విషయసూచిక:- 19:1, 19:2, 19:3 , 19:4, 19:5 , 19:6 ,19:7,8 , 19:9 , 19:10-13 , 19:14,15 , 19:16 , 19:17-19 , 19:20,21 , 19:22 , 19:23 , 19:24 , 19:25
నిర్గమకాండము 19:1
ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవనెలలో, వారు బయలు దేరిననాడే మూడవ నెల ఆరంభదినమందే, వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి.
ఈ వచనంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరిన మూడవ నెల మొదటి రోజుకు సీనాయి అరణ్యానికి వచ్చినట్టు మనం చూస్తాం. అంతవరకూ ఇశ్రాయేలీయులు ఎక్కడెక్కడ సంచరించారో ఆ సంచార క్రమాన్ని మోషే మరొక చోట వివరించాడు.
సంఖ్యాకాండము 33:5-15 ఇశ్రాయేలీయులు రామె సేసులోనుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. సుక్కో తులోనుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతా ములోదిగిరి. ఏతాములోనుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతుతట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. పీహహీరోతులోనుండి బయలుదేరి సముద్రము మధ్యనుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడుదినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాలోనుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి. ఏలీములో పండ్రెండు నీటిబుగ్గ లును డెబ్బది యీతచెట్లును ఉండెను; అక్కడ దిగిరి. ఏలీములోనుండి వారు బయలుదేరి ఎఱ్ఱ సముద్రము నొద్ద దిగిరి. ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి. ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను. రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి.
ఈ సీనాయి అరణ్యం అనేది బైబిల్ చరిత్రలో, ఇశ్రాయేలీయుల చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం. ఎందుకంటే దేవుడైన యెహోవా ఇక్కడే వారితో నిబంధన చేసి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఈ క్రింది వచనాల నుండి మనం అదే చూస్తాం. అదేవిధంగా ఇశ్రాయేలీయులు ఈ సీనాయి అరణ్యం (పర్వతం) దగ్గరకు చేరుకోవడం "మీరు ఐగుప్తునుండి విడుదల పొందాక ఈ పర్వతం పై నన్ను సేవిస్తారన్న దేవుని మాటలకు నెరవేర్పు (నిర్గమకాండము 3:12).
నిర్గమకాండము 19:2
వారు రెఫీదీమునుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి.
ఈ వచనంలో ఇశ్రాయేలీయులు రెఫీదీము నుండి సీనాయికి వచ్చి అక్కడ మకాం వేసినట్టు (విడసిరి) మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు తమ ప్రయాణాన్ని దేవునిమాట చొప్పునే చేసేవారని ఇదివరకే మనం చూసాం. ఇప్పుడు ఆయన మాటచొప్పునే వారు ఈ పర్వతం దగ్గర మకాం వేసారు. ఎందుకంటే ఆయన ఈ స్థలంలో వారికి తన ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించబోతున్నాడు.
నిర్గమకాండము 19:3
మోషే దేవునియొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచినీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసిన దేమనగా-
ఈ వచనంలో దేవుడు మోషేను పిలచి ఇశ్రాయేలీయుల ప్రజలతో తన తరపున మాట్లాడమని సెలవివ్వడం మనం చూస్తాం. ఇక్కడ దేవుడే మోషేను పిలుస్తున్నాడు. ఆ పిలుపు ఇశ్రాయేలీయులతో నిబంధన చేసి వారికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించడానికే అని మనకు ముందుముందు అర్థమౌతుంది. అంటే దేవుడే ఇశ్రాయేలీయులతో నిబంధన చెయ్యడానికి ఆసక్తితో ముందడుగు వేస్తున్నాడు, ఆ ప్రజలు కాదు. కాబట్టి నిబంధన ఎప్పుడూ కూడా దేవుని కృప, ఆసక్తిని బట్టే చెయ్యబడుతుంది. అందులో మనిషి కేవలం నిమిత్తమాత్రుడు మాత్రమే. మన రక్షణ విషయంలో కూడా దేవుడే ముందడుగు వేసి, మనల్ని ప్రేమించి యేసుక్రీస్తును మనకోసం బలిగా పంపించాడు. అందుచేతే మనమంతా ఆయన క్రొత్తనిబంధనలో పాలిభాగస్తులం ఔతున్నాం.
యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
1యోహాను 4: 19 ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.
నిర్గమకాండము 19:4
నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చు కొంటినో మీరు చూచితిరి.
ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలతో ఏం ముచ్చటించాలో మోషేకు సెలవిస్తూ, ఆయన వారిని ఐగుప్తునుండి సీనాయి వరకూ ఎలా కాపాడి తీసుకువచ్చాడో ప్రస్తావించడం మనం చూస్తాం. ఒక గద్ద తన పిల్లలను ఎలాగైతే తన రెక్కలపై మోస్తుందో అలానే ఆయన ఇశ్రాయేలీయుల ప్రజలను మోసుకుంటూ వచ్చాడు. ఉదాహరణకు; ఫరో వలన కానీ అతని సైన్యంవలన కానీ వారికి ఎటువంటి హానీ సంభవించనియ్యలేదు. వారికోసం సముద్రాన్ని పాయలుగా చేసాడు, వారి శత్రువులైన ఐగుప్తీయులను అందులో నాశనం చేసాడు. మారాను మధురమైన నీటిగా మార్చాడు, పూరేడు పక్షులను పంపి మాంసాన్ని అనుగ్రహించాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండను చీల్చి వారి దాహం తీర్చాడు, వారిపై దాడి చేసిన అమాలేకీయులపై యుద్ధం ప్రకటించాడు.
నిర్గమకాండమ 19:5
కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు.
ఈ వచనంలో దేవుడు ఆ ప్రజలను ఐగుప్తునుండి విడిపించి గద్ద తన రెక్కలమీద పిల్లలను మోసినట్టు కాపాడుతూ వచ్చినందుకు ప్రతిగా వారు ఏం చెయ్యాలో, అప్పుడు వారు ఆయన దృష్టికి ఎలా ఉంటారో తెలియచెయ్యడం మనం చూస్తాం. దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి, ఐగుప్తీయుల చేతినుండి ఆకలి దాహాల నుండి, కాపాడినందుకు వారు కేవలం "ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన చెయ్యబోతున్న నిబంధనను అనుసరించి నడుచుకోవాలి". దేవుడు తన ప్రజలనుండి కోరుకుంటుంది ఇదే. ఇశ్రాయేలీయులు దేవుని మాటను విడిచిపెట్టి ఆయన నిబంధనను త్రోసివేసినప్పుడు ఆయన ఇవే మాటలను ప్రస్తావించడం మనం చూస్తాం.
యిర్మీయా 7:22-24 నేను ఐగుప్తు దేశములోనుండి మీ పితరులను రప్పించిన దినమున దహనబలులనుగూర్చిగాని బలులనుగూర్చిగాని నేను వారితో చెప్పలేదు, అట్టి వాటినిగూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చి తిని ఏదనగానా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులై యుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచనలనుబట్టి తమ దుష్ట హృదయకాఠిన్యము ననుసరించి నడుచుచు వచ్చిరి.
అదేవిధంగా "మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు" అంటే; ఒక వ్యక్తి తాను కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని ఎంత శ్రద్ధగా చూసుకుంటాడో లేక ప్రేమిస్తాడో అలానే ఆయన ఇశ్రాయేలీయులను తన స్వకీయ సంపాద్యంగా ప్రేమించి వారిపై శ్రద్ధ నిలుపుతాడని అర్థం.
ఆమోసు 3: 2 అదేమనగా భూమిమీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను.
నిర్గమకాండము 19:6
సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనము గాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా-
ఈ వచనంలో దేవుడు "సమస్త భూమీ నాదేయంటూ" ఇశ్రాయేలీయులను తన యాజకరాజ్యంగా పరిశుద్ధజనంగా ప్రతిష్టిస్తున్నట్టు మనం చూస్తాం. ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టించబడిన సమస్తమూ ఆయనదే. అలానే ఆయన సార్వభౌముడు కాబట్టి తాను సృష్టించిన ప్రజల్లో ఇశ్రాయేలీయులను తనకు యాజకులుగా, పరిశుద్ధజనంగా నిర్ణయించుకున్నాడు. ప్రభువగు యేసుక్రీస్తు సిలువమరణం చెందేవరకూ ఈ నిర్ణయం కొనసాగింది, అప్పటివరకూ ఇశ్రాయేలీయులు మాత్రమే దేవునికి యాజకులు, వారు మాత్రమే ఆయనకు పరిశుద్ధ జనం. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఇశ్రాయేలీయులకూ అన్యజనులకూ మధ్య ఉన్న బేధాన్ని కొట్టివేసిన తరువాత ఇశ్రాయేలీయులకు ఇటువంటి ప్రత్యేకత ఏమీలేదు.
మత్తయి 21: 43 కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.
ప్రస్తుతం ఏ బేధం లేకుండా ఆయనను విశ్వసించినవారంతా ఆయనకు యాజకులే, ఆయనకు పరిశుద్ధ జనమే.
1పేతురు 2: 9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
ప్రకటన గ్రంథం 1: 6 మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.
నిర్గమకాండము 19:7,8
మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తన కాజ్ఞాపించిన ఆ మాటలన్నియు వారియెదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరు యెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను.
ఈ వచనాలలో మోషే దేవుని మాటలను ప్రజలకు తెలియచెయ్యడం, ఆ ప్రజల ప్రత్యుత్తరాన్ని దేవునికి తెలియచెయ్యడం మనం చూస్తాం. ఈవిధంగా మోషే దేవునికీ ఇశ్రాయేలీయులకూ మధ్య చెయ్యబడుతున్న నిబంధనకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు.
నిర్గమకాండము 19:9
యెహోవా మోషేతోఇదిగో నేను నీతో మాటలాడు నప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మక ముంచు నట్లు నేను కారు మబ్బులలో నీయొద్దకు వచ్చెదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా-
ఈ వచనంలో దేవుడు తన మధ్యవర్తియైన మోషే పలుకుతున్న మాటలు తనమాటలే అని ప్రజలు విశ్వసించేలా ఆ ప్రజలకు కనిపించేవిధంగా కారుమబ్బులలో అతనివద్దకు వచ్చి మాట్లాడతానని సెలవివ్వడం మనం చూస్తాం. దేవుడు తన ప్రవక్తల విషయంలో ఇటువంటి రుజువులనే అనుగ్రహిస్తూ వచ్చాడు. దీనికీ ఇటువంటి రుజువులేవీ లేకుండా దేవుడు తమతో గుహలోనో గుడెసెలోనో దూతని పంపించి మాట్లాడాడని చెప్పుకున్న మహమ్మద్ మరియు జోసెఫ్ స్మిత్ వంటివారి సాక్ష్యాలకూ వ్యత్యాసం గమనించండి. మోషేతో దేవుడు బహిరంగంగా మాట్లాడాడు కాబట్టి అతను దేవునిపేరిట ప్రజలను మోసగించే అవకాశం లేనేలేదు.
నిర్గమకాండము 19:10-13
యెహోవా మోషేతో నీవు ప్రజలయొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము; వారు తమ బట్టలు ఉదుకుకొని మూడవనాటికి సిద్ధముగా నుండవలెను; మూడవనాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతముమీదికి దిగివచ్చును. నీవు చుట్టు ప్రజలకు మేరను ఏర్పరచిమీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమీ ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడును చేతితో దాని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను, మనుష్యుడుగాని మృగముగాని బ్రదుకకూడదు, బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతముయొద్దకు రావలెననెను.
ఈ వచనాలలో దేవుడు తాను దిగిరాబోతున్న సీనాయి పర్వతానికి హద్దులు ఏర్పరచి ఆ హద్దులు మీరినవారికి మరణశిక్ష విధించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపియైన మనిషి ఆయన అనుమతించినంతమట్టుకు మాత్రమే సమీపించాలి. ఆయన బయలుపరిచినంతమట్టుకు మాత్రమే ఆయన గురించి తెలుసుకోవాలి. ఆదాము హవ్వలు తప్పిపోయింది ఈ విషయంలోనే. వారు దేవుడు బయలుపరిచినదానికి అధనంగా మంచిచెడులను తెలుసుకోవాలి అనుకున్నారు, అందుకే మరణానికి లోనయ్యారు. ఈరోజు లేఖనాలలో బయలుపరచబడిన సత్యానికి అధనంగా మరేదో తెలుసుకున్నామని మర్మాలు పలికేవారూ, తెలుసుకోవాలని ఆరాటపడేవారూ అలాంటి పాపం చేస్తున్నవారే.
అదేవిధంగా పాతనిబంధనలో బాహ్యసంబంధమైన పరిశుభ్రత మన అంతరంగ పరిశుద్ధతకు ఛాయగా చెప్పబడింది కాబట్టి ఇశ్రాయేలీయులంతా మూడవ రోజుకు తమ బట్టలు ఉదుకుకోవాలని ఆజ్ఞాపించబడ్డారు.
నిర్గమకాండము 19:14,15
అప్పుడు మోషే పర్వతముమీదనుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకు కొనిరి. అప్పుడతడుమూడవనాటికి సిద్ధముగా నుండుడి; ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను.
ఈ వచనాల్లో మోషే సీనాయి పర్వతం నుండి ప్రజలదగ్గరకు దిగివచ్చి దేవుడు తనకు ఆజ్ఞాపించినదాని ప్రకారం ప్రజలను పరిశుద్ధపరచడం మనం చూస్తాం. పరిశుద్ధపరచడం అంటే దేవునికి ప్రత్యేకించడం అనే భావం ఉంది. వారు మూడవదినానికి తమ మనసులో ఎటువంటి స్వంత ఆలోచనలకూ, కార్యాలకూ తావివ్వకుండా దేవునికోసం ప్రత్యేకంగా ఎదురుచూడాలి. అందుకే ఏ పురుషుడూ స్త్రీని చేరకూడదని మోషే చెబుతున్నాడు. భార్యభర్తలు కలుసుకోవడం పాపం కానప్పటికీ వారు దేవునికోసం ప్రత్యేకంగా గడపాలనుకున్న సమయంలో ఆయనపైనే దృష్టి కేంద్రీకరించబడేలా ఆ సంబంధానికి కొంతసమయం దూరంగా ఉండాలి.
మొదటి కొరింథీయులకు 7:5 ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.
నిర్గమకాండము 19:16
మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వ తముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి.
ఈ వచనంలో సీనాయి పర్వతంపైకి దేవుడు దిగివచ్చేటప్పుడు అక్కడ కలిగిన పరిస్థితి గురించి మనం చూస్తాం. ఎందుకంటే అక్కడికి దేవుడు తన దూతలతో దిగివచ్చాడు, ఆ బూరధ్యనులు ఆ దూతలు చేసినవే. అందుకే మోషేతో సహా ప్రజలందరూ ఆ పరిస్థితికి వణికిపోయారు.
ద్వితీయోపదేశకాండము 33:1,2 దైవజనుడైన మోషే మృతినొందకమునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది; అతడిట్లనెను యెహోవా సీనాయినుండి వచ్చెను శేయీరులోనుండి వారికి ఉదయించెను ఆయన పారాను కొండనుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ద సమూహముల మధ్యనుండి ఆయన వచ్చెను ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియు చుండెను.
హెబ్రీయులకు 12:21 మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషేనేను మిక్కిలి భయపడి వణకుచున్నాననెను.
అదేవిధంగా దేవుడు సీనాయి పర్వతంపై మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు ఆయనతో దేవదూతలు కూడా ఉండి వారు కూడా ఆ పరిచర్యలో పాల్గొన్నారు (సాధనాలుగా) కాబట్టి ధర్మశాస్త్రం దేవదూతల ద్వారా అనుగ్రహించబడిందని నూతననిబంధన సాక్ష్యమిస్తుంది (అపో.కార్యములు 7:53, గలతీ 3:19).
నిర్గమకాండము 19:17-19
దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెము లోనుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరముచేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను.
ఈ వచనాలలో కూడా సీనాయి పర్వతంపై దేవుడు దిగి వచ్చినప్పుడు కలిగిన పరిస్థితి గురించి మనం చూస్తాం. హెబ్రీగ్రంథ కర్త ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ మన మధ్యవర్తియైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవునికి అంతకంటే సమీపంగా చేరుకుంటున్నామని చెబుతున్నాడు.
హెబ్రీయులకు 12:18-24 స్పృశించి తెలిసికొనదగినట్టియు, మండుచున్నట్టియు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధ కారమునకును, తుపానుకును, బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చియుండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినయెడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలు కొనిరి. మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషేనేను మిక్కిలి భయపడి వణకుచున్నాననెను. ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును, పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్తనిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు.
ఇది మోషే ద్వారా ఇశ్రాయేలీయులు పొందుకున్న దర్శనం కంటే ఎంతో శ్రేష్టమైనది, నిత్యమైనది కాబట్టి విశ్వాసులమైన మనమంతా మన దేవుని పరిశుద్ధతకు తగినట్టుగా సిద్ధపడాలి.
నిర్గమకాండము 19:20,21
యెహోవా సీనాయి పర్వతముమీదికి, అనగా ఆ పర్వత శిఖరముమీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరముమీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను అప్పుడు యెహోవాప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము.
ఈ వచనాలలో దేవుడు సీనాయి పర్వతం పైకి ఎక్కివచ్చిన మోషేకు ప్రజలు ఆ పర్వతం దగ్గరకు హద్దుమీరి వచ్చి నశించిపోకుండునట్టు మరోసారి ఖండితంగా ఆజ్ఞాపించమనడం మనం చూస్తాం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి అపవిత్రమైనదేదైనా ఆయన సన్నిధిలోకి ప్రవేశిస్తే నాశనం అవ్వకతప్పదు కాబట్టి ఆయన మరోసారి ఇలా హద్దులను గుర్తుచేస్తున్నాడు.
నిర్గమకాండము 19:22
మరియు యెహోవా వారిమీద పడకుండునట్లు యెహోవాయొద్దకు చేరు యాజకులు తమ్ముతామే పరిశుద్ధ పరచుకొనవలెనని మోషేతో చెప్పగా-
ఈ వచనంలో ఇశ్రాయేలీయుల యాజకుల ప్రస్తావన మనం చూస్తాం. అప్పటికి ఇంకా యాజకధర్మం విధించబడకున్నప్పటికీ లేవీగోత్రం గురించి ఆయన ఈమాటలు చెబుతున్నాడు.
నిర్గమకాండము 19:23
మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవుపర్వతమునకు మేరలను ఏర్పరచి దాని పరిశుద్ధపరచ వలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను.
ఈ వచనంలో మోషే దేవుని హెచ్చరికకు బదులిస్తూ ప్రజలెవ్వరూ ఆ పర్వతాన్ని సమీపించరని పలకడం మనం చూస్తాం. ఐతే ఆ క్రింద ఉన్న ప్రజలు ఎలాంటివారో దేవునికి బాగా తెలుసు కాబట్టి ఆయన ఈ క్రింది వచనాల్లో ఇలా ప్రత్యుత్తరమిస్తున్నాడు.
నిర్గమకాండము 19:24
అందుకు యెహోవానీవు దిగి వెళ్లుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులును ప్రజలును ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు; ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా-
ఈ వచనంలో దేవుడు; ఇశ్రాయేలీయుల గురించి మోషే పలికిన మాటలకు బదులివ్వడం, అహరోనును కూడా ఆ పర్వతంపైకి తీసుకురమ్మనడం మనం చూస్తాం. ఐతే ఈ వచనాన్ని మనం జాగ్రతగా పరిశీలించినప్పుడు మోషేతో మాట్లాడుతుంది యెహోవా దేవుడు. మరలా ఆయన "యెహోవా వారి మీద పడకుండునట్లు" "ఆయన వారి మీద పడునేమో" అని మరొకరి గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెహోవా దేవునిలో బహుళత్వం ఉన్నట్టు, యెహోవా అనే నామంతో మరొకరు కూడా పిలవబడుతున్నట్టు మనం స్పష్టంగా గుర్తించగలం. వారిలో ఒకరు తండ్రియైన యెహోవాయైతే మరొకరు కుమారుడైన యెహోవా. ఇక్కడ కుమారుడైన యెహోవా మోషేతో మాట్లాడుతూ "తండ్రియైన యెహోవా వారి మీద పడకుండునట్లు" "ఆయన వారి మీద పడునేమో" అని జాగ్రత్తలు చెబుతున్నాడు. యెహోవా దేవునిలో ఈ బహుళత్వం గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ క్రింది లింకుల ద్వారా సూచించిన వ్యాసాలను చదవండి.
యెహోవా దూత యేసుక్రీస్తు
త్రిత్వ సిద్ధాంత నిరూపణ
నిర్గమకాండము 19:25
మోషే ప్రజలయొద్దకు వెళ్లి ఆ మాట వారితో చెప్పెను.
ఈ వచనంలో మోషే దేవుడు తనను హెచ్చరించినట్టుగానే ప్రజలకు మరోసారి తమ హద్దులను గుర్తుచెయ్యడం మనం చూస్తాం. ఈవిధంగా మోషే దేవునికీ ఇశ్రాయేలీయులకూ మధ్యలో మధ్యవర్తిగా బాధ్యతకలిగి పనిచేస్తున్నాడు.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
నిర్గమకాండము అధ్యాయము 19

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"