపాడో, ఆ జ్ఞానాన్ని చక్కగా ఆయన పనికోసం వినియోగించాడు. లేఖనంలో దేవుని మంచి పనివాడిగా ఘనమైన పేరు సంపాదించుకున్నాడు. కాబట్టి మనం కూడా దేవుడు మనకిచ్చిన తలాంతులను ఆయన సంఘనిర్మాణంలో చక్కగా వినియోగించాలి.
నిర్గమకాండము 38:23
దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబు అతనికి తోడైయుండెను. ఇతడు చెక్కువాడును విచిత్ర మైనపని కల్పించువాడును నీల ధూమ్ర రక్తవర్ణములతోను సన్ననారతోను బుటాపని చేయువాడునై యుండెను.
ఈ వచనంలో బెసలేలుకు దేవుడు సహకారిగా నియమించిన అహోలీయాబు పని గురించి కూడా చక్కగా రాయబడడం మనం చూస్తాం. వాస్తవానికి అహోలీయాబు బెసలేలుకు సహకారి మాత్రమే, అతని అధికారం క్రిందనే ఇతను పని చెయ్యాలి. సాధారణంగా మనం సంఘంలో కానీ సమాజంలో కానీ ఒకరి అధికారం క్రింది పనిచెయ్యవలసి వచ్చినప్పుడు ఏదో తక్కువతనంగా భావిస్తుంటాం. అందువల్ల కొన్నిసార్లు మనకు అప్పగించబడిన పనులను సరిగా చెయ్యము కూడా. కానీ అహోలీయాబును చూడండి. అతను బెసలేలు అధికారం క్రింద పనిచెయ్యవలసి వచ్చినప్పటికీ తనవంతుగా తన బాధ్యతను నిర్వర్తించాడు. కాబట్టి మనం కూడా మన సంఘాల్లో అధికారిగా ఉంటున్నామా లేక అధికారం క్రింద పనిచేస్తున్నామా అని కాదు కానీ అందరికీ అధిపతియైన మన ప్రభువైన యేసుక్రీస్తు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తున్నామా లేదా అనేదానిపైనే మనసుపెట్టాలి. వాని వాని పనుల చొప్పున బహుమానం ఇచ్చేది ఆయనే కదా!
నిర్గమకాండము 38:24
పరిశుద్ధస్థలవిషయమైన పని అంతటిలోను పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు, అనగా ప్రతిష్ఠింప బడిన బంగారు పరిశుద్ధస్థలపు తులము చొప్పున నూట పదహారుమణుగుల ఐదువందల ముప్పది తులములు.
ఈ వచనంలో మోషే ప్రత్యక్షగుడార నిర్మాణం కోసం ఇశ్రాయేలీయులు కానుకలుగా ఇచ్చినటివంటి బంగారంయొక్క లెక్కను రాయడం మనం చూస్తాం. అతను ఎంతో నమ్మకంగా, భవిష్యత్తు తరాలకు కూడా తెలిసేవిధంగా దీనిని లిఖిస్తున్నాడు. ఆ బంగారం పదహారుమణుగుల ఐదువందల ముప్పది తులములు అంటే మన కొలమానం ప్రకారం వెయ్యి కేజీలు.
నిర్గమకాండము 38:25,26
సమాజ ములో చేరినవారి వెండి పరిశుద్ధస్థలపు తులముచొప్పున నాలుగువందల మణుగుల వెయ్యిన్ని ఐదువందల డెబ్బదియైదు తులములు. ఈ పన్ను ఇరువది ఏండ్లు మొదలు కొని పైప్రాయము కలిగి లెక్కలో చేరినవారందరిలో, అనగా ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబది మందిలో తలకొకటికి అరతులము.
ఈ వచనంలో మోషే వెండి గురించి రాస్తున్నాడు. ఈ వెండి నాలుగువందల మణుగుల వెయ్యిన్ని ఐదువందల డెబ్బదియైదు తులములు అంటే మన కొలమానం చొప్పున మూడువేల నాలుగువందల ఇరవై ఐదు కేజీలు. అయితే ఈ వెండి ప్రజలు కానుకగా ఇచ్చింది కాదు కానీ, ఐరవైయేండ్లు మొదలుకొని జనసంఖ్యలో లెక్కించబడినవారు కట్టిన పన్నును బట్టి సమకూర్చబడింది. దీనిగురించి ఇప్పటికే నేను స్పష్టంగా వివరించాను (నిర్గమకాండము 30:11-16 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 38:27,28
ఆ నాలుగువందల వెండి మణు గులతో పరిశుద్ధస్థలమునకు దిమ్మలు అడ్డతెరకు దిమ్మలును; అనగా ఒక దిమ్మకు నాలుగు మణుగుల చొప్పున నాలుగు వందల మణుగులకు నూరు దిమ్మలు పోతపోయబడెను. వెయ్యిన్ని ఐదువందల డెబ్బది యైదు తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోదెలకు పొదిగించి వాటిని పెండె బద్దలచేత కట్టెను.
ఈ వచనంలో మోషే ప్రతిష్టించబడిన వెండితో ఏమేం తయారుచెయ్యబడ్డాయో వివరంగా రాయడం మనం చూస్తాం. అతను తనయొద్ద ఉన్న వెండిని బట్టి, దానిని తగినట్టుగా పనిచేయించాడు. అంటే స్థంబాలకు ఎంత దలసరిలో పోతపోయించాలి, వంకులను బద్దలను ఎంత వెండితో తయారుచేయిస్తే ఆ వెండి సరిపోతుంది అనేది బెసలేలుతో కలపి ముందే లెక్కచూసుకున్నాడు. కాబట్టి ప్రజలు ఇచ్చిన ఆ వెండి చెయ్యవలసిన పనికి సరిపోకుండా కానీ, లేక మిగిలిపోయేలా కానీ జరగకుండా పనులన్నిటికీ సరిగ్గా సరిపోయింది. అతను ఇదే పద్ధతిని బంగారం ఇత్తడి మరియు మిగిలిన వనరుల విషయంలో కూడా అనుసరించాడు. కాబట్టి మనం కూడా దేవునికోసం ఏదైనా తలపెట్టేముందు అది కర్చుతో కూడుకున్నదైనా లేక శ్రమతో జ్ఞానంతో కూడుకున్నదైనా సరే మనకున్నది ఎంత అనేది పరిశీలించుకుని దానిప్రకారంగా వ్యవహరించాలి. లేదంటే మనం ఇబ్బంది పాలవ్వడమే కాదు, ఏ దేవునిపేరుతో ఆ కార్యాన్ని తలపెట్టామో ఆయనకు కూడా అవమానం తీసుకువచ్చేవారమౌతాం. ఉదాహరణకు నేను దేవునిపేరట అనాధశ్రమం కట్టించి వనరులు సరిపోక దానిని కొనసాగించలేకపోతే? లేక ఎవరికైనా ఆయన పేరిట సహాయం చేస్తానని చెప్పి మన సామర్థ్య కొరత వల్ల చెయ్యలేకపోతే ఏమౌతుంది? అందుకే యేసుక్రీస్తు ఇలా అంటున్నారు.
లూకా సువార్త 14:28-32 మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింప లేక పోయినందున చూచువారందరుఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయ సాగుదురు. మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేల మందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొనచూచును గదా.
ఈ నియమం మనం దేవునికార్యాల విషయంలోనే కాదుకానీ వ్యక్తిగత విషయాలలో కూడా అన్వయించుకోవడం మనకు చాలా శ్రేయష్కరం.
నిర్గమకాండము 38:29-31
మరియు ప్రతిష్ఠింపబడిన యిత్తడి రెండువందల ఎనుబది మణుగుల రెండువేల నాలుగువందల తులములు. అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లెడను వేదిక ఉపకరణములన్నిటిని చుట్టునున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణద్వారమునకు దిమ్మలను ఆలయమునకు మేకులన్నిటిని చుట్టునున్నఆవరణ మునకు మేకులన్నిటిని చేసెను.
ఈ వచనంలో మోషే మందిరనిర్మాణంలో ఇత్తడి ఏ విధంగా వినియోగించబడిందో రాయడం మనం చూస్తాం. ఈ ఇత్తడి రెండువందల ఎనుబది మణుగుల రెండువేల నాలుగువందల తులములు అంటే మన కొలమానం ప్రకారం రెండువేల నాలుగువందల పది కేజీలు.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
నిర్గమకాండము అధ్యాయం 38

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"