సండే స్కూల్ పాఠాలు

ఆదికాండము 2:1-3,8-15, నిర్గమకాండము 20:8-11, యెషయా 58:13-14, లూకా 6:15

ఉద్దేశము/లక్ష్యము
ఆరు దినములలో సృష్టిని సంపూర్తి చేసిన దేవుడు ఏడవ దినమున విశ్రాంతి తీసికొనవలెనని మాదిరి చూపించారు అని బోధించుట.

ముఖ్యాంశము
మీ ఇంటిలో మీరు మొక్కలను పెంచుతున్నారా ? పూల తోట లేదా కూరగాయ మొక్కలను చాలా మంది ఇళ్లల్లో పెంచుతూ ఉంటారు. చిన్న చిన్న విత్తనాలు భూమిలో చల్లి వాటికి నీళ్లు పోసి ఎరువులు వేసి వాటిని జాగ్రత్తగా పెంచుతారు. దేవుడు ప్రతి విత్తనములో జీవమును ఉంచి అవి రకరకాల చెట్లు అగునట్లు చేసాడు. మీ తోటలో ఉన్న మొక్కలను లేదా చెట్లను జాగ్రత్తగా గమనించండి. దేవుని సృష్టి ఎంత అద్భుతమైనదో అర్థమవుతుంది. ఈరోజు ప్రపంచములోనే అందమైన తోట గురించి మనము చూద్దాము.

అందమైన గృహము
దేవుడు చక్కటి నివాసాన్ని ఆదాము హవ్వల కొరకు తయారు చేశాడు అని మనము చూశాము. ఆదాముకు సాటి అయిన సహాయముగా దేవుడు హవ్వను ఇచ్చాడు. వారిరువురు ఉండే అందమైన స్థలము ఏదెను తోట (2:8). ఆ తోట ఎంతో అందమైనది. అందమైన చెట్లతో నిండి ఉండేది. ఆ తోటలో నది ప్రవహిస్తూ ఉండేది. దాని వలన ఏదెను తోట ఎప్పుడూ పచ్చగా ఉండేది (2:10). ఆ నది నాలుగు పాయలుగా చీలిపోయి నాలుగు దిక్కుల వైపు ప్రవహిస్తూ ఉండేది. ఆ దృశ్యం ఆదాము హవ్వలకు ఎంత ఆహ్లాదకరంగా ఉండేదో ఊహించండి. ఆ నదిలో చేపలు ఈదడం, చెట్ల మీద పక్షులు పాటలు పాడడం, అందమైన సీతాకోక చిలుకలు పూల మీద వ్రాలడం , జంతువులు తిరగడం, ఇవన్నీ చూస్తూ వారిద్దరూ ఎంతో సంతోషంతో నిండిపోయి ఉండవచ్చు. జంతువులను చూసి భయపడనక్కరలేదు, ఏనుగు సింహంతో కలిసి ఆడుకోవచ్చు. ఆ జంతువులలో ఎటువంటి క్రూరత్వము లేదు. దేవుడు ఆ తోటలో ఉంచిన పండ్లు తింటూ వారు ఆనందంగా ఉన్నారు.

దేవుడు ఆదాముకు కొన్ని పనులు అప్పగించాడు. ఏదెను తోటను కాపాడడం, అక్కడ ఉన్న జంతువులను పరిపాలించడం అనే రెండు పనులు అప్పగించాడు. ఆ తోటలో ఉన్న చెట్లను మొక్కలను కూడా సేద్య పరచాలి. అప్పుడు వాటిలో ఎటువంటి కలుపు మొక్కలు ఉండేవి కాదు, పురుగులు కూడా వచ్చి పండ్లను పాడు చేసేవి కావు. అక్కడ అంతవరకూ ఏదీ మరణించలేదు. ఆదాము హవ్వలకు బాధ కలిగించే విషయాలు అక్కడ ఏమీ లేవు. తనకు దేవుడు ఇచ్చిన పనిని బట్టి ఆదాము ఎంతో సంతోషించి ఉంటాడు. వారికి ఆకలి అయినప్పుడు దేవుడు ఆ తోటలో ఉంచిన పండ్లు కూరగాయలు తినవచ్చు (2:9). జంతువులను చంపి తినమని దేవుడు అప్పటికి ఆదాముకు చెప్పలేదు. పిల్లలను కని భూమిని నింపమని దేవుడు వారికి చెప్పాడు. దేవుడు అన్ని విషయాలను గురించి ఎంతో జాగ్రత్తగా ఆలోచించి వారికి అన్నీ సమకూర్చాడు. దేవుడు అంతకంటే ఎక్కువ వారికి ఏమి చేయగలడు ?

దేవునితో సహవాసము, స్నేహము
ప్రతిరోజు ఆదాము హవ్వలకు ఒక మంచి సమయం ఉండేది. అది సాయంకాల సమయం. సూర్యుడు అస్తమించిన తరువాత చల్లటి సాయంకాల సమయములో వారితో మాట్లాడడానికి ఒక ప్రత్యేకమైన అతిధి వచ్చేవాడు. ఆయన వారిక సృష్టికర్త అయిన దేవుడు (3:8). దేవుడి పట్ల ప్రేమతో వారి హృదయాలు నిండి ఉండేది. దేవుడు వారిని తయారు చేసి వారు ఉండటానికి అందమైన స్థలాన్ని కూడా నిర్మించాడు. దేవుడు శక్తి మంతుడు జ్ఞానవంతుడు పరిపూర్ణుడు అని వారికి తెలుసు. ఆయన నిరంతరం ఉన్నవాడని తమను ఎంతో ప్రేమించేవాడు అని వారు అర్థం చేసుకున్నారు. అటువంటి దేవుడు తమతో ప్రతిదినం మాట్లాడటం వారికి గొప్ప అద్భుతంగా ఉండేది. వారు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతలు చెప్తూ ఉండవచ్చు. ప్రేమతో సంతోషంతో వారి హృదయాలు నిండిపోయి ఉండవచ్చు.

విశ్రాంతిదినము
ఈ అందమైన సృష్టిని దేవుడు ఎన్ని రోజులలో చేశాడో మీకు గుర్తుందా ? ఆయన కావాలి అనుకుంటే కొన్ని నిమిషాలలోనే సృష్టిని చేసి ముగించి ఉండవచ్చు. కానీ ఆయన ఆరు దినములలో తన పని పూర్తి చేసి ఏడవ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన అలసి పోయినందువల్ల విశ్రమించలేదు, దేవుడు సర్వశక్తిమంతుడు కనుక అలసిపోడు. దేవుడు ఎప్పుడూ నిద్రపోడు అని మీకు తెలుసా? ఆయనకు నిద్ర అవసరం లేదు కూడా (కీర్తన 121:4). ఎంత అద్భుతం కదా! మనము ఆయనను అనుసరించి విశ్రాంతి తీసుకోవాలని ఆయన ఆ విధంగా చేశాడు. మనము ఆరు దినములు పనులు చేసుకుని ఏడవ దినము విశ్రాంతి తీసుకోవాలని ఆయన నిర్ణయించాడు. ఏడవ దినము ఎంతో ప్రత్యేకమైనది, ఎందుకంటే అది ప్రభువు దినము గనుక. దేవుడు ఆ దినమును ప్రత్యేకపరచి ఆశీర్వదించాడు (2:3). దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన పది ఆజ్ఞలలో విశ్రాంతిదినమును ఆచరించాలని చెప్పాడు. “విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి” (నిర్గమకాండము 10:8) అని చెప్పాడు. మనము దేవుని ఆజ్ఞలకు లోబడాలి. ప్రభువైన యేసు భూమిపై ఉన్న దినములలో ప్రభు దినమును తప్పక ఆచరించేవాడు (లూకా 4:16). యేసు పునరుత్థానుడు అయిన తరువాత ఆదివారము ప్రభువు దినము గా ఏర్పాటు చేయబడింది. అప్పటి నుండి క్రైస్తవులు ప్రతి ఆదివారము సంఘములో కూడుకొని దేవుని గూర్చి తెలుసుకొని ప్రార్ధించి కీర్తనలు పాడి సహవాసం కలిగి సంతోషిస్తున్నారు.

సందేశము
దేవుడు చూపిన మాదిరిని మనము అనుసరించాలి. దేవుడే మనలను చేశాడు గనుక మనకు ఏది మంచిది అనేది ఆయనకు బాగా తెలుసు. ఒకరోజు విశ్రాంతి మనకు అవసరము అని దేవునికి తెలుసు. విశ్రాంతి లేకుండా వారమంతా పని చేస్తే మనుష్యులు అలసిపోయి, అనారోగ్యం పాలవుతారని దేవునికి తెలుసు. దేవుని మాటలు మనము వినాలి.

అన్వయింపు
ఆదివారము ప్రత్యేకమైనది. ఆదివారము అంతా పడుకొని నిద్రపోవాలని దేవుని ఉద్దేశం కాదు. వారములో చేస్తున్న పనులను పక్కనపెట్టి ఆరోజు దేవునితో సమయం గడపాలి అనేది ఆయన ఆలోచన (యెషయా 58:13-14). మనము ఎలా విశ్రాంతిదినమును ఆచరించవచ్చు?

  • స్నేహితులతో కలిసి బయటికి వెళ్లి రోజంతా ఆడకుండా, టి.వి చూడకుండా, సండే స్కూల్ కి వెళ్లి దేవుని విషయాలు నేర్చుకోవచ్చు (హెబ్రీ 10:25). మిగిలిన రోజులలో కూడా ఆడుకోవచ్చు కదా!
  • బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవచ్చు, చిన్నపిల్లల సండే స్కూల్ పాటలు గుర్తు చేసుకొని, బైబిల్ బొమ్మల పుస్తకాలు తీసుకుని రంగులు వేయవచ్చు.
  • దేవునికి సంతోషం కలిగించే పనులు ఏమైనా చేయవచ్చు. పొలాల వెంట నడుస్తూ దేవుని అద్భుతమైన సృష్టిని చూసి దేవుని స్తుతించ వచ్చు. అనారోగ్యంగా ఉన్న వారి దగ్గరికి వెళ్లి సహాయపడవచ్చు. ఇంట్లో తల్లిదండ్రులకు పనులు చేసి పెట్టవచ్చు. యేసు మంచి పనులు చేస్తూ సంచరించేవాడని బైబిల్ లో వ్రాయబడి ఉంది (అ.కా. 10:38). మనము కూడా యేసు వలె ఉండుటకు ప్రయాసపడాలి.

ప్రభువైన యేసుని ప్రేమించి ఆయనకు మన హృదయములో మొదటి స్థానం ఇస్తే ఆదివారం అన్ని రోజులకంటే సంతోషంగా ఉంటుంది.

కంఠతవాక్యము
విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము (నిర్గమకాండము 20:8).

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

Coming Soon ...

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

Coming Soon ...
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.