నిజ విశ్వాసం - నకిలీ విశ్వాసం by Brother Bibu

https://hithabodha.com/books/salvation/181-true-faith-and-counterfeit-faith

నిజ విశ్వాసం, నకిలీ విశ్వాసం - జి. బిబు “ఆయనతో కూడా సహవాసముగలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల మనము అబద్దమాడుచూ సత్యమును జరిగింపకుందుము” (1 యోహాను 1:6) యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినవారందరూ రక్షణలో ఉన్నారా? ఈ ప్రశ్న వివాదాస్పదమైనదని నాకు తెలుసు. ఐనా ఇది అనేకుల రక్షణకు సంబంధించిన ప్రశ్న కాబట్టి అడుగుతున్నాను. ఎందుకంటే నిజమైన విశ్వాసంలాగే కనిపిస్తూ భ్రమపరిచి, మోసగించే ఒక నకిలీ విశ్వాసం కూడా ఉందని బైబిల్ హెచ్చరిస్తుంది. “ప్రభువా,ప్రభువా” అని పిలిచేవారందరూ పరలోకవారసులు కారని, అనేకులకు బోధించి భ్రష్టులైపోయే అవకాశముందని, ఆయన నామమందు ప్రవచించి, దయ్యములను వెళ్లగొట్టి, అనేక అద్భుతాలు చేయటం పరలోక ప్రవేశానికి అర్హతలు కానక్కరలేదని, ఇలా అనేక విధాలుగా పైన నేను చెప్పిన సత్యాన్ని బైబిల్ నిర్థారిస్తుంది. కాబట్టి విశ్వసించింది యేసునే అయినా, అందులో కూడా రక్షణార్థమైనది, రక్షణార్థం కానిది అనే రెండు రకాల విశ్వాసాలు ఉన్నాయి - నిజవిశ్వాసం,నకిలీ విశ్వాసం; అన్ని విశ్వాసాలూ రక్షణకు దారితీసేవి కావు. నకిలీ అంటేనే, అసలుదానిలా కనిపించి, మోసగించేది అని అర్థం. ఈ రెండిటి మధ్య ఉన్న పోలికలనూ, వ్యత్యాసాలను మనం ఈ ప్రసంగంలో జాగ్రత్తగా పరిశీలించి,మనల్ని మనం పరీక్షించుకుందాం

===================================================

మరిన్ని ఉపయోగకరమైన బైబిల్ సంబంధిత సాహిత్యం కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి - https://hithabodha.com/

మరిన్ని వీడియోస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి - https://www.youtube.com/hithabodha/

మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి - https://www.facebook.com/hithabodha/

మా ట్విట్టర్ అకౌంట్ / Twitter -- https://twitter.com/hithabodha

హితబోధ' ఆండ్రాయిడ్ ఆప్/Android App - https://play.google.com/store/apps/details?id=com.goopages.hithabodha1 ను డౌన్ లోడ్ చేసుకోండి.

 

ఈ 'హితబోధ' వెబ్ సైట్ ను మీకు తెలిసినవారందరికీ పరిచయం చేయండి

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.