లేవీయకాండము 21:1
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను.
లేవీకాండము 10:11లో యాజకులను ఉద్దేశించి "మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైనదానిని, అపవిత్రమైనదాని నుండి పవిత్రమైనదానిని వేరుచేయుటకును, యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైనకట్టడ" అని రాయబడింది. అలా యాజకులు "ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైనదానిని, అపవిత్రమైనదాని నుండి పవిత్రమైనదానిని వేరుచేయుటకును" నిర్ణయించబడిన ఆజ్ఞలనే ఈ అధ్యాయంలో చూస్తాం. యాజకులు వీటి ప్రకారం నడుచుకుంటూ బోధ విషయంలోనే కాదు ప్రవర్తన విషయంలో కూడా పవిత్రంగా జీవించాలి. సంఘ కాపరులకు కూడా ఇది హెచ్చరిక. ఎందుకంటే కాపరియైన తిమోతీకి "నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము" (1 తిమోతికి 4:12) అని రాయబడింది. కాబట్టి కాపరులు బోధ విషయంలోనే కాదు ప్రవర్తన విషయంలో కూడా పవిత్రంగా ఉండడం తప్పనిసరి.
లేవీయకాండము 21:2,3
యాజకులగు అహరోను కుమారులతో ఇట్లనుము మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుటవలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు, అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక, అను వీరి యొక్క శవమునుముట్టి తన్ను అపవిత్రపరచు కొనవచ్చును.
ఈ వచనాల ప్రకారం; యాజకులు తమ రక్తసంబంధుల విషయంలో మినహా మరెవ్వరి శవాన్నీ ముట్టుకుని అపవిత్రం కాకూడదు. కారణం; క్రింది వచనాలలో రాయబడింది.
లేవీయకాండము 21:4-6
అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచు కొని సామాన్యునిగా చేసికొనరాదు. వారు తమ తలలు బోడిచేసికొనరాదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసికొన రాదు, కత్తితో దేహమును కోసికొనరాదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి అహారమును, అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు; కావున వారు పరిశుద్ధులై యుండవలెను.
ఈ వచనాల ప్రకారం; యాజకులు యెహోవా మందిరంలో ఆయనకు బలులు (ఆహారం) హోమద్రవ్యాలు అర్పించడానికి ప్రత్యేకించబడినవారు అనగా "తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారు" కాబట్టి వారి హోదాను బట్టి మరియు వారి పరిచర్యకు ఆటంకం కలగకుండుటకై (శవాన్ని ముట్టి ఆలయంలో ప్రవేశింపకూడదు) ప్రజల్లోని ఒకని శవాన్ని ముట్టడం ద్వారా అపవిత్రులు కాకూడదు. పరిశుద్ధంగా జీవించాలి. లేకుంటే తమ దేవుని నామమును అపవిత్రపరచినట్టే. ఈ నియమాన్ని బట్టి పరిచర్యకై పిలవబడినవారు తమ పరిచర్యకు ఆటంకం కలిగించే ప్రతీ అపవిత్రత నుండీ దూరంగా ఉండాలని నేర్చుకుంటున్నాం.
గమనించండి; ఇలా శవాన్ని ముట్టడం వల్ల కలిగే అపవిత్రత ఆచారసంబంధమైన అపవిత్రత. అనగా నైతికమైన అపవిత్రతలకు ధర్మశాస్త్రంలో ఛాయగా నియమించబడిన అపవిత్రతల్లో ఒకటి. ఇప్పుడైతే క్రైస్తవులమైన మనకు నైతికమైన అపవిత్రతలే తప్ప ఇలాంటి ఆచారసంబంధమైన అపవిత్రతలు లేవు (హెబ్రీ 10:1, ఎఫెసీ 2:14). కాబట్టి శవాన్ని ముట్టకూడదనే ఈ నియమం విశ్వాసులకు కానీ కాపరులకు కానీ వర్తించదు. కొందరు క్రైస్తవులు కూడా శవాన్ని ముట్టాలన్నా చనిపోయినవారి గృహానికి వెళ్ళాలన్నా మైల పడతామని సంశయిస్తుంటారు కాబట్టి ఈ మాటలు ప్రత్యేకంగా చెబుతున్నాను.
"వారు తమ తలలు బోడిచేసికొనరాదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసికొన రాదు, కత్తితో దేహమును కోసికొనరాదు"
చనిపోయినవారి నిమిత్తం అన్యులు ఇలాంటి ఆచారాలన్నీ పాటించేవారు. కానీ యెహోవాకు ప్రతిష్టితులైన యాజకులు తమ హోదాను బట్టి అలా చేసుకోకూడదు. అనగా తమను తాము ఏవిధంగానూ హీనపరుచుకోకూడదు. ఈ నియమం సాధారణ ఇశ్రాయేలీయులకు కూడా చెప్పబడింది (లేవీకాండము 19:28). యాజకులకు అది మరింతగా వర్తిస్తుంది. ఇది నూతననిబంధన విశ్వాసులకు కూడా వర్తిస్తుంది. ఇప్పటికీ కొందరు క్రైస్తవులు తమ కుటుంబసభ్యులు చనిపోయినప్పుడు గుండు కొట్టించుకోవడం వంటివి చేస్తుంటారు. అవన్నీ అన్యాచారాలు. వాటిని పాటించకూడదు.
లేవీయకాండము 21:7
వారు జార స్త్రీనేగాని భ్రష్టురాలినేగాని పెండ్లిచేసికొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసికొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు.
ఈ వచనం ప్రకారం; యాజకుడు జార స్త్రీనేగాని, భ్రష్టురాలినేగాని, పెనిమిటి విడనాడిన స్త్రీనే గాని పెండ్లి చేసికొనకూడదు. కారణం: "యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు". కాబట్టి అతను పరిశుద్ధ వైవాహిక జీవితం కలిగుండేలా కన్యకను మాత్రమే వివాహం చేసుకోవాలి. అపవిత్రమైన జీవితం కలిగినవారిని తన జీవితంలోకి ఆహ్వానించకూడదు. దానివల్ల అతని జీవితం కూడా అపవిత్రమౌతుంది.
అయితే ఈ నియమం యాజకులకు మాత్రమే ప్రత్యేకంగా చెప్పబడింది. విశ్వాసులమైన మనమైతే ఒకప్పుడు అపవిత్రంగా జీవించినప్పటికీ దేవునిలో నిజంగా మారుమనస్సు పొంది ప్రస్తుతం పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నవారిని వివాహం చేసుకోవచ్చు. ఉదాహరణకు మారుమనస్సు పొందిన రాహాబు అనే వేశ్యను ఇశ్రాయేలీయుడైన శల్మాను విహాహం చేసుకున్నాడు. అతని నుంచే దావీదు వంశం ఉద్భవించింది. కానీ ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి, వారు నిజంగా తమ పాపపు బ్రతుకు నుండి మారుమనస్సు పొంది పరిశుద్ధంగా జీవిస్తున్నారా అనేది పలుమార్లు పరీక్షించాకే వారితో వైవాహిక సంబంధానికి సిద్ధపడాలి.
ఒకవేళ విడవబడిన స్త్రీని వివాహం చేసుకోవలసివస్తే ఆమె తన భర్తతో బైబిల్ కల్పించిన మినహాయింపుల ప్రకారమే విడిపోయిందా లేక బైబిల్ నియమాలకు విరుద్ధంగానా అనేది పరిశీలించుకోవాలి. లేకుంటే ఆమెను వివాహం చేసుకుని చేసే సంసారం వ్యభిచారంగా పరిగణించబడుతుంది (లూకా 16:18). ఎలాంటి కారణాలతో భాగస్వామిని విడిచిపెట్టినప్పటికీ అది దేవుని నియమాలకు విరుద్ధం కాదో ఇప్పటికే వివరించాను (నిర్గమకాండము 20:10,11 వ్యాఖ్యానం చూడండి). అలాంటి కారణాలతో విడవబడి విశ్వాసిగా కొనసాగుతున్న స్త్రీని వివాహం చేసుకోవచ్చు. ఈ నియమం స్త్రీ పురుషులిద్దరికీ వర్తిస్తుంది.
లేవీయకాండము 21:8
అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచ వలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను.
"అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను"
ఈ మాటలు దేవుడు మోషేతో చెబుతున్నాడు. మోషే దేవుడు ఆజ్ఞాపించిన ఈ కట్టడలన్నీ యాజకులకు బోధించడం ద్వారా వారిని పరిశుద్ధపరచాలి. అనగా వారు పరిశుద్ధంగా ఉండేలా పర్యవేక్షించాలి.
"మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను"
ఇవి చాలా ప్రాముఖ్యమైన మాటలు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ దేవుని ప్రతినిధులుగా పనిచేసే యాజకులు కూడా ప్రజల్లో పరిశుద్ధంగా జీవించాలి. అతను ఏ విషయంలోనూ అపవిత్రుడు కాకూడదు. దేవుని ఆజ్ఞలను బట్టి నడుచుకున్నప్పుడే అది సాధ్యం. వాటిని మీరడమే అపవిత్రత. ఈ నియమం సంఘానికి ప్రతినిధులుగా ఉన్నవారందరికీ వర్తిస్తుంది. పరిశుద్ధుడైన దేవుణ్ణి ప్రకటించే సేవకులు పరిశుద్ధులుగా ఉండడం (దైవాజ్ఞలకు విధేయులుగా ఉండడం) అవశ్యం. లేకుంటే వారు పరిశుద్ధుడైన దేవుని పరిచర్యకు పూర్తిగా అనర్హులు. అందుకే పౌలు పరిచారకుల విషయంలో "మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందిన వాడైయుండవలెను. ఆలాగుననే పరిచారకులు మాన్యులై యుండి, ద్విమనస్కులును, మిగుల మద్యపానాసక్తులును, దుర్లాభమున పేక్షించువారునైయుండక విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై యుండవలెను" (1తిమోతికి 3:7,8) అని ఆజ్ఞాపిస్తున్నాడు. కాపరియైన తిమోతీని "నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము (విడిచి పారిపొమ్ము), పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము" (2తిమోతికి 2:22) అని హెచ్చరిస్తున్నాడు.
లేవీయకాండము 21:9
మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరచు కొనినయెడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది. అగ్నితో ఆమెను దహింపవలెను.
సాధారణంగానే ఇశ్రాయేలీయుల్లో ఎవరూ వేశ్యలుగా మారి తమ దేశాన్ని అపవిత్రపరచకూడదు (లేవీకాండము 19:29). అలాంటిది యాజకుడి కుమార్తెనే జారిణిగా మారితే అది పరిశుద్ధమైన పరిచర్యకు ఏర్పరచబడిన తన తండ్రికి కూడా ఎంతో అవమానం, అపవిత్రం. అందుకే ఆమెను అగ్నితో కాల్చి వెయ్యాలి. అంటే యాజకుడే కాదు, అతనికి సంబంధించిన కుటుంబం కూడా పవిత్రంగా జీవించాలని ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఈ నియమాన్ని బట్టి సంఘ కాపరులే కాదు వారి పిల్లలు కూడా దేవుని దృష్టికి పవిత్రులుగా జీవించాలి. అందుకే కాపరులను ఎన్నుకునేటప్పుడు "అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలుగలవాడునైయున్నయెడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును" (తీతుకు 1:6) అని పౌలు ఆజ్ఞాపించాడు.
లేవీయకాండము 21:10,11
ప్రధానయాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తలమీద అభిషేకతైలము పోయబడునో, యాజకవస్త్రములు వేసికొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు; తన బట్టలను చింపుకొనరాదు; అతడు శవముదగ్గరకు పోరాదు; తన తండ్రి శవమువలననే గాని తన తల్లి శవమువలననే గాని తన్ను అపవిత్రపరచుకొన రాదు.
ఇంతవరకూ మనం సాధారణ యాజకులకు సంబంధించిన నిషేధాజ్ఞలను చూసాం. ఈ వచనాల నుండి ఆ యాజకులందరికీ ప్రధానుడైన ప్రధానయాజకుడికి సంబంధించిన నిషేధాలను (అపవిత్రతలను) చూస్తాం. యాజకుల ప్రధానుడను ఉద్దేశించి ప్రధానయాజకుడు అనే పదప్రయోగం ఇక్కడే మొదటిసారి చెయ్యబడింది. ఇతనిని ప్రధానయాజకుడిగా ఎలా అభిషేకించాలో ఎలా అలంకరించాలో నిర్గమకాండము 28,29 అధ్యాయాలు, లేవీకాండము 8 అధ్యాయంలోనూ రాయబడింది. ఇతను మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి దేవుని నిబంధన మందసం ఉన్న అతిపరిశుద్ధస్థలంలోకి ప్రవేశించే అర్హత కలవాడు (హెబ్రీ 9:7). కాబట్టి ఇతని విషయంలో సాధారణ యాజకులకంటే ఎక్కువ నిషేధాలు విధించబడ్డాయి (మరింత పవిత్రంగా ఉండాలని). ఉదాహరణకు; సాధారణ యాజకులు తమ రక్తసంబంధీకులు చనిపోయినప్పుడు వారి శవాన్ని ముట్టవచ్చు. కానీ ఈ వచనాల ప్రకారం; ప్రధానయాజకుడు తమ రక్తసంబంధీకులు చనిపోయినప్పటికీ ఆ శవాన్ని ముట్టకూడదు.
ఇది కఠినమైన నిషేధంలానే అనిపించవచ్చు కానీ దేవునికి ప్రతిష్టిడుడైన యాజకుడు అపవిత్రతలకు ఛాయగా ఉన్నటువంటి దేనివల్లా అపవిత్రుడు కాకూడదనే నియమాన్ని బట్టి ఇది అతను పాటించితీరాలి. గమనించండి; ఈ ప్రధానయాజకుడు శవాన్ని ముట్టడం ద్వారా అపవిత్రతలు గలవారిని అనగా స్రావం గలవారినీ కుష్టు గలవారినీ తాకడం ద్వారా అపవిత్రమౌతాడు. కానీ మన ప్రధానయాజకుడైన క్రీస్తు ఐతే ఆ అపవిత్రతలు గలవారిని తాకినప్పటికీ శవాన్ని మోస్తున్న పాడెను ముట్టినప్పటికీ అపవిత్రం కాడు. పైగా వారిని జీవం గలవారిగానూ శుద్ధులుగానూ చెయ్యగల సమర్ధుడు. ఈ రుజువులను సువార్తల్లో చదువుతాం. ఈ తారతమ్యాన్ని చూపించడానికి కూడా ఈ నియమం నియమించబడిందని విశ్వసిస్తున్నాను.
లేవీయకాండము 21:12
దేవుని అభిషేక తైలము అనెడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధమందిరమును విడిచి వెళ్లరాదు; తన దేవుని పరిశుద్ధమందిరమును అపవిత్రపరచ రాదు; నేను యెహోవాను.
"దేవుని అభిషేక తైలము అనెడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధమందిరమును విడిచి వెళ్లరాదు"
అంటే అతను ఎప్పుడూ మందిరంలోనే ఉండాలని కాదు. ఈ మాటలు అతను పరిచర్య చేసే సమయం గురించి చెప్పబడుతున్నాయి. ఆ సమయంలో తన కుటుంబసభ్యులు చనిపోయారని తెలిసినప్పటికీ అతను మందిరం విడిచివెళ్ళకూడదు అనేది ఈ మాటలకు సందర్భంలోని భావం. అతను అలా వెళ్తే ఆ సమయంలో చెయ్యవలసిన పరిచర్య నిలిచిపోవడం ద్వారా మందిరం అపవిత్రపరచబడుతుంది.
లేవీయకాండము 21:13,14
అతడు కన్యకను పెండ్లిచేసి కొనవలెను. విధవరాలినైనను విడనాడబడినదానినైనను భ్రష్టురాలినైనను, అనగా జారస్త్రీనైనను అట్టివారిని పెండ్లిచేసికొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసికొనవలెను.
సాధారణ యాజకుల మాదిరిగానే ప్రధానయాజకుడు కూడా కన్యకనే వివాహం చేసుకోవాలి, కారణం 7వ వచనంలో వివరించాను. అయితే ఈ జాబితాలో విధవరాలు కూడా చేర్చబడడం ఇక్కడ చూస్తున్నాం. కొందరు దీని ఆధారంగా బైబిల్ దేవుడు జారస్త్రీనీ విధవరాలినీ సమానంగా చూస్తున్నాడని, అందుకే జారస్త్రీతో పాటు విధవరాలినీ కలిపి ప్రస్తావించాడని ఆరోపిస్తుంటారు. కానీ ఇక్కడ ప్రధానయాజకుడు ఎవరెవర్ని వివాహం చేసుకోకూడదు అనే జాబితాలో విధవరాలు కూడా ఒకరు అని చెప్పడానికే జారస్త్రీతో పాటు ఆమె ప్రస్తావన కూడా చెయ్యబడింది తప్ప ఇద్దరూ సమానం అని చెప్పడానికి కాదు. ఉదాహరణకు లివర్ సమస్య ఉన్నవారికి వైద్యుడు మద్యానికీ మాంసాహారానికీ దూరంగా ఉండమంటాడు. అంటే ఆ వైద్యుడి దృష్టిలో మద్యమూ మాంసమూ ఒకలాంటివే అనా? కాదు కదా! కానీ అవి రెండూ నిషేధంగా చెప్పడానికి రెండింటినీ వరుసగా ప్రస్తావించవలసి వచ్చింది.
ఇక ప్రధానయాజకుడు విధవరాలిని కూడా వివాహం చేసుకుని ఆమెకు నూతనజీవితం ఎందుకు ప్రసాదించకూడదంటే అతను కన్యకనే వివాహం చేసుకోవాలన్నది దేవుని నియమం, అదే అతని పట్ల దేవుని చిత్తం కాబట్టి అతను కన్యకనే వివాహం చేసుకోవాలి. ప్రధానయాజకుడు ప్రతిష్టుడు కాబట్టి అతను ప్రతిష్టంగానే అనగా దేవుడు ఆజ్ఞాపించినట్టుగానే జీవించాలి. ఇక్కడ మరో ప్రశ్నకూ తావులేదు.
లేవీయకాండము 21:15
యెహోవా అను నేను అతని పరిశుద్ధపరచు వాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము.
ఈ మాటలు ప్రధానయాజకుడి పిల్లలు కూడా దేవునిపరిశుద్ధతకు తగినట్టుగా జీవించాలని ఆవిధంగా అతను తన సంతానం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తెలియచేస్తున్నాయి. ప్రధానయాజకుడి పిల్లలు బ్రష్టులుగా ఉండడానికి వీలులేదు. ఈ నియమం సంఘపరిచర్యలో ఉన్న అందరికీ వర్తిస్తుంది. అందుకే సంఘ అధ్యక్షుడిని నియమించేటప్పుడు అతని సంతానం ఎలా ఉందో కూడా పరిశీలించాలని రాయబడింది (తీతుకు 1:6, 1 తిమోతీ 3:1-5). ఈ వాక్యనియమాన్ని మనం నేటి సంఘకాపరులకు అన్వయిస్తే ఎంతమంది కాపరులుగా కొనసాగగలరు? ఎందుకంటే నేటి చాలా సంఘాల్లో కాపరుల పిల్లలే సాధారణ విశ్వాసుల కంటే బ్రష్టులుగా కనిపిస్తున్నారు. అలాగని కాపరులైన తండ్రులు ఎంతగా దండించినప్పటికీ వారు బ్రష్టులుగానే ఉంటుంటే అతని పరిచర్యను అడ్డుకోకూడదు. కానీ అతను నిజంగానే ఆ పిల్లలను దండించి సరిచెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడా లేక ఏలీలా తన పిల్లలు బ్రష్టులుగా కొనసాగుతున్నప్పటికీ సరైన దండన విధించకుండా ఉన్నాడా అనేది అసలైన ప్రశ్న. ముఖ్యంగా అతను దండించినప్పటికీ ఆ పిల్లలు బ్రష్టులుగానే ఉంటుంటే వారిని సంఘంలో కొనసాగనివ్వకూడదు, వెలివెయ్యాలి.
లేవీయకాండము 21:16-23
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుతో ఇట్లనుమునీ సంతతివారిలో ఒకనికి కళంకమేదైనను కలిగినయెడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. ఏలయనగా ఎవనియందు కళంకముండునో వాడు గ్రుడ్డివాడేగాని కుంటివాడేగాని ముక్కిడివాడేగాని విపరీతమైన అవ యవముగల వాడే గాని కాలైనను చేయినైనను విరిగినవాడే గాని గూనివాడేగాని గుజ్జువాడేగాని కంటిలో పువ్వు గల వాడేగాని గజ్జిగలవాడేగాని చిరుగుడుగలవాడేగాని వృషణములు నలిగినవాడేగాని సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానములో కళంకముగల యే మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కళంకముగలవాడు; అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింప కూడదు. అతి పరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైనను అతడు తినవచ్చును. మెట్టుకు అతడు కళంకముగలవాడు గనుక అడ్డతెరయెదుటికి చేరకూడదు; బలిపీఠమును సమీపింపకూడదు.
ఈ వచనాల ప్రకారం అహరోను వంశంలో అనగా యాజకులుగా పిలవబడిన ఆ వంశంలో ఎవరికైనా ఏదైనా కళంకం, లోపం ఉంటే వారు బలులు అర్పించకూడదు, బలిపీఠాన్ని సమీపించడం కానీ మందిరం లోపలికి ప్రవేశించడం కానీ చెయ్యకూడదు. కారణం? చూసేవారిని బట్టి అది వారి ప్రతిష్టకు భంగం కాబట్టి ఈ నిషేధం విధించబడిందని కొందరు బైబిల్ పండితులు అభిప్రాయపడ్డారు. కానీ ఈ జాబితాలో రహస్య అవయవాల లోపం ఉన్నవారు కూడా ఉన్నారు, ఆ ప్రదేశంలో లోపం ఉన్నట్టు ఎవరికీ కనిపించదు, అలాంటప్పుడు ఆ లోపం ఎవరికైనా కనిపించి వారి ప్రతిష్టకు ఎలా భంగం కలుగుతుంది?. మరికొందరు వారు లోపం కలిగినవారు కాబట్టి దేవుడు వారిని నిషేధించాడని అభిప్రాయపడ్డారు. కానీ ఈ జాబితాలో కుంటివారు గ్రుడ్డివారు గూనివారు కూడా ఉన్నారు. వారిని అలా నేనే పుట్టిస్తున్నానని స్వయంగా దేవుడే సాక్ష్యమిచ్చాడు (నిర్గమకాండము 4:11). ఆయనే అలా పుట్టించినవారిని ఆయనే ఎందుకు నిషేధిస్తాడు? కాబట్టి ఈ అభిప్రాయం కూడా సరైనది కాదు. మరి అసలైన కారణం ఏంటంటే;
యాజక పరిచర్య ప్రాముఖ్యంగా బలులు అర్పించడం అనేది చాలా కష్టతరమైనది. ఒకోబలినీ ఒకోవిధంగా అర్పించాలి. ఈ లేవీకాండము గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ విషయం మనకు అర్థమౌతుంది. అలాంటి కష్టతరమైన పరిచర్యను గ్రుడ్డివారు కానీ కుంటివారు కానీ లేక బాధాకరమైన ఇతర శారీరకలోపాలు ఉన్నవారు కానీ సరిగ్గా నిర్వహించలేరు. వారు ఒక విషయంలో సరైన క్రమాన్ని పాటించకపోయినా ఆ బలి అర్పణ విఫలమౌతుంది. అందుకే ఆ విషయంలో దేవుడు వారిని నిషేధించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే వారికి ఆ సామర్థ్యం లేదు కాబట్టి వారిని ఆ బాధ్యతల నుండి తప్పించాడు. ఒకవేళ వారు దేవుని దృష్టిలో వారు అపవిత్రులుగా పరిగణించబడే ఆ పరిచర్యనుండి తప్పించబడితే "అతి పరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైనను అతడు తినవచ్చును" అని చెప్పడు. ఎందుకంటే అపవిత్రులు అవి తినకూడదు (లేవీకాండము 22:3,4).
ఈ నియమాన్ని మనం సంఘానికి అన్వయించుకుంటే "నీవు అనేక సాక్షులయెదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము" (2తిమోతికి 2:2) అని రాయబడింది. అంటే సంఘంలో బోధించడానికి సామర్థ్యం కలిగినవాడు మాత్రమే కాపరిగా (పెద్దగా) నియమించబడాలి. అతనికున్న ఆస్తిని బట్టో పలుకుబడిని బట్టో నియమింపబడకూడదు.
లేవీయకాండము 21:24
నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు; వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోను, అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను చెప్పెను.
"నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు"
ఈ మాటలు యాజకుల విషయంలోనూ ప్రజల విషయంలోనూ మనం పదే పదే చదువుతున్నాం. అంటే ఆయన పరిచారకులు కానీ ప్రజలు కానీ ఆయన నిషేధించిన అపవిత్రతలకు లోనైనప్పుడు వారే కాదు, వారి దేవుని నామం కూడా అపవిత్రపరచబడుతుంది. ఉదాహరణకు సంఘంలో విశ్వాసులు లేక కాపరి అపవిత్రులుగా ఉంటే ఆ సంఘం అపవిత్రపరచబడుతుంది. కాబట్టి ఈ విషయంలో పరిచారకులూ ప్రజలూ జాగ్రత్త వహించాలి. "వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది?" (రోమా 2:24) అని నిందించబడినవారి జాబితాలో మనం చేరకుండా చూసుకోవాలి. ఆయన ఆజ్ఞలను బట్టి సమస్తమైన అపవిత్రతలకూ దూరంగా జీవించినప్పుడే ఆ జాబితాలో మనం చేరకుంటాం.
"అట్లు మోషే అహరోనుతోను, అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను చెప్పెను"
నిజానికి ఈ అధ్యాయమంతా యాజకులకు సంబంధించింది. మోషే ఈ మాటలు వారితో చెబితే సరిపోతుంది. కానీ అతను వారితో పాటు ఇశ్రాయేలీయుల ప్రజలకు కూడా ఈ మాటలన్నీ తెలియచేసాడు. కారణం: దేవునికీ తమకూ మధ్యలో ప్రతినిధులుగా వ్యవహరిస్తూ దశమభాగాలనూ బలి అర్పణల్లో భాగాలను స్వీకరిస్తున్న యాజకులు దేవుడు ఆజ్ఞాపించినట్టుగా అపవిత్రతలకు దూరంగా ఉండి పరిశుద్ధంగా పరిచర్య చేస్తున్నారా లేదా అనేది ప్రజలకు కూడా తెలియాలి. అప్పుడే యాజకులు దేవుని ఆజ్ఞలను మీరి ఏదైనా అపవిత్రతకు లోనైనప్పుడు ప్రజలు వారిని ప్రశ్నించగలరు. ఈ నియమం సంఘానికి చాలా ప్రాముఖ్యమైన మాదిరి. మన కాపరులూ పరిచారకులూ సరిగ్గానే బోధిస్తున్నారా పరిశుద్ధంగానే జీవిస్తున్నారా అనేది మనకు తెలిసుండాలి. ఆ పరిశీలన మనం చెయ్యాలంటే ప్రతీదినం లేఖనాలను ధ్యానించి, పరిచారకులకూ కాపరులకూ అప్పగించబడిన బోధ ఏంటో వారి జీవనశైలి ఎలాగుండాలో అర్థం చేసుకోవాలి.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
లేవీయకాండము అధ్యాయం 21

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"