Is the Word God?
యోహాను 1:1- "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను".
కొంతమంది బోధకులు, ఈ వచనంలో రాయబడిన వాక్యము అనే దేవుణ్ణి మన చేతిలోని బైబిల్ కి ఆపాదిస్తూ, బైబిలే దేవుడనే మాటలు చెప్తుంటారు. బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన దేవుని మాటలే కానీ బైబిలే దేవుడు కాదు. యోహాను 1:1ని దాని సందర్భంతో కలిపి చదివితే, అవి యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాటలని స్పష్టంగా అర్థమౌతుంది.
యోహాను 1:14 - "14. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; ...".
బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుకు పెట్టబడిన పేర్లలో ఒకానొక పేరే ఈ దేవుని వాక్యము.
ప్రకటన 19:13 - "రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొనియుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది".
పాత నిబంధనలో అనేక చోట్ల, యెహోవా వాక్యము/వాక్కు భక్తులను దర్శించినట్లుగా మనకి కనిపిస్తుంది (ఆది 15:1, 1 సమూ 15:10). వాక్యము అనేది కేవలం దేవుని మాటే అయితే అది వినిపించాలే తప్ప కనిపించకూడదు. కానీ ఆ వాక్యము ఒక వ్యక్తివలె వారిని దర్శించి, తానే దేవునిగా మాట్లాడతాడు. పాతనిబంధన లేఖనాలను బట్టీపట్టే యూదులందరికీ ఇది సాధారణంగా తెలిసిన విషయమే. ఆ భక్తులను దర్శించిన యెహోవా వాక్కు/వాక్యము మరెవరో కాదు, శరీరధారిగా మన వద్దకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువే అని యూదులకు అర్థమయ్యేలా చెప్పేందుకు యోహాను ఆ విధంగా తన సువార్త ప్రారంభ వచనంలో ఆయనను వాక్యము అనే పేరుతో సంబోధిస్తూ రాస్తున్నాడు. అది అక్షరాలా మనచేతిలో ఉన్న వాక్యం (బైబిల్) కాదు, త్రియేక దేవునిలో రెండవ వ్యక్తిగా ఉన్న యేసుక్రీస్తు కలిగున్న నామం
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.