లేవీయకాండము 24:1-4
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపముకొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డ తెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను.
ఈ వచనాలలో దీపవృక్షం గురించి దానియొక్క తైలం గురించి మనం చూస్తాం. ప్రత్యక్షగుడారంలో దీనిని యాజకుడు సాయంత్రం నుండి ఉదయం వరకూ స్వచ్చమైన తైలంతో వెలిగేలా చూసుకోవాలి. ఈ దీపవృక్షం దేవుని వాక్యానికి సాదృష్యంగా ఉంది. కాబట్టి పరిచారకులు సంఘంలో ఆ వాక్యాన్ని ఆరిపోనీయకుండా శ్రద్ధవహించాలి. అనగా నిరంతరం దానిని ప్రకటించేవారిగా ఉండాలి. దీనిగురించి మరింత వివరంగా ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 27:20,21 వ్యాఖ్యానం చూడండి).
లేవీయకాండము 24:5-9
నీవు గోధుమలపిండిని తీసికొని దానితో పండ్రెండు భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి యుండవలెను. యెహోవా సన్నిధిని నిర్మల మైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా యెదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థ మైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాని తీసికొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధస్థలములో దాని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము.
ఈ వచనాలలో సన్నిధిరొట్టెల గురించి మనం చూస్తాం. ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాలతో దేవుని సహవాసానికి గుర్తుగా పన్నెండు రొట్టెలు ఉంచబడతాయి. ప్రజలపక్షంగా యాజకులు వాటిని భుజించాలి. ఇశ్రాయేలీయులు పది గోత్రాల వారు దేవునికి దూరమైనప్పటికీ ఈ విధి కొనసాగింది (2 దినవృత్తాంతములు 12:11). ఈ సన్నిధిరొట్టెల గురించి ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 25:30 వ్యాఖ్యానం చూడండి).
లేవీయకాండము 24:10-14
ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషేయొద్దకు వాని తీసికొనివచ్చిరి. వాని తల్లిపేరు షెలోమీతు; ఆమె దాను గోత్రికుడైన దిబ్రీకుమార్తె యెహోవా యేమి సెలవిచ్చునో తెలిసికొను వరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. శపించినవానిని పాళెము వెలుపలికి తీసికొనిరమ్ము; వాని శాపవచనమును వినినవారందరు వాని తల మీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావ గొట్టవలెను.
ఈ వచనాలలో ఐగుప్తీయుడికీ దానుగోత్రీకురాలికీ పుట్టిన ఒకడు ఇశ్రాయేలీయుడితో పోరుపడి మధ్యలో యెహోవా నామాన్ని దూషించడం, దేవుడు అతనికి మరణశిక్షవిధించడం మనం చూస్తాం. ఇక్కడ ఆ వ్యక్తి తనతో పోరుపడుతున్న ఇశ్రాయేలీయుడ్ని వదిలేసి మధ్యలో తెగించి యెహోవా నామాన్ని దూషించాడు. అతని దుష్టత్వం ఎంత తీవ్రంగా ఉందో గమనించండి, ఏ దేవుని కాపుదలతో ఐతే ఐగుప్తు బానిసత్వం నుండి ఎర్రసముద్రం మధ్యగా విడిపించబడ్డాడో ఏ దేవుని కృపతో ఐతే పగలు ఎండ దెబ్బ కానీ రాత్రి చలికానీ తగలకుండా కాపాడబడుతున్నాడో శ్రేష్టమైన మన్నాను భుజిస్తున్నాడో నీరు త్రాగుతున్నాడో ఆ దేవుణ్ణి దూషించాడు. అందుకే అతనికి మరణశిక్ష విధించబడింది. ప్రస్తుతం చాలామంది మతోన్మాదులు, నాస్తికులు చేస్తుంది ఇదే. వారు దేవుని కృపతో మనుగడ సాగిస్తూ క్రైస్తవులతో పోరుపడి ఆ దేవుని నామాన్నే దూషిస్తున్నారు. ఇదంతా ఆ ఐగుప్తీయుడిలా నాశనం కొని తెచ్చుకోవడానికే.
లేవీయకాండము 24:15,16
మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముతన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను.
యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావ గొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
పవిత్రమైన భయంకరమైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడమే పాపమైనప్పుడు ఆ నామాన్ని దూషించడం మరింతో తీవ్రమైన పాపం, తెగింపుతో కూడిన నేరం. అందుకే ఆ నేరం చేసినవారికి మరణశిక్ష విధించాలి. ఇది దేవుని నామాన్ని ఘనపరచడంలో భాగం.
లేవీయకాండము 24:17-20
ఎవడైనను ఒకనిని ప్రాణహత్యచేసిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను. జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను. ఒకడు తన పొరుగు వానికి కళంకము కలుగజేసినయెడల వాడు చేసినట్లు వానికి చేయవలెను. విరుగగొట్టబడిన దాని విషయములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్నుపంటికి పల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసి నందున వానికి కళంకము కలుగజేయవలెను.
ఈ వచనాలలో హత్యల విషయంలోనూ దాడుల విషయంలోనూ విధించవలసిన శిక్షలను మనం చూస్తాం. ఇవి చట్టపరంగా విధించవలసిన న్యాయమైన శిక్షలు. చట్టపరంగా ప్రాణానికి ప్రాణం కళంకానికి కళంకం విధించినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది, దోషులకు కఠినమైన శిక్షవిధించబడుతుంది. అందుకే దేవుడు వీటిని విధించాడు. ప్రస్తుత దేశాల్లో నాగరికత పేరిట ఇలాంటి శిక్షలు లేకపోవడం వల్లనే యధేచ్చగా హత్యలూ దాడులూ జరుగుతున్నాయి. హత్యలు చేసినవారూ కళంకం కలుగచేసినవారు కొంతకాలానికే జైలునుండి బయటపడుతున్నారు, బాధితులకు న్యాయం జరగడం లేదు. కానీ నిజమైన క్రైస్తవదేశాలు ఈశిక్షలను తప్పకుండా అమలు చెయ్యాలి, అప్పుడే వారు దేవుని న్యాయవిధి ప్రకారం నడుచుకుంటున్నట్టు. దీనిగురించీ "కంటికి కన్ను పంటికి పల్లు" అనే విషయంలో కొందరు గురౌతున్న అపార్థం గురించీ ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 21:23-25 వ్యాఖ్యానం చూడండి).
"జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను"
ఇది దేవుడు ఇశ్రాయేలీయుల పశుసంపదను కాపాడడానికి నియమించిన విధి. దీనిప్రకారం ఎవరైనా జంతువును చంపితే చంపిన జంతువుకు బదులుగా అదే జంతువును యజమానుడికి అప్పగించాలి.
లేవీయకాండము 24:21
జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసినవానికి మరణశిక్ష విధింపవలెను.
ఈ వచనం ప్రకారం; జంతువును చంపితే దానికి మారుగా మరో జంతువును యజమానుడికి అప్పగించాలి. నరహత్య చేసినవాడికి మరణశిక్ష విధించాలి. ఇందులో ఎలాంటి మినహాయింపూ కల్పించకూడదు. అందుకే "చావతగిన నరహంతకుని ప్రాణముకొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను" (సంఖ్యాకాండము 35:31) అని కచ్చితంగా రాయబడింది. కాబట్టి నరహత్యల విషయంలో జీవితఖైదులూ యావజ్జీవాలూ న్యాయమైన శిక్షలు కాదు. నరహత్యకు మరణదండనే దేవుడు విధించిన న్యాయమైన శిక్ష.
లేవీయకాండము 24:22
మీరు పక్షపాతము లేక తీర్పుతీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడ నైన యెహోవానని వారితో చెప్పుము అనెను.
పై వచనాలతో కలిపి ఈ వచనాన్ని అర్థం చేసుకుంటే హత్యల విషయంలో కానీ కళంకం విషయంలో కానీ పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాలి. అనగా ప్రాణానికి ప్రాణం, కళంకానికి కళంకం అనే దేవుని న్యాయవిధిని ఎవరి విషయంలోనూ మినహాయింపులు కల్పించకుండా అమలుచెయ్యాలి. జాతి పేరిట కానీ మతం పేరిట కానీ లింగం పేరిట కానీ శిక్షల విషయంలో మినహాయింపులు కల్పించకూడదు. నరహత్య ఎవరు చేసినా మరణశిక్ష విధించాలి, కళంకం ఎవరు కలుగచేసినా అదే కళంకం వీరికీ కలుగచెయ్యాలి. ప్రస్తుత దేశ న్యాయస్థానాలలో ఈ ఆజ్ఞ ఉల్లంఘనను విపరీతంగా చూస్తున్నాం. అక్కడ మతం పేరిట, కులం పేరిట, లింగం పేరిట పక్షపాతం చూపించబడుతుంది. దానివల్ల కనీసం చట్టంలో ఉన్న శిక్షలైనా వారిపట్ల అమలుచెయ్యబడడం లేదు. క్రైస్తవ దేశాలైనా ఆ పక్షపాతాన్ని విడిచిపెట్టి ఈ ఆజ్ఞకు విధేయత చూపించాలి.
లేవీయకాండము 24:23
కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పెనుశపించిన వానిని పాళెము వెలుపలికి తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టవలెను, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి.
ఈ వచనంలో దేవుణ్ణి దూషించిన ఆ వ్యక్తికి ఇశ్రాయేలీయులు మరణశిక్ష విధించినట్టు మనం చూస్తాం. గమనించండి; ప్రస్తుత క్రైస్తవదేశాలు కూడా ఈ శిక్షను అమలుచెయ్యనంత మాత్రాన ఆ పాపానికి ఉన్నటువంటి తీవ్రత తగ్గిపోలేదు. మానవ చట్టాలు ఈ శిక్షను అమలుచెయ్యకపోయినా దేవుని చట్టం నుండి ఈ నేరం చేసినవారు తప్పించుకోలేరు. ఎందుకంటే ఇది మార్పులేని దేవుని న్యాయశాసనం.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
లేవీయకాండము అధ్యాయం 24

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"