ప్రశ్నోత్తరాలు

If Jesus does not know the hour and the day of His coming how can He be God? (Mark 13:32)

 

జవాబు : ఈ సందర్భంలో యేసు తన రెండవ రాకడకు సంబంధించిన కొన్ని విషయాలను తన శిష్యులకు బయలుపరుస్తూ, వారిని సిద్ధపరుస్తున్నాడు (మార్కు 13:14-37).

అయితే ఆయన ఎప్పుడు రానైయున్నాడో శిష్యుల తెలుసుకొనగోరి "ఇవి ఎప్పుడు జరుగును?" అని యేసును అడుగుతారు (వ.3-4). అందుకు యేసు - "ఆ దినమును గూర్చియు ఆ ఘడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతమైనను, కుమారుడైనను ఎరుగరు” అని సమాధానం చెప్తాడు. దీని అర్థం, యేసు రెండవ రాకడకు సంబంధించిన 'దినమును గూర్చియు .. ఘడియను గూర్చియు' ముందుగానే ఏ మనిషికీ బయలుపరచబడదు. అలాగే దేవునితో అత్యంత సన్నిహిత సహవాసాన్ని ఆనందిస్తూ, ఆయన ఆజ్ఞలన్నిటినీ తక్షణమే అమలుపరచడం కోసం ఆయన సింహాసం వద్దనే ఉండే దేవదూతలకు సైతం (యెషయా 6:2-7) యేసు రెండవ రాకడ దినము, ఘడియ ఎపుడో బయలుపరచబడలేదు. ఇక్కడవరకూ సమస్యేమీ లేదు.

కానీ ఆ దినము, ఘడియ గురించి యేసు తనకు కూడా తెలియదు అని చెప్పడాన్ని బట్టి ఆయన దేవుడయ్యుంటే అది తెలియకపోవడం ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది. దేవునిగా ఆయనకు సమస్తమూ తెలుసు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నేనునూ తండ్రియు ఏకమై ఉన్నామని యేసు చెప్పిన మాట మనం మర్చిపోకూడదు( యోహాను 10:30). కాబట్టి తండ్రికి తెలిసినవన్నీ యేసుకు కూడా తెలుసు. అయితే యేసు, దాసుని స్వరూపం ధరించుకొని మానవావతారిగా వచ్చినప్పుడు ఆ అవతారానికి తగిన విధంగా తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తన మానవ స్వభావంలో తన దైవలక్షణాల ప్రమేయం ఏమీ లేకుండా తన దైవ స్వభావాన్ని తన మానవ స్వభావానికి అనుగుణంగా ఉండే విధంగా పరిమితం చేసుకున్నాడని మనం అర్థం చేసుకోవాలి (ఫిలిప్పీ 2:6-7). అంటే ఆయన సర్వవ్యాపి ఐనప్పటికీ తన ఉనికిని ఒక ప్రత్యేక స్థలానికి ఎలాగైతే పరిమితం చేసుకున్నాడో, సర్వశక్తి కలిగిన దేవుడైనప్పటికీ ఎలాగైతే మానవస్వరూపాన్ని ధరించుకున్నాడో, అలాగే ఆయన సర్వజ్ఞానసంపూర్ణుడే ఐనప్పటికీ, తన అపరిమిత జ్ఞానాన్ని కూడా మానవజ్ఞానానికి అనుగుణంగా పరిమితం చేసుకున్నాడు. అందుకే నిత్యుడైనవాడు వయస్సునందు, సర్వజ్ఞుడైనవాడు జ్ఞానమునందు వర్ధిల్లడం సాధ్యపడింది. కాబట్టి మార్కు13:32లో యేసు తనకు కూడా తెలియదన్న విషయం, తన మానవస్వభావానికి అనుగుణంగా పరిమితం చేసుకున్నదే తప్ప తన దైవత్వంలో కూడా ఆయనకు అది తెలియదని భావం కాదు.

అయితే ఈ వాక్యభాగం అంతటిలో అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే యేసును ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు రాబోతున్నాడో తెలియదు గనుక అప్రమత్తంగా, మెలకువగా ఉండాలి. ఈ లోకంలో దినదినము ఎన్ని శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ, యేసు రెండవసారి తిరిగి రానైయున్నాడు అనే నిరీక్షణ విశ్వాసులకు ఉన్నది అన్న సత్యాన్ని మర్చిపోకూడదు.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.