దావీదు పాపం గురించి మనం ఎన్నోసార్లు వినుంటాము, కాని బత్షెబ పాపాన్ని ఎవరైనా ప్రస్తావించడం చాలా అరుదు. దావీదు పాపం బుద్ధిపూర్వకమైనది, దురభిమానంతో కూడినది కాగా బత్షెబ పాపం కేవలం అజ్ఞానం వలన జరిగింది. దావీదు పాపం ఘోరమైనది, బత్షెబ పాపం చిన్నదనే విషయంలో మనకెటువంటి సందేహమూ లేదు. అయినప్పటికీ, దావీదు యొక్క ఘోర పాపానికి బత్షెబ యొక్క చిన్న పాపమే కారణమయ్యిందన్నది వాస్తవం. అనాలోచితంగా, అజాగ్రత్తగా తన నగ్నశరీరాన్ని చూపించిన ఆమె 'చిన్న పాపం', దహించివేసే మంటను రగిలించిన నిప్పుకణమయ్యింది. "ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును! (యాకోబు 3:5)”
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.