సంఖ్యాకాండము 6:1-4 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. పురుషుడేగాని స్త్రీయేగాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్నుతాను ప్రత్యేకించు కొనినయెడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు; ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు; పచ్చివిగాని యెండి నవిగాని ద్రాక్షపండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నియు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టిన దేదియు తినవలదు.
ఈ వచనాలలో దేవుడు తనకు నాజీరు చేసుకోవడానికి నిర్ణయించుకున్నవారు ఆ నాజీరు దినాల్లో మద్యాన్ని కానీ ద్రాక్షరసాన్ని కానీ త్రాగకూడదని ద్రాక్షకు సంబంధించిన చిన్న భాగం కూడా తినకూడదని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. నాజీరు అంటే స్వచ్చందంగా దేవునికోసం ప్రత్యేకంగా ఉండడం అని అర్థం. కొందరు భక్తులు కొన్ని దినాలను దానికి కేటాయించుకుని ఆయనకోసం ప్రత్యేకంగా ఉండేవారు. వారు మద్యాన్ని కానీ ద్రాక్షరసాన్ని కానీ ఎందుకు త్రాగకూడదంటే; మద్యమూ ద్రాక్షరసమూ వ్యక్తిగత సంతోషానికి సంబంధించిన ద్రావకాలు (కీర్తనలు 104:15), అందుకే వాటిని త్రాగుతారు. పైగా అవి స్వీయ నియంత్రణ కోల్పోయేలా చేసే స్వభావం కలవి. దేవునికి నాజీరు చెయ్యబడినవారు పూర్తి నియంత్రణ కలిగియుండాలి మరియు ఆయనమాత్రమే వారి సంతోషంగా ఉండాలి కాబట్టి నియంత్రణ కోల్పోయేలా చేసే మరియు వ్యక్తిగత సంతోషాన్ని కల్పించే మద్యాన్ని ద్రాక్షరసాన్ని త్రాగకూడదు. చివరికి వాటికి మూలమైన ద్రాక్షలోని చిన్న భాగం కూడా తినకూడదు. ఎందుకంటే వారు పూర్తిగా తమ వ్యక్తిగత సంతోషాలను వదిలిపెట్టి పూర్తి నియంత్రణతో దేవునికోసం ప్రత్యేకంగా ఉండాలి.
ఈ నియమాన్ని బట్టి దేవునికోసం ప్రత్యేకంగా పిలవబడినవారు లేక సమర్పించుకున్నవారు ఆయనమాత్రమే తమ పూర్తి సంతోషంగా భావించాలని, ఆయనకోసం పూర్తి నియంత్రణతో జీవించాలని నేర్చుకుంటున్నాం. "మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మపూర్ణులైయుండుడి. ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి" (ఎఫెసీ 5:18-21) అనే వాక్యభాగం అదే బోధిస్తుంది.
సంఖ్యాకాండము 6:5 అతడు నాజీరగుటకు మ్రొక్కు కొనిన దినములన్నిటిలో మంగలకత్తి అతని తలమీద వేయవలదు, అతడు యెహోవాకు తన్నుతాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరువరకు అతడు ప్రతిష్ఠితుడై తన తలవెండ్రుకలను ఎదుగనియ్యవలెను.
ఈ వచనంలో దేవుడు నాజీరుగా మొక్కుకున్న వ్యక్తి ఆ ప్రతిష్టిత దినాలలో జుట్టు కత్తించుకోకూడదని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. కారణం; అతను అందరివలే కాకుండా దేవునికి ప్రత్యేకంగా ఉన్నాడని ఎదుగుతున్న ఆ జుట్టు జ్ఞాపకంగా ఉంటుంది. అలానే ఆ జుట్టు ఎదుగుతున్నట్టే తన పవిత్ర జీవితం కూడా దినదినం అభివృద్ధి చెందాలని అది సూచిస్తుంది. పుట్టినది మొదలుకొని నాజీరు చెయ్యబడిన సంసోను తన తలవెంట్రుకలు కత్తించుకోకూడదని ఆజ్ఞాపించబడింది (న్యాయాధిపతులు 13:5) ఈ కారణాన్ని బట్టే. ఎందుకంటే అతను తన జీవితకాలమంతా నాజీరు చెయ్యబడినవాడిగా ఉండాలన్నది అతనిపట్ల దేవుని ఉద్దేశం.
సంఖ్యాకాండము 6:6,7 అతడు యెహోవాకు ప్రత్యేకముగానుండు దినములన్ని టిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తలవెండ్రుకలు అతని తలమీద నుండును గనుక అతని తండ్రిగాని తల్లిగాని సహోదరుడుగాని సహోదరి గాని చనిపోయినను వారినిబట్టి అతడు తన్నుతాను అప విత్రపరచుకొనవలదు.
ఈ వచనాలలో దేవుడు నాజీరు చెయ్యబడిన వ్యక్తి తన నాజీరు దినాలలో చివరికి తన కుటుంబసభ్యులు చనిపోయినప్పటికీ ఆ శవాన్ని తాకకూడదని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇది చాలా కఠినమైన ఆజ్ఞగా మనకు కనిపిస్తుంది. కానీ ధర్మశాస్త్రం ప్రకారం నరశవాన్ని ముట్టడం ఆచారసంబంధమైన అపవిత్రతను సూచిస్తుంది (సంఖ్యాకాండము 19:11). అది ఆత్మసంబంధమైన అపవిత్రతకు ఛాయగా నియమించబడింది. పైగా మరణం అనేది పాపఫలితంగానే లోకంలోకి ప్రవేశించింది (రోమా 5:12). అందుకే దేవునికి ప్రత్యేకంగా నాజీరు చెయ్యబడిన వ్యక్తి ఆ అపవిత్రతకు లోనవ్వకుండా ఈ నియమం విధించబడింది. అంటే నాజీరు చెయ్యబడిన వ్యక్తి ధర్మశాస్త్రం విధించిన ఏ అపవిత్రతకూ లోనవ్వకుండా దేవునికి ప్రత్యేకంగా జీవించాలి. అది కొన్నిసార్లు కఠినంగా ఉన్నప్పటికీ దేవునికోసం ప్రత్యేకంగా ఉండాలంటే వాటిని పాటించక తప్పదు. ఈ నియమాన్ని బట్టి దేవునికోసం ప్రత్యేకంగా పిలువబడిన మనమంతా ఆయన వాక్యం ఆదేశించిన సమస్తమైన అపవిత్రతలకూ దూరంగా ఉండాలని హెచ్చరించబడుతున్నాం. అది కొన్నిసార్లు కఠినంగా అనిపించినప్పటికీ దేవునికోసం ప్రత్యేకంగా జీవించాలంటే ఏ అపవిత్రతకూ లోనవ్వకుండా జీవించడం తప్పనిసరి.
సంఖ్యాకాండము 6:8 అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నియు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును.
ఈ వచనం ప్రకారం నాజీరు చెయ్యబడిన వ్యక్తి అతను మొక్కుకున్న దినాలన్నీ దేవునికి ప్రతిష్టంగా ఉంటాడు. ఆయన ఆజ్ఞాపించినట్టుగా జీవించడం వల్ల ఆయనకు ప్రతిష్టంగా ఉంటాడు. ఉదాహరణకు; మద్యాన్ని కానీ ద్రాక్షరసాన్ని కానీ త్రాగకుండడం, తలవెంట్రుకలు కత్తిరించుకోకపోవడం, నరశవాన్ని ముట్టకుండడం ఇలా. ఈ ప్రతిష్ట ఆచారసంబంధంగానే కాదు, ఆధ్యాత్మికంగా ఆయనకోసం ప్రతిష్టంగా అనగా పరిశుద్ధంగా జీవించాలని నేర్పిస్తుంది. క్రీస్తు రక్తాన్ని బట్టి దేవునికి ప్రతిష్ట చెయ్యబడిన మనం కూడా "పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది" (రోమా 12:1) అని ఆజ్ఞాపించబడుతున్నాం.
సంఖ్యాకాండము 6:9-12 ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవుట వలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరపబడిన యెడల అతడు పవిత్రపరపబడు దినమున, అనగా ఏడవ దినమున తనతల గొరిగించుకొనవలెను. ఎనిమిదవ దినమున అతడు రెండు తెల్లగువ్వలనైనను రెండు పావురపు పిల్లల నైనను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నున్న యాజకునియొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు ఒకదానితో పాపపరిహారార్థబలిని రెండవ దానితో దహన బలిని అర్పించి, వాడు శవము ముట్టుటవలన పాపియైనందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధ పరపవలెను. మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరల యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధపరిహారార్థబలిగా ఏడాది గొఱ్ఱెపిల్లను తీసికొని రావలెను; తన వ్రతసంబంధమైన తలవెండ్రుకలు అపవిత్రపరపబడెను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి.
ఈ వచనాల ప్రకారం; నాజీరు చెయ్యబడిన వ్యక్తి సమీపంలో ఎవరైనా హఠాత్తుగా చనిపోతే ఆ శవాన్ని పొరపాటునైనా ఆ వ్యక్తి తాకుంటే సాధారణ ప్రజలు శవాన్ని ముట్టినప్పుడు పవిత్రపరచబడే ఏడవదినమందు (సంఖ్యాకాండము 19:11,12) అతను మొత్తం తలవెంట్రుకలు గొరికించుకుని రెండు తెల్లగువ్వలను కానీ పావురపు పిల్లలను కానీ బలిగా అర్పించాలి. తర్వాత అపరాధపరిహారార్థబలిగా ఏడాది గొఱ్ఱెపిల్లను అర్పించి తన నాజీరు ప్రతిష్టతను మొదటినుండి ప్రారంభించాలి. "తన వ్రతసంబంధమైన తలవెండ్రుకలు అపవిత్రపరపబడెను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి" ఈ మాటలు గమనించండి; అతను పొరపాటున శవాన్ని తాకినప్పటికీ అందులో అతని తప్పేం లేనప్పటికీ అప్పటివరకూ అతను పాటించిన ప్రతిష్టదినాలు వ్యర్థమైపోయాయి. మరలా మొదటినుండి ఆ ప్రతిష్టను కొనసాగించవలసి వచ్చింది. ఈ నియమం పాపం యొక్క తీవ్రతను దాని విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను మనకు బోధిస్తుంది. అనుకోకుండా చేసినప్పటికీ అందులో మన ప్రమేయం లేనప్పటికీ పాపం పాపంగానే పరిగణించబడుతుంది, మన పరిశుద్ధ జీవితంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే నాజీరు చెయ్యబడిన వ్యక్తులు పొరపాటున కూడా ఏ అపవిత్రతకూ గురవ్వకుండా (శవాన్ని ముట్టకుండా) జాగ్రత్తపడేవారు. మనం కూడా దేనివిషయంలోనైనా అపవిత్రులమౌతామనే చిన్నపాటి సందేహం కలిగిననా దానిగురించి అప్రమత్తంగా ఉండాలి.
సంఖ్యాకాండము 6:13-21 నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తరు వాత వానిగూర్చిన విధి యేదనగా, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వానిని తీసికొని రావలెను. అప్పుడతడు దహనబలిగాను నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగాను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱెపిల్లను, సమాధాన బలిగాను నిర్దోష మైన యొక పొట్టేలును, గంపెడు పొంగని పిండి, అనగా గోధమపిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా యెహోవాయొద్దకు తేవలెను. అప్పుడు యాజ కుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పింపవలెను. యాజ కుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధానబలిగా అర్పింపవలెను; వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను. అప్పుడా నాజీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద తన వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు గొరిగించు కొని, ఆ వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు తీసికొని, సమాధానబలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను. మరియు యాజకుడు ఆ పొట్టేలుయొక్క వండిన జబ్బను ఆ గంపలోనుండి పొంగని యొక భక్ష్యమును పొంగని యొక పూరీని తీసికొని నాజీరు తన వ్రతసంబంధమైన వెండ్రుకలు గొరికించుకొనిన పిమ్మట అతని చేతుల మీద వాటి నుంచవలెను. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోను ప్రతిష్ఠిత మైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠితమగును; తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును. మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు, అతడు నాజీరైయున్నందున యెహో వాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇదియంతయు చేయవలెనని చెప్పుము.
ఈ వచనాలలో నాజీరు దినాలు ముగిసిన వ్యక్తి చెయ్యవలసిన విధి గురించి మనం చూస్తాం. మొదటిగా ఆ వ్యక్తి యాజకుడి వద్దకు దహనబలిగా నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱెపిల్లను, సమాధాన బలిగా నిర్దోషమైన యొక పొట్టేలును, గంపెడు పొంగని పిండి, అనగా గోధమపిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణలుగా తీసుకురావాలి (ఈ అర్పణల వివరాలు లేవీకాండము 1-4 అధ్యాయాల్లో రాయబడ్డాయి) ఈ అర్పణలు తన ప్రతిష్టదినాలకు సంబంధించి ఆరాధనను లేక సమర్పణను సూచిస్తున్నాయి. తర్వాత యాజకుడు దహనబలినీ అతను తెలియక చేసిన పాపాల నిమిత్తం పాపపరిహారార్థ బలినీ చివరిగా సమాధానబలిని కూడా అర్పిస్తాడు. సమాధానబలిలో పొంగని రొట్టెలు, నైవేద్యము, పానార్పణములు కూడా అర్పించబడతాయి.
తర్వాత నాజీరు చెయ్యబడిన వ్యక్తి తన తల వెంట్రుకలు గొరికించుకుని సమాధాన బలి అగ్నిలో వెయ్యాలి. ఆ వెంట్రుకలు తన ప్రతిష్టతకు గుర్తు. ఇప్పుడు అవి దేవునికి అర్పించడం ద్వారా తన అంకిత జీవితాన్ని పూర్తిగా ఆయనకు సమర్పించినట్టు అర్థం. తర్వాత యాజకుడు సమాధానబలిలోని పొట్టేలు యొక్క వండిన జబ్బను ఆ గంపలోనుండి పొంగని యొక భక్ష్యమును పొంగని యొక పూరీని తీసికొని ఆ వ్యక్తి చేతుల మీద ఉంచుతాడు. వాటిని యాజకుడు యెహోవా సన్నిధిలో అల్లాడించి తనకోసం తీసుకుంటాడు. అది యాజకుడి భాగం. చివరిగా నాజీరు చెయ్యబడిన వ్యక్తి తన ప్రతిష్టిత దినాలు ముగించుకుని ఒకప్పటిలానే సాధారణ జీవితం జీవిస్తాడు. ఈవిధంగా అతను ప్రతిష్టదినాల్లోనే కాదు ముగింపులో కూడా దేవుణ్ణి తన అర్పణలతో మహిమపరుస్తాడు. ఈ నియమాన్ని బట్టి క్రైస్తవులైతే విశ్వాస జీవితం ప్రారంభంలోనే కాదు దాని ముగింపు వరకూ కూడా ఆయనపట్ల ఆరాధనా భావాన్నీ సమర్పణనూ కలిగియుండాలని బోధిస్తుంది.
గమనించండి; ఈరోజుకూ కొందరు నాజీరు పేరుతో దేవునికి తలవెంట్రులకు సమర్పించడం, శవాన్ని ముట్టకుండడం వంటివి చేస్తున్నారు. కానీ ధర్మశాస్త్రంలో ఈ నియమం దేవుని పట్ల మన సంపూర్ణ సమర్పణకు ఛాయగా మాత్రమే నియమించబడింది. అందువల్ల మనం ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకోవాలే తప్ప దానికి ఛాయగా ఉన్న ఈ నాజీరు ఆచారాన్ని మనం పాటించకూడదు. పౌలు ఈ ఆచారాన్ని పాటించింది (అపొ.కార్యములు 18:18) అతను ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పుడు చేసుకున్న మొక్కుబడిని బట్టే తప్ప క్రైస్తవులు ఆ మొక్కుబడిని చేసుకోవాలని కాదు. పౌలు యూదుడిగా ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పుడు ఆ మొక్కుబడి చేసుకున్నాడు, దానినే నెరవేర్చాడు.
సంఖ్యాకాండము 6:22,23 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఈలాగనుము. మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను.
ఈ వచనాలలో దేవుడు యాజకులైన అహరోను మరియు అతని కుమారులు ఇశ్రాయేలీయులను ఎలా దీవించాలో ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దేవునికీ ప్రజలకూ మధ్యలో యాజకులే మధ్యవర్తులు కాబట్టి వారిని దీవించే బాధ్యతను ఆయన వారికే అప్పగిస్తున్నాడు. ఈ నియమం మధ్యవర్తియైన క్రీస్తు యేసు ద్వారా ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఛాయగా ఉంది. క్రీస్తు యేసును బట్టే మనం దేవుని సకల ఆశీర్వాదాలనూ పొందుకుంటున్నాం. అందుకే "దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములైయున్నవి" (2కోరింథీ 1:20) అని రాయబడింది.
సంఖ్యాకాండము 6:24-26 యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక; యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక; యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.
నాజీరుకు సంబంధించిన విధి ముగిసాక ఈ ఆశీర్వాద పలుకులు చెప్పబడడాన్ని బట్టి మనం ప్రజలందరూ ఆయనకు ప్రతిష్టితులై ఈ ఆశీర్వాదాలను పొందుకోవాలన్నది దేవుని ఉద్దేశమని అర్థం చేసుకోవాలి. ఈ ఆశీర్వాదాలలో భౌతికమైనవీ ఆధ్యాత్మికమైనవీ రెండూ ఉన్నాయి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక! అనేది ఆయన భౌతికమైన రక్షణనూ సమృద్ధినీ సూచిస్తుంది. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక! అనేది ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం. యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక! అనేది దేశంలో యుద్ధభయం లేకుండా చేసే సమాధానపు ఆశీర్వాదం. ఈవిధంగా ఆయనకు ప్రతిష్టితులైన ప్రజలు భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండు విధాలుగా ఆశీర్వదించబడుతున్నారు.
సంఖ్యాకాండము 6:27 అట్లు వారు ఇశ్రాయేలీయులమీద నా నామ మును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను.
ఈ మాటలను బట్టి ఆశీర్వాదపలుకులు ఉచ్చరించేది యాజకులే అయినప్పటికీ ఆశీర్వదించేది మాత్రమే దేవుడే. ఆయన తన ఆశీర్వాదాలను ప్రజలకు అనుగ్రహించడానికి మధ్యవర్తులుగా యాజకులను ఉపయోగించుకుంటున్నాడు.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
సంఖ్యాకాండము అధ్యాయం 6

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"