ప్రశ్నోత్తరాలు

When Jesus questions : "Why do you call me good", how can he be God? (Mark 10:18, Luke 18:19, Matthew 19:17).

 

ఒక ధనవంతుడూ, యవ్వనస్థుడూ అయిన అధికారి ఒకసారి యేసు వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్లూని "సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదున"ని అడిగాడు. అందుకు యేసు "నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు" అని జవాబిచ్చాడు. యేసు తాను సత్పురుషుణ్ణి కానని చెప్పడం ద్వారా తాను దేవుణ్ణి కానని స్పష్టం చేసాడని ఈ మాటల ఆధారంగా కొందరు బైబిల్ విమర్శకులు వాదిస్తుంటారు.

ఈ వచనంలో ముందుగా గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే నేను సత్పురుషుడను కానని యేసు చెప్పడం లేదు. 'నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు' అని అతనిని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు తప్ప ఎవ్వరూ సత్పురుషుడు కానప్పుడు 'నన్ను సత్పురుషుడని' పిలవడాన్ని బట్టి 'నేను దేవుడినని ఒప్పుకుంటున్నావా' అన్నది ఈ ప్రశ్నలోని ఆంతర్యం. ఎందుకంటే, వేరొక సందర్భంలో తాను మంచివాడినని యేసే స్వయంగా ప్రకటించాడు. “నేను గొర్రెల మంచి కాపరిని” (యోహాను 10:14). యేసు నిర్వచనం ప్రకారం మంచివాడు దేవుడే కదా !

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.