ఆదికాండము 1:1-25, కీర్తన 104

ఉద్దేశము/లక్ష్యము

దేవుడు సమస్త సృష్టిని ఆరు దినములలో పూర్తి చేశాడు అని చూపుట. ఇంత గొప్ప సృష్టిని చేసిన దేవుడు ఎంత జ్ఞానము, శక్తి గలవాడో వివరించుట.

ముఖ్యాంశము

మీరు ఏదైనా పెంపుడు జంతువులను కొత్తగా తెచ్చుకోవాలి అనుకుంటే ముందుగా దాని అవసరాలను గురించి తెలుసుకుంటారు. అది ఏమి తింటుంది ఎక్కడ ఉంటుంది ఏది ఇష్టపడుతుంది ఇలా అన్నీ ముందుగానే తెలుసుకుంటారు. దానిని తేవడానికి వెళ్ళే రోజు అన్ని సిద్ధంగా ఉన్నాయా లేదా అని మరోసారి చూస్తారు. ఇంట్లో చిన్నపిల్లలు పుట్టబోయే సమయంలో కూడా అలాగే జాగ్రత్తలు తీసుకుంటాము. మొదటి పురుషుని, స్త్రీని చేయుటకు ముందు వారు నివసించుటకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండునట్లు దేవుడు సృష్టి యావత్తు చేశాడు. దేవుడు ఆరు రోజులలో వారికోసం అన్నింటిని సిద్ధపరిచాడు.

 మొదటి దినము 3 -5 వ

సృష్టి మొదటి దినమునందు రాత్రి పగలు కలుగునట్లు దేవుడు వెలుగును కలుగజేశాడు అని గత వారం చూశాము. మనుష్యులు చూచుటకు పనిచేయుటకు వెలుగు అవసరమైనట్లు, నిద్రించుటకు రాత్రి కూడా అవసరమే. దేవుని నోటనుండి మాట వచ్చినవెంటనే వెలుగు కలిగింది.

రెండవ దినము 7-8వ

తరువాత దేవుడు ఆకాశమును చేశాడు. దేవుడు ఆకాశము క్రింద జలములను, ఆకాశం పైన జలములను వేరు పరచాడు. నీలి తెరను పరచినట్లుగా ఆకాశాన్ని అందంగా చేశాడు(కీర్తనలు 104:2). దేవుడు గాలిని కూడా చేశాడు. ఎందుకంటే పక్షులు పశువులు చేయకముందు వాటికి గాలి అవసరమని దేవునికి తెలుసు. దేవుడు ముందుగానే ఆ విధంగా ప్రాణులు అన్నిటిని సృష్టించాలని, అవి గాలి పీల్చుకుని బ్రతకాలని నిర్ణయించాడు.

మూడవ దినము 9 - 13వ

దేవుడు మూడవ దినమున ఆకాశము క్రింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి నేల ఆరిపోవునట్లు చేశాడు. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. పర్వతములు, లోయలు, సముద్రములు, సరస్సులు అన్నీ ఆ దినమునందే చేయబడ్డాయి. దేవుడు భూమిపై గడ్డి, చెట్లు, ఫలించే చెట్లు,కూర మొక్కలు పెరుగునట్లు చేశాడు. కొన్నివేల రకముల మొక్కలను, పూలను ఎంతో అందంగా ఉండునట్లు ఆయన చేశాడు. మన తోటలో ఒకే రకపు పూల మొక్కలు ఉంటే ఎలా ఉంటుంది? బాగా ఉంటుంది కాని చాలా రకాల పూల మొక్కలు ఉంటే ఇంకా బాగుంటుంది. మానవుల కంటికి పువ్వులు ఎంతో అందమైనవిగా కనిపిస్తాయి. ఇంకా మానవులు తినడానికి ఎన్నోరకాలైన పండ్లు కూరగాయల మొక్కలను చెట్లను దేవుడు సృష్టించాడు.

 నాలుగవ దినము - 14-19వ

నాలుగవ దినమున దేవుడు సూర్యుడిని, చంద్ర నక్షత్రాలను చేశాడు. అవి వెలుగు ఇవ్వడంతోపాటు కాలములను, సంవత్సరములను, దినములను తెలుసుకొనుటకు ఉపయోగపడునట్లు చేశాడు. ఎంతో అద్భుతంగా సూర్యుడిని చేశాడు. పగటి సమయంలో సూర్యుని వెలుగు, వేడి మనకు ఎంతో అవసరం కదా! సూర్యుడు దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికి మనుష్యు లకు చెట్లకు అవసరమైన వేడిని వెలుతురుని అందించగలడు. ఒకే చోట మంట పెట్టినప్పుడు ఆ వేడి కొంత దూరం వరకే వస్తుంది. కాని సూర్యుని వేడి ప్రతి రోజు ప్రతి ఒక్కరూ అనుభవిస్తూ ఉన్నారు. రాత్రి సమయంలో బయటకు వెళ్తే ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలు మనకు కనిపిస్తాయి. దేవుడు నక్షత్రాలను మనకు తక్కువగా ప్రకాశం ఇవ్వాలని దూరంగా పెట్టాడు. చంద్రుడిని రాత్రిపూట వెలుగు ఇవ్వడానికి భూమికి దగ్గరగా, సూర్యుని వెలుగుని ప్రతిబింబింప జేయు లాగున చేశాడు. అందువలన మనము రాత్రి నిద్ర పోగలుగుతున్నాము. ఇంత అందముగా సమస్తమును చేసిన దేవుడు ఎంత అద్భుతమైన వాడు!

 అయిదవ దినము 20-23వ

తరువాత దేవుడు చేపలను పక్షులను ఒక్క మాటతోనే సృష్టించాడు. దేవుడు ఒకే రకమైన చేప పక్షిని సృష్టించలేదు. ఆయన వివిధ రకాలైన చేపలను పక్షులను సృష్టించాడు. చిన్న చేపనుండి పెద్ద తిమింగలం వరకు దేవుడు వాటిని చేశాడు. కొన్ని సముద్రాలలో మరికొన్ని నదులలో, మరికొన్ని కాలువలలో నివసించులాగున చేశాడు. చిన్న పిచ్చుకలతో పాటు పెద్ద గ్రద్దలను కూడా ఆయనే చేశాడు. అవి ఎగరడానికి వాటికి రెక్కలు ఇచ్చాడు. మనము ఎంతో సంతోషించునట్లు అందమైన ప్రపంచాన్ని దేవుడు మనకొరకు సృష్టించాడు. దేవుడు తాను చేసినది చూసినప్పుడు అంతా చాలా మంచిదిగా కనిపించింది.

ఆరవ దినము 24 - 25వ

ఆరవ దినమున దేవుడు అనేక రకాలైన జంతువులను సృష్టించాడు. మీరు జూ పార్కు ఎప్పుడైనా వెళ్లారా ? అక్కడ మీరు చూసిన జంతువుల పేర్లు గుర్తున్నాయా ? ఏనుగులు సింహాలు కోతులు పులులు ఇలా ఎన్నో చూసి ఉంటారు కదా. అవి అన్ని వేరు వేరు శబ్దాలు చేస్తూ అరుస్తూ ఉంటాయి. అవి అన్ని ఉండటానికి స్థలాన్ని దేవుడే ఏర్పరిచాడు. వాటి ఆహారం కోసం గడ్డిని మొక్కలను చెట్లను దేవుడు మొలిపించాడు. మొదట జంతువులను చేసినప్పుడు అవి అన్నీ కలిసి ఉండేవి. దేవుడు పిల్లలను కని భూమిని నింపమని వాటికి ఆజ్ఞాపించాడు. మనుష్యుల కొరకు అంతా దేవుని చేత సిద్ధపరచ బడింది. ఇంత అందమైన ప్రపంచంలో నివసించటం మనుష్యులకు ఎంతో సంతోషం. మొదటి పురుషుని, స్త్రీని దేవుడు ఎలా సృష్టించాడో వచ్చే వారం తెలుసుకుందాం.

 సందేశము

దేవుడు శూన్యములో నుండి ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని ఆరు రోజులలో ఎలా చేసాడు అని మనం చూశాము. ఆయన మాట పలికిన వెంటనే అన్నీ సృజింపబడ్డాయి. మాటల ద్వారా మీరు ఏమైనా సృష్టించగలరా? ఆరు రోజులు దేవుడు చేసిన దానిని ఆయన చూసినప్పుడు అవి ఎంతో మంచివిగా కనిపించాయి. అందులో దేనిని కూడా మార్చవలసిన అవసరం రాలేదు. మనము ఏదైనా పని చేస్తున్నా బొమ్మ గీస్తున్నా ఏదో ఒక పొరపాటు చేసి మరల మారుస్తూ ఉంటాము. కాని దేవుడు ఎన్నడూ పొరపాటు చేయడు. మనుష్యులు సంతోషంగా జీవించడానికి అవసరమైన ప్రతి దానిని దేవుడు ఎంతో అద్భుతంగా చేశాడు.

 అన్వయింపు

దేవుడు ఎంత జ్ఞానము, శక్తి గలవాడు! ఆయన సృష్టిని చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మంచి సువాసనలతో అనేక రంగులతో ఉన్న పువ్వులు ఆయన సృష్టి లోని అందాన్ని చూపిస్తుంటాయి. చిన్న పిచ్చుకలు కూడా ఆయన చేత సృష్టింపబడినవే. దేవుడు అంతకంటె ఎక్కువగా మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయనను ప్రేమించి విశ్వసించినట్లయితే మన అవసరాలు అన్నీ ఆయన తీర్చగలడు. ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమను బట్టి మనము ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి! మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని బైబిల్ లో వ్రాయబడింది (కీర్తనలు 100:4). చాలామంది పిల్లలు ప్రతి దినము దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. మరి మీ విషయం ఏమిటి? ఈ సృష్టిని అందులోని అందాలను చూడటానికి దేవుడు కళ్ళు ఇచ్చినందుకు మనము అందరము దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి.

 కంఠతవాక్యము

సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి (కీర్తనలు 150:6)

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

Coming Soon ...

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

Coming Soon ...
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.