దుర్బోధలకు జవాబు

సార్వత్రిక క్రైస్తవసంఘం ప్రపంచవ్యాప్తముగా విస్తరించి ప్రభువు తమకు ఆజ్ఞాపించిన బోధలను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేయుచున్న తరుణములో,సహించలేని అపవాది అదే క్రైస్తవ సంఘ పరిచారకుల వేషములో తన అనుచరులను రేపి, సంఘాన్ని, సంఘబోధనీ కలవరపరిచే ప్రయత్నాన్ని ప్రారంభం నుండీ చేస్తూ వచ్చాడు.

 

దేవుని అనాది సంకల్పానుసారంగా ఈ భూమిపైన సంఘము ఏర్పడిననాటనుండీ, ఆ సంఘానికి శిరస్సుగా, విమోచకునిగా, దేవునిగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తువారిపైన అపవాది అనుచరులు సంఘము వెలుపటినుంచీ, సంఘములోపటినుంచీ అనేకమైన దాడులకు పాల్పడ్డారు,

 


అబ్రహాము దేవుడు ఎవరు? యెహోవా లేక అల్లాహ్?

బైబిల్ లో ఉన్న యెహోవా, ఖురాన్ లో ఉన్న అల్లాహ్… ఇద్దరూ ఒక్కరేనా లేక వేరు వేరా? యెహోవా - అల్లాహ్, ఇద్దరూ ఒక్కరే అని ముస్లింలు చాలా బలంగా విశ్వసిస్తారు. ఎందుకంటే, బైబిల్ ప్రకారం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ల దేవుడి పేరు యెహోవా. అలాగే ఖురాన్ ప్రకారం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ల దేవుడి పేరు అల్లాహ్. అందువలన ముస్లింలకు వేరే మార్గం లేదు. అల్లాహ్, యెహోవా ఇద్దరూ ఒక్కరే అని వారు మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి మూడు భిన్న వాదనలను ఈ రోజు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా, ప్రముఖ ముస్లిం మత ప్రచారకుడు డాక్టర్ షబ్బీర్ అలీ గారి వాదన ఏమిటో చూద్దాం.

 

పరిశుద్ధాత్మ ఎవరు?

గమనిక: ఈ రచన బి.జాన్ గారి ప్రసంగం ఎంత వరకు సత్యము అని పరిశీలించడానికి మాత్రమే ఉద్దేశించినది. ఇది పరిశుద్ధాత్ముని గూర్చిన పూర్తి వివరణ ఇచ్చే రచన కాదు. కొందరు IBT సహోదరులు ఇలా జాన్ గారి దురోధలను బహిర్గతం చేయడం, వ్యక్తిగత విమర్శ అంటున్నారు. డా|| జాన్ గారి దగ్గరికి వచ్చే సహోదరులు జాన్ గారి బోధలను ఏమాత్రం పరిశీలించకుండానే అంగీకరించి వాటినే ఇతరులకు బోధిస్తున్నారు.

 

ప్రభువునందు ఏర్పరచబడిన ప్రియులందరికీ నా వందనములు.

తెలుగు క్రైస్తవ సంఘములో పీడీ సుందరావుగారి పేరు తెలియనివారు చాలా అరుదు. పీడీ సుందరావుగారు BOUI అనేటటువంటి ఒక సంస్థను స్థాపించి సార్వత్రిక క్రైస్తవసంఘం ప్రాముఖ్యమైన విశ్వాసపునాదులుగా నమ్మేటటువంటి లేఖనాధారమైన సిద్దాంతాలను విస్మరించి,బైబిల్ రాయబడినటువంటి మూలభాషలను కానీ,సంఘచరిత్రను కానీ, సందర్భానుసారముగా లేఖనాలను అర్థం చేసుకొనే పద్ధతిని కానీ ఏమాత్రమూ అనుసరించకుండా తనకున్న మిడిమిడి జ్ఞానముతో ఎన్నో దుర్భోధలను తన సంస్థ ద్వారా వ్యాపింపచేసి,తనకున్న వాక్చాతుర్యముతో కొద్దికాలములోనే అతిపెద్ద కల్ట్ గ తెలుగు క్రైస్తవ్యములో ఎదగగలిగాడు.ప్రస్తుతకాలములో ఈ కల్ట్ తెలుగులో మాత్రమే కాకుండా భారతదేశములోని కొన్ని ఇతర రాష్ట్రాలలోనూ వారివారి స్వంతభాషల్లో విస్తరిస్తూ క్రైస్తవ సంఘానికి ఒకపెద్ద ప్రమాదముగా మారినదని చెప్పడములో ఏమాత్రమూ సందేహము లేదు.

ప్రభువునందు ఏర్పరబడిన సహోదరీ/సహోదరులందరికీ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారినామములో వందనములు;ప్రస్తుతం మనం నివశిస్తున్న ఈ దేశంలో, అత్యధికంగా హిందూమతస్తులే ఉన్నారని మన అందరికీ తెలుసు;వారికి ఎంతోమంది దేవీదేవతలు ఉన్నారనీ, వారి చరిత్రలకు సంభంధించిన‌ ఎన్నో మతగ్రంధాలు కూడా మనమధ్య ఉన్నాయనేది కూడా మనందరికీ తెలుసు.

"మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు, యెహోవా ఏమియు సెలవియ్యనప్పుడు - ప్రభువైన యెహోవా యీలాగు సెలవిచ్చు చున్నాడని చెప్పుచు, వట్టిసోదెగాండ్రయి జనులు కట్టిన మంటిగోడకు గచ్చుపూత పూయువారై యున్నారు" - యెహెజ్కేలు 22:28.

 

సాంప్రదాయక క్రైస్తవ్యం, యెహోవాసాక్షులు, మార్మోన్లు

ఉపదేశకునిగాను బోధకునిగాను ఉండే వ్యక్తి దేవుని యెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను (2 తిమోతి2:15), మరియు హితబోధ విషయమై హెచ్చరించుటకును,...

‘జయశాలి' అని స్వయం బిరుదు పెట్టుకున్న శ్రీ పి.డి.సుందరరావుగారు, గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అనే ధోరణిలో పుస్తకాల వెంబడి పుస్తకాలను, ప్రసంగాల వెంబడి ప్రసంగాలను ప్రచురిస్తున్నారు.

మానవజీవిత పరమార్థమును గుర్తుచేస్తూ, ప్రగతిపథంలో నడిపించుటకై రూపొందించబడినవి ఆచారములు. మంచిపద్దతులతో మిళితమైయున్న ఆ ఆచారములను ఆచరణలో పెడుతూ భావితరాలవారికి అందించడమే వాటిని పాటించుటలోని ముఖ్యోద్దేశం.

అపవాది ఆరంభికుడు కాదు గాని అనుకరించేవాడు. దేవునికి యేసుక్రీస్తు ఏకైకకుమారునిగా ఉన్నట్లే అపవాదికి కూడ ''పాపపురుషుడనే నాశనపుత్రుడు ఉన్నాడు'' (2థెస్స. 2:3).

| ప్రపంచములో ఎక్కువ మంది ప్రజలు క్రైస్తవులు. అయినా క్రిస్టియానిటీ ఇండియాలో మాత్రమే ఉన్న నిమ్న (మాల, మాదిగ) కులాల వారిది అనే అపోహ మన దేశ ప్రజలలో ప్రబలంగా ఉంది. ఇది నిజమా?

విశ్వాసుల ఐక్యతకు సాధనమైన బల్లారాధన, వారి మధ్య విభేదానికి హేతువు కావడం ఎంతో విచారకరం. కొందరు ఆ బల్లలోని పదార్థాలు అక్షరాలా యేసు శరీర రకాలుగా మారతాయని భావిస్తున్నారు.

క్రైస్తవలోకం మొదటి శతాబ్దము నుండి ఎన్నో తప్పుడుబోధలను ఎదుర్కొని ఎన్నో శ్రమలు అనుభవించి దేవుని సువార్త మరియు ఆయన బోధను కాపాడుకుంటూ వస్తున్నా, అపోస్తలుల కాలము నుండే సాతానువశులైన తప్పుడు బోధకులు ఎంతోమంది సత్యబోధను వంచించే ప్రయత్నం చేయడం మానలేదు.

'యాజకుడు' అంటే యాజకత్వము చేసేవాడు అని అర్థము. యాజకుడు చేసే పనిని అంటే అతడు చేయాల్సిన విధిని 'యాజక ధర్మము' అని అంటారు.

ఈనాడు చాలామంది తప్పును బహిర్గతం చేయటం మరియు పేర్లను బయటపెట్టటాన్ని సరికాదు అనుకుంటారు. స్వేచ్ఛావాదులు ఎప్పటికీ అలాగే నమ్మేవారు కాని, ఈ మధ్యకాలంలో బైబిల్‌కి కట్టుబడివున్నామని ...

సర్వోన్నతమైన నాణ్యతాప్రమాణాలు కలిగిన దేవోక్తులను, క్రైస్తవుల స్వచ్ఛమైన విశ్వాసమును అడ్డగించు లోపభూయిష్టమైన సిద్ధాంతాలు పౌలు కాలంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.

Institute of Bible Technology (I.B.T) వ్యవస్థాపకులైన డా|| బొంకూరి జాన్ గారు గతంలో వ్రాసిన 'యేసు ఎవరు?' అనే కరపత్రమును విమర్శిస్తూ www.hithabodha.com లో మేము ఒక వ్యాసమును ప్రచురించాము.

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.