ప్రశ్నోత్తరాలు

What did Jesus mean when he said 'Do you think that I have come to give peace on earth? No, I tell you, but rather division'?(Luke 12:51-53; Matthew 10:34-35).

జవాబు: యేసుక్రీస్తు పాపుల రక్షకుడని వాక్యం చెబుతుంది (1 తిమో 1:15); ఐతే ఈ రక్షణ అంగీకరించినవారికి, తిరస్కరించిన వారికి మధ్య విరోధం తప్పకుండా వుంటుంది. ఈ ఉదాహరణ గమనించండి - కుల బేధాలతో నిండియున్న సమాజంలోని ఒక యువకుడు సువార్తకు ప్రభావితుడై 'కుల కట్ల” నుండి విడుదల కావాలని ఆరాటపడతాడు. తరతరాలుగా పాతుకుపోయిన సాంఘిక దురాచారాల మీద కొరడా ఝళిపించాలని, వాటి నుండి తమ కుటుంబసభ్యులను విడిపించాలని ఆకాంక్షిస్తాడు. అలా తాను వినిన క్రీస్తు సువార్తను తన వారికి ప్రకటించి వారిని కూడా దైవసన్నిధికి నడిపించాలని ఆశపడతాడు. ఐతే అది అనుకున్నంత సులువైన పని కాదు. తన ఇంటివారితో అతడు పోరాడవలసి వస్తుంది. అది సాయుధ పోరాటం కాదు, భావ పోరాటం లేక సూత్రపోరాటం. తనకూ ఇంటివారికీ మధ్య తర్జనబర్జనలు జరుగుతాయి. తన ఇంటివారిలో కరుడు కట్టుకుపోయిన మూఢనమ్మకాలను, కులకట్లను తన భావజాలపోరాటం ద్వారా దహించి వేయాలని అతడు అభిలాషిస్తాడు, దీనివలన వారిలో వారికి భేదాభిప్రాయాలు రావచ్చు. ఆ పోరాటంలో ఆతనికి తన కుటుంబసభ్యులు శత్రువులుగా మారవచ్చు. వారు అతనిని హింసకు కూడా గురిచేయవచ్చు (మత్తయి 10:21-22). యేసు చెప్పింది ఇలాంటి ఖడ్గాన్ని గురించే.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.