హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.
హితబోధ యాప్ కొరకు Join WhatsApp
ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.
© 2024. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.
లేవీయకాండము అధ్యాయం 1
ఈ అధ్యాయంలో దేవుడు దహనబలి పశువుల గురించీ వాటిని అర్పించవలసిన క్రమం గురించీ ఆజ్ఞాపించడం మనం చదువుతాం.
లేవీయకాండము అధ్యాయం 2
ఈ అధ్యాయంలో గోధుమపిండికి సంబంధమైన నైవేద్యాల గురించీ, నిషేధమైన అర్పణల గురించీ, అలానే ప్రధమఫలాల నైవేద్యం గురించి మనం చదువుతాం.
లేవీయకాండము అధ్యాయం 3
ఈ అధ్యాయంలో సమాధానబలి గురించీ ఆ బలిలో యేయే జంతువులను ఎలా అర్పించాలి అనేదాని గురించీ (1-15) క్రొవ్వునూ రక్తాన్నీ తినకూడదనే కట్టడ గురించీ మనం చదువుతాం.
లేవీయకాండము అధ్యాయం 4
ఈ అధ్యాయంలో యాజకుడు పొరపాటున పాపం చేసినప్పుడు అర్పించవలసిన బలి గురించి (1-12) సమాజమంతా పాపం చేసినప్పుడు అర్పించవలసిన బలి గురించి (13-21) అధికారి పాపం చేసినప్పుడు అర్పించవలసిన బలి గురించి (22-26) వ్యక్తులు పాపం చేసినప్పుడు అర్పించవవలసిన బలి గురించి (27-35) మనం చదువుతాం.
లేవీయకాండము అధ్యాయం 5
ఈ అధ్యాయంలో అబద్ధ సాక్ష్యానికి సంబంధించిన అపవిత్రత గురించి, అపవిత్ర జంతువుల సంబంధమైన అపవిత్రత గురించి, ఒట్టు పెట్టుకోవడానికి సంబంధించిన అపవిత్రత గురించి, వారు అర్పించవలసిన బలుల గురించి మనం చదువుతాం.
లేవీయకాండము అధ్యాయం 6
ఈ అధ్యాయంలో పొరుగువారి పట్ల అన్యాయం చేసినప్పుడు పాయశ్చిత్తంగా అర్పించవలసిన బలి గురించి (1-7) యాజకులు బలులు అర్పించవలసిన క్రమం, పరిచర్య గురించి (8-18) యాజకుడు చెయ్యవలసిన నైవేద్యం గురుంచి (19-23) వారు తినవలసిన ఆహారం, క్రమం గురించి (24-30) మనం చదువుతాం.
లేవీయకాండము అధ్యాయం 7
ఈ అధ్యాయంలో దేవుడు అపరాధపరిహారార్థబలి గురించిన విధిని అందులో మూడు రకాల బలుల గురించి వివరించడం మనం చదువుతాం.
లేవీయకాండము అధ్యాయం 8
ఈ అధ్యాయంలో మోషే దేవుడు ఆజ్ఞాపించినట్టుగా అహరోనునూ అతని కుమారులనూ యాజకులుగా ప్రతిష్టించడం గురించి మనం చదువుతాం.