లేవీయకాండము 7:1
అపరాధపరిహారార్థబలి అతిపరిశుద్ధము. దాని గూర్చిన విధి యేదనగా-
లిని గూర్చిగాని విధి యొక్కటే". ఈ బలిని దేవునికి సంబంధించిన విషయాలలోనూ, సహోదరుల విషయంలోనూ పాపం చేసినప్పుడు అర్పించాలి (లేవీకాండము 5:15-19, 6:1-5 వ్యాఖ్యానాలు చూడండి).
లేవీయకాండము 7:2
దహనబలి పశువులను వధించుచోట అపరాధ పరిహారార్థబలి రూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠముచుట్టు దాని ర
ఈ వచనంలో దేవుడు అపరాధపరిహారార్థబలి గురించిన విధిని తెలియచెయ్యడం మనం చూస్తాం. 7వ వచనం ప్రకారం "పాపపరిహారార్థబలిని గూర్చిగాని అపరాధ పరిహారార్థబక్తమును ప్రోక్షింపవలెను.
"దహనబలి పశువులను వధించుచోటనే ఈ అపరాధ పరిహారార్థబలి రూపమైన పశువులను కూడా వధింపవలెను" అంటే ప్రత్యక్షగుడారపు ద్వారం దగ్గర అనగా బలిపీఠానికి సమీపంలో ఈ పశువులను వధించాలి, ఆ తర్వాత యాజకుడు ఆ రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి (లేవీకాండము 1:3-5).
లేవీయకాండము 7:3-6
దానిలో నుండి దాని క్రొవ్వంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములలోని క్రొవ్వును రెండు మూత్ర గ్రంథులను డొక్కలపైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథుల మీది క్రొవ్వును కాలేజము మీది వపను తీసి దాని నంతయు అర్పింపవలెను. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠము మీద వాటిని దహింపవలెను; అది అపరాధ పరిహారార్థబలి; యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను.
ఈ వచనాలలో దేవుడు అపరాధ పరిహారార్థ బలిపశువునుండి ఆయనకు యేయేభాగాలు బలిపీఠంపై అర్పించాలో వివరించడం మనం చూస్తాం. ఈ బలిపశువు గొర్రెపిల్ల అయినప్పుడు మాత్రమే దాని క్రొవ్విన దాని తోక కూడా ఆయనకు అర్పించబడుతుంది. ఎందుకంటే ఆ గొర్రెల తోకలు క్రొవ్వి బలమైనవిగా ఉండేవంట. ఈ విషయాలన్నీ నేను ఇప్పటికే వివరించాను (లేవీకాండము 3 వ్యాఖ్యానం చూడండి).
ఇక "యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను" అన్నప్పుడు కూడా ఈ బలిలో క్రొవ్వు దేవునికి అర్పించబడి మిగిలిన మాంసం యాజకుడికీ మరియు బలి పశువును తీసుకువచ్చినవాడికీ పంచబడుతుంది. దానిని ఆ యాజకుడు తినాలి. మగవాడు మాత్రమే తినాలి అన్నప్పుడు ఆ మాంసం "అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను" కాబట్టి అక్కడ పరిచర్య చేసే యాజకులు (మగవారు) మాత్రమే దానిని తినాలి. ఇంటికి తీసుకువెళ్ళకూడదు.
లేవీయకాండము 7:7
పాపపరిహారార్థబలిని గూర్చిగాని అపరాధ పరిహారార్థబలిని గూర్చిగాని విధి యొక్కటే. ఆ బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును.
"ఆ బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును" అన్నప్పుడు యాజకుడికి మాంసము మాత్రమే కాకుండా పరిహారార్థబలిని తీసుకువచ్చిన వ్యక్తి అతను దేవుని విషయంలో దొంగిలించిన దానికి ఐదవవంతు కూడా అధనంగా చెల్లించాలి. ఆ ఐదవవంతు యాజకుడిదే (లేవీకాండము 5:16).
లేవీయకాండము 7:8
ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలి పశువు చర్మము అతనిది; అది అతనిదగును.
ఈ వచనంలో దేవుడు "ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలి పశువు చర్మము అతనిది" అని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. పాపపరిహారార్థ బలిలో చర్మంతో సహా ఆ జంతువు అంతా పాళెంకి వెలుపల అగ్నితో దహించబడుతుంది (లేవీకాండము 4:11,12). దాని క్రొవ్వు మాత్రమే బలిపీఠంపై అర్పించబడుతుంది (లేవీకాండము 4:8-10). ఆ బలిలో చర్మం కూడా పాళెం వెలుపల దహించబడుతుంది కాబట్టి యాజకుడికి అది చెందదు. కానీ దహనబలిలో మాత్రం (లేవీకాండము 1) మాంసమంతా బలిపీఠంపై అర్పించబడి దాని చర్మం యాజకుడికి దక్కుతుంది. ఎందుకంటే ఈ దహనబలిలో యాజకుడికి మాంసం దక్కదు. ఈవిధంగా దేవుడు ప్రతీబలిలోనూ కష్టపడి పనిచేసే యాజకుడికి ఏదో ఒక భాగం నిర్ణయించాడు.
ఇక "ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలి పశువు చర్మము అతనిది" అన్నప్పుడు కొందరు బైబిల్ పండితులు; ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారికి చర్మపు చొక్కాయిలకై ఒక పశువు చంపబడింది. ఆ పశువును దేవుడు ఆదాము ద్వారానే చంపించియుంటాడు. అక్కడ ఆదాము తన తరపునా తన భార్యతరపునా యాజకుడిగా ఆపని చేసాడు. ఆ చర్మమే వారికి వస్త్రాలుగా మారింది కాబట్టి దానికి జ్ఞాపకార్థంగానే యాజకులకు ఇలా నియమించబడిందని భావిస్తున్నారు.
లేవీయకాండము 7:9,10
పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును, కుండలోనేగాని పెనము మీద నేగాని కాల్చినది యావత్తును, దానిని అర్పించిన యాజకునిది, అది అతనిదగును. అది నూనె కలిసినదేగాని పొడిదేగాని మీ నైవేద్యములన్నిటిని అహరోను సంతతివారు సమముగా పంచుకొనవలెను.
ఈ వచనాలలో దేవుడు నైవేద్యాల శేషం గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దేవునికి బలి అర్పణలే కాకుండా గోధుమపిండితో చేసిన నైవేద్యాలు అనగా రొట్టెలు కూడా అర్పించాలి. ఆ శేషం యాజకులకు సమానంగా చెందుతుంది. దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (లేవీకాండము 2 వ్యాఖ్యానం చూడండి).
లేవీయకాండము 7:11
ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధానబలిని గూర్చిన విధి యేదనగా -
ఈ వచనంలో దేవుడు సమాధాన బలి గురించిన విధిని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (లేవీకాండము 3 వ్యాఖ్యానం చూడండి). ఈ సమాధాన బలిలో మూడు రకాలు ఉంటాయి. కృతజ్ఞతా అర్పణ (12వ), మరియు మ్రొక్కుబడి అర్పణ, స్వేచ్ఛార్పణ (16వ). కృతజ్ఞతా అర్పణ అంటే దేవుడు చేసిన మేలులను బట్టి ఆయనకు అర్పించేది. దీనిగురించే కీర్తనాకారుడు "వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక" (కీర్తనలు 107:22) అని రాస్తున్నాడు. మ్రొక్కుబడి బలి అంటే ఆయనకు చేసుకున్న మ్రొక్కుబడులను బట్టి ఆయనకు అర్పించే బలులు "మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడె దను ఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను" (కీర్తనలు 22:25). ఇక స్వేచ్ఛార్పణ బలి అంటే ప్రేరేపణను బట్టి ఆయనకు అర్పించే బలులు.
లేవీయకాండము 7:12,13
వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ఆ పిండివంటలేకాక సమాధానబలి రూపమైన కృతజ్ఞతాబలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను.
ఈ వచనాలలో దేవుడు కృతజ్ఞతార్పణ బలి అర్పించేటప్పుడు బలి పశువే కాకుండా ఇంకా ఏమేం ఆయన సన్నిధికి తీసుకురావాలో ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అయితే ఇక్కడ వాటిలో "పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను" అని రాయబడింది. వాస్తవానికి పులిసింది ఏదీ ఆయనకు అర్పించకూడదు (నిర్గమకాండము 23:18, లేవీకాండము 2:11). కాబట్టి ఇక్కడ "పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను" అనంటే అది బలిపీఠంపై దహించడానికి కాదు. క్రింది వచనం ప్రకారం అది యాజకుడికి చెందుతుంది. "మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. అది సమాధాన బలిపశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతనిదగును" (లేవీయకాండము 7:14). అందుకే ఆ పులిసిన రొట్టెను ఒకటి మాత్రమే తీసుకురమ్మంటున్నాడు. ప్రత్యక్షగుడారంలో పరిచర్య చేసే యాజకులంతా పులియని వాటినే తినాలి. కానీ రొట్టె పులియకుంటే అది రుచికరంగా ఉండదు. అందుకే దేవుడు వారికోసం ఈ పులిసిన రొట్టెను కూడా ఆజ్ఞాపించాడు. పైగా ఈ రొట్టెలు అతని కుటుంబం కూడా తినవచ్చు. ఈవిధంగా దేవుడు యాజకుల ఆహారం విషయంలో కూడా శ్రద్ధతీసుకుంటూ వచ్చాడు.
లేవీయకాండము 7:14,15
మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. అది సమాధాన బలిపశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతనిదగును. సమాధానబలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను; దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు.
ఈ వచనాలలో దేవుడు సమాధాన బలిలోని కృతజ్ఞతాబలిలో యాజకుడికీ మరియు బలి తీసుకువచ్చిన వ్యక్తికీ లభించే మాంసం ఆరోజే తినాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. మ్రొక్కుబడి బలిలోనూ స్వేచ్చార్పణలోనూ అర్పించే బలి మాంసం ఆ మరునాడు కూడా తినవచ్చు (క్రిందివచనం) కానీ ఈ కృతజ్ఞతా బలిలో మాత్రం ఆరోజే ఆ మాంసాన్ని తినాలి. ఒకవిధంగా ఈ కట్టడ ఆయన చేసిన ఉపకారాలకై కృతజ్ఞతలు చెల్లించడానికి ఆలస్యం చెయ్యవద్దని బోధిస్తుంది.
లేవీయకాండము 7:16,17
అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దానినర్పించు నాడే తినవలెను. మిగిలినది మరు నాడు తినవచ్చును; మూడవనాడు ఆ బలిపశువు మాంస ములో మిగిలినదానిని అగ్నితో కాల్చి వేయవలెను.
ఈ వచనాలలో దేవుడు సమాధాన బలిలోని మ్రొక్కుబడి బలిలో కానీ స్వేచ్ఛార్పణ బలిలో కానీ వంతుగా వచ్చే మాంసం ఆ రోజు మరియు మరుసటి రోజు కూడా తినవచ్చని మూడవ రోజు మాత్రం తినకుండా కాల్చివెయ్యాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. వీటికి పై వచనాల ప్రకారం సమాధాన బలిలోని కృతజ్ఞతాబలిలోని మాంసం ఆరోజే భుజించాలి. మరునాటికి ఉంచుకోకూడదు. అదే సమాధాన బలికి చెందిన ఈ రెండు బలుల్లో మాత్రం మరునాడు కూడా ఆ మాంసం తినవచ్చు. ఈ మాటలు యాజకులకూ బలి తీసుకువచ్చిన వ్యక్తికీ ఇద్దరికీ చెందుతాయి.
లేవీయకాండము 7:18
ఒకడు తన సమాధానబలి పశువుమాంసములో కొంచె మైనను మూడవనాడు తినినయెడల అది అంగీకరింపబడదు; అది అర్పించినవానికి సమాధానబలిగా ఎంచబడదు; అది హేయము; దాని తినువాడు తన దోషశిక్షను భరించును.
ఈ వచనంలో దేవుడు సమాధాన బలిపశువు మాంసములో కొంచెమైనా మిగుల్చుకుని మూడవరోజు తినేవాడికి అది సమాధాన బలిగా ఎంచబడదని అనగా అది అంగీకరింపబడదని, పైగా వాడు తమ దోషశిక్షను భరిస్తాడని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇది దేవుడు చాలా కఠినంగా జారీ చేస్తున్నటువంటి ఆజ్ఞ. అంటే దేవుడు అంగీకరించని అర్పణలు కూడా ఉన్నాయి. దేవుని ఆజ్ఞ ప్రకారంగా జరిగేవే ఆయన అంగీకరించే అర్పణలు. దీనిప్రకారం నేను పైన వివరించిన మ్రొక్కుబడి బలిలో కానీ స్వేచ్ఛార్పణ బలిలో కానీ వంతుగా వచ్చే మాంసాన్ని ఎవ్వరూ మూడవరోజు తినకూడదు. అలానే పై వచనాల ప్రకారం కృతజ్ఞతార్పణ బలి మాంసాన్ని మరునాడు కూడా తినకూడదు. అలా తింటే "అది హేయము; దాని తినువాడు తన దోషశిక్షను భరించును". కాబట్టి బలి తీసుకువచ్చేవాడు తీసుకురావడంలో ఉన్న శ్రద్ధ ఆయన చెప్పినట్టుగా తినడంలోనూ వహించాలి. ఈ బలులన్నీ క్రీస్తుకు ఛాయగా ఉన్నాయి కాబట్టి వాటి మాంసం పాడు కాకూడదు.
లేవీయకాండము 7:19-21
అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తిన కూడదు; అగ్నితో దానిని కాల్చివేయవలెను; మాంసము విషయమైతే పవిత్రులందరు మాంసమును తినవచ్చును గాని ఒకడు తనకు అపవిత్రత కలిగియుండగా యెహోవాకు అర్పించు సమాధానబలి పశువుమాంసములో కొంచెమైనను తినినయెడల వాడు ప్రజలలో నుండి కొట్టివేయ బడును. ఎవడు మనుష్యుల అపవిత్రతనేగాని అపవిత్రమైన జంతువునేగాని యే అపవిత్రమైన వస్తువునేగాని తాకి యెహోవాకు అర్పించు సమాధాన బలిపశువు మాంసమును తినునో వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును.
ఈ వచనాలలో దేవుడు ఆ మాంసము గురించి మరికొన్ని ఆజ్ఞలు జారీచెయ్యడం మనం చూస్తాం. వాటి ప్రకారం; శుభ్రంగా లేనిది ఏదైనా ఆ మాంసానికి తగిలినప్పుడు దానిని కాల్చివెయ్యాలి. అలానే అపవిత్రమైన జంతువులను కానీ మనుషులను కానీ తాకి ఆ మాంసాన్ని తాకినప్పుడు కూడా అది అపవిత్రమౌతుంది కాబట్టి దానిని కాల్చివెయ్యాలి. దీనికి సంబంధించిన మాటలనే హగ్గయిలో మనం చదువుతాం.
హగ్గయి 2:12,13 ఒకడు ప్రతిష్టితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని, తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏవిధమగు భోజనపదార్థమునైనను ముట్టినయెడల, ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా? యని యాజకులనడుగగా వారు కాదనిరి శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టివాటిలో దేనినైనను ముట్టినయెడల తాను ముట్టినది అపవిత్రమగునాయని హగ్గయి మరల నడుగగా యాజకులు అది అపవిత్రమగుననిరి.
దీనిప్రకారం అపవిత్రమైనది పవిత్రమైన అర్పణలను తాకినప్పటికీ ఆ అపవిత్రమైనది పవిత్రమవ్వదు పైగా ఆ పవిత్రమైనది అపవిత్రంగా ఎంచబడుతుంది. ఇది సులభంగా అపవిత్రపరిచే పాపం విషయం లో హెచ్చరికగా చెప్పబడుతుంది. అంటే మన పవిత్రత ఇంకొకరికి సోకదు కానీ వారి అపవిత్రత మనకు సోకుతుంది కాబట్టి పాపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
ఇక పవిత్రులు మాత్రమే ఆ మాంసాన్ని తినాలి. అపవిత్రులు అనగా అపవిత్రజంతు కలేబరాలను ముట్టినవారు కానీ, ధర్మశాత్రం అపవిత్రంగా చెబుతున్నటువంటి రోగాల కారణంగా అపవిత్రులైనవారు కానీ (కుష్టు, స్రావము) ఆ మాంసాన్ని తినకూడదు. అలా తిన్నవాడు "ప్రజలలో నుండి కొట్టివేయబడును" ఎందుకంటే ఈ బలులు క్రీస్తుకు ఛాయగా ఉన్నాయి. అపవిత్రమైన జీవితాలు జీవిస్తూ ప్రభువుబల్లలో పాల్గోకూడదని ఈ నియమం మనకు నేర్పిస్తుంది. అందుకే పేతురు "ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి" (1 పేతురు 2:1-3) అని రాస్తున్నాడు.
లేవీయకాండము 7:22,23
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఎద్దుదేగాని గొఱ్ఱెదేగాని మేకదేగాని దేని క్రొవ్వును మీరు తినకూడదు.
ఈ వచనాలలో దేవుడు క్రొవ్వును తినకూడదని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అంటే ఏ జంతువు క్రొవ్వును తినకూడదని కాదు కానీ 25వ వచనం ప్రకారం ఆయనకు దహనబలిగా అర్పించే జంతువుల క్రొవ్వును తినకూడదు. ఆ క్రొవ్వును ఆయనకు మాత్రమే అర్పించాలి. క్రొవ్విన మాంసాన్ని కానీ క్రొవ్విన మెదడును కానీ తినవచ్చు (ద్వితీయోపదేశకాండము 32:14, కీర్తనలు 63:5).
లేవీయకాండము 7:24
చచ్చినదాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దానినే మాత్రమును తినకూడదు.
ఇశ్రాయేలీయులు చనిపోయిన జంతువును కూడా తినకూడదు (ద్వితీయోపదేశకాండము 14:21) అలానే దాని క్రొవ్వును కూడా తినకూడదు కానీ ఆ క్రొవ్వును ఇతరపనులకు ఉపయోగించవచ్చు. అనగా దీపాలకై నూనెను తయారు చెయ్యడం వంటివి.
లేవీయకాండము 7:25-27
ఏలయనగా మనుష్యులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వు నైనను తినినవాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును. మరియు పక్షిదేగాని జంతువుదేగాని యే రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు. ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును.
ఈ వచనాలలో దేవుడు ఆయనకు అర్పించే క్రొవ్వును తినకూడదని అలానే రక్తాన్ని అయితే అసలే తినకూడదని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అంటే ఏ జీవి రక్తాన్నీ కూడా తినకూడదు. క్రొత్తనిబంధన విశ్వాసులమైన మనకు కూడా ఈ నియమం వర్తిస్తుంది (అపొ.కా 15:19,20,28). కారణమేంటో నేను ఇప్పటికే వివరించాను (ఆదికాండము 9:4 వ్యాఖ్యానం చూడండి).
లేవీయకాండము 7:28-30
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఎవడు యెహోవాకు సమాధానబలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించునది యెహోవా సన్నిధికి తేవలెను. అతడు తన చేతులలోనే యెహోవాకు హోమద్రవ్యములను, అనగా బోర మీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను.
ఈ వచనాలలో దేవుడు సమాధాన బలిగురించి మరొకొన్ని విషయాలను ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దీనిప్రకారం బలి పశువును తీసుకువచ్చిన వ్యక్తే దేవునికి అర్పించవలసిన భాగాలను తీసుకురావాలి. అనగా ప్రత్యక్షగుడారపు ద్వారం దగ్గర యాజకుడు ఆ పశువును చంపి సిద్ధం చేసాక బలిపీఠంపై అర్పించబడే భాగాలను మరియు బోరను అతను తన చేతులతో తీసుకురావాలి.
లేవీయకాండము 7:31-33
యాజకుడు బలిపీఠము మీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని, బోర అహరోనుకును అతని సంతతివారికిని చెందును. సమాధాన బలిపశువులలో నుండి ప్రతిష్ఠార్పణముగా యాజకునికి కుడి జబ్బనియ్యవలెను. అహరోను సంతతివారిలో ఎవడు సమాధానబలియగు పశువురక్తమును క్రొవ్వును అర్పించునో కుడిజబ్బ వానిదగును.
ఈ వచనాల ప్రకారం; పశువు యొక్క బోర మరియు కుడి జబ్బ యాజకుడికి చెందుతుంది. క్రొవ్వు మరియు కాలేజము మీద పప దేవునికి బలిపీఠంపై అర్పించబడుతుంది. మిగిలిన భాగాలు బలి తీసుకువచ్చిన వ్యక్తికి చెందుతాయి. అలానే చర్మం కూడా యాజకుడికే చెందుతుంది. ఈ నియమమే పౌలు సంఘ బోధకులకు కూడా అన్వయించి సువార్త చేసేవారు దానిచేత పోషించబడాలని సంఘం ఆ విధంగా వారికి సహాయం చెయ్యాలని బోధించాడు (1 కొరింథీ 9:13,14, 1 తిమోతీ 5:17-19).
లేవీయకాండము 7:34-36
ఏలయనగా ఇశ్రా యేలీయుల యొద్ద నుండి, అనగా వారి సమాధానబలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసికొని, నిత్యమైన కట్టడచొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతివారికిని ఇచ్చియున్నాను. వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమద్రవ్య ములలో నుండి నది అభిషేకమునుబట్టి అహరోనుకును అభిషేకమునుబట్టియే అతని సంతతివారికిని కలిగెను. వీటిని ఇశ్రాయేలీయులు వారికియ్యవలెనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను.
ఈ వచనాలలో దేవుడు అహరోనును ఆయన యాజకుడిగా ప్రతిష్టించడాన్ని బట్టే అతని వంశమంతటికీ ఈ ఘనత కలిగినట్టుగా తెలియచెయ్యడం మనం చూస్తాం. ఇది కేవలం ఆయన ఏర్పాటును బట్టే జరుగుతుంది. ఆయన మోషేను నాయకుడిగా ఎన్నుకున్నాడు అహరోను వంశాన్ని తరతరాల పాటు ప్రధానయాజలుగా యాజకులుగా ప్రతిష్టించాడు.
లేవీయకాండము 7:37
ఇది దహనబలిని గూర్చియు అప రాధపరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాపపరిహా రార్థబలిని గూర్చియు అపరాధ పరిహారార్థబలిని గూర్చియు ప్రతిష్ఠితార్పణమును గూర్చియు సమాధానబలిని గూర్చియు చేయబడిన విధి.
ఇక్కడ ప్రస్తావించబడిన బలులూ నైవేద్యాలన్నీ ఈ పుస్తకం మొదటి అధ్యాయం నుండి ఈ అధ్యాయం వరకూ మనం గమనిస్తాం. భవిష్యత్తులో ఏ యాజకుడు బలి అర్పించినా ఈ నియమాలను బట్టే అర్పించాలి.
లేవీయకాండము 7:38
ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణ ములను తీసికొని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఆలాగుననే ఆజ్ఞాపించెను.
ఈ వచనం ప్రకారం; ఈ ఆజ్ఞలన్నీ దేవుడు సీనాయి పర్వతంపై మోషేకు ఆజ్ఞాపించాడు. "ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణ ములను తీసికొని రావలెనని" అనంటే నిర్గమకాండము 25నుండి ఈ భాగం మొదలౌతుంది. కానీ ఇదంతా జరిగిపోయాక మోషే రాస్తున్నాడు కాబట్టి ఆ మధ్యలో జరిగిన విషయాలను కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చాడు.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
లేవీయకాండము అధ్యాయం 7
లేవీయకాండము 7:1
లిని గూర్చిగాని విధి యొక్కటే". ఈ బలిని దేవునికి సంబంధించిన విషయాలలోనూ, సహోదరుల విషయంలోనూ పాపం చేసినప్పుడు అర్పించాలి (లేవీకాండము 5:15-19, 6:1-5 వ్యాఖ్యానాలు చూడండి).అపరాధపరిహారార్థబలి అతిపరిశుద్ధము. దాని గూర్చిన విధి యేదనగా-

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"