లేవీయకాండము 23:1,2
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామక కాలములు ఇవి.
గత అధ్యాయాల్లో దేవుని ప్రజలు ఎలా పవిత్రంగా ఉండాలో ఆయన యాజకులు ఎలా పవిత్రంగా ఉండాలో ఆయనకు అర్పించేవి ఎలా లోపం లేనివిగా ఉండాలో చూసాం. ఈ అధ్యాయంలో దేవుడు నియమించిన పండుగలను, ప్రతిష్టిత దినాలను పవిత్రంగా ఎలా ఆచరించాలో మనం చూస్తాం. ఆ పండుగలు, ప్రతిష్టిత దినాలు:
విశ్రాంతి దినము (లేవీకాండము 23:3)
పస్కా పండుగ (లేవీకాండము 23:5)
పులియని రొట్టెల పండుగ (లేవీకాండము 23:6-8)
ప్రధమఫలముల పండుగ (లేవీకాండము 23:14)
క్రొత్తఫలముల పండుగ (లేవీకాండము 23:15-21)
శృంగధ్వని పండుగ (లేవీకాండము 23:23-25)
ప్రాయశ్చిత్త దినము (లేవీకాండము 23:26-32)
పర్ణశాలల పండుగ (లేవీకాండము 23:33-36)
లేవీయకాండము 23:3
ఆరు దినములు పనిచేయవలెను; వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము; అది పరిశుద్ధసంఘపు దినము. అందులో మీరు ఏ పనియైనను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతిదినము.
దేవుడైన యెహోవా ఆరుదినాల్లో సృష్టిని చేసి విశ్రమించిన ఏడవ దినమే ఈ విశ్రాంతిదినము. హీబ్రూ వారాల ప్రకారం ఇది శనివారం వస్తుంది. దీనిని ఆయన దేవుని పిల్లలు పొందపోయే విశ్రాంతికి ఛాయగా నియమించాడు (హెబ్రీ 4:9). కాబట్టి ఇశ్రాయేలీయులు ఈ విశ్రాంతిదినాన్ని తప్పక ఆచరించాలి. దీనిగురించి మరింత వివరంగా ఇప్పటికే వివరించాను (నిర్గమకాండము 20:8-11 వ్యాఖ్యానం చూడండి).
లేవీయకాండము 23:4
ఇవి యెహోవా నియామకకాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధసంఘపు దినములు ఇవి.
ఈ మాటలు బాగా పరిశీలించండి; ఇశ్రాయేలీయులు ఈ దినాలను లేక పండుగలను ఎందుకు ఆచరించాలంటే "ఇవి యెహోవా నియామకకాలములు" కాబట్టి. నేటిసంఘాల్లో మనం కూడా మనకు ప్రభువు నియమించిన దినాలనే ఆచరించాలి. ఆయన ఆదివారం ఆరాధన దినాన్ని మాత్రమే మనకు నియమించాడు. కాబట్టి మానవకల్పితాలైన క్రిస్మస్, గుడ్ ఫ్రైడే ఈస్టర్ వంటివి మనకు సంబంధం లేని పండుగలు. వాటిని దేవుడు నియమించలేదు.
లేవీయకాండము 23:5-8
మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును. ఆ నెల పదునయిదవ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును; ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి యైన ఏ పనియు చేయకూడదు. ఏడు దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. ఏడవ దినమున పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము.
ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి బయలు దేరివచ్చిన అబీబు నెల 14వ దినం ఈ పస్కాపండుగ వస్తుంది, ఆరోజే ఆయన బలిపశువు రక్తం ద్వారా ఇశ్రాయేలీయులను రక్షించి, ఆ రక్తం గుర్తు లేని ఐగుప్తీయుల గృహాలలోని తొలిచూలు పిల్లలందర్నీ వధించాడు. ఆరోజే ఇశ్రాయేలీయులు పిసుకుకున్న పిండి పులియకముందే ఐగుప్తునుండి వెళ్ళగొట్టబడ్డారు కాబట్టి దానికి జ్ఞాపకార్థంగా 15వ దినం నుండి ఏడుదినాల వరకూ పులియని రొట్టెల పండుగ ఆచరించాలి. ఇశ్రాయేలీయుల రక్షణకోసం వధించబడిన ఆ పశువు క్రీస్తుకు ఛాయగా ఉంది (1 కొరింథీ 5:8). దీనిగురించి మరింత వివరంగా ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 12 వ్యాఖ్యానం చూడండి).
లేవీయకాండము 23:9-11
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీ కిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్ము నంగీకరించునట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతిదినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను.
ఇది ప్రధమఫలముల పండుగ. ఇశ్రాయేలీయులకు ఆయన కనాను దేశాన్ని స్వాస్థ్యంగా పంచి, ఆ భూమి పంటను అనుభవింపచేసాడు అనడానికి జ్ఞాపకార్థంగా కృతజ్ఞతగా ఇది నియమించబడింది. అబీబు నెలలో పులియని రొట్టెల పండుగ వారం రోజుల్లో విశ్రాంతిదినమైన శనివారం తర్వాత దినం అనగా ఆదివారం ఈ పండుగ జరుగుతుంది. అప్పటికి ఇశ్రాయేలీయులకు యవల పంట చేతికి వస్తుంది. ఆరోజు ఆ పంట పనను దేవుని సన్నిధిలో అల్లాడిస్తారు. ఇది క్రీస్తు పునరుత్థానానికి సాదృష్యంగా ఉంది. ఆయన పస్కా పండుగలో చనిపోయి ఆదివారం ప్రధమ ఫలముల పండుగరోజు ప్రధమఫలంగా లేపబడ్డాడు (1 కొరింథీ 15-20).
లేవీయకాండము 23:12-14
మీరు ఆ పనను అర్పించుదినమున నిర్దోషమైన యేడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పింపవలెను దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు పదియవ వంతుల గోధుమపిండి. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చువరకు ఆ దినమెల్ల మీరు రొట్టె యేమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ.
ఈ వచనాలలో ప్రధమఫలముల పండుగరోజు మొదటి పనను అర్పించేటప్పుడు పాటించవలసిన విధి గురించి మనం చూస్తాం. ఆరోజు ఆయనకు గోధుమపిండి, ద్రాక్షరసంతో కలపి పొట్టేలును దహనబలిగా అర్పించాలి. ఇది ఆయన పట్ల కృతజ్ఞతను సూచిస్తుంది. అందుకే ఆరోజు వారు ఉపవాసంతో ఉండి ఆ బలిని అర్పించాలి.
లేవీయకాండము 23:15-21
మీరు విశ్రాంతిదినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలు కొని యేడు వారములు లెక్కింపవలెను; లెక్కకు తక్కువ కాకుండ ఏడు వారములు ఉండవ లెను. ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు ఏబది దినములు లెక్కించి యెహోవాకు క్రొత్తఫలముతో నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసములలో నుండి తూములో రెండేసి పదియవవంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమపిండితో చేసి పులియ బెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమఫలముల అర్పణము. మరియు మీరు ఆ రొట్టె లతో నిర్దోషమైన యేడు ఏడాది మగ గొఱ్ఱెపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోను దహనబలియై యెహోవాకు ఇంపైన సువాసనగల హోమ మగును. అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాప పరిహారార్థబలిగా అర్పించి రెండు ఏడాది గొఱ్ఱెపిల్లలను సమాధానబలిగా అర్పింపవలెను. యాజకుడు ప్రథమఫల ముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతి ష్ఠింపబడినవై యాజకుని వగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనో పాధి యైన ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్తనివాసములలో మీ తరతరములకు నిత్య మైన కట్టడ.
ఇది ప్రధమఫలముల పండుగ మరునాడు నుండి ఏడువారాల తర్వాత అనగా 50 వ రోజున పాటించవలసిన క్రొత్తఫలముల పండుగ. ఆ సమయంలో గోధుమ పంట చేతికి వస్తుంది. దానితో పాటుగా వారు బలులనూ పులిసిన రొట్టెలనూ ఆయనకు అర్పించాలి. దీనినే పెంతుకోస్తు పండుగ అంటారు. ఈ దినానే అపోస్తలులకు ఆత్మదేవుడు అనుగ్రహింపబడి సంఘం స్థాపించబడింది (అపొ.కార్యములు 2). ప్రధమఫలముల పండుగలో క్రీస్తు మృతినుండి లేచాడు, క్రొత్తఫలముల పండుగ అనగా పెంతుకోస్తు పండుగలో ఆత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు.
లేవీయకాండము 23:22
మీరు మీ పంటచేను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను; నేను మీ దేవుడ నైన యెహోవాను.
ఇది దేశంలోని బీదలపై పరదేశులపై దేవుని కనికరాన్ని సూచించే ఆజ్ఞ. దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (లేవీకాండము 19:9,10 వ్యాఖ్యానం చూడండి).
లేవీయకాండము 23:23-25
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతిదినము. అందులో జ్ఞాప కార్థశృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయుటమాని యెహోవాకు హోమము చేయవలెను.
ఈ శృంగధ్వని పండుగ తిస్రీ నెల 1 దినాన జరుగుతుంది. ఇది అధికారికంగా వారికి నూతన సంవత్సరం రోజు. దీని తర్వాత పదవరోజు ప్రాయశ్చిత్త దినం వస్తుంది. కాబట్టి ఈ పండుగ ప్రాయశ్చిత్త దినానికి సిద్ధపాటు పిలుపుగా భావించవచ్చు. ఈరోజు పాటించవలసిన విధిగురించి సంఖ్యాకాండము 29:1-6 వచనాలలో వివరించబడింది.
లేవీయకాండము 23:26-32
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరిశుద్ధసంఘ ముగా కూడవలెను. మిమ్మును మీరుదుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు; మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసికొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్నుతాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతివానిని వాని ప్రజలలోనుండకుండ నాశము చేసెదను. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహా విశ్రాంతిదినము, మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల తొమ్మిదవనాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతిదినముగా ఆచరింపవలెను.
ఇది ప్రాయశ్చిత్తదినం. ఆరోజు బలిద్వారా దేశప్రజలందరి పాపాలకూ ప్రాయశ్చిత్తం చెయ్యబడుతుంది. లోకపాపాలను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లకు ఛాయగా ఆరోజు దేశప్రజల పాపాలకోసం ఒక మేక వధించబడుతుంది, దానివల్ల ఆ ప్రజల పాపాలు వారికి దూరంగా పోయాయి అనడానికి సాదృష్యంగా ఒక మేక విడిచిపెట్టబడుతుంది. ఆరోజే ప్రధానయాజకుడు అతిపరిశుద్ధస్థలంలోకి రక్తంతో ప్రవేశిస్తాడు. తన స్వరక్తంతో దేవుని సముఖంలోకి ప్రవేశించిన క్రీస్తుకు ఛాయగా ఇది జరుగుతుంది. దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (లేవీకాండము 16 వ్యాఖ్యానం చూడండి). ఈ ప్రాయశ్చిత్తదినాన అర్పించవలసిన ఇతర బలుల గురించి సంఖ్యాకాండము 29:7-10 వచనాలలో వివరించబడింది.
లేవీయకాండము 23:34-36
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఈ యేడవ నెల పదునయిదవదినము మొదలుకొని యేడు దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయ కూడదు. ఏడు దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధసంఘ ముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.
ఇది పర్ణశాలల పండుగ. ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వచ్చినప్పుడు వారు పర్ణశాలల్లో నివసించినదానికి జ్ఞాపకార్థంగా ఇది నియమించబడింది (42వ). ఈ పండుగ ఏడురోజులూ వారు పర్ణశాలల్లో నివసించాలి. ఆ సమయంలో పాటించవలసిన విధి గురించి సంఖ్యాకాండము 29:12-39 వచనాలలో వివరించబడింది.
లేవీయకాండము 23:37,38
యెహోవా నియమించిన విశ్రాంతిదినములు గాకయు, మీరు దానములనిచ్చు దినములుగాకయు, మీ మ్రొక్కుబడి దినములుగాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములుగాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి దహనబలి ద్రవ్యమునేమి నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. ఏ అర్పణదినమున ఆ అర్పణమును తీసికొని రావలెను.
ఏ పండుగలో ఏ అర్పణ తీసుకురావాలో ఆయా సందర్భాల్లో వివరించాను.
లేవీయకాండము 23:39-44
అయితే ఏడవ నెల పదునయిదవదినమున మీరు భూమిపంటను కూర్చుకొనగా ఏడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, ఎనిమిదవ దినము విశ్రాంతిదినము. మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి చెట్లకొమ్మలను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్స హించుచుండవలెను. అట్లు మీరు ఏటేట ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తర తరములలో నిత్యమైన కట్టడ. ఏడవ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్తుదేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియ చెప్పెను.
ఈ పర్ణశాలల పండుగ ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వచ్చి పర్ణశాలల్లో నివసించడానికి జ్ఞాపకార్థంగానే కాదు, దేవుడు వచ్చి మానవుల మధ్య నివసించడానికి కూడా ఛాయగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రజల మధ్యకు శరీరధారిగా దిగివచ్చిన (జన్మించిన) సమయం ఈ పండుగలోనే అయ్యుండాలి. ఎందుకంటే ప్రతీ పండుగా నియామకకాలం ఆయనలో నెరవేరినట్టే ఇది కూడా ఆయనలో నెరవేరుతుంది. ఈ పండుగ ఏతనీ 15 నుంచి 22 వరకూ జరుగుతుంది. మనకు ఆ సమయం సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో వస్తుంది
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
లేవీయకాండము అధ్యాయం 23

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"