విషయసూచిక:- 31:1,2, 31:3-5, 31:6 , 31:7-11, 31:12 , 31:13,14 , 31:15,16 , 31:17 , 31:18.
నిర్గమకాండము 31:1,2
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను చూడుము; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని.
ఈ వచనంలో దేవుడు యూదా గోత్రానికి చెందిన బెసలేలు గురించి మోషేకు పరిచయం చెయ్యడం మనం చూస్తాం. క్రింది వచనాల ప్రకారం ఆయన అతడిని ప్రత్యక్షగుడారపు వస్తువులను తయారు చెయ్యడానికి పిలిచాడు. ఈ బెసలేలు హూరు మనవడు. ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు అహరోనుతో పాటుగా ఈ హూరు కూడా మోషేకు సహకారిగా ఉన్నట్టు మనం గమనిస్తాం (నిర్గమకాండము 17:10-12). బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం మోషే సహోదరియైన మిర్యాము భర్తనే ఈ హూరు. అదే నిజమైతే బెసలేలు మిర్యాముకూ మోషేకు కూడా మనవడు ఔతాడు.
ఇక బెసలేలు అనే పేరుకు మహోన్నతుడైన దేవుని చాటున నివసించువాడు అని అర్థం. చాటున అన్నప్పుడు నీడన, ఛాయన అనే అర్థం కూడా వస్తుంది. యేసుక్రీస్తుకూ ఆయన బలికీ ఛాయగా ఉన్న (హెబ్రీ 8:5, 10:1) ప్రత్యక్షగుడారపు వస్తువులను తయారుచెయ్యడానికి అతను పిలవబడడం ద్వారా ఆ పేరుకు ఉన్న అర్థం అతనికి సార్థకం చెయ్యబడింది.
నిర్గమకాండము 31:3-5
విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి యున్నాను.
ఈ వచనాల్లో దేవుడు బెసలేలు ను పిలిచిన ఉన్నతమైన కారణాన్ని తెలియచెయ్యడం మనం చూస్తాం. నిర్గమకాండము 25వ అధ్యాయం నుండి 30వ అధ్యాయం వరకూ ఆయన ప్రత్యక్ష గుడారాన్ని ఎలా నిర్మించాలో వేటితో నిర్మించాలో, మందసాన్ని దీపవృక్షాన్నీ, బలిపీఠాన్నీ, బల్లనూ, యాజక వస్త్రాలనూ, ధూపవేదికనూ, ఇత్తడి గంగాళాన్నీ, అభిషేక తైలాన్నీ, పరిమళ ధూపద్రవ్యాలనూ ఎలా తయారు చెయ్యాలో వేటితో తయారు చెయ్యాలో వివరించాడు. అవన్నీ కష్టతరమైన, అపరిమితమైన జ్ఞానవివేకాలతో కూడుకున్న పనులు కాబట్టి, వాటిని తయారు చెయ్యడానికి ఆయనే బెసలేలును ఎన్నుకుని అతన్ని జ్ఞానవివేకాలు కలిగిన ఆత్మపూర్ణుడిగా చేస్తున్నాడు.
సామెతలు 8:12 జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసికొనియున్నాను సదుపాయములు తెలిసికొనుట నాచేతనగును.
ఇక్కడ దేవుని పని మరియు దేవుని ఎన్నిక (పిలుపు) అనే రెండింటినీ మనం గమనిస్తాం. ఆయన ఎన్నిక (పిలుపు) లేకుండా ఎవరూ ఆయన పనిని విజయవంతంగా చెయ్యలేరు. ఆయన పని నిమిత్తమైన ఆ ఎన్నికను ఆయనే చేస్తున్నాడు కాబట్టి ఇతరులు ఎవ్వరూ అందులో అసూయపడే అవకాశం కూడా లేదు.
ఇక్కడ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించి దానికి సంబంధించిన వస్తువులను తయారు చెయ్యాలనేది ఆయన ఆజ్ఞ. కానీ ఆ పనిని ఇశ్రాయేలీయులు విజయవంతంగా పూర్తిచెయ్యలేరు. ఎందుకంటే నేను పైన చెప్పినట్టుగా అవి చాలా సంక్లిష్టమైన తయారీలు. అందుకే దేవుడు ఇక్కడ బెసలేలును ఎన్నుకుని ఆ నిర్మాణాలను ఆయన ఆజ్ఞాపించిన విధంగా పూర్తిచెయ్యగలిగే జ్ఞానవివేకాలను అతనికి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆజ్ఞాపించిన దేవుడే ఆ ఆజ్ఞలను నెరవేర్చగలిగే సామర్థ్యాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు. కేవలం మనకు ఆ ఆజ్ఞలను నెరవేర్చాలనే ఆసక్తి ఉంటే చాలు. ఆయనే వాటివిషయంలో మనం తొట్రిల్లిపోకుండా సహాయం చేస్తాడు (యూదా 1:24,25). అందుకే పౌలు సువార్త ప్రకటన అనే ఆయన ఆజ్ఞను ఆయన అనుగ్రహించిన సామర్థ్యంతోనే విజయవంతంగా ప్రకటిస్తున్నట్టు ఒప్పుకుంటున్నాడు.
2కోరింథీయులకు 3:5 మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.
అదేవిధంగా ఆయన బెసలేలును యేసుక్రీస్తుకూ ఆయన కలిగించే రక్షణకూ సాదృష్యంగా ఉన్న వస్తువులను తయారు చెయ్యడానికి పిలిచి ఆత్మపూర్ణుడిగా చేస్తే, నిజస్వరూపమైన సంఘంలో పరిచర్య చెయ్యడానికి కూడా ఆయన కొందరిని పిలిచి వారిని మరింత ఉన్నతమైన ఆత్మవరాలతో నింపాడు.
ఎఫెసీయులకు 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.
ప్రస్తుతం అపోస్తలీయ వరాలు, ప్రవక్తలూ సంఘంలో లేనప్పటికీ, ఉపదేశించే వరం, కాపరులుగా ఉండే వరం, సువార్త ప్రకటించే భారం మనమంతా కలిగియున్నాము. కాబట్టి ఆయన మనకు అప్పగించిన బాధ్యతల్లో ఆయన అనుగ్రహించిన వరాలను బెసలేలు కంటే ఉన్నంతంగా వినియోగించి దేవుని గృహాన్ని (సంఘాన్ని) కట్టగలగాలి. సంఘమంటే దేవుని గృహం (1 కొరింథీ 3:9).
నిర్గమకాండము 31:6
మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసి తిని. నేను నీకాజ్ఞాపించినవన్నియు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను.
ఈ వచనంలో దేవుడు బెసలేలుకు సహకారులుగా దానుగోత్రీకుడైన అహోలీయాబును మరి కొందరినీ నియమించి వారిని కూడా జ్ఞానంతో నింపుతున్నట్టు మనం చూస్తాం. ఎందుకంటే బెసలేలు ఒక్కడే అన్ని పనులనూ చెయ్యలేడు. అందుకే అతని నిర్వాహణ కింద వీరందరూ ఉంచబడ్డారు. ఇక్కడ దేవుడు తన ప్రజలపై వారు మొయ్యలేని బరువును ఉంచడని మరోసారి చాటుకున్నాడు. ఆయన జారీ చేసే వ్యక్తిగత ఆజ్ఞలు కూడా ఆయన్ని ప్రేమించేవారికి భారమైనవి కావు (1యోహాను 5:3).
దేవుడు ప్రత్యక్షగుడారపు వస్తువులను తయారు చెయ్యడానికి యూదా గోత్రం నుండి బెసలేలును పిలిచాడు. అతనికి సహకారిగా ఉండడానికి దానుగోత్రం నుండి అహోలీయాబును పిలుస్తున్నాడు. ఈ దాను అనేవాడు యాకోబుకు రాహేలు దాసి ద్వారా జన్మించినవాడు (ఆదికాండము 30:3-6). కానీ దేవుడు ఇక్కడ అతడిని కూడా తన మందిరసంబంధమైన వస్తువుల తయారికీ బెసలేలు సహకారిగా పిలవడం ద్వారా ఆయనలో ఎటువంటి బేధం లేదని తెలియచేస్తున్నాడు. అలాగే లేవీగోత్రాన్ని ఆయన యాజకత్వానికై పిలిచాడు. కాబట్టి మనం కూడా సంఘంలో ఎలాంటి బేధాలనూ కలిగియుండకూడదు. ఎందుకంటే మనమంతా ఒకే క్రీస్తు శరీరంగా పిలవబడ్డాము. పౌలు ఈ విషయాన్ని ఎంతో చక్కగా తన పత్రికలో జ్ఞాపకం చేసాడు.
మొదటి కొరింథీయులకు 12:12-27 ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి. శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియునేను కన్ను కాను గనుక శరీరములోనిదానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములోనుంచెను. అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ? అవయవములు అనేకములైనను శరీరమొక్కటే.
గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు. అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితో కూడ శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితో కూడ సంతోషించును. అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములైయున్నారు.
అదేవిధంగా ఆయన మోషేకు అహరోనును సహకారిగా నియమించాడు. బెసలేలుకు అహోలియాబును సహకారిగా నియమించాడు. యేసుక్రీస్తు తన శిష్యులను సువార్త నిమిత్తం పంపినప్పుడు ఇద్దరేసి చొప్పున పంపించాడు (మార్కు 6:7). పరిశుద్ధాత్ముడు ఆ సువార్తకోసం పౌలునూ బర్నబాను ప్రత్యేకపరిచాడు (అపొ.కార్యములు 13:2) . ప్రకటన గ్రంథంలో కూడా ఇద్దరు సాక్షుల గురించి మనం చదువుతాం (ప్రకటన 11:3). ఈవిధంగా చాలా సందర్భాలలో ప్రభువు పరిచర్యలో ఒకరితో పాటు మరొకరు సహకారులుగా నిర్ణయించబడుతున్నట్టు మనం గమనిస్తాం. ఎందుకంటే దీనివల్ల పరిచర్య బలంగా కొనసాగడమే కాకుండా ఒకరిని ఒకరు వ్యక్తిగతంగా బలపరచుకునే అవకాశం ఉంటుంది. సొలొమోను కూడా ఈ విషయం మనకు జ్ఞాపకం చేస్తాడు.
ప్రసంగి 4:9 ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలముకలుగును గనుక ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడియుండుట మేలు.
కాబట్టి మనం పరిచర్యలో ఒంటరిగా కాకుండా ఇతరులతో కలసి కొనసాగడానికి ప్రయత్నించాలి. మనలో వ్యక్తిగత స్వార్థం లేనప్పుడే అది సాధ్యమౌతుంది. స్వార్థం ఉన్న వ్యక్తి పరిచర్యలో పాల్గొన్నప్పటికీ అతను విజయం సాధించలేడు.
నిర్గమకాండము 31:7-11
ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దానిమీదనున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉప కరణములన్నిటిని బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటిని ధూపవేదికను దహన బలిపీఠ మును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను యాజకసేవచేయునట్లు సేవా వస్త్రములను యాజకుడైన అహరోనుయొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధ స్థలముకొరకు పరిమళ ధూపద్రవ్యములను నేను నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను.
ఈ వచనాల్లో దేవుడు బెసలేలు మరియు అతని సహకారులు కలసి తయారు చెయ్యవలసినవాటి వివరాలను మరోసారి తెలియచెయ్యడం మనం చూస్తాం. వీటిగురించి నేను ఇప్పటికే స్పష్టంగా వివరించాను.
ప్రత్యక్షపు గుడారము: నిర్గమకాండము 26 వ్యాఖ్యానం చూడండి
సాక్ష్యపు మందసము: నిర్గమకాండము 25:10-16 వ్యాఖ్యానం చూడండి
కరుణాపీఠము: నిర్గమకాండము 25:10-16 వ్యాఖ్యానం చూడండి
బల్లను: నిర్గమకాండము 25:10-16 వ్యాఖ్యానం చూడండి
దీపవృక్షము: నిర్గమకాండము 25:10-16 వ్యాఖ్యానం చూడండి
ధూపవేదిక: నిర్గమకాండము 30:1-9 వ్యాఖ్యానం చూడండి
దహనబలిపీఠము: నిర్గమకాండము 27:1-9 వ్యాఖ్యానం చూడండి
గంగాళము: నిర్గమకాండము 30:1-9 వ్యాఖ్యానం చూడండి
యాజకవస్త్రాలు: నిర్గమకాండము 28 వ్యాఖ్యానం చూడండి
అభిషేక తైలము: నిర్గమకాండము 30:1-9 వ్యాఖ్యానం చూడండి
పరిమళ ధూపద్రవ్యములు: నిర్గమకాండము 30:1-9 వ్యాఖ్యానం చూడండి
నిర్గమకాండము 31:12
మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను.
ఈ వచనంలో దేవుడు విశ్రాంతి దినాచారం గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ప్రతీ శనివారం ఇశ్రాయేలీయులు దీనిని ఆచరించాలి. ఈ విశ్రాంతిదిన కట్టడ గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి "నిర్గమకాండము 20:8-11 వ్యాఖ్యానం చూడండి"
అదేవిధంగా ఇశ్రాయేలీయులకు శనివారం మాత్రమే కాకుండా పండుగలకు సంబంధించిన విశ్రాంతిదినాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ప్రాయుశ్చిత్త పండుగ రోజున వారికి మహా విశ్రాంతిదినం ఉంటుంది (లేవీకాండము 16:31). పస్కా పండుగ మరునాడు ప్రారంభమయ్యే పులియనిరొట్టెల పండుగలో మొదటి దినం, చివరిదినమైన ఏడవ దినం కూడా వారికి విశ్రాంతిదినమే (లేవీకాండము 23:5-8). ప్రభువైన యేసుక్రీస్తు పస్కా రోజున సిలువ వెయ్యబడితే మరుసటి దినం విశ్రాంతిదినం మహా దినం అని చెప్పబడింది ఈ పులియనిరొట్టెల పండుగలోని విశ్రాంతిదినం గురించే (యోహాను 19:30,31).
నిర్గమకాండము 31:13,14
మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తర తరములకు నాకును మీకును గురుతగును. కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్ర పరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును.
ఈ వచనాల్లో దేవుడు విశ్రాంతిదినాచారాన్ని నియమించడానికి గల కారణాన్ని తెలియచెయ్యడం మనం చూస్తాం. ఆయన ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరుస్తున్నాడు అనడానికి గురుతే విశ్రాంతిదినం. పరిశుద్ధపరచడం అనగా ప్రత్యేకించడం అనే అర్థం వస్తుంది. ఇశ్రాయేలీయులు ఈ విశ్రాంతిదినాన్ని పాటించడం ద్వారా మిగిలిన జాతుల ప్రజల నుండి ప్రత్యేకంగా ఉంటారు. అలాంటప్పుడు ఎవరైనా దానిని ధిక్కరించడం, ఆయనచేత పరిశుద్ధపరచడాన్ని ధిక్కరించడమే ఔతుంది, అందుకే ఆయన దానిని ధిక్కరించినవాడికి మరణశిక్ష విధించాడు (సంఖ్యాకాండము 15:32-36). ఈ అవగాహన లేని కొందరు బైబిల్ దేవుడు విశ్రాంతిదినాన్న కట్టెలు ఏరుకున్నవాడికి కూడా మరణశిక్ష విధించాడంటూ ఆరోపణలు చేస్తుంటారు. వాడు విశ్రాంతి దినాన కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళాడంటే, విశ్రాంతి దినాచారం వెనుక ఉన్న ఆయన ఉద్దేశాన్ని ధిక్కరించి ఆ పని చేసాడని అర్థం. యోగ్యత లేకున్నప్పటికీ కేవలం ఆయన కృపను బట్టి ఇనుప కొలిమి వంటి ఐగుప్తు శ్రమలనుండి విడిపించబడి, ఆయన చేత పరిశుద్ధపరచబడడాన్ని ధిక్కరించేవాడికి మరణశిక్ష న్యాయమే. పైగా ఆయన ముందుగానే విశ్రాంతిదినాన్ని ధిక్కరించేవాడు "తన ప్రజలలో నుండి కొట్టివేయబడును" అని "ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును" అని హెచ్చరించినప్పటికీ వాడు ఆ పని చేసాడంటే, దేవుని హెచ్చరిక పట్లవాడు అత్యంత చులకనభావంతో ఉన్నాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలను ధిక్కరించడమంటే ఆ ఆజ్ఞల వెనుకున్న ఆయన పవిత్రమైన ఉద్దేశాన్ని ధిక్కరించడమే అని, ఆయన హెచ్చరికను చులకనగా భావించడమే అని మనం గుర్తుంచుకోవాలి.
నిర్గమకాండము 31:15,16
ఆరు దినములు పనిచేయ వచ్చును. ఏడవదినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతిదినము. ఆ విశ్రాంతిదినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తర తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను. అది నిత్యనిబంధన.
ఈ వచనాల్లో దేవుడు విశ్రాంతి దినం గురించి హెచ్చరిక చేస్తూ "అది నిత్యనిబంధన" అని పలకడం మనం చూస్తాం. గత సందర్భాల్లో వివరించినట్టుగా "అది నిత్యనిబంధన" అంటే సాదృష్యమైన దీనికి నిజస్వరూపం వచ్చేవరకూ అని అర్థం. ఈ విశ్రాంతిదినాచారం యేసుక్రీస్తులో మనకు కలిగే పరిశుద్ధతకూ, పరలోకంలో కలిగే విశ్రాంతికీ సాదృష్యంగా ఉంది.
కొలస్సీయులకు 2:16,17 కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది.
హెబ్రీయులకు 4:9,10 కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును.
కాబట్టి మనం సాదృష్యమైన శనివారపు విశ్రాంతిదినాచారం పాటించనవసరం లేదు. అయితే మనకు ఆదివారపు ప్రభువు దినాచారం మాత్రం ఉంది. ఆరోజు తప్పకుండా మనం మన పనులనుండి విశ్రమించి సంఘంగా కూడుకుని ఆయనను ఆరాధించాలి. కుటుంబంతో కలసి ఆత్మీయసంబంధమైన సంగతులను నేర్చుకోవడానికి పూర్తి సమయం కేటాయించాలి.
నిర్గమకాండము 31:17
నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గురుతైయుండును. ఏలయనగా ఆరుదినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి యేడవదినమున పని మాని విశ్రమించెనని చెప్పుము.
ఈ వచనంలో దేవుడు విశ్రాంతిదినాచారం వెనుక ఉన్న మరో ఉద్దేశాన్ని కూడా తెలియచేస్తూ అది ఆయన ఆరురోజుల్లో సృష్టిని పూర్తిచేసి ఏడవదినాన విశ్రమించిన దినంగా గుర్తుచెయ్యడం మనం చూస్తాం. కాబట్టి ఆయన ఈ సృష్టిని ఆరురోజుల్లో చేసాడనడానికి కూడా విశ్రాంతిదినాచారం గుర్తుగా నియమించబడింది. అయితే ఆయన ఏడవదినమున పనిమాని విశ్రమించెను అంటే, ఆయనేదో అలసిపోయి విశ్రాంతి తీసుకున్నాడని అర్థం కాదు. కొందరు ఈ విధంగా కూడా అపార్థం చేసుకుంటుంటారు. ఆయన ఏడవదినాన విశ్రమించాడు అంటే, ఆయన ఆరురోజుల్లో చెయ్యాలనుకున్న సృష్టిని ఆ నిర్థిష్ట సమయంలో సంపూర్ణంగా పూర్తిచేసి ఏడవ దినాన మరేదీ నూతనసృష్టి చెయ్యలేదని అర్థం. అంతేతప్ప బైబిల్ దేవుడు అలసిపోయే దేవుడు కాడు, ఆయన అనంతమైన శక్తికలిగిన నిత్యుడైన దేవుడు, సమస్తశక్తికీ మూలం ఆయనే.
ఆదికాండము 2:1-3 ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూ హమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.
యెషయా 40:28 నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.
నిర్గమకాండము 31:18
మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసన ములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను.
ఈ వచనంలో దేవుడు మోషేకు రెండు రాతిపలకలను ఇవ్వడం మనం చూస్తాం. ఈ రెండు రాతిపలకలపైనే నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం చదువుతున్న పది ఆజ్ఞలూ రాయబడ్డాయి. దేవుడు చెబుతున్న మిగిలిన సంగతులన్నీ మోషే జ్ఞాపకముంచుకుని పరిశుద్ధాత్మ ప్రేరణతో గ్రంథస్థం చేస్తే, ఆ పది ఆజ్ఞలను మాత్రం స్వయంగా దేవుడే రాసాడు. ఎందుకంటే ఆ ఆజ్ఞలు మొత్తం బైబిల్ గ్రంథానికి పునాదిగా ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
పది ఆజ్ఞల వివరణ
అయితే దేవుడు తన వ్రేలితో వాటిని రాసాడు అన్నప్పుడు ఆయనకు మనలానే వ్రేళ్ళు ఉంటాయని అర్థం కాదు. లేఖనాలు మనకు అర్థమయ్యే బాషలో రాయబడ్డాయి కాబట్టి గ్రంథకర్తలు దేవునికి కూడా మనలాంటి అవయాలు ఉన్నట్టుగా వర్ణించడం జరిగింది. ఈ విధమైన వర్ణనను anthromorpism అంటారు. దేవుడు ఆత్మ ఆయనకు మనలాంటి పరిమిత శరీరం ఉండదు. ఆపది ఆజ్ఞలూ స్వయంగా ఆయనచేత రాయబడ్డాయని తెలియచేసేందుకే మోషే అలాంటి వర్ణనను ఉపయోగించాడు. ఉదాహరణకు; యేసుక్రీస్తు దెయ్యాలను వెళ్ళగొట్టింది దేవునిశక్తితోనే కదా. కానీ ఆయన దానిని ఎలా వర్ణిస్తున్నాడో చూడండి.
లూకా 11:20 అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
నిర్గమకాండము అధ్యాయం 31

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"