హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.
హితబోధ యాప్ కొరకు Join WhatsApp
ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.
© 2024. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.
నిర్గమకాండము అధ్యాయము 10
ఈ అధ్యాయంలో దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడం వెనుకున్న మరో కారణాన్ని మోషేకు వివరించడం (1-2) మోషేను ఫరో యొద్దకు పంపి మిడతల తెగులు గురించి హెచ్చరించమనడం (3-6) ఫరో సేవకులు ఆ మాటలు విని ఫరోను వేడుకోవడం ఫరో మోషేను పిలిపించి ఇశ్రాయేలీయులను పంపే విషయంలో మినహాయింపులు ప్రస్తావించడం, మోషే దానికి ఒప్పుకోకపోవడం (7-11) మోషే ఐగుప్తుపైకి మిడతల దండును రప్పించడం (12-15) ఫరో మోషేను వేడుకున్నపుడు మోషే ఆ మిడతలను తొలగించడం అయినప్పటికీ ఫరో ఎప్పటిలానే ప్రవర్తించడం (16-20) దేవుడు ఐగుప్తుదేశమంతా కటికచీకటి కమ్మచెయ్యడం, అది భరించలేని ఫరో మరలా మోషేను పిలిపించి రాజీకి ప్రయత్నించడం దానికి మోషే ఒప్పుకోకపోవడం (21-29) గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయము 1
నిర్గమకాండము అధ్యాయము 2
ఈ అధ్యాయంలో మోషే జన్మించి మూడు నెలలు దాచబడడం (1-2) తరువాత ఆ బిడ్డను జమ్ముపెట్టెలో పెట్టి నీటియొడ్డున విడిచిపెట్టడం, ఫరో కుమార్తె ఆ బిడ్డను కనికరించి దత్తతు తీసుకోవడం (3-10) మోషే పెద్దవాడయ్యాక ఇశ్రాయేలీయులను కలుసుకోవడం, అన్యాయం పక్షంగా పోరాటం చేసి సొంత ప్రజలచే ఎదిరించబడడం (11-14) ఫరో మోషేను చంపాలనుకున్నపుడు ఐగుప్తునుండి మిద్యానుకు పారిపోయి మిద్యాను యాజకుడి గృహంలో చేరడం, అతని కుమార్తెను వివాహం చేసుకుని కుమారుడిని కనడం (15-22) దేవుడు ఇశ్రాయేలీయుల మొర ఆలకించి, వారిపై లక్ష్యముంచడం (23-25) గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయము 3
ఈ అధ్యాయంలో మోషే అరణ్యంలో తన మామ మందను మేపుతున్నపుడు మండుతున్న పొదలో యెహోవా దూత ప్రత్యక్షమై, పితరుల దేవునిగా చాటుకోవడం (1-6) ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి విడిపించడానికి మోషేను ప్రేరేపించడం (7-10) మోషే తన సామర్థ్యాన్ని అభ్యంతరంగా ప్రస్తావించడం, దానికి దేవుడు బదులివ్వడం (11-12) మోషే ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుని పేరును అడగడం, దానికి ఆయన బదులివ్వడం (13-15) ఆయన మోషేకు ఐగుప్తులో ఏం చెయ్యాలో, ప్రజలతో ఏమని మాట్లాడాలో వివరించడం (16-18) చివరికి ఇశ్రాయేలీయులు ఏవిధంగా విడిపించబడతారో జరగబోయేదానిని ముందే ప్రకటించడం (19-22) గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయము 4
ఈ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలీయుల విషయంలో లేవనెత్తిన అభ్యంతరానికి బదులుగా దేవుడు అతనితో మూడు అద్భుతాలను చేయించడం (1-8) అయినప్పటికీ మోషే తనకున్న లోపాలను బట్టి దేవునిముందు ప్రాధేయపడడం, దేవుడు వాటికి కూడా పరిష్కారం చూపడం (10-12) మోషే ఇంకా తన సామర్థ్యలేమిని బట్టి వెనుకడుగు వేస్తున్నపుడు దేవుడు కోపగించి అహరోను గురించి ప్రస్తావించడం (13-17) తరువాత మోషే తనమామయైన యిత్రో సెలవుతో తన భార్యాపిల్లలను తీసుకుని ఐగుప్తుకు పయనమవ్వడం, సత్రంలో యెహోవా అతడిని చంపచూడడం (18-24) దానికి తన కుమారుడికి సున్నతిని చెయ్యకపోవడమే కారణమని గ్రహించిన సిప్పోరా ఆ కార్యాన్ని జరిగించి మోషేను కాపాడడం (25-26) మోషే అహరోనులు ఇద్దరూ సీనాయిపర్వతంపై కలుసుకుని, ఇశ్రాయేలీయుల పెద్దలదగ్గరకు వెళ్ళి దేవుడు తమతో చెప్పిన అద్భుతాలను చెయ్యడం, ఆ ప్రజలు మోషే చెప్పినమాటలను విశ్వసించడం (27-31) గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయము 5
ఈ అధ్యాయంలో మోషే అహరోనులు దేవుడు తమకు ఆజ్ఞాపించినదాని ప్రకారం, ఇశ్రాయేలీయుల నిర్గమం గురించి ఫరోతో మాట్లాడడం, ఫరో దానికి ఒప్పుకోకపోవడం (1-5) ఫరో ఇశ్రాయేలీయులపై పని భారాన్ని అధికం చేసి వారిని మరింతగా కష్టపెట్టడానికి సన్నాహాలు చెయ్యడం (6-14) ఈ విషయంలో ఇశ్రాయేలీయులు ఆందోళన చెంది ఫరోవద్దకు పరుగెత్తడం, అక్కడ వారికి అవమానం ఎదురవ్వడం (15-19) వారు ఫరో వద్దనుండి వచ్చి మోషే అహరోనులను నిందించడం, మోషే కూడా దేవుణ్ణి నిందించేవిధంగా ప్రార్థించడం (20-22) గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయము 6
ఈ అధ్యాయంలో మోషే చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వడం, తన నామం పితరులకు తెలియబడలేదని ప్రకటించడం (1-8) ఇశ్రాయేలీయులు మోషే మాట విననప్పుడు అతడు నిరుత్సాహపడడం, దేవుడు అతడిని ఫరోవద్దకు వెళ్ళమని ఆదేశించడం (9-13) ఇశ్రాయేలీయుల గోత్రాల మూల పురుషుల వివరాలు రాయబడడం (14-30) గురించి మనం చదువుతాం
నిర్గమకాండము అధ్యాయము 7
ఈ అధ్యాయంలో దేవుడు మోషే అహరోనులను ధైర్యపరచి వారు ఫరో ముందు చెయ్యవలసిన అద్భుతాల గురించి వివరించడం (1-9) మోషే అహరోనులు ఫరోముందు తమ కఱ్ఱను సర్పంగా మార్చడం, ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా అలానే చెయ్యడం (10-13) మోషే అహరోనులు నైలునదిని రక్తంగా మార్చడం, ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా అలానే చెయ్యడం, ఐగుప్తీయులు ఏటిపక్కన బావులను తవ్వి నీరు సంపాదించుకోవడం (14-24) గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయము 8
ఈ అధ్యాయంలో దేవుడు ఐగుప్తు దేశం మీదకు కప్పలు రాబోతున్నట్టుగా ఫరోను హెచ్చరించమని మోషేకు సెలవివ్వడం (1-4) ఆ ప్రకారంగానే ఐగుప్తుపైకి కప్పలు రప్పించినప్పుడు ఫరోతో పాటు ఐగుప్తీయుందరూ ఇబ్బంది పడడం, శకునగాండ్రు కూడా అలానే చెయ్యడం (5-7) ఫరో మొదటిసారి మెట్టుదిగుతూ యెహోవా దేవుణ్ణి వేడుకోమని మోషేను బ్రతిమిలాడడం, మోషే అలానే చెయ్యడం (8-14) ఫరో మోషేకు ఇచ్చిన మాటను తప్పినపుడు దేవుడు ఆదేశపు ధూళిని పేలుగా మార్చి వారిని ఇబ్బంది పెట్టడం (15-17) ఈ విషయంలో శకునగాండ్రు విఫలమై ఫరోకు ఇది దేవునిశక్తియని చెప్పినపుడు అతను వారిమాట వినకపోవడం (18-19) మరలా దేవుడు ఐగుప్తీ మీదికి ఈగల గుంపులను పంపడం (20-24) ఫరో మరలా మోషే అహరోనులను పిలిపించి ఈగల గుంపుల గురించి వేడుకోమనడం, మోషే ఆ ప్రకారంగా చేసినప్పుడు కూడా తన హృదయాన్ని కఠినపరచుకోవడం (25-32) గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయము 9
ఈ అధ్యాయంలో దేవుడు, ఐగుప్తీయుల జంతువులపైకి తెగులును రప్పించబోతున్నట్టు ఫరోను హెచ్చరించడం (1-5) అదేవిధంగా చేసి ఇశ్రాయేలీయుల పశువులను ఆ తెగులునుండి మినహాయించడం (6-7) ఆవపు బుగ్గిద్వారా ఐగుప్తీయులకు దద్దుర్లు కలిగించడం (8-12) మరలా వగడండ్ల వానను కురిపించడం (13-26) ఫరో మోషే అహరోనులను పిలిపించి, ఆ వడగండ్ల వర్షం గురించి దేవుణ్ణి వేడుకోమనడం, మోషే అలానే చేసి ఆ వర్షాన్ని ఆపినప్పుడు కూడా ఫరో ఎప్పటిలానే కఠినంగా వ్యవహరించడం (27-35) గురించి మనం చదువుతాం.
Page 2 of 2