లేవీయకాండము 18:1,2
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము.
ఈ వచనాలలో దేవుడు నేను మీ దేవుడైన యెహోవానని ఇశ్రాయేలీయులకు చెప్పమని మోషేకు ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఈ మాటలు ఆయన విడిపించి, నడిపిస్తున్న ప్రజలపై ఆయన అధికారాన్ని సూచిస్తున్నాయి. ఆయనే వారి దేవుడైన యెహోవా కాబట్టి ఆయనకు వారిని ఆజ్ఞాపించే అధికారం ఉంటుంది. ఆయనే వారి దేవుడైన యెహోవా కాబట్టి వారంతా ఆయన ఆజ్ఞాపించిన/ఆజ్ఞాపించబోతున్న విధులకు లోబడాలి, వాటి ప్రకారమే జీవించాలి. వాటికి మేమెందుకు లోబడాలి అనే ప్రశ్నించడానికి ఇక అవకాశం లేదు. ఎందుకంటే వాటిని ఆజ్ఞాపిస్తుంది వారి దేవుడైన యెహోవా. ఈ మాటలు క్లుప్తంగా చెప్పాలంటే;
1. ఆయనే వారి దేవుడైన యెహోవా. దానికి ఆయన ఎన్నో రుజువులను కూడా చూపిస్తూ వచ్చాడు. ఉదాహరణకు వారిని ఇనుప కొలిమిలాంటి ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి, అరణ్యంలో పోషించి నడిపిస్తున్నాడు. శ్రేష్టమైన దేశంలోకి ప్రవేశపెట్టబోతున్నాడు.
2. అదంతా ఆయన వారి దేవుడు కాబట్టే చేసాడు, చేస్తున్నాడు. అందుకే ఆయన చేసిన, చేస్తున్న ఉపకారాలకు కృతజ్ఞతగా లేక ఆయన అధికారానికి విధేయతగా ఆయన ఆజ్ఞాపించిన విధుల ప్రకారం జీవించాలి. ఇదే నియమం విశ్వాసులమైన మన విషయంలో మరింతగా వర్తిస్తుంది. ఎందుకంటే అన్నివిధాలుగా మనం వారికంటే ఎక్కువగా ఆయన ప్రేమను రుచిచూస్తున్నాం. ఆయన ఉపకారాలనూ అనుభవిస్తున్నాం. ఉదాహరణకు మన రక్షణ విషయంలోనూ ఇహపరమైనవే కాకుండా పరసంబంధమైన ఆశీర్వాదాల విషయంలోనూ.
లేవీయకాండము 18:3
మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; వారి కట్టడలను బట్టి నడవకూడదు.
ఈ వచనాలలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు తాము విడిచివచ్చిన ఐగుప్తు దేశాచారాలను కానీ తాము ప్రవేశించబోతున్న కనాను దేశపు ఆచారాలను కానీ పాటించరాదని ఆజ్ఞాపించడం మనం చుస్తాం. ఎందుకంటే అవన్నీ విగ్రహసంబంధమైన ఆచారాలు. ఐగుప్తులో ఉండగా ఇశ్రాయేలీయులు వాటిని పాటించేవారు (యెహెజ్కేలు 20:6,7, లేవీకాండము 17:7). అలానే కనాను దేశపు విగ్రహసంబంధమైన ఆచారాలు అత్యంత హేయమైనవి, అనైతికమైనవి. అందుకే దేవునిప్రజలైన ఇశ్రాయేలీయులు వాటిని పాటించకూడదు, వారి కట్టడలు అనగా చట్టాలను బట్టి నడుచుకోకూడదు.
లేవీయకాండము 18:4
మీరు నా విధులను గైకొనవలెను; నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను; మీ దేవుడనగు నేను యెహోవాను.
పై వచనంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల ఆచారాలను కానీ కనానీయుల ఆచారాలను కానీ పాటించకూడదని ఆజ్ఞాపించిన దేవుడు; ఈ వచనంలో వారు ఆయన విధులను గైకొనాలని ఆయన కట్టడలను బట్టే నడుచుకోవాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అంటే ఆయన తన ప్రజలకు ఏం పాటించకూడదో ఎలా నడుచుకోకూడదో మాత్రమే కాదు వారు ఏం పాటించాలో ఎలా నడుచుకోవాలో కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయనే వారి దేవుడైన యెహోవా కాబట్టి ఆయన విధులనే ఆయన ప్రజలు గైకొనాలి, ఆయన కట్టడలను బట్టే నడుచుకోవాలి.
లేవీయకాండము18:5
మీరు నాకట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును; నేను యెహోవాను.
దేవుని ఆజ్ఞలు నిత్యజీవానికి సంబంధించినవి మాత్రమే కాదు, ఈలోకంలో సుఖంగా ఆరోగ్యంగా జీవింపచేసేవని కూడా ఈ వచనాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు; వ్యభిచరించకుండా ఉండడం వల్ల మన ఆరోగ్యానికీ మన కుటుంబక్షేమానికే మేలు. ప్రాముఖ్యంగా ఆయన ఆజ్ఞలను గైకొనేవారికి ఆయన ఆదరణ కలుగుతుంది కాబట్టి ఈలోకంలో సుఖంగా జీవించగలుగుతారు. గైకొననివారిపై ఆయన శాపం నిలుస్తుంది కాబట్టి సంతోషంగా బ్రతకలేరు.
సామెతలు 6:23 ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.
లేవీయకాండము 18:6
మీలో ఎవరును తమ రక్తసంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు; నేను యెహోవాను.
ఈ వచనంలో దేవుడు "మీలో ఎవరును తమ రక్తసంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదని" ఆజ్ఞాపించడం మనం చూస్తాం. "మానాచ్ఛాదనమును తీయకూడదంటే" వారిని నగ్నంగా చూడకూడదనే అర్థం వస్తుంది. అయితే ఈ అధ్యాయంలో లైంగికసంబంధాన్ని సూచిస్తూ ఆ మాటలు వాడబడ్డాయి. క్రింది వచనాల నుండి అదే గమనిస్తాం. కాబట్టి మన కుటుంబసభ్యులు కానీ సన్నిహితులు కానీ తమ వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేని అనారోగ్యానికి లోనైనప్పుడు లేక ప్రమాదాలకు గురైనప్పుడు వారిని నగ్నంగా చూడకూడదనే నిషేధం ఇక్కడ లేదు. మనం ఎవరికైనా స్నానం చేయిస్తున్నప్పుడూ వస్త్రాలు మారుస్తున్నప్పుడూ వైద్యరంగంలో ఉన్నవారైతే చికిత్స చేస్తున్నప్పుడు ఇలా అవసరాన్ని బట్టి ఒకర్ని నగ్నంగా చూడడం ఎంతమాత్రం తప్పు కాదు. అది మన బాధ్యత. కొందరు నోవహు పట్ల హాము చేసినదానిని బట్టి కూడా అలా అభిప్రాయపడుతుంటారు కానీ అక్కడ జరిగింది పూర్తిగా వేరు.
గమనించండి; ఇప్పటినుండి మనం చూడబోతున్న వరుసలవారితో లైంగికసంబంధమే పెట్టుకోకూడదంటే ఆ వరుసల వారిని వివాహం చేసుకోకూడదనే నియమం వేరే చెప్పనవసరం లేదు. కాబట్టి విశ్వాసులు ఈ వరుసల వారితో వివాహసంబంధాలు పెట్టుకోకుండా జాగ్రత్త వహించాలి. ఇది పరిశుద్ధుడైన దేవుని నైతికప్రమాణం.
లేవీయకాండము 18:7,8
నీ తండ్రికి మానాచ్ఛాదనముగా నున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ తండ్రిదే.
ఈ వచనాలలో దేవుడు నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదని, నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అంటే స్వంత తల్లితో కానీ లేక తండ్రికి భార్య స్థానంలో ఉన్న మరెవరితో కానీ లైంగికసంబంధం పెట్టుకోకూడదని అర్థం. యాకోబు పెద్దకుమారుడైన రూబేను కనానీయుల ఆచారం ప్రకారం ఆ పాపానికి ఒడిగట్టే జ్యేష్టత్వపు హక్కును కోల్పోయాడు (ఆదికాండము 35:22, 1 దినవృత్తాంతములు 5:1). అదే పాపానికి పాల్పడిన దావీదు కుమారుడైన అబ్షాలోము కూడా దుర్మరణం చెందాడు (2 సమూయేలు 16:21,22, 2 సమూయేలు 18:14-17). మన దేవుడు సాధారణంగానే వివాహానికి వెలుపల జరిగే లైంగికసంబంధాన్ని (వ్యభిచారాన్ని) అసహ్యించుకుని ఆ కార్యానికి పాల్పడినవారికి మరణశిక్ష విధించమని ఆజ్ఞాపించాడు. అయితే ఇక్కడ మరియు ఈ అధ్యాయంలో నిషేధించబడిన అక్రమసంబంధాలు మరింత హేయమైనవి. అందుకే వాటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు. కనానీయుల సంస్కృతిలో ఆ హేయసంబంధాలన్నీ ఉండడం కూడా దీనికి ప్రధానకారణం (24 వచనం).
గమనించండి; ఈ నైతిక నియమాలు ఇశ్రాయేలీయులకో లేక ఏదో ఒక కాలానికో పరిమితం కాదు. దేవుని నైతిక ప్రమాణాలు ఎప్పుడూ ఎవరివిషయంలోనూ మార్పు చెందవు. అందుకే కొరింథీ సంఘంలో ఒకడు తన తండ్రి భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నప్పుడు వాడిని వెలివెయ్యాలని పౌలు ఆజ్ఞాపించాడు. వాడు దుర్మార్గుడంటూ నిందించాడు (1 కొరింథీ 5:1,13). అంటే సంఘమంతా ఈ అధ్యాయంలో చెప్పబడుతున్న నైతికనియమాలను కచ్చితంగా పాటించాలి. ఇవి దేవుని నైతికప్రమాణానికి సంబంధించిన ఆజ్ఞలు కాబట్టి కొంచెమైనా రాజీపడే అవకాశం లేదు.
అదేవిధంగా ఈ అధ్యాయంలో ఆయన పురుషులను ప్రస్తావిస్తూ ఆజ్ఞాపిస్తున్నాడు. కానీ మనం స్త్రీల వైపు నుండి కూడా వాటిని ఆపాదించుకుని ఆ వరుసల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు పురుషుడిని ప్రస్తావించి చెప్పబడినా స్త్రీని ప్రస్తావించి చెప్పబడినా అందులోని నైతికనియమాలు ఇద్దరికీ వర్తిస్తాయి. ఉదాహరణకు మోహపు చూపు పురుషుడూ చూడకూడదు స్త్రీ కూడా చూడకూడదు. ఎవరు చూసినా అది వ్యభిచారమే కానీ ప్రభువు ఆ మాటలు పురుషులను ప్రస్తావిస్తూ మాట్లాడాడు (మత్తయి 5:28). ఈ వచనాలను ఆవిధంగా ఆపాదించుకున్నప్పుడు స్త్రీలైతే తన స్వంత తండ్రితో కానీ తల్లికి భర్తస్థానంలో ఉన్న మరెవరితోనైనా కానీ ఆ సంబంధం కలిగియుండకూడదు.
లేవీయకాండము 18:9
నీ సహోదరి మానాచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టిన దేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క యైనను నీ తల్లి కుమార్తె యొక్క యైనను మానాచ్ఛాదనమును తీయకూడదు.
ఈ వచనం ప్రకారం; పురుషుడు తన స్వంత అక్కా చెల్లిది కానీ లేక తన తండ్రివల్ల/తల్లి వల్ల ఇతరులకు జన్మించిన అక్కా చెల్లి (step sister) ది కానీ మానాచ్ఛాదనమును తీయకూడదు. అనగా వారితో లైంగికసంబంధం కానీ లైంగికసంబంధంతో ముడిపడిన వివాహసంబంధం కానీ పెట్టుకోకూడదు. స్త్రీ ఐతే తన స్వంత తల్లి తండ్రులకు జన్మించిన అన్నా తమ్ముడి విషయంలో లేక తన తల్లి ద్వారా కానీ తండ్రి ద్వారా కానీ ఇతరులకు జన్మించిన అన్నా తమ్ముడి (step brother) విషయంలో ఈ నియమాన్ని పాటించాలి. ఈ నియమం మినహా అక్కా చెల్లిలి వరుస అయ్యేవారిని కానీ అన్నా తమ్ముడి వరుస అయ్యేవారిని కానీ ఉదాహరణకు పెదనాన్న చిన్నాన్న పిల్లలు, పెద్దమ్మ చిన్నమ్మల పిల్లలను కూడా వివాహం చేసుకోవచ్చు. మన సంస్కృతిలో మేనత్త, మేనమామల పిల్లల్ని వివాహం చేసుకోవడం తప్పు కాదు కానీ పెదనాన్న, చిన్నాన్న, పెద్దమ్మ, చిన్నమ్మల పిల్లలను వివాహం చేసుకోవడం తప్పుగా పరిగణిస్తారు. కానీ బైబిల్ అలాంటి నిషేధమేమీ విధించలేదు. బైబిల్ నిషేధించనిదానిని మనం నిషేధంగా చూడకూడదు. అత్త పిల్లల్ని మావయ్య పిల్లల్ని చేసుకోవడంలో లేని తప్పు చిన్నమ్మ/పెద్దమ్మ, చిన్నాన్న/పెదనాన్న పిల్లలను చేసుకోవడంలో ఉందని ఏ నియమాన్ని బట్టి చెబుతున్నారు?
కొందరు ఆదాము హవ్వల మొదటి కుమారుడైన కయీను తన స్వంత చెల్లినే వివాహం చేసుకున్నాడని అపోహపడుతుంటారు. అది వాస్తవం కాదు. ఆదాము హవ్వల పిల్లలెవరూ తమ స్వంత అన్నా చెల్లెల్లను వివాహం చేసుకునే అనుమతిని దేవుడు కల్పించలేదు. ఆ అంశం గురించి వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
కయీను తన చెల్లినే వివాహం చేసుకున్నాడా?
లేవీయకాండము 18:10
నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయకూడదు; అది నీది.
ఈ వచనం ప్రకారం, స్వంత మనవరాలి మానాచ్ఛాదనమును తీయకూడదు. అనగా వారితో లైంగికసంబంధం పెట్టుకోకూడదు. స్త్రీలైతే స్వంత మనువడి విషయంలో ఈ నియమాన్ని పాటించాలి.
లేవీయకాండము 18:11
నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.
ఈ వచనం గురించి 9వ వచనంలో వివరించాను.
లేవీయకాండము 18:12
నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి.
ఈ వచనం ప్రకారం, మేనత్త మానాచ్ఛాదనమును తీయకూడదు. అనగా ఆమెతో లైంగికసంబంధం పెట్టుకోకూడదు. ఈ నియమాన్ని స్త్రీలవైపు నుండి చూసినప్పుడు నీ తల్లి సహోదరుడి అనగా మేనమామ మానాచ్ఛాదనమును తీయకూడదని ఉంటుంది. అంటే మన దేశంలో నిరభ్యంతరంగా జరుగుతున్న మేనరికాలను (మేనమామను వివాహం చేసుకోవడడాన్ని) బైబిల్ స్పష్టంగా ఖండిస్తుంది. కాబట్టి విశ్వాసులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి సంఘంలో ఈ మేనరికపు వివాహాలను నిషేధించాలి. మనకు దేవుని ప్రమాణమే ప్రమాణం, ఆయన నిషేధించిందే నిషేధం తప్ప దేశసంస్కృతులో పితరుల ఆచారాలో కాదు.
లేవీయకాండము 18:13
నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి రక్తసంబంధి.
ఈ వచనం ప్రకారం, పిన్నమ్మ/పెద్దమ్మల మానాచ్ఛాదనమును తీయకూడదు. అనగా వారితో లైంగికసంబంధం పెట్టుకోకూడదు. స్త్రీలైతే పెదనాన్న చిన్నాన్నల విషయంలో ఈ నియమాన్ని పాటించాలి.
లేవీయకాండము 18:14
నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు; ఆమె నీ పినతల్లి.
ఈ వచనం ప్రకారం, స్వంత పెదనాన్న చిన్నాన్నల భార్యలతో అక్రమసంబంధం పెట్టుకోకూడదు. స్త్రీలైతే స్వంత పెద్దమ్మ చిన్నమ్మల భర్తల విషయంలో ఈ నియమాన్ని పాటించాలి.
లేవీయకాండము 18:15
నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.
ఈ వచనం ప్రకారం, కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు. అనగా ఆమెతో అక్రమసంబంధం పెట్టుకోకూడదు. స్త్రీలైతే అల్లుల్ల విషయంలో ఈ నియమాన్ని పాటించాలి.
లేవీయకాండము 18:16
నీ సహోదరుని భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ సహోదరుని మానము.
ఈ వచనం ప్రకారం; స్వంత వదినగారిది కానీ మరదలిది కానీ మానాచ్ఛాదనమును తీయకూడదు. అనగా వారితో లైంగికసంబంధం పెట్టుకోకూడదు. స్త్రీలైతే స్వంత బావగారు మరిదిల విషయంలో ఈ నియమాన్ని పాటించాలి. గమనించండి; ఈ నియమం సహోదరుడు కానీ సహోదరి కానీ బ్రతికుండగా మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోతే వారి భాగస్వాములను వివాహం చేసుకోవచ్చు. ఈ మినహాయింపు ఎందుకు కల్పిస్తున్నానంటే ధర్మశాస్త్రంలో సంతానం లేకుండా ఒకడి సహోదరుడు చనిపోయినప్పుడు అతని భార్యను వివాహం చేసుకుని సంతానం కలుగచెయ్యాలనే ఆజ్ఞ రాయబడింది (ద్వితీయోపదేశకాండము 25:5-10). దీనినే మరిది ధర్మం అంటారు. కాబట్టి సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినప్పుడు వారి భాగస్వాములను వివాహం చేసుకుని వారికి నూతనజీవితం కల్పించడం పాపంగా ఎంచబడదు. అయితే వివాహం చేసుకునేవారు కూడా అవివాహితులో లేక ఒంటరివారో అయ్యుండాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మనకు దేశసంస్కృతులు కాదు దేవుని ప్రమాణమే ప్రమాణం. దేవుని నిషేధమే నిషేధం.
లేవీయకాండము 18:17
ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను ఆమె కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు; వారు ఆమె రక్తసంబంధులు; అది దుష్కామప్రవర్తన.
ఈ వచనం ప్రకారం, ఒక స్త్రీతో కలపి ఆమె కుమార్తెదీ లేక ఆమె మనువరాలిదీ మానాచ్ఛాదనమును తీయకూడదు. అనగా వారితో లైంగికసంబంధం పెట్టుకోకూడదు. స్త్రీ ఐతే ఒక పురుషుడిదీ అతని కుమారుడిదీ లేక అతని మనువడిదీ మానాచ్ఛాదనమును తీయకూడదు. ఈ నియమాన్ని బట్టి ఒక స్త్రీని వివాహం చేసుకుని ఆమె తల్లి (అత్త) మానాచ్ఛాదనమును కూడా తియ్యకూడదు. స్త్రీ ఐతే ఒక పురుషుడ్ని వివాహం చేసుకుని అతని తండ్రి (మామ) మానాచ్ఛాదనమును తియ్యకూడదు. "అది దుష్కామప్రవర్తన" అని నొక్కిచెప్పబడడం గమనించండి.
లేవీయకాండము 18:18
నీ భార్య బ్రదికి యుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానాచ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లి చేసి కొనకూడదు.
ఈ వచనం ప్రకారం, అక్క బ్రతికుండగా చెల్లెలిని వివాహం చేసుకోకూడదు. బైబిల్ బహుభార్యాత్వాన్ని నిషేధిస్తుంది అనడానికి ఈమాటలు మంచి ఉదాహరణ. ఒక స్త్రీ పీడించబడేలా ఆమె స్వంత చెల్లినే మరలా వివాహం చేసుకోకూడదంటే అన్యస్త్రీలు ఆమెను ఇంకా పీడిస్తారు కాబట్టి మరొకరితో వివాహం మరింత నిషేధం కదా!. పాతనిబంధనలో భక్తులు కూడా బహుభార్యాత్వానికి లోనైనట్టు మనం చూస్తాం. కానీ మనకు దేవుని ఆజ్ఞలే ప్రమాణమని గుర్తుంచుకోవాలి. భక్తుల జీవితాలను దేవుని ఆజ్ఞల వెలుగులో పరిశీలించి ఆ ఆజ్ఞలకు అనుకూలంగా ఉన్న మాదిరిని మాత్రమే మనం అనుసరించాలి. వారు చేసినప్రతీదీ దేవుని అనుమతిగా భావించకూడదు.
లేవీయకాండము 18:19
అపవిత్రతవలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు.
ఈ వచనం ప్రకారం, రుతుస్రావంతో ఉన్న భార్యతో లైంగికసంబంధం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆ సమయంలో ఆమె శారీరకమైన అపవిత్రతకు గురైయుంటుంది, బలహీనంగా కూడా ఉంటుంది కాబట్టి ఆమెను ఇబ్బంది పెట్టకూడదు. ఈ నియమాన్ని గుర్తుంచుకుని స్త్రీలు కూడా ఆ సమయంలో భర్తలకు దూరంగా ఉండాలి. కొందరు స్త్రీలు కూడా ఆ సమయంలో భర్తలను ప్రేరేపిస్తుంటారని తెలిసింది కాబట్టి వారికి కూడా ఈ మాటలు చెబుతున్నాను. అలా చెయ్యకూడదు. గమనించండి; భార్యాభర్తల మధ్య లైంగికసంబంధం దేవుడు నియమించిందే ఐనా ఆయన నిషేధించిన సమయంలో అది నిషేధంగానే ఉండాలి. ఆ సమయంలో వారు ఇతరసంతోషాలను అనుభవిస్తూ తమ ఆధ్యాత్మిక అభివృద్ధికోసం, కుటుంబ అభివృద్ధికోసం మంచిగా చర్చించుకోవాలి.
లేవీయకాండము 18:20
నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమెవలన అపవిత్రత కలుగజేసికొన కూడదు.
ఈ వచనం ప్రకారం, పురుషుడు తన పొరుగువాని భార్యతో కానీ స్త్రీ ఐతే పొరుగుదాని భర్తతో కానీ లైంగికసంబంధం పెట్టుకోకూడదు. అంటే వ్యభిచరించకూడదు. బైబిల్ గ్రంథం బహుభార్యాత్వాన్ని నిషేధిస్తుంది అనడానికి ఈ మాటలు కూడా మరోచక్కటి ఉదాహరణ. పురుషుడు పొరుగువాని భార్యతో లైంగికసంబంధం పెట్టుకోకూడదంటే స్త్రీ పొరుగుదాని భర్తతో ఆ సంబంధం పెట్టుకోకూడదు. వివాహం జరిగినవాడితో లైంగికసంబంధమే పెట్టుకోకూడదంటే అతనికి మరో భార్యగా వెళ్ళకూడదనే నియమం ఇక్కడ మరింత స్పష్టంగా ఉంది కదా!
లేవీయకాండము 18:21
నీవు ఏ మాత్రమును నీ సంతానమును మోలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయ కూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను.
ఈ మాటలు కనానీయులు ఆచరించిన పసిపిల్లల దహన బలుల గురించి హెచ్చరిస్తూ రాయబడ్డాయి. వారు పసిపిల్లలను మోలెకు దేవతకు దహనబలులు అర్పించేవారు. దానికి మనదగ్గర పురాతత్వ శాస్త్రానికి చెందిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. దానికి సంబంధించిన వ్యాసాన్ని క్రింది వచనాలలో ప్రస్తావించాను.
లేవీయకాండము 18:22
స్త్రీ శయనమువలె పురుషశయనము కూడదు; అది హేయము.
ఈ వచనంలో దేవుడు స్వలింగసంపర్కాన్ని నిషేధించడం మనం చూస్తాం. ఎందుకంటే ఆ కార్యం అస్వభావికమైనది. అందుకే దేవుడు దానిని "హేయము" గా నిషేధిస్తున్నాడు. కాబట్టి పురుషులతో పురుషులు కానీ స్త్రీలతో స్త్రీలు కానీ అలాంటి అస్వభావికమైన కార్యానికి పాల్పడకూడదు. దీనిగురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
LGBTQ+ పై బైబిల్ దృక్పథం ఏంటి? బైబిల్ ప్రకారం మూడవ లింగం (Third Gender) ఉందా?
లేవీయకాండము 18:23
ఏ జంతువు నందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము.
ఈ వచనంలో దేవుడు జంతుశయనాన్ని నిషేధించడం మనం చూస్తాం. ఎందుకంటే ఈ కార్యం కూడా అస్వభావికమైనది. అత్యంత నీచమైనది. కానీ ప్రస్తుత ప్రపంచంలో పై వచనంలో నిషేధించబడిన స్వలింగసంపర్కం, ఈ వచనంలో నిషేధించబడిన జంతుశయనం విపరీతంగా జరుగుతున్నట్టు మనం గమనిస్తాం. మానవస్వేచ్చ పేరుతో వీటికి అనుకూలంగా చట్టాలు కూడా తయారౌతున్నాయి. క్రీస్తు త్వరలో అరుదించి ఈ భూలోకానికి కఠినమైన తీర్పు తీర్చబోతున్నాడనడానికి ఇదో నిదర్శనం.
లేవీయకాండము 18:24,25
వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.
ఈ వచనాల ప్రకారం, కనానీయులు ఈ అధ్యాయంలో ఆయన నిషేధించిన హేయకార్యాలన్నిటికీ పాల్పడ్డారు. అందుకే ఆయన వారికి ఇశ్రాయేలీయుల ద్వారా తీర్పు తీర్చి వారిని ఆ దేశం నుండి వెళ్ళగొట్టబోతున్నాడు. "ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది" అనే అలంకారంలో ఉన్న భావం అదే. కనానీయుల సంస్కృతి ఎలాంటిదో వారు పాటించిన ఆచారాలు ఎంత హేయమైనవో వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
ఇశ్రాయేలీయులు కనానీయులను సంహరించడం నేరమా? న్యాయమా?
గమనించండి; కనానీయులు ఈ హేయక్రియలన్నిటినీ ధర్మశాస్త్రానికి ముందటి కాలంలో చేసారు. అయినప్పటికీ దేవుడు వారికి అందులోని నైతిక నియమాలను బట్టి తీర్పు తీరుస్తున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రంలోని నైతిక నియమాలు ప్రతీకాలంలోనూ వర్తించేవిగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము ధర్మశాస్త్రం క్రిందలేమని చెప్పుకునేవారు కూడా అందులోని నైతిక నియమాలను పాటించవలసిందే. దీనిగురించి వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
మోషే ధర్మశాస్త్రానికి ముందు నైతిక ఆజ్ఞలు లేవా?
లేవీయకాండము 18:26-29
కాబట్టి ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు, అనగా స్వదేశియేగాని మీలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక, యీ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలొ నుండి కొట్టి వేయబడుదురు.
ఈ వచనాలలో దేవుడు కనానీయులు చేసినట్టుగా మీరూ అలాంటి హేయక్రియలు చెయ్యకూడదని చేస్తే వారికిలానే మీరూ నశిస్తారని ఇశ్రాయేలీయులను హెచ్చరించడం మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు అదేవిధంగా చేసినప్పుడు ఆయన హెచ్చరించినట్టుగానే అన్యరాజుల చేత వారిని నశింపచేసాడు. ఆ వివరాలన్నీ పైన ప్రస్తావించిన వ్యాసంలో తెలియచేసాను.
లేవీయకాండము 18:30
కాబట్టి మీకంటె ముందుగానున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుటవలన అపవిత్రత కలుగజేసికొనకుండునట్లు నేను మీకు విధించిన విధి ననుసరించి నడుచు కొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.
ఈ వచనంలోని దేవుని మాటల ప్రకారం, ఆ దేవుని పిల్లలు ఇతరుల ఆచారాలను బట్టి అపవిత్రులు కాకుండాలంటే ఆయన విధులను అనుసరించి నడుచుకోవడమే ఏకైక మార్గం. అప్పుడు మాత్రమే ఎవరి ఆచారాలను బట్టి కానీ ఎవరి సంస్కృతిని/ప్రవర్తనను బట్టి కానీ వారు అపవిత్రులు కాలేరు. కాబట్టి దేవుని పిల్లలమైన మనకు ఆయన లేఖనాలలో ఆజ్ఞాపించిన విధులే ప్రమాణం అయ్యుండాలి. అప్పుడు మాత్రమే పరిశుద్ధులంగా ఆయన సన్నిధిలో నిలబడగలం, సంఘం నుండి మూఢనమ్మకాలను కూడా తొలగించగలం
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
లేవీయకాండము అధ్యాయం 18

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"