లేవీయకాండము 11:1 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.
ఈ వచనంలో దేవుడు మోషే అహరోనులకు కొన్ని సంగతుల గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. మోషే ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉన్నాడు, అహరోను ప్రధానయాజకుడిగా నియమించబడ్డాడు. ఈ కారణంగా ఆయన ఇరువురికీ తన వాక్య ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ వస్తున్నాడు.
లేవీయకాండము 11:2 మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి భూమి మీదనున్న జీవులన్నిటిలోను మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును.
ఈ వచనంలో దేవుడు తన నిబంధన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఏ జీవులను తినాలో ఆజ్ఞాపించడం మనం చూస్తాం. నోవహు సమయంలో ఆయన సమస్త (విషం కాని) జీవరాశులనూ తినవచ్చని ఆజ్ఞాపించడం మనం చూసాం (ఆదికాండము 9:3). ఇక్కడ ఇశ్రాయేలీయుల విషయంలో మాత్రం ఆయన పరిమితులు విధిస్తున్నాడు. ఎందుకంటే తన ప్రజలు ఆహారం విషయంలో కూడా ఇతర జనాంగాలకు ప్రత్యేకంగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం. "నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ద పరచుకొనవలెను" (లేవీయకాండము 11:44) అంటే అర్థం ఇదే. దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండడం అంటే ప్రత్యేకంగా ఉండడం అని భావం. అందుకే ఇప్పటివరకూ వారి ప్రవర్తనకు సంబంధించి, ఆరాధనలో భాగంగా ఆయనకు అర్పించవలసిన బలులను గురించి ఆజ్ఞాపించిన ఆయన ఇప్పుడు వారి ఆహారం విషయంలో కూడా పరిమితులు విధిస్తున్నాడు. ఈ పరిమితుల వల్ల వారు దేవుడు నిషేధించిన జీవులను తినే అన్యజనులతో సహవాసం చెయ్యలేరు, ఎందుకంటే సహవాసాల్లో భోజనపు బల్ల అనేది ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఈవిధంగా దేవుడు ఏవిధంగా ఐతే అన్నిటికంటే ప్రత్యేకంగా ఉన్నాడో అలానే తన ప్రజలు కూడా ఇతరులనుండి ప్రత్యేకంగా ఉండాలి అనేది నేర్పించడానికే ఇవన్నీ. ఈ విషయం మరింత స్పష్టంగా వివరించబడిన వాక్యభాగం చూడండి.
"మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవనినిబట్టి మిమ్మును మీరు కోసికొన కూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడిచేసికొనకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్టిత జనము. మరియు యెహోవా భూమిమీద నున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. నీవు హేయమైనదేదియు తినకూడదు" (ద్వితీయోపదేశకాండము 14:1-3).
గమనించండి; ఈ పరిమితులు ఇశ్రాయేలీయులకు మాత్రమే చెందినవి ఎందుకంటే ఈ ఆచార సంబంధమైన, ఆహారానికి సంబంధించిన ధర్మశాస్త్రం కేవలం ఛాయగా మాత్రమే నియమించబడింది (హెబ్రీ 10:1, కొలస్సీ 2:16,17). వీటిని బట్టి మనం నేను పైన వివరించినట్టుగా లోకం నుండి ఆయనకోసం ప్రత్యేకంగా అనగా పరిశుద్ధులుగా జీవించాలి అనేది మాత్రమే నేర్చుకోవాలి. అంతకుమించి మనం కూడా ఆహారం విషయంలో ఈ పరిమితులు పాటించవలసిన అవసరం లేదు. నూతననిబంధన ఈవిషయం మనకు చాలా స్పష్టంగా బోధిస్తూ ఇంకా ఈ పరిమితులను పాటించాలనే బోధను దెయ్యాల బోధగా గద్దిస్తుంది (1 తిమోతీ 4:1-4). పౌలుతో పాటుగా మిగిలిన ప్రముఖ అపోస్తలులు మరియు ప్రభువు సహోదరుడైన యాకోబు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు (అపొ.కార్యములు 15:19,20). దాని ప్రకారం విశ్వాసులమైన మనం విగ్రహసంబంధమైన వాటినీ గొంతు పిసికి చంపిన వాటినీ రక్తాన్నీ మినహా అన్నిటినీ నిస్సందేహంగా తినవచ్చు. ఎందుకంటే "దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు" (1తిమోతికి 4:4).
"సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను" (రోమీయులకు 14:14). ఈ వాక్యభాగం ప్రకారం; సహజంగా ఏదీ నిషిద్ధమైనది కాదు దేవుడు సృజించిన ప్రతీదీ మంచిదే. అయితే దేవుడు ఇశ్రాయేలీయులకు కొన్నిటిని నిషేధించాడు కాబట్టి ఆయన నిషేధించడాన్ని బట్టి వాటిని తినడం వారికి పాపంగా ఎంచబడుతుంది. మన విషయంలోనైతే "విగ్రహసంబంధమైన వాటినీ గొంతు పిసికిచంపినవాటినీ రక్తాన్నీ తప్ప ఆయన మరేమీ నిషేధించలేదు". తన ప్రజల విషయంలో దేనినైనా నిషేధించే హక్కు ఆయనకు మాత్రమే ఉంటుంది. మనుషులెవరికీ ఆ హక్కు లేదు కాబట్టి ఈరోజు ఎవరైనా ధర్మశాస్త్రంలో నిషేధించబడిన జీవులను సంఘం విషయంలో కూడా నిషేధిస్తుంటే వారు దేవునికి మాత్రమే చెందిన హక్కును దొంగిలిస్తున్నవారని అనగా దేవుని స్థానాన్ని ఆక్రమిస్తున్న దుర్మార్గులని మనం అర్థం చేసుకోవాలి.
లేవీయకాండము 11:3 జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చును గాని-
ఈ వచనంలో దేవుడు జంతువులలో కాలికి డెక్కలు కలిగి, తిన్నటువంటి ఆహారాన్ని మరలా నెమరువేసే వాటన్నిటినీ తినవచ్చని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఈ జాబితా మరొక చోట వివరించబడింది చూడండి; "నీవు హేయమైనదేదియు తినకూడదు. మీరు తినదగిన జంతువులు ఏవేవనగా ఎద్దు, గొఱ్ఱెపిల్ల, మేక పిల్ల, దుప్పి, ఎఱ్ఱ చిన్నజింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొఱ్ఱె అనునవే. జంతువులలో రెండు డెక్కలు గలదై నెమరువేయు జంతువును తినవచ్చును" (ద్వితీయోపదేశకాండము 14:3-6).
లేవీయకాండము 11:4-8 నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలుగల వాటిలోను వీటిని తినకూడదు, ఒంటె నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పంది విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరువేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తిన కూడదు; వాటి కళేబరములను ముట్టకూడదు; అవి మీకు అపవిత్రములు.
ఈ వచనాల్లో దేవుడు కాళ్ళకు రెండు డెక్కలు ఉన్నప్పటికీ నెమరు వేయకుండా ఉండేవాటినీ ఒకవేళ నెమరు వేస్తున్నప్పటికీ కాళ్ళకు డెక్కలు లేనివాటినీ ఇలా కాళ్ళకు డెక్కలు నెమరు వెయ్యడం అనే రెండు లక్షణాలూ లేకుండా ఏదో ఒకటి ఉండి మరోటి లేనివాటిని తినకూడదని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. వీటిలో ఒంటె, పొట్టి కుందేలు, కుందేలు, పంది ఉన్నాయి. ఇశ్రాయేలీయులు వీటిని తినకుండడమే కాదు చివరికి చనిపోయిన వీటి కళేబరాలను కూడా ముట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడు వాటిని నిషేధించాడు కాబట్టి నిషిద్ధంగానే ఉండాలి. కొందరు వ్యాఖ్యానకర్తలు ఈ జీవుల స్వభావం మంచిది కాదు కాబట్టి లేక వాటి మాంసం ఆరోగ్యానికి హానికరం కాబట్టి వాటిని తినవద్దు అన్నాడని భావిస్తున్నారు. అదే నిజమైతే నూతననిబంధన ప్రజలమైన మన విషయంలో ఆ నిషేధం ఎందుకు కొనసాగలేదు? ప్రస్తుతం మనం అన్నిటినీ తినవచ్చని రాయబడిన వాక్యభాగాలు ఇప్పటికే చూపించాను కదా. కాబట్టి నేను రెండవ వచనపు వ్యాఖ్యానంలో వివరించినట్టుగా ఇశ్రాయేలీయులు ఇతరప్రజలతో ప్రత్యేకంగా ఉండడానికే ఈ జీవుల విషయంలో ఆయన నిషేధాజ్ఞలు జారీ చేసాడు. దేవుడు దేనినైనా నిషేధించాడంటే అది నిషేధమే. ఆ నిషేధాన్ని అతిక్రమిస్తే పాపమే. నిషేధించే హక్కూ అనుమతించే హక్కూ ఆయనదే. ఇంతకు మించిన కారణాలు మనకు అప్రస్తుతం.
లేవీయకాండము 11:9-12 జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును; సముద్రములో నేమి, నదులలో నేమి, యే నీళ్లలోనేమి, వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును. సముద్రములలోనేమి, నదులలోనేమి, సమస్త జలచరములలోను సమస్త జలజంతువులలోను వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నియు మీకు హేయములు; అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము.
ఈ వచనాలలో దేవుడు నీటిలో సంచరించే జీవరాశుల్లో రెక్కలు పొలుసులు లేని వాటిని తినకూడదని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అంటే మనకు చేపల బజారులో సహజంగా లభించి మనం తినే చేపలను; ఉదాహరణకు బొచ్చు, శీలావతి, కొయ్యింగ, బంగారు తీగ, పండుగప్ప, వీటిని మీరు గమనించే ఉంటారు. వాటికి శరీరం అంతా పొలుసు ఉంటుంది. అలానే తల ప్రక్కనా వీపుపైనా పొట్టపైనా తోకపైనా రెక్కల వంటివి ఉంటాయి. అలా రెక్కలూ పొలులూ రెండూ లేనివాటిని మినహా ఇశ్రాయేలీయులు మరే నీటి జీవులనూ తినకూడదు. ఒకటి ఉండి మరోటి ఉన్నప్పటికీ తినకూడదు రెండూ ఉండాలి. నేను రెండవవచనం నుండీ వివరిస్తున్నట్టుగా ఈ మినహాయించబడిన నీటి జీవులు కూడా సహజంగా నిషిద్ధం కాకపోయినా ఇశ్రాయేలీయులకు అవి దేవుడు నిషేధించాడు కాబట్టి నిషేధంగానే ఉండాలి. ఆవిధంగా వారు ఇతర జాతుల ఆహారం విషయంలో ప్రత్యేకంగా ఉండాలి. నిషేధించబడిన వాటిలో ఏమీ లేకపోయినప్పటికీ నిషేధించిన దేవుణ్ణి బట్టి ఈ నియమాలు అతిక్రమించినవారు దోషులు.
లేవీయకాండము 11:13-19 పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద, ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతివిధమైన డేగ, పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము.
ఈ వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయులు తినకూడని పక్షుల జాబితాను వివరించడం మనం చూస్తాం. హెబ్రీబాషపై అవగాహన కలిగిన పండితుల అభిప్రాయం ప్రకారం; ప్రస్తుత ఇశ్రాయేలీయులు హెబ్రీ బాషలో ఇక్కడ ఏ పక్షుల గురించి చెప్పబడిందో వాటిలో కొన్నింటి పేర్లు కచ్చితంగా చెప్పలేరంట. ఆ విధంగా కూడా ఈ భాగం నిత్యం పాటించవలసిన నియమాలకు సంబంధించింది కాదని మనకు తెలియచేస్తుంది. ఒకవేళ ఈ నియమాలు ఇప్పటికీ వర్తిస్తుంటే అవి తన ప్రజలకు అర్థమయ్యేలానే ఉండేవి. ప్రభువు వాక్యం తన పిల్లలకు మరుగుచెయ్యబడదు.
లేవీయకాండము 11:20-25 రెక్కలుకలిగి నాలుగుకాళ్లతో చరించు చరములన్నియు మీకు హేయములు. అయితే నాలుగుకాళ్లతో చరించుచు నేల గంతులువేయుటకు కాళ్ల మీద తొడలు గల పురుగులన్ని తినవచ్చును. నేత మిడతగాని చిన్న మిడతగాని ఆకుమిడతగాని మిడతలలో ప్రతివిధమైనది తినవచ్చును. నాలుగు కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు. వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములలో కొంచె మైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.
ఈ వచనాలలో దేవుడు నేలపై ప్రాకే పురుగుల గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఈ మాటల ప్రకారం మిడతలు మినహా మరే పురుగులనూ ఇశ్రాయేలీయులు తినకూడదు. గమనించండి; ఈ అధ్యాయంలో దేవుడు మొదట జంతువుల గురించీ తర్వాత చేపల గురించీ ఆ తర్వాత పక్షుల గురించీ ఇప్పుడు పురుగుల గురించి..ఇలా ఈ భూమిపై కనిపించే జీవరాశులను విభజిస్తూ ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ మాటలు "మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగమాంసము వేరు, పక్షి మాంసమువేరు, చేప మాంసము వేరు" (1కోరింథీ 15:38,39) అనే పౌలు మాటలను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి.
లేవీయకాండము 11:26-28 రెండుడెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు, నెమరు వేయకయు నుండునవి మీకు అపవిత్రములు, వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును. నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాసులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నియు అపవిత్రములు; వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును; వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును; అవి మీకు అపవిత్రమైనవి.
ఈ అధ్యాయమంతటిలోనూ "వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును" అనే మాటలు మనకు కనిపిస్తుంటాయి. ఇది ఆధ్యాత్మికతకు సంబంధించిన అపవిత్రత కాదు కానీ ఆచారసంబంధమైన అపవిత్రత (Sermonial uncleanness). అంటే వారి దేహాలను అపవిత్రం చేసే అపవిత్రత. అయితే ఈ నియమం యొక్క ఉద్దేశం; వాటిని అసలే ముట్టకూడదని కాదు. ఉదాహరణకు; వారి పరిసర ప్రాంతాల్లో అవి చనిపోయినప్పుడు అక్కడినుండి ఆ కళేబరాన్ని తొలగించాలంటే ముట్టుకునే తీరాలి. అందుకే అలా ముట్టుకున్నవాడు ఏం చెయ్యాలో ఇక్కడ చెబుతున్నాడు: తన బట్టలు ఉతుక్కుని సాయంకాలం వరకూ అపవిత్రునిగా (ప్రత్యేకంగా) ఉండాలి. అనగా పరిశుద్ధమైన (ఆలయసంబంధమైన) కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ దానికి సంబంధించిన అర్పణలను తినడం కానీ చెయ్యకూడదు (లేవీకాండము 7:20,21). ఈ ఆజ్ఞలు జారీ చేస్తుంది దేవుడు కాబట్టి; కావాలని ఈ నియమాలను అతిక్రమించినవారు అనగా అవసరం లేకున్నా కళేబరాలను ముట్టుకోవడం కానీ తప్పనిసరి పరిస్థితుల్లో (అనుకోకుండా కూడా) ముట్టుకుని సాయంకాలం వరకూ ప్రత్యేకంగా ఉండకుండా ఆలయసంబంధమైన వాటిని తినడం కానీ చేసినవాడు ఆధ్యాత్మికంగా కూడా అపవిత్రునిగా పరిగణించబడతాడు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమం పాపం.
లేవీయకాండము 11:29-40 నేల మీద ప్రాకు జీవరాసులలో మీకు అపవిత్ర మైనవి ఏవేవనగా, చిన్నముంగిస, చిన్నపందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఊసరవెల్లి, నేలమొసలి, తొండ, సరటము, అడవి యెలుక. ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు; ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. వాటిలో చచ్చిన దాని కళేబరము దేని మీద పడునో అది అపవిత్ర మగును. అది చెక్కపాత్రయేగాని బట్టయేగాని చర్మమే గాని సంచియేగాని పనిచేయు ఉపకరణము ఏదియు గాని అయినయెడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయంకాలము వరకు అపవిత్రమైయుండును; తరువాత అది పవిత్ర మగును. వీటిలో ఏదైనను మంటిపాత్రలో పడినయెడల దానిలోనిదంతయు అపవిత్రమగును; మీరు దానిని పగుల గొట్టవలెను. తినదగిన ఆహారమంతటిలో దేని మీద ఆ నీళ్ళు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన యే పానీయమును అపవిత్రము. వాటి కళే బరములలో కొంచెము దేని మీద పడునో అది అపవిత్ర మగును. అది పొయ్యియైనను కుంపటియైనను దానిని పగులగొట్టవలెను. అవి అపవిత్రములు, అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను. అయితే విస్తారమైన నీళ్లుగల ఊటలోగాని గుంటలోగాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు గాని కళేబరమునకు తగిలినది అపవిత్ర మగును. వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తన ముల మీద పడినను అవి అపవిత్రములు కావు గాని ఆ విత్తన ముల మీద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటి మీద పడినయెడల అవి మీకు అపవిత్రములగును. మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చిన యెడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును.
ఈ వచనాలలో దేవుడు మరికొన్ని ఆజ్ఞలను తెలియచెయ్యడం మనం చూస్తాం. వీటి ఉద్దేశం ఇప్పటికే నేను వివరించాను కాబట్టి ఇక ముందుకు వెళ్తున్నాను. అయితే "విస్తారమైన నీళ్లుగల ఊటలోగాని గుంటలోగాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు" అనే మాటలు ఇక్కడ ప్రత్యేకంగా చదువుతున్నాం. ఎందుకంటే ఏ చిన్నపాటి కళేబరమూ ఎక్కువ నీరు ప్రవహించే నదులవంటి వాటిని కలుషితం చెయ్యలేవు కాబట్టి ఈ మాటలు చెప్పబడ్డాయి. పైగా ఆ కళేబరం తీసివెయ్యబడుతుంది కదా!. "వీటిలో ఏదైనను మంటిపాత్రలో పడినయెడల దానిలోనిదంతయు అపవిత్రమగును; మీరు దానిని పగుల గొట్టవలెను" ఎందుకంటే సహజంగానే మంటి పాత్రలకు పీల్చుకునే స్వభావం ఉంటుంది. అలాంటప్పుడు దానిని శుభ్రం చేసినప్పటికీ ఆ పడినదాని ప్రభావం పూర్తిగా పోదు అందుకే ఆయన ఈమాటలు చెబుతున్నాడు. ఇవి వారి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం.
లేవీయకాండము 11:41-47 నేల మీద ప్రాకు జీవరాసులన్నియు హేయములు, వాటిని తినకూడదు. నేల మీద ప్రాకు జీవరాసులన్నిటిలో కడుపుతో చరించుదానినైనను నాలుగుకాళ్లతో చరించుదానినైనను చాలా కాళ్లుగల దానినైనను మీరు తినకూడదు; అవి హేయములు. ప్రాకు జీవరాసులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు; వాటివలన అపవిత్రులగునట్లు వాటివలన అపవిత్రత కలుగ జేసికొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ద పరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు. నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. అపవిత్రమైనదానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతు వులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు జంతువులను గూర్చియు, పక్షులను గూర్చియు, జలచరము లైన సమస్త జీవులను గూర్చియు, నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధియిదే అని చెప్పుమనెను.
ఇంతటితో ఇశ్రాయేలీయుల ఆహారానికి సంబంధించిన దేవుని ఆజ్ఞలు ముగిసాయి. ఈ ఆజ్ఞల చివరిలో "నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను". "నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను" అనే మాటలు ఆయన ప్రత్యేకంగా చెబుతున్నాడు. నేను ఇప్పటివరకూ వివరించినట్టుగా తన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఆహారం విషయంలో కూడా తనకోసం ప్రత్యేకంగా ఉండాలని ఆయన ఈ నియమాలు ప్రవేశపెట్టాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల రాజ్యం భౌతికమైనది కాబట్టి భౌతికంగా ఇవన్నీ వారికి వర్తించాయి. ఇప్పుడు మన రాజ్యం ఆత్మసంబంధమైనది కాబట్టి ఆత్మసంబంధమైన అన్ని విషయాలలోనూ ఆయనకు లోబడేలా ఇవి మనకు ఛాయగా ఉన్నాయి. వారు ఆహారం విషయంలోనే ఆయనకు లోబడాలంటే మనం ఆధ్యాత్మికంగా మరెంతగా లోబడాలో ఇవి మనకు నేర్పిస్తున్నాయి. వారి నోటికి నచ్చింది వారు తినకూడదు అలానే మోసకరమైన మన హృదయానికి తోచింది మనం చేయకూడదు. ఆయనే మనకు దిశానిర్ధేశకం.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
లేవీయకాండము అధ్యాయం 11

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"