వివాహం అంటేనే కష్టంతో కూడుకున్నది. సాధారణంగా సగటు వ్యక్తి రోజుకి 7 నుండీ 9 గంటలు పని చేస్తాడు. అలా లెక్కిస్తే వారానికి 40 నుండీ 60 గంటలు పని చేస్తాడు. కానీ వివాహ బాంధవ్యం కోసం ప్రతి ఒక్కరూ వారానికి 168 (24x7) గంటలూ, అలా 365 రోజులూ పని చెయ్యాల్సి ఉంటుంది. వివాహ బాంధవ్యానికి సెలవులు ఉండవు. అయితే 'కష్టపడటం' అంటే భారంగా, అయిష్టంగా, తప్పక, దుఃఖంతో పని చేయడమనేది నా ఉద్దేశ్యం కాదు. అటువంటిదాని గురించి కాదు నేను మాట్లాడేది. వివాహ బాంధవ్యం గురించి కష్టపడటం అంటే వివాహ సంబంధాన్ని జాగ్రత్తగా పట్టించుకోవడం. తోటి భాగస్వామికి త్యాగపూరితంగా సేవ చెయ్యడం కోసం, వారిని ప్రేమించి, ఆదరించి, బలపరిచి, ఎదిగించడం కోసం నిన్ను నువ్వు సమర్పించుకోవడం. ఇది ప్రేమతో, ఇష్టంతో చేసేటువంటి పని.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.