లేవీయకాండము 13:1-17
మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. ఒకని దేహచర్మమందు వాపుగాని పక్కు గాని నిగనిగలాడు మచ్చగాని యుండి వాని దేహచర్మమందు కుష్ఠుపొడవంటిది కనబడిన యెడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకనియొద్దకైనను వాని తీసికొని రావలెను. ఆ యాజకుడు వాని దేహచర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడయందలి వెండ్రుకలు తెల్లబారినయెడలను, ఆ పొడ అతని దేహచర్మము కంటె పల్లముగా కనబడినయెడలను అది కుష్ఠు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. నిగనిగలాడు మచ్చ చర్మముల కంటె పల్లముకాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడినయెడలను, దాని వెండ్రుకలు తెల్లబారకున్న యెడలను ఆ యాజకుడు ఏడు దినములు ఆ పొడగలవానిని కడగా ఉంచవలెను. ఏడవ నాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండినయెడల, యాజకుడు మరి యేడు దినములు వాని కడగా ఉంచవలెను. ఏడవనాడు యాజకుడు రెండవసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండినయెడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను; అది పక్కే, వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును. అయితే వాడు తన శుద్ధివిషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను. అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించినయెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. కుష్ఠుపొడ యొకనికి కలిగినయెడల యాజకుని యొద్దకు వానిని తీసికొనిరావలెను. యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడినయెడలను, అది వెండ్రుకలను తెల్లబారినయెడలను, వాపులో పచ్చి మాంసము కనబడినయెడలను, అది వాని దేహచర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, వానిని కడగా ఉంచకూడదు; వాడు అపవిత్రుడు. కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగలవాని తల మొదలు కొని పాదముల వరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి యుండినయెడల యాజకుడు వానిని చూడవలెను; ఆ కుష్ఠము వాని దేహమంతట వ్యాపించినయెడల ఆ పొడగల వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్లంతయు తెల్లబారెను; వాడు పవిత్రుడు. అయితే వాని యొంట పచ్చిమాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు. యాజకుడు ఆ పచ్చిమాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చిమాంసము అపవిత్రమే; అది కుష్ఠము. అయితే ఆ పచ్చిమాంసము ఆరి తెల్లబారిన యెడల వాడు యాజకునియొద్దకు రావలెను; యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారినయెడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను; వాడు పవిత్రుడు.
ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఆరు రకాలైన కుష్టుల్లో ఇది మొదటిది. ఇది దేహచర్మానికి సంబంధించిన కుష్టు. అంటే సాధారణ దేహంపై మచ్చలు కానీ పొక్కులు కానీ ఏర్పడిన వ్యక్తి దానివిషయమైన నిర్థారణకై యాజకుడి దగ్గరకు వెళ్ళాలి. ఆ యాజకుడు అతడిని అన్నివిధాలుగా పరిశీలించి అనగా ఏడురోజుల సమయంలో అది వ్యాపిస్తుందో లేదో గమనించి అది కుష్టురోగమో లేక సాధారణమైన మచ్చనో నిర్ణయిస్తాడు. ఒకవేళ అతనిది కుష్టురోగమే ఐతే అతను అపవిత్రుడిగా అనగా ప్రత్యేకంగా ఉండేలా ఆదేశిస్తాడు.
అయితే 12,13 వచనాల ప్రకారం ఆ కుష్టు మొదటే శరీరమంతా వ్యాపించియుంటే అతను ప్రత్యేకంగా నుండనవసరం లేదు. ఎందుకంటే ఇక అది శరీరంపై వ్యాపించే అవకాశం లేదు కాబట్టి దేవుడు ఆ విధంగా ఆజ్ఞాపించియుండవచ్చు. గమనించండి; ఈ కుష్టులు నిబంధన అతిక్రమం విషయంలో శాపంగా తటస్థించే ఒకానొక రోగం (ద్వితీయోపదేశకాండము 28;27) ఉదాహరణకు దేవునిపై తిరుగుబాటు చేసిన మిర్యాము, గెహాజీ, రాజైన ఉజ్జియాలను కూడా ఆయన ఇదే కుష్టురోగంతో మొత్తినట్టు మనం చదువుతాము. ఆవిధంగా ఈ కుష్టులు దైవశాపంలో భాగం కాబట్టే ఆ నిర్థారణ వైద్యుడు కాకుండా దైవప్రతినిధియైన యాజకుడే చెయ్యాల్సిఉంది. అందుకే యాజకుడు తొందరపడకుండా అన్నివిధాలుగా పరీక్షించి అది శాపసంబంధమైన కుష్టునో లేక సాధారణ మచ్చనో తేల్చేవిధంగా ఆయన పరీక్షలను ప్రవేశపెట్టాడు. అంటే అతను తన కళ్ళతో చూసిన ఆధారాలను బట్టి అవతలివాడు అపవిత్రుడో పవిత్రుడో నిర్ణయించాలి. ఆ అధికారమంతా యాజకుడిడే.
నైతికపరమైన పాపాల విషయంలో ఇలాంటి అధికారమే నూతననిబంధన సంఘపరిచారకులకు అప్పగించబడినట్టుగా మనం చదువుతున్నాం. మీరెవరి పాపములను క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి ఎవరి పాపములను ఉండనిత్తురో అవి ఉంటాయి అని యేసుక్రీస్తు పలికిమాటలు ఇందుకు మంచి ఆధారం. నైతికపరమైన పాపంలో పడిపోయిన వ్యక్తిని సంఘసేవకులు వాక్యపు ఆధారాలతో పరీక్షించి "వ్యక్తిగతంగానూ సంఘంతో కలిసీనూ సరిచేసే ప్రయత్నం చెయ్యాలి". ఆ వ్యక్తి మార్పు చెందకుంటే అతన్ని అన్యునిగా అనగా అపవిత్రునిగా ఎంచాలి.
ఈ శాపసంబంధమైన కుష్టువిషయంలో మరోవిషయం ఏంటంటే ఆ శాపం పొందిన వ్యక్తి జీవితాంతమూ దానిని భరించాలని ఏం లేదు. ఆ వ్యక్తి దేవుని తట్టు తిరిగినప్పుడు మిర్యాము తరహాలోనే శుద్ధుడయ్యే అవకాశం ఉంది. అలా శుద్ధుడైనవాడు కృతజ్ఞతగా ఏం చెయ్యాలో తర్వాత అధ్యాయంలో మనం చదువుతాం. ఆవిధంగా ఈ కుష్టు విషయంలో స్వస్థత "మన పాపాలను మనం ఒప్పుకుంటే యేసురక్తం ప్రతీపాపం నుండీ మనల్ని పవిత్రులుగా చేస్తుందనే" సత్యానికి ఛాయగా కనిపిస్తుంది. దీనికి యేసుక్రీస్తు ప్రభువు కుష్టురోగులను శుద్ధుడవు కమ్ము అనే మాటతో శుద్ధులుగా చేసిన సంఘటలే మంచి ఉదాహరణ. పాతనిబంధన యాజకుడు కేవలం ఒక వ్యక్తికి వచ్చింది కుష్టునో కాదో మాత్రమే నిర్ణయించగలడు కానీ మన ప్రధానయాజకుడైన ఆయన ఆ కుష్టునుండి శుద్ధులుగా చెయ్యగలడు. అలానే సంఘపరిచారకులు మన పాపాలను మాత్రమే ఎత్తి చూపించగలరు, ఈయనైతే ఆ పాపాలనుండి మనల్ని విడిపించగలడు.
1యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.
లేవీయకాండము 13:18-23
ఒకని దేహచర్మమందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండుండిన చోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన యెరుపురంగుగల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టినయెడల, యాజకునికి దానికనుపరచవలెను. యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, దాని వెండ్రుకలు తెల్లబారి యుండినయెడలను, యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది ఆ పుంటివలన పుట్టిన కుష్ఠుపొడ. యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయిన యెడలను, అది చర్మము కంటె పల్లముకాక కొంచెము నయముగా కనబడినయెడలను, యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను. అది చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠుపొడ. నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండినయెడల అది దద్దురు; యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను.
ఇది ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన రెండవ రకపు కుష్టు. దీని విషయంలో కూడా యాజకుడు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా పరీక్షించి అతనిది కుష్టురోగమో సాధారణమైన దద్దురో నిర్ణయించాలి (17వ వచనపు వ్యాఖ్యానం చదవండి).
లేవీయకాండము 13:24-28
దద్దురు కలిగిన దేహచర్మమందు ఆ వాత యెఱ్ఱగానేగాని తెల్లగానేగాని నిగనిగలాడు తెల్లని మచ్చగానేగాని యుండినయెడల యాజకుడు దాని చూడవలెను. నిగనిగలాడు ఆ మచ్చలోని వెండ్రుకలు తెల్లబారినయెడలను, అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, అది ఆ వాతవలన పుట్టిన కుష్ఠుపొడ; యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠము. యాజకుడు దాని చూచునప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెండ్రుకలు లేకయేగాని చర్మముకంటె పల్లముగా నుండకయే గాని కొంత నయముగా కనబడినయెడల, యాజకుడు ఏడు దినములు వానిని కడగా ఉంచవలెను. ఏడవనాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠమే.
అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనేయుండి కొంచెము నయముగా కనబడినయెడల అది వాతపు వాపే; వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది వాతపు మంటయే.
ఇది ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన మూడవరకపు కుష్టు. దీని విషయంలో కూడా యాజకుడు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా పరీక్షించి అతనిది కుష్టురోగమో సాధారణమైన దద్దురో నిర్ణయించాలి (17వ వచనపు వ్యాఖ్యానం చదవండి).
లేవీయకాండము 13:29-37
పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టినయెడల, యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మముకంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెండ్రుకలు కలదిగాను కనబడిన యెడల, వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది బొబ్బ, తల మీద నేమి గడ్డము మీద నేమి పుట్టిన కుష్ఠము. యాజకుడు ఆ బొబ్బయిన పొడను చూచి నప్పుడు అది చర్మముకంటె పల్లము కానియెడలను, దానిలో నల్లవెండ్రుకలు లేనియెడలను, యాజకుడు ఆ బొబ్బయిన పొడగలవానిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. ఏడవనాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపింపక యుండినయెడలను, దానిలో పసుపు పచ్చవెండ్రుకలు లేనియెడలను, చర్మముకంటె పల్లముకాని యెడలను, వాడు క్షౌరము చేసికొనవలెను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి యేడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. ఏడవనాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మముకంటె పల్లము కాక యుండినయెడల, యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును. వాడు పవిత్రు డని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన యెడల యాజకుడు వాని చూడవలెను, అప్పుడు ఆ మాద వ్యాపించి యుండినయెడల యాజకుడు పసుపు పచ్చ వెండ్రుకలను వెదకనక్కరలేదు; వాడు అపవిత్రుడు. అయితే నిలిచిన ఆ మాదలో నల్లవెండ్రుకలు పుట్టిన యెడల ఆ మాద బాగుపడెను; వాడు పవిత్రుడు; యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను.
ఇది ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన నాలుగవ రకపు కుష్టు. దీని విషయంలో కూడా యాజకుడు దేవుడు ఆజ్ఞాపించి ప్రకారంగా పరీక్షించి అతనిది కుష్టురోగమో సాధారణమైన దద్దురో నిర్ణయించాలి (17వ వచనపు వ్యాఖ్యానం చదవండి).
లేవీయకాండము 13:40,41
తలవెండ్రుకలు రాలినవాడు బట్ట తలవాడు; అయినను వాడు పవిత్రుడు. ముఖమువైపున తల వెండ్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు; వాడు పవిత్రుడు.
కుష్టురోగాన్ని బట్టి కూడా తలపై వెంట్రుకలు రాలిపోతాయి. కానీ తలవెంట్రుకలు రాలినంతమాత్రాన కుష్టురోగం కాదు. కుష్టురోగం అని నిర్థారించాలంటే క్రింది వచనాల ప్రకారం పరీక్షించాలి.
లేవీయకాండము 13:42-46
అయినను బట్ట తలయందేగాని బట్ట నొసటియందేగాని యెఱ్ఱగానుండు తెల్లని పొడ పుట్టిన యెడల, అది వాని బట్ట తలయందైనను బట్ట నొసటి యందైనను పుట్టిన కుష్ఠము. యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహచర్మమందు కనబడునట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్టతలయందైనను వాని బట్టనొసటియందైనను ఎఱ్ఱగానుండు తెల్లని పొడయైనయెడల వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు; యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను; వాని కుష్ఠము వాని తలలోనున్నది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను; వాడు తల విరియబోసికొనవలెను; వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడై యుండును; వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను.
ఇది ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఐదవరకపు కుష్టు. దీని విషయంలో కూడా యాజకుడు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా పరీక్షించి అతనిది కుష్టురోగమో సాధారణమైన దద్దురో నిర్ణయించాలి (17వ వచనపు వ్యాఖ్యానం చదవండి).
17 వచనంలో నేను వివరించినట్టుగా ఇది శాపసంబంధమైన కుష్టు. అనగా దేవుని నిబంధనను అతిక్రమించడం వల్ల కలిగిన కుష్టు. అందుకే అతను తనపై నిలిచిన శాపాన్ని ఒప్పుకుంటూ "వాడు తల విరియబోసికొనవలెను; వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను" దీనివల్ల చుట్టుప్రక్కల ప్రజలు కూడా అతనికి దూరంగా ఉండగలుగుతారు. లేకుంటే కుష్టు అనేది అంటువ్యాధి కాబట్టి ఇతరులపై కూడా ఆ ప్రభావం పడే ప్రమాదం ఉంది.
గమనించండి; కొన్ని నాగరికతల్లో కుష్టురోగులను సజీవదహనం చేసిన దురాచారాలు కూడా ఉన్నట్టు చరిత్ర చెబుతుంది. కానీ బైబిల్ చరిత్రలో మాత్రం వారి వ్యాధి ఇతరులకు సోకకుండా "వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను" అని స్పష్టంగా రాయబడింది తప్ప చంపమని కానీ హింసించమని కానీ లేదు. వారికి అవసరమైన ఆహారం కూడా ప్రజలే సహాయపడాలి.
లేవీయకాండము 13:47-59
మరియు కుష్ఠుపొడ వస్త్రమందు కనబడునప్పుడు అది గొఱ్ఱెవెండ్రుకల బట్టయందేమి నారబట్టయందేమి నారతోనేగాని వెండ్రుకలతోనేగాని నేసిన పడుగునందేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏయొక వస్తువునందేమి పుట్టి
ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళు గానేగాని యెఱ్ఱదాళుగానేగాని కనబడినయెడల, అది కుష్ఠుపొడ; యాజకునికి దాని కనుపరచవలెను. యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు, అనగా పడుగునందేగాని పేకయందేగాని తోలునందేగాని తోలుతో చేసిన వస్తువునందేగాని ఆ పొడ వ్యాపించినయెడల అది కొరుకుడు కుష్ఠము; అది అపవిత్రము. కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను; అది కొరుకుడు కుష్ఠము; అగ్నితో దాని కాల్చివేయవలెను. అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు, అనగా పడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపింపక పోయినయెడల యాజకుడు ఆ పొడగలదానిని ఉదుకనాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచవలెను. ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపక పోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చి వేయవలెను. అది లోవైపునగాని పైవైపునగాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును. యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడి యుండినయెడల, అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను. అటుతరువాత అది ఆ వస్త్రమందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలుతో చేసిన దేనియందేగాని కనబడినయెడల అది కొరుకుడు కుష్ఠము. ఆ పొడ దేనిలో నున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను. ఏ వస్త్రమునేగాని పడుగునేగాని పేకనేగాని తోలుతో చేసిన దేనినేగాని ఉదికిన తరువాత ఆ పొడ వదిలిన యెడల, రెండవమారు దానిని ఉదుకవలెను; అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్టయందేగాని నారబట్టయందేగాని పడుగునందేగాని పేక యందేగాని తోలు వస్తువులయందేగాని యుండు కుష్ఠుపొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధియిదే.
ఇది ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఆరవరకపు కుష్టు. దీని విషయంలో కూడా యాజకుడు దేవుడు ఆజ్ఞాపించి ప్రకారంగా పరీక్షించి అతని వస్త్రాలకు తటాస్థించింది కుష్టునో కాదో నిర్ణయించాలి. కొందరు ఈ వస్త్రసంబంధమైన కుష్టును ఉదహరిస్తూ వస్త్రాలకు కుష్టురోగం రావడమేంటని ఎగతాళి చేస్తుంటారు. కానీ నేను 17వ వచనపు వ్యాఖ్యానంలో వివరించినట్టుగా ఇవి నిబంధన అతిక్రమం విషయంలో శాపంగా కలిగే కుష్టులు (ద్వితీయోపదేశకాండము 28:27). అందుకే ఈ కుష్టురోగ నిర్థారణ వైద్యుడు కాకుండా దేవునిప్రతినిధియైన యాజకుడే చెయ్యాలని రాయబడింది. ఆవిధంగా అర్థం చేసుకున్నప్పుడు ఒకవ్యక్తిపై దేవుని శాపం నిలిచింది అనడానికి రుజువుగా కూడా అతని వస్త్రాలకు కుష్టు పుడుతుంది. కొందరి విషయంలోనైతే వారి ఇంటికి కూడా. ఈ వచనాలు చదవండి.
లేవీయకాండము 14:33-35
మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చినతరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను "నేను కుష్ఠుపొడ కలుగ జేసినయెడల" ఆ యింటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చిన నా యింటిలో కుష్ఠుపొడ వంటిది నాకు కనబడెనని అతనికి తెలియ చెప్పవలెను.
ఈ మాటలు బాగా పరిశీలించండి. ఇక్కడ దేవుడు "యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగ జేసినయెడల" అని అంటున్నాడు. అంటే అది ఆయన శాపంలో భాగంగా ఆయనే కలుగచేసే కుష్టు. కాబట్టి వస్త్రాలకు కుష్టు ఏంటి? ఇంటికి కుష్టు ఏంటి అనే ఎగతాళికి ఇక్కడ అవకాశం లేదు. ఇది సాధారణ కుష్టు కాదు. నిబంధన అతిక్రమం విషయంలో శాపానికి సంబంధించిన కుష్టు.
ద్వితీయోపదేశకాండము 28:15,27 నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును. యెహోవా ఐగుప్తు పుంటిచేతను మూలవ్యాధిచేతను కుష్టు చేతను గజ్జిచేతను నిన్ను బాధించును; నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
లేవీయకాండము అధ్యాయం 13

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"