ప్రశ్నోత్తరాలు

What is the meaning of Jesus' words : "Let the dead bury their dead"? (Luke 9:20; Matthew 8:22). 

 

Q 1 Article Release long Death min

 

జవాబు: యేసు ఒక వ్యక్తితో 'తనను వెంబడించమని' చెప్పాడు (లూకా 9:59). యేసును వెంబడించాలనుకున్న ఆ వ్యక్తి - '...... ప్రభువా, నేను మొదట వెళ్ళి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను" అడిగెను. ఈ శిష్యుడు చనిపోయిన తన తండ్రి మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని యేసు బోధ వినడానికి రాలేదు. అలా వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రం ప్రకారం, మరణించినవాని ఇంటివారు ఏడు దినముల వరకూ అపవిత్రంగా ఉంటారు (సంఖ్యా 19:11-20). తమ అపవిత్రత వలన ఇతరులు మైలపడకుండా తమను తాము వేరుగా ఉంచుకోవడం వారి పద్ధతి (సంఖ్యా 19:22). కాబట్టి మృతదేహం ఇంటిలో పెట్టుకుని ఇశ్రాయేలీయుడైన ఈ వ్యక్తి జనసమూహం మధ్యకు వచ్చే అవకాశం లేదు.

ఒకవేళ అతని తండ్రి అప్పటికే చనిపోయి ఉన్నా, అతన్ని పాటిపెట్టి, ఆపై వచ్చి యేసును వెంబడించడానికి ఆటంకం ఏం ఉంటుంది? అలా చేయడానికి పర్మిషన్ అడగాల్సిన అవసరం కూడా లేదు. పైగా యేసు గొప్పతన్నాన్ని గుర్తించి ఆయనకు శిష్యరికం చేసేంతగా ఒప్పించబడినవాడు, చనిపోయిన తన తండ్రిని పాతిపెట్టే అనుమతి కోరడం కంటే, అతనిని బ్రతికించమని ప్రాధేయపడి ఉండాలి కదా?

కాబట్టి తన తండ్రికి మరణపర్యంతము సేవలు చేసి అంత్యక్రియల వరకూ తన బాధ్యతలు నిర్వర్తించి, ఆపై వచ్చి యేసును వెంబడించడానికి ఆ శిష్యుడు అనుమతి కోరుతున్నాడు. ఐతే యేసు భూమిపై ఉండాల్సిన గడువు అతి త్వరలో ముగియబోతున్న నేపథ్యంలో, ఆ అనుమతి ఇవ్వడం సాధ్యపడదు. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ గమనిద్దాం. దేశసరిహద్దులలో కాపలాగా ఉండే జవానుకు ఒక్కసారిగా తన తల్లితండ్రులను చూసుకోవాలనో, వారి బాధ్యతలను తీర్చాలనో అనిపించింది. ఇంతలో యుద్ధఘడియలు ముంచుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో, వ్యక్తిగత బాధ్యతలకంటే దేశం యొక్క శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇవ్వాలి; కాబట్టి సదరు జవాను కోరిక మన్నించలేదంటే దానికి మనం మిలిటరీ చట్టాన్ని తప్పు పడితే అది మన తెలివితక్కువతనమే అవుతుంది. ఎందుకంటే అక్కడున్న అత్యవసర పరిస్థితుల్లో అతను అక్కడే ఉండడం అవసరం. అలాగే ఆ శిష్యుడు వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రికి మరణపర్యంతమూ సేవ చేసి తిరిగి వచ్చేసరికి యేసు పరిచర్య కాస్తా ముగిసిపోవచ్చు. మూడున్నర సంవత్సరాల వరకూ మాత్రమే చేయాల్సిన ఆయన పరిచర్యలో అప్పటికే ఎంతో సమయం గడిచిపోయింది. ఈ అత్యవసర పరిస్థితిలో ఇంటి పనులు చూసుకోవడానికి అనుమతి కోరడం సమంజసం కాదు.

అందుకు యేసు అతని చూచి - నన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను.' చదవగానే ఈ మాటలు కొందరికి అర్థరహితంగానూ, మరికొందరికి అన్యాయంగానూ అనిపించవచ్చు గానీ, యేసు మాటల వెనకున్న అసలు భావాన్ని సందర్భం అంతటిలోనుండీ గ్రహించే ప్రయత్నం చేద్దాం.

ఇక్కడ యేసు భౌతికంగా మరణించిన వారి గురించి మాట్లాడటం లేదు, ఆధ్యాత్మికంగా మరణించిన వారి గురించి మాట్లాడుతున్నాడు (ఎఫెసీ 2:1). బహుశా అతని కుటుంబ సభ్యులు అవిశ్వాసులు అయ్యుంటారు. వారు అపరాధములచేతను పాపములచేతను .. చచ్చినవారు గనుక యేసు వారిని మృతులు అని అన్నాడు (ఎఫెసీ 2:1,5). 'ఆధ్యాత్మికంగా చనిపోయిన నీ ఇతర కుటుంబ సభ్యులు నీ తండ్రిని పాతపెట్టనిమ్ము. నువ్వు నన్ను వెంబడించు' అన్నది యేసు మాటల అసలు భావం.

యేసు పరిచర్య కాలపరిమితి అతి స్వల్పమైనది మరియు అనుమతి కోరిన ఆ శిష్యుని ఇంట్లో తన తండ్రి పట్ల బాధ్యతను నిర్వర్తించగలిగే ఇతరులు కూడా ఉన్నారనీ తాను వెళ్తేనే తప్ప అది జరగదనే అత్యవసర పరిస్థితేమీ అక్కడ లేదనీ స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఆ పనులు చూసుకునే అనుమతి ఆ శిష్యునికి లభించలేదు.

అంతమాత్రాన తల్లిదండ్రులను నట్టేట మునగనిమ్మని, వారిపట్ల బాధ్యతలు నెరవేర్చవద్దని యేసు భావం కాదు. ఇందుకు భిన్నంగా, కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలో ఎలాంటి జాప్యం జరగకూడదనేదే బైబిల్ బోధించే సాధారణ నియమం. “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్నా చెడ్డవాడై యుండును”(1 తిమోతి 5:8). ఇదే ఆదర్శాన్ని కనపరుస్తూ, తల్లిదండ్రుల బాధ్యతను దైవసేవ పేరిట నిరాకరించే విధంగా ప్రేరేపించిన పరిసయ్యులను యేసు తీవ్రంగా ఖండించిన మరో సందర్భం మార్కు 7:10-13 లో కనబడుతుంది.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.