లేవీయకాండము 12:1,2 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఒక స్త్రీ గర్భవతియై మగపిల్లను కనినయెడల ఆమెయేడు దినములు పురిటాలై యుండవలెను. ఆమె తాను ముట్టుదై కడగానుండు దినముల లెక్కను బట్టి పురిటాలై యుండవలెను.
ఈ వచనాల్లో దేవుడు గర్భవతియై కుమారుణ్ణి కన్నటువంటి స్త్రీ పాటించవలసిన నియమాల గురించి ఆజ్ఞాపించడం మనం చదువుతాం. ఆమె రుతుస్రావం సమయంలో ఎలాగైతే ఏడుదినాలపాటు ప్రత్యేకంగా ఉంటుందో అలానే ఈ సమయంలో కూడా ఉండాలి. గమనించండి; నేను గత అధ్యాయంలో వివరించినట్టుగా ఇవి ఆచారసంబంధమైన (Sermonial) ఆజ్ఞలు. ఇవి మన ఆధ్యాత్మిక అపవిత్రతకు ఛాయగా నియమించబడ్డాయి (హెబ్రీ 10:1). కాబట్టి ప్రస్తుత విశ్వాసులు వీటిని పాటించవలసిన అవసరం లేదు. ఈ అంశం గురించి నేను మరింత వివరంగా రాసినటువంటి వ్యాసాన్ని క్రింది వచనాలలో సూచిస్తాను.
లేవీయకాండము 12:3 ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను.
ఈ వచనంలో దేవుడు పుట్టినటువంటి ఆ మగపిల్లాడికి ఎనిమిదవ దినాన సున్నతి చెయ్యించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఆ స్త్రీ ఏడుదినాల పాటు ప్రత్యేకంగా ఉండాలి కాబట్టే సున్నతి అనే ఆచారాన్ని దేవుడు అబ్రాహాము సమయం నుండీ ఎనిమిదవ దినాన నియమించాడని బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆరోజునే సున్నతి నియమించడంలో ఉన్న శాస్త్రీయమైన కారణాలను, అలాగే అసలు సున్నతి యొక్క ఉద్దేశాన్ని నేను ఇప్పటికే వివరించాను (ఆదికాండము 17 వ్యాఖ్యానం చూడండి).
లేవీయకాండము 12:4 ఆమె తన రక్తశుద్ధి కొరకు ముప్పది మూడు దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు.
ఈ వచనంలో దేవుడు ఆజ్ఞాపిస్తున్నదాని ప్రకారం ఆ స్త్రీ మొదటి ఏడు దినాలూ ప్రత్యేకంగా ఉండడమే కాదు. మరో 33 మూడు రోజులపాటు పరిశుద్ధమైనదానిని అనగా ఆలయసంబంధమైన అర్పణలను తినడం కానీ ముట్టుకోవడం కానీ చెయ్యకూడదు. ఆమె ఆలయంలో ప్రవేశింపకూడదు. మొదటి వచనాల్లో వివరించినట్టుగా ఈ ఆజ్ఞలు వారి శరీరసంబంధమైనవై మన ఆధ్యాత్మిక అపవిత్రతకు ఛాయగా ఉన్నాయి. అందువల్ల ఈ కట్టడలను బట్టి బిడ్డను కన్న ప్రస్తుత విశ్వాసురాళ్ళను సంఘసహవాసంలో నిషేధించడం వంటివి చెయ్యకూడదు. ఎలాగైతే ఇశ్రాయేలీయుల ఆ ఆలయం ప్రస్తుతం మనకు ఉపమానంగా ఉండిందో అలాగే ఆ అపవిత్రతలు అన్నీ మన ఆధ్యాత్మిక అపవిత్రతలకు ఛాయగా ఉండి అనగా అపవిత్రులమైన మనం ఆయన సన్నిధిలో ప్రవేశించలేమని జ్ఞాపకం చేస్తున్నాయి.
హెబ్రీయులకు 9:9,10 ఆ గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమానముగా ఉన్నది. ఇవి దిద్దు బాటు జరుగుకాలము వచ్చువరకు విధింపబడి, అన్న పానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను (మూలభాషలో- బాప్తిస్మములతోను) సంబంధించిన శరీరాచారములు మాత్రమైయున్నవి.
లేవీయకాండము 12:5 ఆమె ఆడుపిల్లను కనినయెడల ఆమె తాను కడగా ఉండునప్పటివలె రెండు వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు అరువదియారు దినములు కడగా ఉండవలెను.
ఈ వచనంలో దేవుడు ఒకవేళ ఆ స్త్రీ ఆడపిల్లను కంటే మగపిల్లాడి కంటే ఎక్కువ దినాలు అనగా రెండు వారాలు+66 దినాలు ప్రత్యేకంగా ఉండాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దీనికారణంగా కొందరు బైబిల్ విమర్శకులు యెహోవా దేవుడేదో స్త్రీలపై వివక్ష చూపించినట్టుగా ఆరోపిస్తుంటారు. అలాగైతే ఆయన మగపిల్లాడికి నియమించినట్టుగా ఇక్కడ ఆడపిల్లకు 8వ దినాన సున్నతి నియమించలేదు (కొన్ని సంస్కృతుల్లో స్త్రీలకు కూడా సున్నతి ఉంటుంది). దీనికారణంగా ఆయన ఆడపిల్లల పట్ల పక్షపాతం చూపించాడని అనుకోవచ్చా? దేవునిలో వివక్షేకాదు పక్షపాతం కూడా ఉండకూడదు. బైబిల్ దేవుడు అవి రెండూ లేనివాడు (రోమా 2:11, 1 పేతురు 1:17, ఎఫెసీ 6:9). అందుకే ఆయన పిల్లల్లో కూడా అవి ఉండకూడదని ఖండితంగా ఆజ్ఞాపించాడు (లేవీకాండము 24:22, ద్వితీయోపదేశకాండము 16:19, యోబు 13:10, సామెతలు 24:23, 28:21, 1 తిమోతీ 5:21, యాకోబు 2:9). అలాంటప్పుడు ఆడపిల్ల విషయంలో రెట్టింపు దినాలు ఎందుకంటే;
గమనించండి: ఈ అధ్యాయంలోనూ తదుపరి అధ్యాయాల్లోనూ స్రావాన్ని అపవిత్రంగా (శరీరసంబంధమైన) ఎంచడం మనం చూస్తున్నాం. దానికి గల కారణాలు కూడా నేను వివరించాను. ఈ కోణంలో మనం పరిశీలించినప్పుడు మగపిల్లాడిని కన్నప్పుడు స్త్రీకి మాత్రమే రక్తస్రావం జరుగుతుంది. కానీ ఆడపిల్లను కన్నప్పుడు ఆ తల్లితో పాటు ఆ పాపకు కూడా కొన్ని రోజులపాటు పసుపురంగులో స్రావం ఔతుంది. దీనినే "New vagina Bleeding" అంటారు. ఆ ఇద్దరికీ కలిగే స్రావాన్ని బట్టే ఆయన ఆడపిల్ల విషయంలో రెట్టింపు దినాలను ఆజ్ఞాపించాడు. ఈ అంశంతో పాటు ధర్మశాస్త్రంలో రుతుస్రావం అపవిత్రమని ఎందుకు చెప్పబడింది? స్త్రీ సంఘంలో మౌనంగా ఎందుకు ఉండాలి ఈ ఆరోపణలన్నిటికీ నేను మరింత వివరంగా అన్ని కోణాలనుండీ సమాధానం రాసాను ఈ వ్యాసం చదవండి.
బైబిల్ దేవునికి స్త్రీలపై వివక్ష వాస్తవమా లేక ఆరోపణా?
లేవీయకాండము 12:6,7 కుమారునికొరకేగాని కుమార్తెకొరకేగాని ఆమె శుద్ధిదినములు సంపూర్తియైన తరువాత ఆమె దహనబలిగా ఒక యేడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసికొనిరావలెను. అతడు యెహోవా సన్నిధిని దాని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లనుగాని ఆడు పిల్లనుగాని కనిన స్త్రీనిగూర్చిన విధి.
ఈ వచనాల్లో దేవుడు బిడ్డను కన్న స్త్రీ ప్రత్యేకంగా ఉండవలసిన దినాలు ముగిసిన తర్వాత రెండు బలులను అర్పించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దహనబలిగా గొర్రెపిల్లను అర్పించాలి. పాపపరిహారార్థ బలిగా పావురపు పిల్లను కానీ తెల్లగువ్వను కానీ అర్పించాలి. దహనబలి గర్భవతిగా ఉన్నప్పుడూ ప్రసవం సమయంలో తననూ తన బిడ్డనూ కాపాడినందుకు కృతజ్ఞతగా అర్పిస్తే తెల్లగువ్వను కానీ పావురపు పిల్లను కానీ పాపపరిహారార్థ బలిగా అర్పించాలి. అయితే ఇక్కడ బిడ్డను కనడంలో ఏ పాపముందని ఆమె పాపపరిహార్థ బలి అర్పించవలసి వచ్చింది? అనే ప్రశ్నకు మనం సమాధానం చూడాలి.
గమనించండి; భార్యభర్తలు ఫలించి అభివృద్ధి చెందాలని ఆయనే ఆజ్ఞాపించాడు. గర్భఫలం దేవుడిచ్చే బహుమానమని కూడా రాయబడింది. కాబట్టి ఈ పాపపరిహారార్థ బలి బిడ్డను కనడం పాపంగా నియమించబడలేదు కానీ పైన వివరిస్తున్నట్టుగా వారి శరీరసంబంధమైన అపవిత్రతలు మన ఆధ్యాత్మిక అపవిత్రతలకు ఛాయలుగా నియమించబడి మన అపవిత్రతలకు పాపపరిహారం చెయ్యబడకుండా మనం దేవుణ్ణి సమీపించలేమని, కాబట్టి పాపానికి లోనైన ప్రతీసారీ వాటిని యధార్థంగా ఒప్పుకుంటూ క్రీస్తు రక్తంలో శుద్ధిచేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాయి. అందుకే రుతుస్రావం, పురిటాల విషయంలోనే కాదు స్రావం కలిగిన పురుషుల విషయంలో కూడా అలాంటి బలులే అర్పించాలని రాయబడింది (లేవీకాండము 15:13-15). ఆవిధంగా ఇశ్రాయేలీయుల శారీరక అపవిత్రతలూ పాపానికి సాదృష్యంగా ఉండి వాటికి బలి (క్రీస్తురక్తం) అవసరమని బోధిస్తున్నాయి. మరోవిధంగా ప్రతీ వేదనా (రుతుస్రావపు బాధ, ప్రసవవేదన) ప్రతీరోగం ఆదాము హవ్వల పాపఫలితంగానే ఈలోకంలోకి ప్రవేశించింది. అప్పటినుంచీ అవన్నీ బలి వైపే సూచిస్తున్నాయి (ఆదికాండము 3వ అధ్యాయము).
లేవీయకాండము 12:8 ఆమె గొఱ్ఱె పిల్లను తేజాలని యెడల ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను దహనబలిగా ఒకదానిని, పాపపరిహారార్థబలిగా ఒక దానిని తీసికొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును.
ఈ వచనంలో దేవుడు గొఱ్ఱెపిల్లను తేలేని పేద స్త్రీ గువ్వల్లో కానీ పావురాల్లో కానీ రెండింటిని తీసుకురావాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. "ఆయన ఆజ్ఞలు భారమైనవి కావని" (1 యోహాను 5:3) అనగా తన పిల్లల స్థాయికి మించి ఆయన కోరేవాడు కాడని ఈ కట్టడ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలీయుల్లో పక్షులను కూడా తీసుకురాలేనంత పేదవారు ఉండే అవకాశం లేదు. ఒకవేళ అలా ఉన్నా కూడా వారి విషయంలో ఆయన కొంచెం గోధుమపిండితో సరిపెట్టాడు (లేవీకాండము 14:21). మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా మరియ యోసేపులు పక్షుల నుండే బలులు అర్పించినట్టు చదువుతున్నాం (లూకా 2:24). దీనిని బట్టి ఆయన పుట్టినప్పుడు మరియ యోసేపులు ఎంత పేదవారిగా ఉన్నారో మనకు అర్థమౌతుంది. ఎందుకంటే భక్తిపరులైన ఆ దంపతులు ఇవ్వగలిగియుండుంటే దహనబలిగా గొఱ్ఱెపిల్లను తేలేకుండా ఉండేవారు కారు.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
లేవీయకాండము అధ్యాయం 12

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"