లేవీయకాండము 19:1
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో ఇట్లు చెప్పుము.
ఈ వచనంలో దేవుడు తాను ఆజ్ఞాపించబోయే విధులను సర్వసమాజంతో చెప్పమని మోషేకు ఆజ్ఞాపించడం మనం చూస్తాం. సర్వసమాజము అన్నప్పుడు వారిలో ఉన్న అన్యులు కూడా పరిగణలోకి వస్తారు. అయితే మోషే అహరోనులు ఈ ఆజ్ఞలను సమాజమంతటికీ చెప్పలేరు కాబట్టి వారు ఇశ్రాయేలీయుల గోత్ర పెద్దలకు ఈ సంగతులు వివరిస్తారు. వారు తమ తమ గోత్రాలకు ఆ సంగతులను తెలియచేస్తారు.
లేవీయకాండము 19:2 
మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను.
ఈ వచనంలో దేవుడు "మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నానని" సెలవివ్వడం మనం చూస్తాం. ఆయనకు ప్రతిష్టతంగా ఉండడమే పరిశుద్ధులుగా ఉండడం. ఆయన ఆజ్ఞాపించిన బలి అర్పణలను అర్పించడం ద్వారా ఆచారసంబంధమైన మరియు నైతికమైన విధులను గైకొనడం ద్వారా ఇది సాధ్యమౌతుంది. ఇదే నియమం నూతననిబంధనలో కూడా మనకు జ్ఞాపకం చెయ్యబడింది (1 పేతురు 1:14). అయితే ప్రస్తుతం మనం ఆచారసంబంధమైన ఆజ్ఞల క్రిందా యేసుక్రీస్తుకు ఛాయలైన బలి అర్పణల క్రిందా లేము కాబట్టి నైతికపరమైన ఆజ్ఞలను గైకొనడం ద్వారా ఆయనకు ప్రతిష్టితంగా ఉండాలి.
లేవీయకాండము 19:3
మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను.
"మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను" అంటే వారిని సన్మానించాలి అని అర్థం వస్తుంది. దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 20:12 వ్యాఖ్యానం చూడండి). ఆ విధంగా ఈ అధ్యాయంలో దాదాపు పది ఆజ్ఞలన్నీ జ్ఞాపకం చెయ్యబడతాయి.
"నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను"
ఇశ్రాయేలీయులకు శనివారమే కాకుండా పండుగలకు సంబంధించిన మరికొన్ని విశ్రాంతి దినాలను కూడా ఆయన నియమించాడు (లేవీకాండము 23:1-37). వాటి గురించే ఇక్కడ చెప్పబడుతుంది. అవేంటంటే;
పస్కా పండుగ (నిర్గమకాండము 12:16)
పులియనిరొట్టెల పండుగ (నిర్గమకాండము 12:16)
ప్రధమఫలముల పండుగ (సంఖ్యాకాండము 28:26)
పెంతుకోస్తు పండుగ (ద్వితీయోపదేశకాండము 16:9-12)
శృంగధ్వని పండుగ (సంఖ్యాకాండము 29:1,2)
ప్రాయశ్చిత్త దినము (లేవీకాండము 23:26-28)
పర్ణశాలల పండుగ (లేవీకాండము 23:33-35).
ఈ విశ్రాంతి దినాల (పండుగల) వెనుక దేవునికి ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఇశ్రాయేలీయులు వాటన్నిటినీ పాటించాలి.
"నేను మీ దేవుడనైన యెహోవాను"
ఈ అధ్యాయంలో ఇవే మాటలు 15 సార్లు మనకు కనిపిస్తాయి. అంటే ఆ ప్రజలు ఈ కట్టడలను ఎందుకు పాటించాలో ఆ మాటలు తెలియచేస్తున్నాయి. ఆయనే దేవుడైన యెహోవా కాబట్టి ఆయన ఆజ్ఞాపిస్తున్న కట్టడలను ప్రజలు
పాటించాలి.
లేవీయకాండము 19:4
మీరు వ్యర్థమైన దేవతలతట్టు తిరుగకూడదు. మీరు పోతవిగ్రహములను చేసికొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.
ఇది "పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు" (నిర్గమకాండము 20:4) అనే ఆజ్ఞతో ముడిపడిన ఆజ్ఞ. దీని గురించి ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 20:4 వ్యాఖ్యానం చూడండి).
లేవీయకాండము 19:5-8
మీరు యెహోవాకు సమాధానబలి అర్పించునప్పుడు అది అంగీకరింపబడునట్లుగా అర్పింపవలెను. మీరు బలినర్పించునాడైనను మరునాడైనను దాని తినవలెను. మూడవ నాటి వరకు మిగిలియున్న దానిని అగ్నితో కాల్చివేయ వలెను. మూడవనాడు దానిలో కొంచె మైనను తినినయెడల అది హేయమగును; అది అంగీకరింపబడదు. దానిని తినువాడు తన దోషశిక్షను భరించును. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను. వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును.
ఈ సమాధాన బలిగురించీ దానిని మూడవనాడు ఎందుకు తినకూడదు అనేదాని గురించీ ఇప్పటికే నేను వివరించాను (లేవీకాండము 7:15-18 వ్యాఖ్యానం చూడండి). ఇక్కడ బలి అర్పించడమే కాదు, దానిని తినడం విషయంలో కూడా జాగ్రత్త వహించాలని నేర్చుకుంటున్నాం. అంటే బలి అర్పించే విషయంలో యాజకుడు జాగ్రత్త వహించాలి, తినే విషయంలో ఆ బలి తీసుకువచ్చిన వ్యక్తి జాగ్రత్త వహించాలి. అప్పుడే ఆ బలి అంగీకరించబడుతుంది. అలానే వాక్యం బోధించే బోధకుడు సత్యవాక్యాన్ని బోధించాలి, వినే విశ్వాసి సిద్ధమనస్సుతో ఆ వాక్యాన్ని వినాలి. లేకుంటే అతనికి ఏ ప్రయోజనం ఉండదు.
లేవీయకాండము 19:9,10
మీరు మీ భూమి పంటను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు; నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు; నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు; నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను.
ఈ ఆజ్ఞలు బీదలపై దేవునికున్న కటాక్షాన్ని సూచిస్తున్నాయి. ఆయన ప్రజలు కూడా అలాంటి కటాక్షమే వారిపై చూపిస్తూ ఈ ఆజ్ఞలు పాటించాలి. దేవుడు మనకిచ్చేది ఏదీ మనం మాత్రమే అనుభవించడానికి కాదు అందుకే "ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక,సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్‌క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునైయుండవలెనని వారికి ఆజ్ఞాపించుము" (1తిమోతికి 6:17) అని రాయబడింది. అలానే "బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును" (కీర్తనలు 41:1), "బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును." (సామెతలు 19:17) అని కూడా చదువుతున్నాం.
లేవీయకాండము 19:11
నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు.
ఈ వచనంలో పది ఆజ్ఞలలోని దొంగిలింపకూడదు, అబద్ధమాడకూడదు అనే ఆజ్ఞలు మరోసారి జ్ఞాపకం చెయ్యబడడం మనం చూస్తాం. సందర్భానుసారంగా చూస్తే "దొంగిలింపకూడదు" అన్నప్పుడు బీదలకు ఇవ్వవలసింది ఇవ్వకుండా ఉండడం కూడా దొంగిలించడంగానే పరిగణించబడుతుంది. అలానే బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు అన్నప్పుడు ఒకరికి ఏవిధమైన నష్టమూ కలిగేలా అబద్ధమాడకూడదని అర్థం.
లేవీయకాండము 19:12 
నా నామమును బట్టి అబద్ధప్రమాణము చేయకూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచ కూడదు; నేను యెహోవాను.
ఇది కూడా "నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు" (నిర్గమకాండము 20:7) అనే ఆజ్ఞకు సంబంధించిన ఆజ్ఞనే. ఆయన పేరుతో ఎలాంటి అబద్ధప్రమాణం చెయ్యకూడదని, ఆయన పేరుతో ప్రమాణం చేసేటప్పుడు తెలిసిన ఏ విషయాన్నీ దాచిపెట్టకూడదని ఈ ఆజ్ఞ హెచ్చరిస్తుంది.
లేవీయకాండము 19:13
నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీయొద్ద ఉంచుకొనకూడదు.
ఇవి కూలివారి సందర్భంలో చెప్పబడుతున్నమాటలు. వారికి ఆరోజు ఇవ్వవలసిన కూలీ ఇవ్వకపోవడమే వారిని హింసించడం, దోచుకోవడం. ఎందుకంటే దిన కూలీల కుటుంబాలు ఆ దిన కూలీపై ఆధారపడే జీవిస్తాయి. అందుకే దిన కూలీల కూలి మరునాటికి ఉంచుకోకూడదు. ఈ నియమం మరికొన్ని సార్లు కూడా జ్ఞాపకం చెయ్యబడుతుంది.
యిర్మియా 22:13 నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ; న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు, జీతమియ్యక తన పొరుగువానిచేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ.
యాకోబు 5:4 ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.
లేవీయకాండము 19:14
చెవిటివాని తిట్టకూడదు, గ్రుడ్డివానియెదుట అడ్డమువేయకూడదు; నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను.
ఇవి చెవిటివారి పట్ల గ్రుడ్డివారి పట్ల దేవుని శ్రద్ధను తెలియచేసే హెచ్చరికలు. చెవిటివాడు వినబడక తిరిగి సమాధానం చెప్పలేడు కాబట్టి వాడిని తిట్టకూడదు. గ్రుడ్డివాడికి కనిపించదు కాబట్టి వాడు పడిపోయేలా కానీ దారి తప్పేలా కానీ అడ్డం వెయ్యకూడదు. ఇది చాలా క్రూరమైన చర్య. ఇలా ఎవరైనా చేసేవారా అంటే; అలాంటి క్రూరులు ఉండేవారు కాబట్టే ఆయన ఈ హెచ్చరికలు చేస్తున్నాడు. అలాగే ఈ మాటల వెనుక ఉన్న నియమాన్ని కూడా మనం చూడాలి. చెవిటివాడిని తిట్టకూడదు అన్నప్పుడు తిరిగి స్పందించలేని ఏ వ్యక్తిపై కూడా అభియోగాలు మోపకూడదు. అలానే ఒక వ్యక్తిని ఏవిధంగానైనా పడిపోయేలా కానీ దారితప్పించేలా కానీ కుట్రచెయ్యకూడదు.
లేవీయకాండము 19:15
అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్ష పాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను.
ధర్మశాస్త్రంలో ఈ నియమం మనకు మరికొన్నిసార్లు కూడా కనిపిస్తుంది. మన దేవుడు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుడు కాబట్టి (1 పేతురు 1:17) ఆయన పిల్లలు కూడా అలాంటి లక్షణమే కలిగియుండాలి. లేకుంటే అది పాపంగా ఎంచబడుతుంది. అందుకే "మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు" (యాకోబు 2:9) అని రాయబడింది.
లేవీయకాండము 19:16
నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, నీ సహోదరునికి ప్రాణ హానిచేయ చూడకూడదు, నేను యెహోవాను.
ఈ వచనంలో దేవుడు కొండేలు చెప్పడాన్ని నిషేధించడం మనం చూస్తాం. ఎందుకంటే ఈ కొండేల వల్ల ఒక వ్యక్తి మానానికి హాని కలుగుతుంది, కొన్నిసార్లు అది ప్రాణహాని దాకా వెళ్తుంది. అందుకే దేవుడు తన ప్రజల విషయంలో దీనిని నిషేధించాడు. సంఘంలో కూడా ఇదే నియమాన్ని మనం చూస్తాం (1 తిమోతీ 3:11, తీతుకు 2:3). ఈ కొండేలు చెప్పే గుణం ఉన్నవారు దేవుని సన్నిధిలో ప్రవేశించలేరు (కీర్తనలు 15:1-3).
లేవీయకాండము 19:17
నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను.
పగ తీర్చడం ఆయన పని ఆయనే ప్రతిఫలం ఇచ్చేవాడు (హెబ్రీ 10:30) కాబట్టి ఆయన పిల్లలు పగ పట్టే గుణం కలిగియుండకూడదు. తనకు ఏదైనా అన్యాయం జరిగిందని భావిస్తే సంబంధిత పెద్దలనో న్యాయాధికారులనో సంప్రదించడం, దేవునికి ప్రార్థించడం మాత్రమే చెయ్యాలి. లేకుంటే హృదయంలోని ఆ పగ క్రియారూపం దాల్చే ప్రమాదం కూడా ఉంది.
"నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను"
మన సంబంధీకులు ఏదైనా పాపం చేస్తున్నారని తెలిసినప్పుడు వారిని ఆ విషయంలో గద్దించాలని ఈ మాటలు తెలియచేస్తున్నాయి. లేకుంటే అది మనకు కూడా పాపమయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనవారి పట్ల అది బాధ్యతారాహీత్యం ఔతుంది. కాబట్టి మనవారిని మనం గద్దించాలి.
యాకోబు 5:20 పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణమునుండి యొక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలిసికొనవలెను.
గలతియులకు 6:1 సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదు నేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొని రావలెను.
లేవీయకాండము 19:18
కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.
"కీడుకు ప్రతికీడు చేయకూడదు"
ఈ నియమం లేఖనాలలో మరలా మరలా మనకు జ్ఞాపకం చెయ్యబడుతుంది (సామెతలు 20:22, రోమా 12:17, 1 పేతురు 3:9). కాబట్టి దేవుని పిల్లలు ఈ విషయంలో జాగ్రత్తకలిగియుండాలి. పగతీర్చువాడు దేవుడే.
"నీ ప్రజల మీద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను"
బైబిల్ గ్రంథంలో ఇది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ప్రభువైన యేసుక్రీస్తు కూడా దీనిని ప్రస్తావించడం మనం చూస్తాం (మత్తయి 19:19). దేవుని పిల్లలు మొదట దేవుణ్ణి ప్రేమించాలి, అలానే తమ పొరుగువారిని కూడా తమవలే ప్రేమించాలి. ఈ లక్షణం లేనివారు దేవుణ్ణి ప్రేమించేవారు కారు. యేసుక్రీస్తు మంచి సమరయుని ఉపమానం చెప్పింది ఈ ఆజ్ఞను స్థిరపరచడానికే (లూకా 10:25-37). పౌలు కూడా "పొరుగువానిని ప్రేమించుటయే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటయంటూ" దానికి గల కారణం కూడా వివరించాడు.
రోమీయులకు 13:8-10 పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.
లేవీయకాండము 19:19
మీరు నాకట్టడలను ఆచరింపవలెను; నీ జంతువులను ఇతర జాతిజంతువులను కలియ నీయకూడదు; నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు; బొచ్చును నారయు కలిసినబట్ట వేసి కొనకూడదు.
"మీరు నాకట్టడలను ఆచరింపవలెను"
దేవుడు విధించే కట్టడల వెనుక కారణమేంటో కొన్నిటికి తెలియకపోవచ్చు. అయినప్పటికీ ఆయన దేవుడు కాబట్టి ఆయన చేసేవన్నీ మంచిగానే ఉంటాయి కాబట్టి కారణం తెలిసినా తెలియకపోయినా ఆయన ప్రజలు వాటిని పాటించాలి.
"నీ జంతువులను ఇతర జాతిజంతువులను కలియ నీయకూడదు"
ఆదికాండము 1:24 ప్రకారం; దేవుడు వాటి వాటి జాతిచొప్పున ప్రతీ జంతువునూ సృష్టించాడు. కాబట్టి ఆయన సృష్టి క్రమాన్ని మార్చేవిధంగా ఇతరజాతి జంతువులను కలవనివ్వకూడదు.
ప్రసంగి 3:14 దేవుడు చేయు పనులన్నియు శాశ్వతములని నేను తెలిసికొంటిని; దాని కేదియు చేర్చబడదు దానినుండి ఏదియు తీయబడదు; మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు.
"నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు"
కొన్నిరకాలైన పంటలను ఒకే పొలంలో వేసినప్పుడు రెండు పంటలకూ నష్టం వస్తుంది. ఉదాహరణకు ఓట్స్, గోధుమలు. అందుకే ఒక పొలంలో ఒకేరకమైన పంటను వెయ్యాలి. వారికున్న వనరులను నష్టపరుచుకోకూడదు.
"బొచ్చును నారయు కలిసినబట్ట వేసి కొనకూడదు"
ఇంగ్లీషు బాషలో ఈ వచనం "neither shall a garment mingled of linen and woolen come upon thee" అని ఉంటుంది. ఆ కాలంలో ఐగుప్తీయులూ మరియు కనానీయులు తమ దేవతల పూజల్లో ఆ రెండూ కలగలిపిన వస్త్రాలను ధరించేవారు. అందుకే దేవుడు ఇశ్రాయేలీయులను ఆ సంస్కృతుల పూజా విధానాల నుండి దూరం చెయ్యడానికి అలాంటి వస్త్రాలను నిషేధించాడు. సాధారణంగా లినెన్ చల్లగా ఉంటుంది. అందుకే దానిని వేశవిలో ధరించాలి, వూలెన్ వెచ్చగా ఉంటుంది దానిని చలికాలంలో ధరించాలి. రెండూ కలగలిపిన వస్త్రాలు ధరించడం అనేది శరీరానికి ఇబ్బంది కూడా.
లేవీయకాండము 19:20
ఒకనికి ప్రధానము చేయబడిన దాసి, వెలయిచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడిపింపబడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసినయెడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు.
సాధారణంగా ఒకరికి ప్రధానం చెయ్యబడిన స్త్రీతో వ్యభిచరిస్తే వారిద్దరినీ రాళ్ళతో కొట్టి చంపాలి (ద్వితీయోపదేశకాండము 22:23,24). కానీ ఈ సందర్భంలో ప్రధానం చెయ్యబడిన స్త్రీ ఒకరికి దాసి కాబట్టి ఆమెను చంపివేస్తే ఆ యజమానుడే నష్టం కాబట్టి ఆమెను చంపకూడదు. ఇద్దరూ పాపం చేసినప్పుడు ఒక్కరినే శిక్షించడం న్యాయం కాదు కాబట్టి ఆ పురుషుణ్ణి కూడా చంపకూడదు. వారిని వేరేవిధంగా శిక్షించాలి. అలానే క్రింది వచనాల ప్రకారం ఆ పురుషుడు తన పాపపరిహారం కోసం బలులు అర్పించాలి.
లేవీయకాండము 19:21,22
అతడు అపరాధ పరిహారార్ధబలిని, అనగా అపరాధపరిహారార్థబలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాపపరిహారార్థబలియగు పొట్టేలువలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును.
ఈ వచనాల ప్రకారం ప్రధానం చెయ్యబడిన దాసితో శయనించినవాడు అపరాధపరిహార్థ బలిని అర్పించాలి. అయితే ఈ బలి పాపం చేసి దానిని కప్పుకోవడానికో లేక మరో పాపం చెయ్యడానికి అనుమతిగానో కాదు. అప్పటికే అతను చేసిన పాపం విషయంలో క్షమాపణ కొరకు దీనిని అర్పించాలి. ప్రతీ బలి వెనుకా ఇదే ఉద్దేశం.
లేవీయకాండము 19:23-25
మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి మూడు సంవత్సరముల వరకు మీకు అపవిత్రముగా ఉండవలెను, వాటిని తిన కూడదు. నాలుగవ సంవత్సరమున వాటి ఫలములన్నియు యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగద్రవ్యములగును; అయిదవ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును; నేను మీ దేవుడనైన యెహోవాను.
ఈ వచనాల ప్రకారం; ఇశ్రాయేలీయులు కనాను దేశంలో ప్రవేశించాక మూడు సంవత్సరాల పంటను తినకుండా వాటిని అపవిత్రంగా ఎంచాలి. నాలుగవ సంవత్సరమైతే ఆ పంటను దేవునికి అర్పించాలి (యాజకులకు). ఐదవ సంవత్సరం నుండి మాత్రమే ప్రజలు ఆ పంటను తినాలి. ఆయనే దేవుడైన యెహోవా కాబట్టి ఆయన నియమించిన ఈ కట్టడ వెనుక కారణం తెలియనప్పటికీ దానిని పాటించాలి.
లేవీయకాండము 19:26
రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడ కూడదు, మంత్ర యోగములు చేయకూడదు.
సాధారణంగా ఆయన ప్రజలు రక్తాన్ని తినకూడదు. ఈ ఆజ్ఞను మనం అనేకసార్లు చూస్తాం. అయితే ఈ సందర్భంలో ఈ మాటలు శకునాలకు మంత్ర ప్రయోగానికి సంబంధించి చెప్పబడ్డాయి. ఆ కాలంలో మంత్రప్రయోగం చేసేవారు లేక శకునాలు చూసేవారు బలిగా అర్పించిన జీవిని తిని దాని రక్తాన్ని త్రాగేవారు (యెహెజ్కేలు 33:25). ఆయన ప్రజలు అలా చెయ్యకూడదు.
లేవీయకాండము 19:27
మీ నుదుటి వెండ్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు.
ఆ కాలంలో కొన్ని జాతులు తమ దేవతలను బట్టి ప్రత్యేకంగా ఉండడానికి ఇలాంటివి చేసేవారు (యిర్మియా 9:26). కానీ ఆయన ప్రజలు అలాంటి ఆచారాలు పాటించడం వల్ల కాదు ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారానే ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి అలా చెయ్యకూడదు.
లేవీయకాండము 19:28
చచ్చినవారికొరకు మీ దేహ మును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచు కొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.
"చచ్చినవారికొరకు మీ దేహ మును చీరుకొనకూడదు"
చనిపోయినవారి విషయంలో తమ బాధను వ్యక్తపరచడానికి ఆ కాలంలో కొన్ని జాతులవారు ఇలా చేసేవారు. కానీ దేవుని ప్రజలు చనిపోయినవారి విషయంలో మృతులపునరుత్థానం అనే నిరీక్షణతో ఉండాలి కాబట్టి అలా తమ దేహాన్ని చీరుకోవడం కానీ మరేవిధమైన బాధకు గురిచేసుకోవడం కానీ చెయ్యకూడదు. ముఖ్యంగా దేహం దేవునిదని గుర్తించాలి.
"పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచు కొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను"
ఆ కాలంలో కొన్ని జాతుల ప్రజలు తమ దేవతల పేరిట దేహంపై పచ్చబొట్లు పొడుచుకునేవారు. ఆ దేవతల పేర్లునో లేక చిహ్నాలనో. కాబట్టి ఆయన ప్రజలు అలా చెయ్యకూడదు. ఈ నియమం దేవతల పేరిటనే కాదు సాధారణంగా పొడిపించుకునే పచ్చబొట్లకు కూడా వర్తిస్తుంది. దేహం దేవునిది కాబట్టి ఆ దేహంపై పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. "మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి" (1కోరింథీ 6:19,20) అని నూతననిబంధనలో కూడా ఈ సత్యం ప్రకటించబడింది. కాబట్టి దేవుని సొత్తైన దేహంపై సరదాలకోసమనో జ్ఞాపకాలకోసమనో మరే కారణంతోనైనా సరే పచ్చబొట్లు పొడిపించుకోకూడదు, కొన్ని సందర్భాల్లో అది దేహానికి హానికరం కూడా.
లేవీయకాండము 19:29
మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణియగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు.
ఆకాలంలో కొందరు తల్లితండ్రులు తమ దేవతల పేరిట తమ కుమార్తెలను వేశ్యలుగా మార్చేవారు. దానివల్ల దేశం వ్యభిచారమయం ఔతుంది కాబట్టి దేవుడు అసహ్యించుకునే ఆ పాపం ప్రబలకుండా ఉండేటట్టు ఆయన పిల్లలు అలాంటి ఆచారాలు పాటించకూడదు. మన దేశంలో కూడా దేవదాసీ, జోగినీ అనే పేర్లతో ఈ ఆచారం కొనసాగేది. క్రైస్తవమిషనరీలు ఈ వాక్యం ఆధారంగానే వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసారు.
లేవీయకాండము 19:30
నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను నా పరిశుద్ధస్థలమును మన్నింపవలెను; నేను యెహోవాను.
ఈ విశ్రాంతి దినాల గురించి ఇప్పటికే వివరించాను.
లేవీయకాండము 19:31
కర్ణపిశాచిగలవారి దగ్గరకు పోకూడదు, సోదె గాండ్రను వెదకి వారివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.
"ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు" (ఎఫెసీ 1:12) కాబట్టి ఆయన పిల్లలు భవిష్యత్తు విషయంలో ఆయనపై ఆధారపడాలే తప్ప దానిని తెలుసుకోవడానికి దెయ్యపు శక్తులను ఆశ్రయించకూడదు. సౌలు పాపం ముగిసి అతను హతం అవ్వడానికి అతను కర్ణపిశాచిగలదానిని వెదకడమే కారణమని లేఖనం తెలియచేస్తుంది (1 దినవృత్తాంతములు 10:13,14).
లేవీయకాండము 19:32
తల నెరసినవాని యెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను; నేను యెహోవాను.
వృద్ధులు ఎన్నో విలువైన అనుభవాలను కలిగియుంటారు, వారు అంతకాలం వరకూ జీవించియున్నారంటే అది వారిపట్ల దేవుని కృపయే.
సామెతలు 16:31 నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును.
కాబట్టి అలాంటి వృద్ధులను గౌరవించాలి. వారి మంచి అనుభవాల సారాన్ని మాదిరిగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ మాటలు విశ్వాసులైన వృద్ధుల విషయంలో వర్తిస్తాయి. కాబట్టి సంఘంలో వారికి గౌరవప్రధమైన స్థానం కల్పించాలి.
లేవీయకాండము 19:33,34
మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు, మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను.
ఈ వచనాల్లో దేవుడు ఐగుప్తుదేశంలో ఇశ్రాయేలీయులు అనుభవించిన శ్రమలను గుర్తు చేస్తూ పరదేశుల పట్ల ప్రేమ కలిగియుండమని బోధించడం మనం చూస్తాం. అంటే ఆయన వారి అనుభవాలను ఉదాహరణగా తీసుకుని వారికి పరదేశుల పట్ల ప్రేమ నేర్పిస్తున్నాడు. ఇవే మాటలు మరలా మరలా జ్ఞాపకం చెయ్యబడతాయి (నిర్గమకాండము 23:9).
లేవీయకాండము 19:35,36
తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికెలోగాని పరిమాణములోగాని మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను; నేను ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.
ఈ వచనాల ప్రకారం; దేవునిపిల్లలు అన్నివిధాలైన లావాదేవీల విషయంలో న్యాయంగా వ్యవహరించాలి. అమ్మే విషయంలో కావొచ్చు కొనే విషయంలో కావొచ్చు, ధాన్యం విషయంలో కావొచ్చు భూమి విషయంలో కావొచ్చు ఇలా అన్నివిధాలైన లావాదేవీల విషయంలోనూ "న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను"
లేవీయకాండము 19:37
కాగా మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను; నేను యెహోవాను.
ఆయనే దేవుడైన యెహోవా కాబట్టి ఆయన కట్టడలనూ విధులనూ ఆయన ప్రజలు గైకొనాలి. లేకుంటే ఆయన ప్రజలలోనుండి వారు కొట్టివెయ్యబడతారు
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి 
 అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com" 
          ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
 
లేవీయకాండము అధ్యాయం 19

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"