బైబిల్ కావాలా బైబిల్ మిషను కావాలా? అనే మా పుస్తకం యొక్క లింక్ " https://hithabodha.com/books/answer-to-false-doctrines/352-want-the-bible-or-want-the-bible-mission.html " అబద్ధాలకు దాగని ఆట్మనమ్మ గది - బైబిల్ మిషన్ కు మళ్ళీ సవాల్ | Bible Mission Challenged again by Bibu - https://youtu.be/Q0--6ERTsAk
దేవదాసు అయ్యగారి జీవిత చరిత్రగా బైబిల్ మిషను వారు ప్రచురించిన పుస్తకం 59-61 పేజీలలో దేవదాసు అయ్యగారితో సహా మొత్తం ఐదుగురు కలసి ప్రభువు వారితో మాట్లాడిన మాటలన్నిటినీ రాసి ఆ ప్రతులను ఒక పెద్ద గదిలో భద్రపరిచారనీ, వాటిని కనుక అచ్చువేస్తే ఇప్పుడున్న 100 బైబిళ్ళకు ఆ గ్రంథం సామానం ఔతుందనీ, ఇతరులు ఎవరైనా ఆ గదిలోకి వెళ్తే చనిపోతారనీ తెలియచేసారు.
ఆ మాటలు వారి పుస్తకంలో ఉన్నది మీరే చదవండి -
"మిస్సమ్మగారు ప్రభువు చెప్పేవన్నీ నోట్స్ లో వ్రాసి, టిన్ డబ్బాలో పెట్టి సీలు చేసేవారు. మన ఎదరనున్న గదికంటే అది పెద్దగది. ప్రభువు చెప్పగా వ్రాసిన పుస్తకాలన్నిటితో ఆ గది నిండిపోయినది. అయ్యగారి పుస్తకం కూడా అందులో ఉన్నది. ఆ 5గురు చనిపోయిరి కాని ఆ గదిని, ఆ గదిలోనున్న వ్రాతలు అన్ని రాకడ వరకు ఉండునని వారు నిరీక్షించారు. వారు రాకడ వరకు ఉంటామని నమ్మి, ఆ వ్రాతలు వారికి ప్రభువు అప్పజెప్పితే, రాకడ వరకు ఉంటవని భద్రపరచిరి. ఆ వ్రాతలన్నీ తీసి అచ్చువేస్తే తెలుగు బైబిళ్లు సుమారు 100 బైబిళ్లు అవ్వచ్చు. అవి లోకమంతటికి పంపాలి.
ఆ పుస్తకమునకు దిట్టమైన ఖరీదు వేయాలి. అని ప్రభువు చెప్పారు. ఈ మెంబర్లంతా భయపడ్డారు. ఆ ఖరీదు కూటస్థులు పెట్టుకోవాలి. రాబోయే ప్రజలు అనగా ఇవి కొనబోయే ప్రజలు భాగ్యవంతులై ఉంటారనుకొన్నారు. వారికి ఇప్పుడున్నంత జీతములులేవు. (జీవిత చరిత్ర, పే నెం.59,60)"
"ఆట్మనమ్మ గారు వ్రాతలున్నవి. అవి ఎప్పుడు తీస్తారు. ఎప్పుడు అచ్చువేస్తారు? అని వారు ప్రభువును అడిగినవారు. ఆ పుస్తకము ఎప్పుడు అచ్చువేస్తారు. ఆ గది తాళము తీయడానికే ఇంకా తండ్రి సెలవు రాలేదు. ఆ తాళము ఎవరైనా విప్పితే వారికి హాని. దైవ సన్నిధి, దైవ వ్రాతలు; ఏర్పాటు ఉంటే తప్ప ఇతరులు వెళ్లితే చనిపోతారు (జీవిత చరిత్ర పే నెం. 61)"
ఇక్కడ నేను బైబిల్ మిషన్ వారికి విసురుతున్న సవాల్ ఏంటంటే, ఇతరులు ప్రవేశిస్తే చనిపోతారని మీరు భయపెడుతున్న ఆ గది ఎక్కడుందో నాకు చూపించండి. ఎందుకంటే,
ఈరోజు ఎంతోమంది అన్యులు కూడా బైబిల్ ని తప్పుపట్టాలనే ఉద్దేశంతో చదువుతున్నారు కానీ వారెవ్వరూ చనిపోవడం లేదు. అలాంటప్పుడు ఇతరులు ఎవరైనా (క్రైస్తవులే) ఆట్మనమ్మగారి రచనలు ఉన్న గదిలోకి వెళ్తే మాత్రం ఎందుకు చనిపోతారు? అంటే ఆ రచనలు బైబిల్ కంటే గంభీరమైనవి, పవిత్రమైనవి, ప్రతిష్ఠితమైనవి అని మీరు చెప్పాలనుకుంటున్నారా?
ఈ విషయంలో నేను చావడానికైనా తెగిస్తాను కానీ అందులో ఎంతమట్టుకు వాస్తవముందో తెలుసుకోకుండా మాత్రం వెనక్కు తగ్గను, నాకు చావంటే అస్సలు భయం లేదు. కాబట్టి మీరు తెలియచేసిన ఆ గది నిజంగా ఉంటే అది ఎక్కడుందో నాకు చూపించాలి. ఒకవేళ మీరు చూపించలేకపోతే, మీ ప్రచురణలలో మీరు చెబుతున్నవన్నీ ఇలాంటి అభూతకల్పనలే అని ఒప్పుకుంటూ క్రైస్తవ సమాజానికీ, దేవునికీ క్షమాపణ చెప్పాలి. మీ రచనలన్నిటినీ ఉపసంహరించుకోవాలి.
అసలు మీ రచనల్లో సత్యముందా, లేక నా రచనల్లో సత్యముందా అనేది దీనిని బట్టి అందరి ముందూ రుజువౌతుంది. నేను మీకు సవాలు చేస్తున్నాను, మీ నిజాయితీ నిరూపించుకోవటానికి ఇది మీకో సువర్ణావకాశం. ఏవేవో సాకులు చెప్పి మీరు వెనుకకు తగ్గితే మాత్రం అదే మీ ఓటమిగా అందరూ అర్థం చేసుకోవలసి వస్తుంది సుమా! అప్పుడు మీరు అబద్ధికులని అందరికీ (విచక్షణతో ఆలోచించేవారికి) తెలిసిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే, మీరు చెబుతున్నట్టు ఆ గది ఎక్కడుందో నాకు తెలియచెయ్యండి. నేను అందులోకి వెళ్ళి మీరు రాసినట్టే చనిపోతే, మీరు చెప్పింది నిజమేనని ప్రపంచం గుర్తిస్తుంది, అది మీకే మంచిది కదా! దానివల్ల మీ బైబిల్ మిషన్ మరింత అభివృద్ధి చెందుతుంది.
ఇది చదువుతున్న సాధారణ విశ్వాసులు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సవాలును నేను నా గర్వంతోనో, అత్యుత్సాహంతోనో, అధిక సాహసంతోనో చెయ్యడం లేదు. దేవుడు ప్రత్యక్షపరచిన మాటలు బైబిల్ గ్రంథంలో తప్ప మరెక్కడా లేవనే స్థిరమైన, బలమైన, విశ్వాసం ఆధారంగా మాత్రమే ఈ సవాలు చేస్తున్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే, బైబిల్ మాత్రమే దేవుడు రాయించిన గ్రంథమని నిరూపించడానికే ఈ సవాల్.
ఈ సవాలును నేను మొదటిసారిగా జూన్ 21, 2021లో నా వెబ్ సైట్ లో ప్రచురించి మరోసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఆట్మనమ్మగారి రచనలున్న ఆ గది అడ్రస్ నాకు డిసెంబర్ 21, 2021లోపు బైబిల్ మిషన్ వారు తెలియచేయకపోతే, అందులోకి నేను మీడియాముఖంగా ప్రవేశించి చనిపోకపోతే, బైబిల్ మిషను మొత్తం బూటకమని తేలిపోతుంది, దానిని క్రైస్తవ సమాజం అంతా వివేకం కలిగి అంగీకరించాలి.
దేవదాసు అయ్యగారి బోధల బాగోతాన్ని బయటపెడుతూ, జూన్ 21వ తారీఖున మా వెబ్ సైట్ లో నేను ప్రచురించిన వ్యాసాన్ని పైన ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు చదవండి, చేతనైతే దీనిపై కూడా బైబిల్ మిషను వారు స్పందించి నేను రాసినవి వాక్యానుసారంగా సరికావని మరియు వారి అయ్యగారి బోధలు పూర్తిగా వాక్యానుసారమని నిరూపించుకోవాలి.
బైబిల్ మిషను వారి ప్రతిస్పందన కొరకు ఎదురుచూస్తూ, బ్రదర్ బిబు
===================================================
మరిన్ని ఉపయోగకరమైన బైబిల్ సంబంధిత సాహిత్యం కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి - https://hithabodha.com/
మరిన్ని వీడియోస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి - https://www.youtube.com/@hithabodha/
మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి - https://www.facebook.com/hithabodha/
మా ట్విట్టర్ అకౌంట్ / Twitter -- https://twitter.com/hithabodha
హితబోధ' ఆండ్రాయిడ్ ఆప్/Android App - https://play.google.com/store/apps/details?id=com.goopages.hithabodha1 ను డౌన్ లోడ్ చేసుకోండి.
ఈ 'హితబోధ' వెబ్ సైట్ ను మీకు తెలిసినవారందరికీ పరిచయం చేయండి