పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

విషయసూచిక:- 37:1-9 , 37:10-16, 37:17-24 , 37:25-28 , 37:29 .

 నిర్గమకాండము 37:1-9

మరియు బెసలేలు తుమ్మకఱ్ఱతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర దాని యెత్తు మూరెడునర. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను. దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములును ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములుండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించెను. మరియు అతడు తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొది గించి మందసమును మోయుటకు దాని ప్రక్కలమీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను చొనిపెను. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర; మరియు రెండు బంగారు కెరూబులను చేసెను, కరుణాపీఠముయొక్క రెండు కొనలను వాటిని నకిషిపనిగా చేసెను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని రెండు కొనలమీద కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకివిప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒక దానికి ఒకటి ఎదురుగా ఉండెను; వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను.

ఈ వచనాల్లో బెసలేలు మందసాన్ని మరియు దాని పైభాగమైన కరుణాపీఠాన్ని తయారు చెయ్యడం మనం చూస్తాం. ఈ మందసం మరియు కరుణాపీఠాల యొక్క ఉపయోగం అలానే అవి దేనికి ఛాయగా ఉన్నాయో ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 25:10-21 వ్యాఖ్యానం చూడండి). అదేవిధంగా మోషే గతంలో తాను వివరంగా రాసినవాటినే మరలా ఇక్కడ ఎందుకు రాయవలసి వచ్చిందో కూడా నేను వివరించాను (నిర్గమకాండము 36:8-38 వ్యాఖ్యానం చూడండి).

నిర్గమకాండము 37:10-16
మరియు అతడు తుమ్మకఱ్ఱతో బల్లను చేసెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరెడు దాని యెత్తు మూరెడునర. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను; దానికి చుట్టు బెత్తెడు బద్దెచేసి దాని బద్దెపైని చుట్టు బంగారు జవను చేసెను. దానికి నాలుగు బంగారు ఉంగ రములను పోతపోసి దాని నాలుగు కాళ్లకుండిన నాలుగు మూలలయందు ఆ ఉంగరములను వేసెను. బల్లను మోయు టకు మోతకఱ్ఱ లుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీ పముగా నుండెను. బల్లను మోయుటకు తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను. మరియు నతడు బల్లమీదనుండు దాని ఉపకరణములను, అనగా దాని గంగాళములను దాని ధూపకలశములను దాని గిన్నెలను తర్పణము చేయుటకు దాని పాత్రలనుమేలిమి బంగారుతో చేసెను.

ఈ వచనాల్లో బెసలేలు బల్ల మరియు దానిపై ఉంచబడే ఉపకరణాలను తయారు చెయ్యడం‌ మనం చూస్తాం. ఈ బల్ల యొక్క ఉపయోగం అలానే అది దేనికి ఛాయగా ఉందో ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 25:23-30 వ్యాఖ్యానం చూడండి). అదేవిధంగా మోషే గతంలో తాను వివరంగా రాసినవాటినే మరలా ఇక్కడ ఎందుకు రాయవలసి వచ్చిందో కూడా నేను వివరించాను (నిర్గమకాండము 36:8-38 వ్యాఖ్యానం చూడండి).

నిర్గమకాండము 37:17-24
అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నకిషిపనిగా చేసెను. దాని కలశములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కలనుండి మూడేసికొమ్మలు అట్లు దాని ప్రక్కలనుండి ఆరు కొమ్మలు బయలుదేరినవి. ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులుగల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులుగల బాదమురూపమైన మూడు కలశములు; అట్లు దీపవృక్షమునుండి బయలుదేరిన ఆరు కొమ్మలకు ఉండెను. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులుగల బాదమురూపమైన నాలుగు కలశము లుండెను. దీపవృక్షమునుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి; అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నకిషిపనిగా చేయబడెను. మరియు అతడు దాని యేడు ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టుకారును దాని కత్తెరచిప్పను మేలిమి బంగారుతో చేసెను. దానిని దాని ఉపకరణములన్నిటిని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేసెను.

ఈ వచనాల్లో బెసలేలు దీపవృక్షం మరియు దాని కత్తెర,చిప్పలను తయారు చెయ్య‌డం‌ మనం చూస్తాం. వీటియొక్క ఉపయోగం ఏంటో అలానే ఇవి దేనికి ఛాయగా ఉన్నాయో ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 25:31-39 వ్యాఖ్యానం చూడండి). అదేవిధంగా మోషే గతంలో తాను వివరంగా రాసినవాటినే మరలా ఇక్కడ ఎందుకు రాయవలసి వచ్చిందో కూడా నేను వివరించాను (నిర్గమకాండము 36:8-38 వ్యాఖ్యానం చూడండి).

నిర్గమకాండము 37:25-28
మరియు అతడు తుమ్మకఱ్ఱతో ధూపవేదికను చేసెను. దాని పొడుగు మూరెడు దాని వెడల్పు మూరెడు, అది చచ్చౌకముగా నుండెను. దాని యెత్తు రెండు మూరలు దాని కొమ్ములు ఏకాండమైనవి. దానికి, అనగా దాని కప్పుకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను. దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములుగా దానికి రెండు ఉంగరములను బంగారుతో చేసి దానిరెండు ప్రక్కలయందు దాని రెండు మూలలయందు దాని జవకు దిగువను వాటిని వేసెను. దాని మోత కఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను.

ఈ వచనాల్లో బెసలేలు ధూపవేదికను తయారు చెయ్యడం మనం చూస్తాం. దీని యొక్క ఉపయోగం‌ ఏంటో అలానే‌ ఇది దేనికి ఛాయగా ఉందో ఇప్పటికే నేను‌ వివరించాను (నిర్గమకాండము 30:1-9 వ్యాఖ్యానం చూడండి). అదేవిధంగా మోషే గతంలో తాను వివరంగా రాసినవాటినే మరలా ఇక్కడ ఎందుకు రాయవలసి వచ్చిందో కూడా నేను వివరించాను (నిర్గమకాండము 36:8-38 వ్యాఖ్యానం చూడండి).

నిర్గమకాండము 37:29
అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకునిచేత చేయించెను.

ఈ వచనంలో బెసలేలు అభిషేక తైలాన్ని మరియు పరిమళ ధూపద్రవ్యాలను తయారు చేయించడం మనం చూస్తాం. వీటి ఉపయోగం ఏంటో అలానే ఇవి దేనికి ఛాయగా ఉన్నాయో ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 30:22-38 వ్యాఖ్యానం చూడండి). అదేవిధంగా మోషే గతంలో తాను వివరంగా రాసినవాటినే మరలా ఇక్కడ ఎందుకు రాయవలసి వచ్చిందో కూడా నేను వివరించాను (నిర్గమకాండము 36:8-38 వ్యాఖ్యానం చూడండి).

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.