ప్రశ్నోత్తరాలు

When it was prophesied that the Messiah would be named "Immanuel" (Isaiah 9:6), is it not a failure of the prophecy to name Him Jesus?

 

ముందుగా మత్తయి 1:21-25 వచనాలను జాగ్రత్తగా పరిశీలించండి. 23వ వచనంలో యేసు అని పేరు పెట్టబడడం, “ఇమ్మానుయేలు” అని పేరు పెట్టబడుతుందనే ప్రవచనానికి నిరర్థకతగా కాకుండా నెరవేర్పుగా పేర్కొనబడటం ప్రత్యేకించి గమనించండి. ఐతే ఇది ఎలా సాధ్యమన్నదే అసలు ప్రశ్న. దేవుడు ప్రవచనాత్మకంగా మెస్సీయకు ఆపాదించిన అనేక పేర్లలో “ఇమ్మానుయేలు” అనేది కేవలం ఒక్క పేరు మాత్రమే. ఇది కాకుండా ఇంకా అనేక పేర్లు ఆయనకు ప్రవచనాత్మకంగా ఆపాదించబడ్డాయి. ఉదా: యెషయా 9:6 చూడండి - “ఆశ్చర్యకరుడు”, “ఆలోచనకర్త”, “బలవంతుడైన దేవుడు” , “నిత్యుడగు తండ్రి”, “సమాధానకర్తయగు అధిపతి” - ఇవన్నీ ఆయనకు పెట్టబడాల్సిన పేర్లే కానీ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇవన్నీ 'గుణవాచక' నామాలే తప్ప వ్యక్తిగత నామవాచకాలు కావు.

అంటే ఇవన్నీ మెస్సీయ నెరవేర్చే కార్యాలను లేక ఆయన వ్యక్తిత్వానికి చెందిన గుణలక్షణాలను వర్ణించే పేర్లు. మెస్సీయ పుట్టినప్పుడు ఆయనకు ఏ పేరు పెట్టబడినా సరే దేవుడే శరీరధారియై మన మధ్యకు దిగివచ్చినందుకు గాను “దేవుడు మనకు తోడు” అని అర్థమిచ్చే “ఇమ్మానుయేలు” అనే పేరు సార్థకమైనట్టే. కాబట్టి ప్రవచనం విఫలమవ్వడం అనే సమస్యకు ఇక్కడ తావు లేదు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.