విషయసూచిక:- 3:1, 3:2, 3:3-5 , 3:6 ,3:7-10 , 3:11 , 3:12-15 , 3:16, 17
లేవీయకాండము 3:1
అతడు అర్పించునది సమాధాన బలియైన యెడల అతడు గోవులలోనిది తీసికొనివచ్చిన యెడల అది మగదేగాని ఆడుదేగాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసికొనిరావలెను.
మొదటి అధ్యాయంలో దహనబలుల గురించీ రెండవ అధ్యాయంలో గోధుమపిండి సంబంధమైన నైవేద్యాల గురించి ఆజ్ఞాపించిన దేవుడు ఈ అధ్యాయంలో సమాధాన బలుల గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం, వీటిగురించి లేవీకాండము 7:11-21, 28-34 వచనాల్లో కూడా వివరించబడింది. ఇక ఈ సమాధాన బలుల గురించి మనం పరిశీలిస్తే;
1. ఇవి దేవునితో సమాధానం పొందడానికి సంబంధించిన బలులు. మనకోణంలో చెప్పాలంటే ఆయన సహవాసానికి సాదృష్యమైన బలులు అని కూడా చెప్పవచ్చు. ఈ బలిలో అర్పించబడిన పశువు మాంసం బలిపీఠంపై దహించబడడమే కాకుండా అందులోని కొంతభాగం బలి తీసుకువచ్చినవాడికీ, అలానే ఆ పశువును దేవునికి అర్పించిన యాజకుడికి కూడా చెందుతుంది (లేవీకాండము 7:15-18). అందుకే ఇది సమాధాన బలి అని పిలవబడింది. ఆ విధంగా ఈ బలిపశువు మాంసం దేవునికీ అర్పించబడుతుంది, ఆ బలిని తీసుకువచ్చినవాడికీ ఇవ్వబడుతుంది, దేవునికీ ఆ వ్యక్తికీ మధ్యలో మధ్యవర్తిగా వ్యవహరించిన యాజకుడికి కూడా చెందుతుంది. ఆ పశువులో యేయే భాగాలు దేవునికి అర్పించాలో క్రింది వచనాల్లో రాయబడింది. మిగిలిన భాగాలన్నీ వారికే చెందుతాయి. అయితే వారు మాంసాన్ని అదేరోజు తినాలి. మరునాటికి ఉంచుకోకూడదు.
లేవీయకాండము 7:15 సమాధానబలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను; దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు.
ఈ నియమం దేవునితో తనప్రజలు ప్రతీరోజూ నూతనంగా సమాధానం లేక సహవాసం కలిగియుండాలని నేర్పిస్తుంది. కాబట్టివిశ్వాసులమైన మనం ప్రతీరోజూ వాక్యధ్యానం ద్వారా ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా ఆయనతో సహవాసం కలిగియుండాలి.
2. దహనబలిలో అర్పించబడే పశువు మాంసం మొత్తం బలిపీఠంపై దహించబడాలి, అలానే అందులో మగవాటిని మాత్రమే అర్పించాలి. కానీ ఈ సమాధాన బలిలోని మాంసం బలి తీసుకువచ్చినవాడికీ, అర్పించిన యాజకుడికి కూడా చెందుతున్నట్టే, ఇందులో మగవాటినీ ఆడవాటినీ కూడా అర్పించవచ్చు. అదంతా దేవుని నిర్ణయం, ఆయనకు ఎప్పుడు వేటిని ఎలా అర్పించాలో, పిండివంటలతో సహా (2వ అధ్యాయం) ఆయనే నిర్ణయించాడు. ఎందుకంటే ఇది పూర్తిగా ఆయనకు సంబంధించిన విషయం. ఇక్కడ పతనమైన మానవస్వేచ్చకు అనుమతి ఉండదు. అలానే ఆయనకు బలులుగా నిర్దోషమైన పశువులనే అర్పించాలి, నిర్దోషమైన అంటే అర్థమేంటో ఇప్పటికే నేను వివరించాను (లేవీకాండము 1:3 వ్యాఖ్యానం చూడండి).
3. ఈ సమాధానబలి యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనకు లభించిన సమాధానికి సాదృష్యంగా ఉంది. కేవలం ఆయన బలిని బట్టే మన పాపాల ద్వారా దేవుని దృష్టికి శత్రువులంగా, లేక తిరుగుబాటుదారులంగా ఎంచబడిన మనం, అంత దారుణంగా ప్రవర్తించిన మనం, అందుకు తగిన శిక్షను పొందుకోకుండా ఆయనతో సమాధానపరచబడ్డాము.
రోమీయులకు 5:9 కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.
ఎఫెసీయులకు 2:14-18 ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము.
2 కొరింథీయులకు 5:18-21 సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.
కొలొస్సయులకు 1:20-22 ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. మరియు గతకాల మందు దేవునికి దూరస్థులును, మీ దుష్‌క్రియలవలన మీ మనస్సులో విరోధ భావముగలవారునైయుండిన మిమ్మును కూడ తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను.
లేవీయకాండము 3:2
తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
ఈ వచనంలో బలిపశువును తీసుకువచ్చిన వ్యక్తి ముందుగా ఆ పశువుపై తలపెట్టడం తర్వాత యాజకులు దానిని ద్వారం దగ్గర వధించి ఆ రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించడం మనం చూస్తాం. ఆ వ్యక్తి ఆ పశువుపై అలా చెయ్యి పెట్టడం ద్వారా అది తన పక్షంగా లేక తనకు బదులుగా అర్పించబడుతుందని ఒప్పుకుంటున్నాడు. ఇక యాజకులు ఆ పశువును ద్వారం దగ్గరే వధించడం, దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించడం గురించి ఇప్పటికే నేను వివరించాను (లేవీకాండము 1:3-5 వ్యాఖ్యానం చూడండి).
లేవీయకాండము 3:3-5
అతడు ఆ సమాధాన బలిపశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వంతటిని రెండు మూత్రగ్రంధులను వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును కాలేజము మీదను మూత్రగ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింవలెను. అహరోను కుమారులు బలిపీఠము మీద, అనగా అగ్నిమీది కట్టెలపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.
ఈ వచనాల్లో సమాధానబలి పశువునుండి యేయే భాగాలను దేవునికి అర్పించాలో మనం చూస్తాం. ఆ పశువుయొక్క లోపటి భాగాలపై (పేగులపై) ఉన్న క్రొవ్వు అంతటినీ అలానే మూత్రపిండాలనూ దాని చుట్టూ ఉండే క్రొవ్వునూ ఆయనకు దహనబలిగా అర్పించాలి. బోర మరియు తొడ యాజకుడికి చెందుతుంది (లేవీకాండము 7:31-34). మిగిలిన మాంసం ఆ పశువును తీసుకువచ్చిన వ్యక్తికి ఇవ్వబడుతుంది. ఈవిధంగా దేవుడు ఈ సమాధానబలి పశువు లోపటి భాగాలనూ వాటిపై ఉండే క్రొవ్వునూ కోరుకోవడం, ఆయన మన అంతరంగంలో పరిశుద్ధతను కోరుతున్నాడు అనేదానికి సాదృష్యంగా ఉంది (కీర్తనలు 51:6). కొన్ని మతాలవరే ఆయన తన పిల్లలనుండి పైపై వేషధారణనో లేక ఆహార అలవాట్లనో కాదు, హృదయసంబంధమైన పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. అందుకే ఆయన హృదయాంతరంగాలను పరిశీలించి దేవుడు అని పిలవబడ్డాడు (యిర్మియా 11:20, 20:12). యేసుక్రీస్తు ప్రభువు ఇలా అంటున్నారు;
మత్తయి 15:17-20 నోటిలోనికి పోవునదంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను.
అలానే "విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు" (కీర్తనలు 51:17) అని కూడా రాయబడింది. కాబట్టి ఆయన పిల్లలమైన మనం ఆ హృదయపరిశుద్ధతను కలిగియుండాలి. ఆ హృదయపరిశుద్ధతకు అనుగుణంగానే మన వేషధారణ (వస్త్రధారణ, అలంకరణ) కూడా ఉండాలి.
కీర్తనలు 24:3,4 యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు? వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.
లేవీయకాండము 3:6
యెహోవాకు సమాధానబలిగా ఒకడు అర్పించునది గొఱ్ఱె మేకలలోనిదైన యెడల అది మగదేగాని ఆడుదేగాని నిర్దోషమైనదాని తీసికొనిరావలెను.
ఈ వచనంలో దేవుడు గొఱ్ఱె మేకలకు సంబంధించిన సమాధానబలి గురించి వివరించడం మనం చూస్తాం. మొదటి అధ్యాయం ప్రకారం; మొదటిగా ఆయన గోవులకు సంబంధించిన బలిగురించి తెలియచేసాడు, కాబట్టి ఇప్పటివరకూ మనం చూసింది ఆ గోవులకు సంబంధించిన బలులగురించే. కానీ ఆ గోవులను తీసుకురాలేని పేదవారికి ఈ గొఱ్ఱె మేకలు నిర్ణయించబడ్డాయి, ఈ వచనం నుండి వాటి గురించే చూస్తాం. ఇవి కూడా తీసుకురాలేనివారికి పక్షులు కూడా నిర్ణయించబడ్డాయి. అయితే ఈ సమాధాన బలిలో అటు దేవునికీ ఇటు వ్యక్తికీ యాజకుడికి కూడా భాగం ఉంటుంది, పక్షిమాంసం అందుకు సరిపోదు కాబట్టి పక్షులు అనుమతించబడలేదు. అందువల్ల ఈ సమాధాన బలిలో గోవులనూ లేదా గొఱ్ఱె మేకలను మాత్రమే వినియోగించాలి.
లేవీయకాండము 3:7-10
అతడర్పించు అర్పణము గొఱ్ఱెపిల్లయైన యెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొని రావలెను. తాను అర్పించు దాని తలమీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఆ సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వును ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీది డొక్కల పైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథుల మీది కాలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను.
ఈ వచనాల్లో దేవుడు సమాధానబలిలో గొఱ్ఱెపిల్లను ఏవిధంగా అర్పించాలో తెలియచెయ్యడం మనం చూస్తాం. దీనివిషయంలో కూడా గోవుల విషయంలో చేసినట్టే చేసి, లోపటి క్రొవ్వునూ మూత్రపిండాలనూ ఆయనకు దహనబలిగా అర్పించాలి. బోర మరియు తొడ యాజకుడికి చెందుతుంది, మిగిలిన మాంసం అంతా పశువును తీసుకువచ్చిన వ్యక్తికి ఇవ్వబడుతుంది. అయితే ఈ గొఱ్ఱె విషయంలో అదనంగా "ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని" కూడా ఆయనకు అర్పించాలని చదువుతున్నాం. ఎందుకంటే ఈ గొఱ్ఱెలకు తోక కూడా క్రొవ్వుపట్టి బలంగా ఉంటుంది అంట. అందుకే ఆయన దానిని కూడా తనకు అర్పించమంటున్నాడు. ఒకవిధంగా ఇది ఏ విలువా లేనిదానిని కూడా తనకు అర్పణగా ఎన్నుకుంటాడని తెలియచేస్తుంది, మాంసంతో పోలిస్తే తోకకు ఏ విలువా ఉండదు కదా. ఆవిధంగా ఆలోచించినప్పుడు ఈనియమం ఆయన తన సంఘంలో ఘనహీనులైన వారిని ఘనంగా వాడుకోవడానికి సాదృష్యంగా ఉంది (1 కొరింథీ 12:12-27). అదేవిధంగా యెహోవాకు హోమము, ఇంపైన సువాసన అనే వర్ణన గురించి ఇప్పటికే నేను వివరించాను (లేవీకాండము 1 వ్యాఖ్యానం చూడండి)).
లేవీయకాండము 3:11
యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము.
ఈ వచనంలో యాజకుడు బలిపీఠంపై చేసే దహనబలి "యెహోవాకు హోమరూపమైన ఆహారము" అని ప్రస్తావించబడడం మనం చూస్తాం, ఇవే మాటలు మనకు మరికొన్ని సందర్భాల్లో కూడా కనిపిస్తాయి (లేవీకాండము 21:21, సంఖ్యాకాండము 28:2). అయితే ఈమాటలకు బలిపీఠంపై అర్పించబడే మాంసం ఆయన తింటాడని అర్థం కాదు, అది దహనబలిగా కాలిపోతుంది కదా! కాబట్టి ఈ మాటలు ఆయనకు సంబంధించిన అర్పణలకు అలంకారంగా వాడబడ్డాయని అర్థం చేసుకోవాలి. ఈ వాక్యభాగం చూడండి;
లేవీయకాండము 21:6 వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. "ఏలయనగా వారు తమ దేవునికి అహారమును, అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు" కావున వారు పరిశుద్ధులై యుండవలెను.
ఇక్కడ ఆయనకు ఆహారాన్ని అర్పించడమంటే, హోమద్రవ్యాలను అర్పించడమే అని స్పష్టంగా వివరించబడింది. ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే ఈమాటలు కూడా చూడండి;
ద్వితియోపదేశకాండము 32:38 నిజముగా తన ప్రజలకు తీర్పుచేయును. ఆయన వారి నైవేద్యముల క్రొవ్వును తిని వారి పానీ యార్పణమైన ద్రాక్షారసమును త్రాగినవారి దేవత లేమైరి?వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చునువారు మీకు శరణము కానియ్యుడి అని చెప్పును.
ఈ సందర్భంలో మోషే భవిష్యత్తులో ఇశ్రాయేలీయులు చేసే విగ్రహారాధనను బట్టి దేవుడు ఎలా తీర్పుతీరుస్తాడు అనేదానిని ప్రవచిస్తూ "వారి నైవేద్యముల క్రొవ్వును తిని వారి పానీ యార్పణమైన ద్రాక్షారసమును త్రాగినవారి దేవతలేమైరి?" అని అంటున్నాడు. విగ్రహాలు ఏమీ తినవు త్రాగవు అనే విషయం మనకు తెలుసు. కానీ మోషే ఇక్కడ ఇశ్రాయేలీయులు వాటికి బలులు పానీయాలు అర్పించడం గురించి అలంకారంగా ఇలా మాట్లాడుతున్నాడు. కాబట్టి "బలిపీఠంపై అర్పించబడే పశుమాంసం యెహోవాకు ఆహారం" అన్నప్పుడు ఆయన ఆ మాంసం తింటాడని కాదు కానీ, అది ఆయనకు చెందిన అర్పణ అనే భావంలోనే వాడబడిందని మరోసారి స్పష్టం చేస్తున్నాను. మనం కూడా ఆయనకు అర్పణగా పోల్చబడ్డాము (రోమా 15:15). ఎందుకంటే మనం ఆయనకు చెందినవారం కదా!
లేవీయకాండము 3:12-15
అతడు అర్పించునది మేక యైనయెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొని రావలెను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీది డొక్కలపైనున్న క్రొవ్వును రెండు మూత్ర గ్రంథులపైనున్న కాలేజము యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను.
ఈ వచనాల్లో దేవుడు సమాధాన బలిలో మేకలకు సంబంధించిన విధిని తెలియచెయ్యడం మనం చూస్తాం. ఇది కూడా గొర్రెను అర్పించిన విధంగానే అర్పించాలి. గొర్రె విషయంలో ఒక్క తోక మాత్రమే అదనంగా ఆయనకు అర్పించబడుతుంది. ఈ మేక విషయంలో మాత్రం అలా జరగదు.
లేవీయకాండము 3:16,17
యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే; అది సువాసనగల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోను నిత్యమైన కట్టడ.
ఈ వచనాల్లో దేవుడు క్రొవ్వు మొత్తాన్నీ ఆయనకే అర్పించాలని, క్రొవ్వును కానీ రక్తాన్ని కానీ తినకూడదని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. క్రొవ్వును తినకూడదు అన్నప్పుడు బలిలో అర్పించబడే క్రొవ్వును మాత్రమే కాదు కానీ ఇంటివద్ద మాంసం కోసం వధించే పశువు క్రొవ్వును కూడా తినకూడదు, అందుకే ఈ మాటలు "మీ నివాస స్థలములన్నిటిలోను" అని చెప్పబడుతున్నాయి. బలిలో ఐతే అది బలిపీఠంపై అర్పించాలి, ఇంటివద్ద ఐతే తినకుండా పారవెయ్యాలి, లేదా ఇతర పనులకు వినియోగించాలి (లేవీకాండము 7:23-25). ఎందుకంటే ఈ క్రొవ్వును తినకూడదనే నియమం బలిలో యెహోవాకు చెందింది (లేవీకాండము 7:25) అని మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యరీత్యా కూడా నియమించబడింది. క్రొవ్వును తినడం వల్ల శరీరంలో చెడు కొలస్ట్రాల్ పెరిగి చాలా హానికరమైన పరిస్థితికి తీసుకువస్తుంది. అందుకే దానిని తినకూడదని ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే క్రొవ్వును తినకూడదు అన్నప్పుడు క్రొవ్విన మాంసం కానీ క్రొవ్వు మెదడు కానీ తినకూడదని అర్థం కాదు, భక్తులు వాటిని భుజించినట్టుగా మనం చదువుతాం (కీర్తనలు 65:3, నెహెమ్యా 8:10). ఎందుకంటే క్రొవ్విన మెదడు, మాంసం వేరు, క్రొవ్వు వేరు. క్రొవ్విన మాంసం, మెదడుల నుండి క్రొవ్వును వేరు చెయ్యలేం, పైగా అది చాలా రుచికరమైన ఆహారం. కానీ జంతువు శరీరంలో ప్రత్యేకంగా ఉండే క్రొవ్వు వేరు, ప్రజలు దానిని మాత్రం తినకూడదు.
అలానే ఆయన రక్తాన్ని కూడా తినకూడదు అని ఆజ్ఞాపించాడు ఈమాటలు ఆదికాండము 9:4 మొదలుకొని మోషే ధర్మశాస్త్రంలో చాలాసార్లు మనకు కనిపిస్తాయి. నూతననిబంధనలో కూడా ఇది ఆజ్ఞాపించబడింది (అపొ.కా 15:20,28). ఎందుకంటే బలిలో ఈ రక్తం పాపానికి ప్రాయుశ్చిత్తంగా చిందించబడుతుందని మాత్రమే కాదు, అలాగైతే ఈ జంతుబలులన్నీ క్రీస్తుబలిలో నెరవేరిపోయాక కూడా నూతననిబంధనలో మళ్ళీ ఆ నియమం చెప్పబడేది కాదు. కానీ రక్తాన్ని తినకూడదనే ఈ ఆజ్ఞ క్రొవ్వు తరహాలోనే ప్రజల ఆరోగ్యరీత్యా కూడా చెప్పబడింది. సాధారణంగా రక్తాన్ని "fluid of life" అంటారు. శాస్త్రీయంగా కోణంలో దీనిని పరిశీలించినప్పుడు, ఏదైన ఒక జీవికి రోగం సంక్రమించినప్పుడు ఆ ప్రభావం రక్తంలో ఎక్కువగా ఉంటుంది. (మనిషికి కూడా, అందుకే రక్తపరీక్షలు చేస్తారు) ఈ కారణం చేత ఏదైనా రోగంబారిన పడిన జీవియొక్క రక్తాన్ని ఎవరైనా తింటే ఆ రోగం వారికి సంక్రమించే ప్రమాదం ఉంది. ఇందువల్ల, మనిషి యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, దేవుడు రక్తాన్ని తినకూడదని ఆజ్ఞాపించాడు (ఆదికాండము 9:4 వ్యాఖ్యానం చూడండి)).
ఈవిధంగా ధర్మశాస్త్రంలో దేవుడు నియమించిన ఆజ్ఞలు ఆత్మీయకోణంలోనే కాకుండా ప్రజలకు శరీరరీత్యా మేలుచేసేవిగా కూడా ఉంటాయి. ఉదాహరణకు సున్నతి (ఆదికాండము 17:10-13 వ్యాఖ్యానం చూడండి)).
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
లేవీయకాండము అధ్యాయం 3

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"