లేవీయకాండము 9:1
ఎనిమిదవదినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి-
గత అధ్యాయంలో దేవుడు అహరోనునూ అతని కుమారులనూ ఏడు దినాల పాటు యాజకులుగా ప్రతిష్టించమని ఆజ్ఞాపించడం మనం చూసాం (లేవీకాండము 8:33). ఆ ఏడుదినాల తర్వాత అనగా ఎనిమిదవ దినాన వారు ఏం చెయ్యాలో ఈ అధ్యాయంలో ఆజ్ఞాపిస్తున్నాడు. లేఖనంలో ఈ ఎనిమిదవ దినానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎనిమిదవ దినానే బిడ్డకు సున్నతి చేయించాలి (లేవీకాండము 12:3) యెహోవాకు ప్రతిష్టించిన పశువులను ఎనిమిదవ దినానే ఆయనకు అర్పించాలి (నిర్గమకాండము 22:30) కుష్టునుండి స్వస్థపడిన వ్యక్తి కూడా ఈ ఎనిమిదవ దినానే తన బలులను అర్పించాలి (లేవీకాండము 14:23).
ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. అహరోను మరియు అతని కుమారులు ఇప్పటికే ఏడు దినాల పాటు ప్రత్యక్షగుడారంలో నివశించారు. ఆ వెంటనే ఇప్పుడు ప్రాముఖ్యమైన పని చెయ్యడానికి ఆజ్ఞాపించబడుతున్నారు. వారికి మధ్యలో ఒకరోజు కూడా విశ్రాంతి కేటాయించబడలేదు. దేవుని పరిచర్య విషయంలో సమయాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకోవాలో ఈ కట్టడ మనకు నేర్పిస్తుంది. ఆయన పరిచర్యకు విశ్రాంతి అంటూ ఏమీ ఉండదు. పరలోకం చేరుకునేవరకూ ప్రయాసపడవలసిందే. అందుకే పౌలు తన ప్రియకుమారుడైన తిమోతీకి "దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము" (2 తిమోతికి 4:1,2) అని ఆజ్ఞాపిస్తున్నాడు.
లేవీయకాండము 9:2-4
అహరోనుతో ఇట్లనెను - నీవు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను, దహనబలిగా నిర్దోషమైన యొక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసికొని రమ్ము. మరియు నీవు ఇశ్రాయేలీయులతో మీరు యెహోవా సన్నిధిని బలి నర్పించునట్లు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన మేక పిల్లను, దహనబలిగా నిర్దోషమైన యేడాది దూడను గొఱ్ఱెపిల్లను సమాధానబలిగా కోడెను పొట్టేలును నూనె కలిపిన నైవేద్యమును తీసికొని రండి; నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము.
ఈ వచనాలలో మోషే ఇశ్రాయేలీయుల పెద్దలముందు అహరోను మరియు ప్రజలు అర్పించవలసిన బలుల గురించి అతనికి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇక్కడ మొదట యాజకుడు తన నిమిత్తం బలి అర్పించాలి. తర్వాత ప్రజల పక్షంగా అర్పించాలి. ఎందుకంటే యాజకులు కూడా అందరిలాంటి మనుషులూ పాపులే కాబట్టి మొదట వారి పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగి దేవుని చేత అంగీకరించబడాలి (హెబ్రీ 5:1,2, 7;28). అప్పుడు మాత్రమే వారు ప్రజలపక్షంగా దేవుని సన్నిధిలో మధ్యవర్తిత్వం వహించగలరు. వారి పాపాలకే ప్రాయశ్చిత్తం జరగక దేవునిచేత అంగీకరించబడకుంటే ప్రజలపక్షంగా విజ్ఞాపన చెయ్యడం లేక వారి పాపాలకు పరిహారం చెయ్యడం సాధ్యం కాదు.
ఈ నియమం సంఘప్రతినిధులు ఎలాంటి మాదిరిని కనపరచాలో మనకు తెలియచేస్తుంది. అందుకే పౌలు సంఘకాపరియైన తిమోతీకి "నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు" (1తిమోతికి 4:16), "దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము" (2 తిమోతికి 2:15) అని ఆజ్ఞాపిస్తున్నాడు. అదేవిధంగా సాధారణ విశ్వాసులకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. వారే దేవునితో సమాధానపడకుండా ఉండి అనగా పాప రహిత జీవితం లేకుండి, సాధారణ ప్రజలను దేవునితో సమాధానపరిచే సువార్త పక్షంగా పని చెయ్యడం అసాధ్యం. అందుకే మొదట మనలో సువార్త ఫలాలు కనిపించాలి. అప్పుడే ఇతరులను అందులోకి నడిపించగలం. మనలోనే మార్పు తీసుకురాని సువార్త వారిని మాత్రం మారుస్తుందని ఎవరూ ఆలోచించరు కదా!
ఇక ఇక్కడ చెప్పబడిన పాపపరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలుల గురించి ఇప్పటికే నేను వివరించాను. లేవీకాండము 1 నుండి 4 వ్యాఖ్యానాలు చదవండి.
లేవీయకాండము 9:5,6
మోషే ఆజ్ఞాపించినవాటిని వారు ప్రత్యక్షపు గుడారము నెదుటికి తీసికొనివచ్చిరి. సమాజ మంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా మోషే - మీరు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే; అట్లు చేయుడి. అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననెను.
వీటికి పై వచనాల ముగింపులో "నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము" అని రాయబడి ఈ వచనాలలో "అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడును" అని రాయబడడం మనం చూస్తున్నాం. అది ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం. కానీ వారు ఆయన వాగ్దానమైన ఆయన మహిమను చూడాలంటే ఆయన అజ్ఞాపించినట్టుగా బలులు అర్పించాలి. దేవుని వాగ్దానానికై పిలువబడిన ప్రతీ ఒక్కరూ దానిని అనుభవించాలంటే ఆయన చెప్పిన విధిని అనుసరించాలని ఈ నియమం మనకు బోధిస్తుంది. అబ్రాహాము ఇస్సాకు యాకోబుల నుండి మనం ఇదే చూస్తున్నాం. ఉదాహరణకు ఆయన అబ్రాహాముకు సంతానం గురించి కనాను దేశం గురించి వాగ్దానం చేసాడు, వెంటనే "నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము" (ఆదికాండము 17:1) అనగా నా నియమాల ప్రకారం నడుచుకో అనే మాటలు చదువుతున్నాం. కాబట్టి నిత్యజీవమనే వాగ్దానానికి పిలువబడిన మనందరం ఆయన నియమాల ప్రకారం జీవించడం తప్పనిసరి అని మర్చిపోకూడదు అందుకే "ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడైయున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును" (1యోహాను 3:3) అని రాయబడింది.
లేవీయకాండము 9:7-17
మరియు మోషే అహరోనుతో ఇట్లనెను నీవు బలిపీఠమునొద్దకు వెళ్లి పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పించి నీ నిమిత్త మును ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి ప్రజల కొరకు అర్పణము చేసి, యెహోవా ఆజ్ఞాపించి నట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్లి తనకొరకు పాపపరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ముల మీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను.
దాని క్రొవ్వును మూత్రగ్రంథులను కాలేజము మీది వపను బలిపీఠము మీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. దాని మాంసమును చర్మమును పాళెము వెలుపల అగ్నితో కాల్చివేసెను. అప్పుడతడు దహన బలిపశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తము నప్పగింపగా అతడు బలిపీఠముచుట్టు దానిని ప్రోక్షించెను. మరియు వారు దహన బలిపశువు యొక్క తలను అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము మీద వాటిని దహించెను. అతడు దాని ఆంత్రములను కాళ్లను కడిగి బలిపీఠము మీద నున్న దహనబలి ద్రవ్యముపైని దహించెను. అతడు ప్రజల అర్పణమును తీసికొని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థబలియగు మేకను తీసికొని వధించి మొదటి దానివలె దీనిని పాప పరిహారార్థబలిగా అర్పించెను. అప్పుడతడు దహనబలి పశువును తీసికొని విధి చొప్పున దాని నర్పించెను. అప్పుడతడు నైవేద్యమును తెచ్చి దానిలో నుండి చేరెడు తీసి ప్రాతఃకాలమందు చేసిన దహనబలిగాక బలిపీఠము మీద తీసిన దానిని దహించెను.
ఈ వచనాలలో దేవునిమాట ప్రకారం మోషే ఆజ్ఞాపించినట్టుగా అహరోను బలులు మరియు నైవేద్యాన్ని అర్పించడం మనం చూస్తాం. ఇక్కడ అతను మొదట తమకోసం తర్వాత ప్రజలకోసం కూడా ఈ బలులను అర్పించడం జరిగింది. ప్రారంభంలో నేను వివరించినట్టు ఈ యాజకులు కూడా ప్రజలలాంటి పాపులే కాబట్టి మొదట వారికోసం కూడా బలులు అర్పించి దేవునితో సమాధాన పడవలసి వచ్చింది (హెబ్రీ 5:1-3). కానీ మన ప్రధానయాజకుడైన క్రీస్తుకు ఇలాంటి పరిస్థితిలేదు. పరిహారం చెయ్యబడేలా ఆయన ఏ పాపమూ లేని పరిశుద్ధుడు. కాబట్టి ఇశ్రాయేలీయుల ప్రజలు వారి యాజకులకు లోబడినదానికంటే మరి యెక్కువగా ఈయనకు మనం లోబడబద్ధులమైయున్నామని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వాక్యభాగం శ్రద్ధగా పరిశీలించండి.
హెబ్రీయులకు 10:28,29
ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?.
మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అహరోను తన కుమారుల సహాయంతో పని చేస్తున్నప్పటికీ ప్రాముఖ్యమైన లేక కష్టతరమైన పనినంతా అతనే చేస్తున్నాడు. ఎందుకంటే ప్రధానయాజకుడిగా అది అతని బాధ్యత. కాబట్టి దేవునిపనిలో ఉన్నతంగా నియమించబడినవారు ఎక్కువ బాధ్యతను లేక కష్టాన్ని కలిగియుండాలని ఈ నియమం మనకు నేర్పిస్తుంది. ఇది భవిష్యత్తు సేవకులకు మంచి మాదిరిగా కూడా ఉంటుంది. అలాగే ఇప్పటివరకూ దేవునికి బలులు అర్పించడం అనేది ఏ సందర్భంలో జరిగినా అది మోషేనే చేస్తూ లేక చేయిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఆ బాధ్యత అహరోనుకు అప్పగించబడింది కాబట్టి అతనే ఆ పని చెయ్యాలి (ప్రతిష్టతలో భాగమైన క్రిందివచనాలు మినహా). మోషే ధర్మశాస్త్రంలో ఇది ప్రాముఖ్యమైన నియమం. యాజకులు కాని వ్యక్తులు బలులు అర్పించకూడదు. సౌలు ఈ నియమాన్ని మీరినందువల్లే రాజుగా ఉండకుండా విసర్జించబడ్డాడు. ఎందుకంటే అది క్రీస్తు మధ్యవర్తిత్వానికి ఛాయగా నియమించబడింది, ఎవరూ తమ పాపాలకు తామే ప్రాయశ్చిత్తం చేసుకోలేరు వారికి పాపం లేని మధ్యవర్తి అవసరమని అది నేర్పిస్తుంది. యాజకుడు మొదట తనకోసం బలి అర్పించుకుంటాడు కాబట్టి ఛాయగా అతను దానికి తగినవాడే. ఈవిధంగా మోషే ధర్మశాస్త్రం ప్రజలను మొదటినుండీ క్రీస్తువైపుకు నడిపించే బాలశిక్షకుడిగా నియమించబడింది.
ఇక ఈ వచనాలలో చెప్పబడిన బలి క్రమమంతటినీ లేవీకాండము 1 అధ్యాయం నుండి వివరించుకుంటూ వచ్చాను. ప్రాముఖ్యంగా యాజకులు అర్పించవలసిన బలి, నైవేద్యం గురించి నిర్గమకాండము 29లో వివరించబడింది. అక్కడ చెప్పబడిందే ఇక్కడ వీరు చేసారు.
లేవీయకాండము 9:18-22
మరియు మోషే ప్రజలు అర్పించు సమాధానబలి రూపమైన కోడెదూడను పొట్టే లును వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టు దానిని ప్రోక్షించెను. మరియు వారు ఆ దూడ క్రొవ్వును మేకక్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును మూత్ర గ్రంథులను కాలేజము మీది వపను అప్పగించిరి. బోరల మీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠము మీద ఆ క్రొవ్వును దహించెను. బోరలను కుడి జబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అహరోను పాపపరిహారార్థబలిని దహనబలిని సమాధానబలిని అర్పించి, ప్రజలవైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను.
ఈ వచనాలలో మోషే కూడా అహరోనుతో కలసి ప్రజలపక్షంగా బలిని అర్పించడం మనం చూస్తాం. ఇది యాజకప్రతిష్టత రోజుకు సంబంధించి "అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన" నియమం కాబట్టి అతను కూడా బలి అర్పించాడు. ఈ సందర్భం మినహా మిగిలినరోజుల్లో అహరోను సంతానం మాత్రమే అక్కడ బలులు అర్పించాలి. ఇక మోషే కానీ అతని సంతానం కానీ ఆ పని చెయ్యకూడదు. గమనించండి; నాయకుడిగా ఇంతకాలం ఆ ప్రజలను ఎంతోకష్టపడి నడిపించిన మోషే ఈ బాధ్యత అహరోనుకు అప్పగించబడడం విషయంలో ఎలాంటి అసంతృప్తికీ లోనవ్వడం లేదు. అందుకే అహరోనుతో కలసి అతను కూడా ప్రజలను దీవిస్తున్నాడు. ఎందుకంటే అతను దేవుని ఎన్నికను బట్టి ఆనందించే భక్తుడు. అలానే ఇంతకాలం అహరోను కూడా అతనితో కష్టపడ్డాడు. కాబట్టి సంఘనాయకులు పరిచర్య విషయంలో ఇలాంటి మనస్తత్వం కలిగియుండాలి. దేవుని పరిచర్యలో అసూయకు చోటు లేదు. ఎవరిని ఏ బాధ్యతలో నియమించాలో కేవలం దేవుని నిర్ణయం.
సంఘసేవకుల విషయంలోనే కాదు ప్రతీవిశ్వాసికీ ఈ నియమం వర్తిస్తుంది. సంఘంలో కావొచ్చు సామాజికంగా కావొచ్చు మనకంటే గొప్పబాధ్యతలో నియమించబడుతున్నవారిని చూసి మనం అసూయచెందకూడదు. లేదంటే ఆ అసూయ మనం ఆత్మసంబంధులం కాకుండా శరీరసంబంధులుగానే ఉన్నామని దేవుని యెదుట మనపై ఆరోపణ చేస్తుంది (1 కొరింథీ 3:3). ఈ అసూయ అనేది కేవలం మనం హెచ్చువాటియందు మనసు పెట్టుకోవడాన్ని బట్టే మనలో చెలరేగుతుంది. అందుకే "హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు" (రోమా 12:16) అని రాయబడింది. ఎవర్ని ఎప్పుడు హెచ్చించాలో దేవునికి తెలుసు. అప్పటివరకూ మన మనసు ఇలానే ఉండాలి. అప్పగించబడుతున్న బాధ్యతలు ఉన్నతమైనవైనా దిగువస్థాయివైనా బాధ్యతతో కొనసాగాలి.
ఇక మోషే అహరోనులు ప్రజలను ఏమని దీవించారో వేరే సందర్భంలో వివరించబడింది:
సంఖ్యాకాండము 6:23-27
మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక; యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక; యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయులమీద నా నామ మును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను.
లేవీయకాండము 9:23
మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికివచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను.
ఈ వచనంలో మోషే అహరోనులు ప్రత్యక్షగుడారం నుండి బయటకు వచ్చి ప్రజలను దీవించినప్పుడు యెహోవా మహిమ ఆ ప్రజలందరికీ కనిపించడం మనం చూస్తాం. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను చర్చించుకుందాం.
1. అహరోను ఇకపై ఏవిధంగా నడుచుకోవాలో అలానే ప్రత్యక్షగుడారంలో మందసం ఎక్కడ ఉండాలి, ధూపవేధిక ఎక్కడ ఉండాలి, బల్ల ఎక్కడ ఉండాలి ఇలా. ఈ వివరాలన్నీ దేవుడు మోషేకే ఆజ్ఞాపించాడు (నిర్గమకాండము 40) కాబట్టి అవన్నీ నేర్పించడానికి మోషే కూడా ప్రత్యక్షగుడారంలో ప్రవేశించాడు. ఈ ప్రారంభ సందర్భం మినహా యాజకులు తప్ప ఇతరులు ఎవ్వరూ ప్రత్యక్షగుడారంలోకి ప్రవేశించకూడదు.
2. "యెహోవా మీకు కనబడును" అనే ఆయన వాగ్దానం ఇక్కడ నెరవేరినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే అహరోను మరియు ప్రజలు ఆ వాగ్దానానికి తగినట్టు చెయ్యాల్సిందంతా చేసారు. అందుకే ఆ వాగ్దాన నెరవేర్పును వారు అనుభవిస్తున్నారు. "ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు?" (ద్వితియోపదేశకాండము 4:7) అనే మాటలకు కూడా ఇది మంచి నిర్ధారణ. కాబట్టి ఆయన మనకు సమీపంగా ఉండాలంటే మనం ఆయన విధులకు సమీపంగా ఉండాలి.
3. సీనాయి పర్వతం దగ్గరనుండి ప్రజలు ఎప్పుడు చూసినా ఆయన మహిమను చూసారే తప్ప ఆయన రూపాన్ని కాదు. అందుకే ఆయనకు ఏ రూపం ఆపాదించకూడదని పదేపదే ఆజ్ఞాపించబడింది (ద్వితీయోపదేశకాండము 4:12-16).
లేవీయకాండము 9:24
యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్లి బలిపీఠము మీద నున్న దహనబలిద్రవ్యమును క్రొవ్వును కాల్చి వేసెను; ప్రజలందరు దానిని చూచి ఉత్సాహధ్వనిచేసి సాగిలపడిరి.
ఈ వచనంలో యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్లి బలిపీఠము మీద నున్న దహనబలిద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసినట్టు మనం చూస్తాం. ఈ సూచన అక్కడ జరుగుతుందంతా ఆయన ఆజ్ఞప్రకారమే జరుగుతుందనే ఆయన ఆమోదాన్ని తెలియచేస్తుంది. ఈవిధంగా అగ్ని దిగివచ్చి బలిద్రవ్యాలను దహించడం అనేక సందర్భాలలో మనం చదువుతున్నాం. ఏలియా (1 రాజులు 18:38), గిద్యోను (న్యాయాధిపతులు 6:21), దావీదు (1 దినవృత్తాంతములు 21:26), సొలోమోను (2 దినవృత్తాంతములు 7:1) ఇలా. ఆ సందర్భాలలో ఆయన ఆమోదాన్ని తెలియచేయడానికే అలా జరిగింది. అలానే హేబెలు బలిని దేవుడు అంగీకరించాడని కూడా ఈవిధంగానే తెలిసిందని బైబిల్ పండితులు విశ్వసిస్తున్నారు. నేను కూడా అదే సత్యమని భావిస్తున్నాను. గమనించండి; దేవుని ఆజ్ఞప్రకారం జరుగుతున్న ఈ అర్పణలు ఆయన అంగీకరించాడనడానికి ఆయన అగ్ని ఏవిధంగా రుజువుగా మారిందో అలానే దేవుని ఎన్నికలో ఉన్న మనిషిలో ఆయన క్రియలు రుజువుగా ఉంటాయి. అవి లేనివారు తమ విశ్వాసాన్ని తప్పక పరీక్షించుకోవాలి.
రోమీయులకు 6:22
అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.
అయితే ఈ అధ్యాయంలో అహరోను కూడా బలిపీఠంపై బలి అర్పణలను దహించినట్టు రాయబడింది. అలాంటప్పుడు మరలా దేవుడు వాటిని దహించడం ఏంటనే సందేహం కొందరికి కలగొచ్చు. కానీ ఆరోజు అర్పించబడింది ఒకే బలి కాదని మనం గుర్తుంచుకోవాలి. ఆవిధంగా ప్రారంభంలో కొన్నిటిని అహరోను దహించాడు, మిగిలిన బలిద్రవ్యాలను దేవుడు దహించాడు. ఆయన ఆ ప్రతిష్టతను అంగీకరించాడనడానికి రుజువుగా ఒక్క బలి అర్పణను దహించినా సరిపోతుంది. అక్కడ దాని ఉద్దేశం అదే.
"ప్రజలందరు దానిని చూచి ఉత్సాహధ్వనిచేసి సాగిలపడిరి"
దేవుని మహిమను ఆయన అంగీకారానికి సూచనైన అగ్నినీ చూసిన ప్రజలు ఉత్సాహధ్వని చేస్తూ సాగిలపడ్డారు. మనం చూడబోయే నిత్యమహిమకు ఛాయగా కనిపించిన వాటిని చూసే వారు అంతగా ఉత్సాహధ్వని చేసి సాగిలపడితే పరలోకంలో ఆయన మహిమయొక్క నిజస్వరూపాన్ని చూడబోతున్న మనం (1 యోహాను 3:2) మరెంతగా ఆనందిస్తామో ఆయనను స్తుతిస్తామో ఆలోచించండి. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేలా ఆయన పిల్లలంతా పరిశుద్ధులుగా ఉండితీరాలి.
1యోహాను 3:3
ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడైయున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును.
హెబ్రీయులకు 12:14
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
లేవీయకాండము అధ్యాయం 9

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"