లూకా సువార్త పరిచయము:
లూకా సువార్త, అపోస్తలుల కార్యములు, ఈ రెండు గ్రంథాలు కలిసి సుమారు కొత్త నిబంధన అంతటిలో నాలుగో వంతు ఉంటాయి.
ఈ సువార్తలో 40 శాతం విషయాలు, వేరే సువార్తలలో లేనివి.
1) లూకా పేరు కొత్త నిబంధనలో మూడు సార్లు మాత్రమే కనిపిస్తుంది.
కొలస్సీ 4:14 -
"14. లూకా అను ప్రియుడైన వైద్యుడును, దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు."
2 తిమోతి 4:11 -
"11. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు. తుకికును ఎఫెసునకు పంపితిని."
ఫిలేమోను 24 -
"24. నా జతపనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు."
2) బైబిల్ ఆధారంగా లూకా గురించి మనం ఎం తెలుసుకోవచ్చు?
i) కొలస్సీ 4:14 ప్రకారం లూకా ఒక వైద్యుడు, పౌలుకి ప్రియుడైన వాడు అని తెలుస్తుంది.
ii) అపొ. కార్య. 1:19 -
"19. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియ వచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా"
"వారి భాషలో" అంటే తాను యూదుడను కానని చెప్తున్నాడు లూకా.
ఒక అన్యుడైయుండి (యూదుడు కానివాడు/ ఇశ్రాయేలుతో సంబంధం లేనివాడు) బైబిల్ లో ఒక పుస్తకాన్ని రచించిన ఏకైక వ్యక్తి లూకా అని పండితుల అభిప్రాయం. అతడు యూదా మతంలోకి మారినవాడనీ, పౌలు అంతియొకయలో చేసిన పరిచర్య ఫలితంగానే లూకా రక్షణ పొందాడనీ, సిరియా అంతియొకయలో వైద్యుడిగా ఉండేవాడనీ కొందరు పండితుల అభిప్రాయం.
iii) 2 తిమోతి 4:11 & ఫిలేమోను 24 ప్రకారం పౌలు యొక్క మొదటి మరియు రెండవ రోమా చెరలలో లూకా పౌలుతో కూడా ఉన్నాడని తెలుస్తుంది.
సువార్త ప్రయాణాల్లో లూకా పౌలుతో కూడా ఉన్నాడన్న అభిప్రాయాన్ని బలపరిచే విధంగా మరి కొన్ని వచనాలలో "మమ్మును" , "మేము" అన్న మాటలను చూస్తాము.
ఉదా: అపొ. కార్య. 16:10-17; 20: 5; 21:18; 27: 1- 28: 16.
3) లూకాయే ఈ సువార్తను రచించాడు అని ఆదిమ సంఘమూ, అపోస్తలీయ కాలంలో రాయబడిన బైబిల్ పుస్తకాలు, ఇతర రచనలూ సాక్ష్యం ఇస్తున్నాయి.
ఉదాహరణకి: 1 తిమోతి 5:18,19 -
"18. ఇందుకు నూర్చెడి యెద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది.
19. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనేగాని పెద్దమీద దోషా రోపణ అంగీకరింపకుము"
ఈ వచనంలో పౌలు లేఖనాలు చెప్పిన విషయాలను ఉటంకిస్తూ మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ద్వితీయో 25:4 గురించీ లూకా 10:7 గురించీ ప్రస్తావిస్తాడు. అలా ఆ రెండింటినీ సమానంగా ఎంచుతూ ఉటంకించడాన్ని బట్టి పౌలు లూకా సువార్తని కూడా లేఖనాలని పరిగణించినట్లు మనం గ్రహించవచ్చు. పైగా "లేఖనము చెప్పుచున్నది" అని చెప్పి లూకా సువార్తలోని వచనాన్ని ఉటంకించాడు కాబట్టి అప్పటికే సంఘము కూడా లూకా సువార్తని లేఖనమని అంగీకరించిందని గ్రంహించవచ్చు. అందుకే పౌలు తిమోతికి రాసిన పత్రికలో లేఖనాలలోని మాటలను ఉటంకిస్తున్నానని చెప్పి లూకా సువార్తలోని వచనాన్ని ఉటంకించాడు. ఈ విషయంలో మొదటి నుండీ ఎక్కువ భిన్న అభిప్రాయాలు లేవు కాబట్టి ఈ విషయం గురించి చర్చ అనవసరం.
4) లూకా సువార్త, అపోస్తలుల కార్యములు, రెండింటినీ రచించినది లూకాయే.
యేసు పుట్టుకకూ,పరిచర్యకూ, సిలువ మరణానికీ, పునరుర్ధానానికీ సంబంధించిన విషయాలు లూకా సువార్తలో చూస్తాం. ఆఖరి అధ్యాయంలో ఆయన ఆరోహణం గురించి చూస్తాం.
అపొ. కార్యముల గ్రంధములో యేసు ఆరోహణమవ్వడానికి ముందు 40 రోజులు ఎం జరిగిందో మొదటి అధ్యాయంలో తెలియజేసి, ఇక ఆ తరువాత జరిగిన సంగతులను రెండవ అధ్యాయం నుండీ చెప్పడం కొనసాగిస్తాడు లూకా. ఈ విషయాన్ని గురించి లూకా ఏమన్నాడో, అతని మాటల్లోనే చూడండి.
అపొ. కార్య. 1:2 -
"2. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని."
5) లూకా సువార్త, అపొస్తలుల కార్యములు, రెండు గ్రంథాలు ఒకే వ్యక్తికి రాయడం జరిగింది.
లూకా 1:1 -
" ఘనతవహించిన థెయొఫిలా,..."
అపొ. కార్య. 1:1 -
"ఓ థెయొఫిలా,..."
ఒకే వ్యక్తికి రాయడం అనేది ఒకే వ్యక్తి ఈ రెండింటినీ రాసుండొచ్చు అన్న అభిప్రాయాన్ని బలపరుస్తుంది.
రెండు గ్రంథాల (లూకా/అపొ. కార్య.) రచనా శైలిలో చాలా దగ్గర పోలికలున్నాయి. వాడిన పదాలు, బాషా శైలి తదితర వాటిల్లో చాలా దగ్గర పోలికలుండడాన్ని బట్టి రెండు ఒకరే రాశారని గ్రహించవచ్చు. ఉదా: మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ రెండు గ్రంథాలలోనూ వైద్యులకు సంబంధించిన బాషా, పదాలూ ఎక్కువగా కనిపిస్తుంటాయి. లూకా ఒక వైద్యుడు కాబట్టి ఈ రెండు గ్రంధాలూ తనే రచించాడు అనడానికి ఇది మరొక రుజువు.
6) లూకా సువార్త రచించబడిన కాలం:
క్రీ. శ. 60-61 లో లూకా ఈ సువార్తను వ్రాసి ఉండవచ్చు. ఎందుకంటే సంఘ చరిత్రలో క్రీ.శ. 61 తర్వాత జరిగిన సంఘటనల ప్రస్తావన లూకా సువార్తలో లేదు.
ఉదా:
1) అపొస్తలుల కార్యములు అర్ధాంతరంగా ముగుస్తుంది. ఎందుకంటే ఈ సువార్త రాస్తున్న సమయానికి పౌలు ఇంకా చెరసాలలోనే ఉన్నాడు.
అతను విడుదలవ్వడం, తర్వాతి ప్రయాణాలను గురించిన వివరాలు లేవు.
2) యాకోబు (యేసు సహోదరుడు, యెరూషలేము సంఘ నాయకుడు) మరణం (క్రీ. శ. 62).
3) నీరో శ్రమలు - ఆ కారణంగానే పేతురు, పౌలు హతసాక్ష్యులయ్యారు (క్రీ. శ. 60).
4) క్రీ. శ. 70 లో రోమీయులు యెరూషలేమును నాశనం చేయడం.
5) పౌలు పత్రికల గురించిన ప్రస్తావన లూకా యొక్క రెండు గ్రంథాల్లో ఎక్కడా కనపడదు. అంటే ఆ పత్రికలు రాయబడక ముందే ఈ గ్రంథాలు రచించబడి యుండాలి.
7) లూకా ఏ ప్రాంతములో ఉన్నప్పుడు ఈ గ్రంధాన్ని రచించాడు?
సువార్త ప్రయాణాల్లో లూకా పౌలుతో పాటే ఉన్నాడు కాబట్టి రోమాలో ఉన్నప్పుడే లూకా ఈ గ్రంథాలను రచించియుండవచ్చు.
8) లూకా ఈ సువార్తను ఎవరికి రాశాడు?
లూకా ఈ సువార్తను, థెయొఫిలాకు తద్వారా అన్యజనులకు రాశాడు. దానికి ఆధారం ఏంటంటే - అన్యజనులకు ఆరామిక్ పదాలు అర్ధం కావు కాబట్టి లూకా వాటిని ఉపయోగించలేదు. అయితే అబ్బా, రబ్బీ, హోసన్నా, గొల్గొతా మొదలగు పదాలను ఇతర సువార్తలో వాడడం మనం చూస్తాం.
యూదుల ఆచారాల గురించీ, భౌగోళిక ప్రదేశాల గురించీ వారికి అర్ధం అయ్యేలా వివరిస్తుంటాడు.
ఇది ఒక వ్యక్తిగత పత్రిక, అంటే ఒక సంఘాన్ని లేదా ఒక ప్రాంతంలోని ప్రజలను ఉద్దేశించి వ్రాయబడింది కాదు, ఒక వ్యక్తికి రాసిన పత్రిక.
లూకా సువార్త పరిచయము

Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.