ఐశ్వర్యమును
ద్వితీయోపదేశకాండమ 8:18

కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే.

1 సమూయేలు 2:7

యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే.

1 సమూయేలు 2:8

దరిద్రులను అధికారు లతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్పమీదినుండి లేవనెత్తువాడు ఆయనే.భూమియొక్క స్తంభములు యెహోవా వశము,లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు .

యోబు గ్రంథము 42:10

మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.

కీర్తనల గ్రంథము 75:6

తూర్పునుండియైనను పడమటినుండియైనను అరణ్యమునుండియైనను హెచ్చుకలుగదు.

కీర్తనల గ్రంథము 75:7

దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును

కీర్తనల గ్రంథము 113:7

ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై

కీర్తనల గ్రంథము 113:8

ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటకుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు

సామెతలు 8:18

ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నాయొద్ద నున్నవి.

సామెతలు 10:22

యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు.

ప్రసంగి 5:19

మరియు దేవుడు ఒకనికి ధనధాన్యసమృద్ధి ఇచ్చి దానియందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసినయెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదమువలన కలిగినదనుకొనవలెను.

లూకా 1:51-53
51

ఆయన తన బాహువు తో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను .

52

సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను .

53

ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను .

రోమీయులకు 11:35
ముందుగా ఆయన కిచ్చి , ప్రతిఫలము పొందగలవాడెవడు?
రోమీయులకు 11:36
ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌ .
సమస్తమును ఏలువాడవు
దానియేలు 6:26

నా సముఖమున నియమించిన దేమనగానా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను . ఆయనే జీవముగల దేవుడు , ఆయనే యుగయుగములుండువాడు , ఆయన రాజ్యము నాశనము కానేరదు , ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును.

power
యోబు గ్రంథము 9:19

బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగా నేనేయున్నానని ఆయన యనును న్యాయవిధినిగూర్చి వాదము కలుగగా ప్రతివాదిగానుండ తెగించువాడెవడని ఆయన యనును?

కీర్తనల గ్రంథము 62:11

బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను.

యెషయా 43:13

ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలోనుండి విడిపించగలవాడెవడును లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయు వాడెవడు ?

యెషయా 46:10

నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.

దానియేలు 5:18-21
18

రాజా చిత్తగించుము; మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను .

19

దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చి నందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను ; ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను , ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను ; ఎవరిని పడ వేయగోరెనో వారిని పడవేసెను . కాబట్టి సకల రాష్ట్రములును జనులును ఆ యా భాషలు మాటలాడు వారును అతనికి భయపడుచు అతని యెదుట వణకుచు నుండిరి.

20

అయితే అతడు మనస్సున అతిశయించి , బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసికొనగా దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను .

21

అప్పుడతడు మానవుల యొద్దనుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయెను . మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు , ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలిసికొను వరకు అతడు అడవి గాడిదలమధ్య నివసించుచు పశువులవలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను.

మత్తయి 28:18

అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.

యోహాను 19:11

అందుకు యేసుపైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను.

ఎఫెసీయులకు 3:20

మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,

ప్రకటన 11:17

వర్తమానభూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

బలము ఇచ్చువాడవును
2 దినవృత్తాంతములు 16:9

తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును.

కీర్తనల గ్రంథము 18:31

యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?

కీర్తనల గ్రంథము 18:32

నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే.

కీర్తనల గ్రంథము 28:8

యెహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణదుర్గము.

కీర్తనల గ్రంథము 29:1

దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి

కీర్తనల గ్రంథము 29:11

యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.

కీర్తనల గ్రంథము 68:34

దేవునికి బలాతిశయము నారోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలుమీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది

కీర్తనల గ్రంథము 68:35

తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములననుగ్రహించుచున్నాడు దేవుడు స్తుతినొందును గాక.

కీర్తనల గ్రంథము 144:1

నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు.

కీర్తనల గ్రంథము 144:2

ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడెము నే నాశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోబరచువాడైయున్నాడు.

యెషయా 40:29

సొమ్మసిల్లినవారికి బల మిచ్చువాడు ఆయనే శక్తి హీనులకు బలా భివృద్ధి కలుగజేయువాడు ఆయనే.

యెషయా 45:24

యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు

ఎఫెసీయులకు 3:16

క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను,

ఫిలిప్పీయులకు 4:13

నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను .

కొలొస్సయులకు 1:11

ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు , ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తి నిబట్టి సంపూర్ణ బలము తో బలపరచబడవలెననియు ,