'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.
హితబోధ యాప్ కొరకు Join WhatsApp
ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.
© 2024. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.
గలతీ పత్రిక 2వ అధ్యాయంపై వ్యాఖ్యానం
గలతీ పత్రిక రెండవ అధ్యాయంలో పౌలు రెండు విషయాల గురించి మాట్లాడుతున్నాడుః 1. మొదటిగా తన సువార్త దేవుని నుండి పొందుకుంది అని, యెరూషలేములో ఉంటున్న అపొస్తలులు దానిని ఆమోదించారు అని చెప్పాడు. 2. రెండవదిగా, పేతురు సువార్త సత్యాన్ని బట్టి నడవకపోవడం తాను చూసినప్పుడు, తనని బహిరంగంగా ఖండించి, తాను మనుష్యులను సంతోషపెట్టేవాడు కాదు, దేవునిని మాత్రమే సంతోషపెట్టేవాడు అని చూపించాడు. ఈ కారణాలను బట్టి తాను అపొస్తలుడను అని తెలియజేయడం మాత్రమే కాకుండా, తన అపొస్తలత్వం యెరూషలేములోనివారి అపొస్తలత్వానికంటే తక్కువైనదేమీ కాదు అని నిరూపించాడు.
గలతి పత్రిక అధ్యాయం 1 పై వ్యాఖ్యానం
గలతి పత్రిక మొదటి అధ్యాయంలో నాలుగు భాగాలను మనం గమనించొచ్చు. మొదటి రెండు వచనాలు ఈ పత్రిక రచించిన రచయత ఎవరో తెలియజేస్తున్నాయి (అపొస్తలుడైన పౌలు), తన యొక్క అపొస్తలత్వపు అధికారం ఎవరి నుండి పొందుకున్నాడో తెలియజేస్తున్నాయి (యేసుక్రీస్తు వలనను, తండ్రియైన దేవునివలనను), మరియు తనతో ఉన్న సహోదరుల గురించి తెలియజేస్తున్నాయి. గలతి 3-5 వచనాలలో పౌలు గలతి సంఘానికి శుభాలు తెలియజేస్తున్నాడు. మరి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసం యొక్క మూలాంశాన్ని గురించి మాట్లాడుతున్నాడు, "మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను." గలతి 6-10 వచనాలలో పౌలు సువార్త గురించి మాట్లాడుతున్నాడు. గలతి సంఘంవారు నిజ సువార్తను విడిచి భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోవటాన్ని చూసి తన ఆశ్చర్యాన్ని వెల్లడిచేస్తున్నాడు. భిన్నమైన సువార్తను బోధించేవారు ఎవరైనా సరే వారు శాపగ్రస్తులు అని, నాశనానికి గురిచేయబడిన వారని చెప్తున్నాడు.....
గలతీ పత్రిక పరిచయం
గలతీయులకు రాసిన పత్రిక పౌలు రచించిన పదమూడు పత్రికలలో మొదటిది. పౌలు రాసిన పత్రికలన్నిటిలో గలతీయులకు రాసిన పత్రికకు ఒక విశిష్ట స్థానం ఉంది. రోమీయులకి రాసిన పత్రికకు ఈ పత్రికలో ఉన్నవిషయాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ రెండు పత్రికలలో పౌలు విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర క్రియల వలన ఏ మనిషి దేవుని ముందు నీతిమంతుడుగా తీర్చబడడు అని స్పష్టం చేస్తున్నాడు...