Does God give Spirit by measure? (John 4:34)
ఆత్మకు బైబిల్ ఇచ్చే నిర్వచనం తెలియకపోతే పై వచనంలోని మాటలు అర్థం చేసుకోవడం సాధ్యంకాదు. పరిశుద్ధాత్మను బైబిల్ ఒక వ్యక్తిగా నిర్వచిస్తుంది. ఒక వ్యక్తిగానే సంబోధిస్తుంది. “ఆయన”, “తాను” అనే వ్యక్తిగత సర్వనామాలు బైబిల్లో ఆయనకు బహుస్పష్టంగా ఆపాదించబడ్డాయి. యోహాను 14:16-17,26, యోహాను 15:26, యోహాను 16:7 రోమా 8:26. ఒక వ్యక్తి కొలత చొప్పున ఇవ్వబడడమనేది అక్షరార్థంలో సాధ్యపడదు. కాబట్టి, యేసుకు పరిశుద్ధాత్మ కొలత లేకుండా అనుగ్రహించబడ్డాడనే మాట ఏ భావంలో చెప్పబడిందో పరిశీలించడం ఉత్తమం.
పరశుద్దాత్మ వరాలు అందరికీ ఒకే పరిమాణంలో ఇవ్వబడవనీ, సంఘంలో పరిచర్యావసరతను బట్టి ఒకొక్కరికి వేరు-వేరు వరాలు ప్రసాదించబడతాయనీ బైబిల్ బోధిస్తుంది (1కొరింథీ 12:4-11). ఆయన చిత్తానుసారంగా కొందరికి ఎక్కువ మరికొందరికి తక్కువ వరాల్ని అనుగ్రహిస్తాడు. ఒకే శరీరంలోని వేరు వేరు అవయవాలకు వేరు వేరు పరిచర్యలు అప్పగించబడ్డాయి. కొందరికి కొన్ని వరాలు, ఇంకొందరికి ఇంకొన్ని వరాలు అనుగ్రహించబడినప్పటికీ, ఒకే శరీరావయవాలు కాబట్టి వారందరూ సమానమే. ఐతే, క్రీస్తుకు తండ్రి పరిశుద్దాత్మను ఎలాంటి పరిమితులు లేకుండా సమస్త వరాల సర్వపరిపూర్ణతలో అనుగ్రహించాడు. అందుకే, “కొలత లేకుండా” అనే అలంకారం ఇక్కడ వాడబడిందే తప్ప అక్షరార్థంలో ఆత్మకు కొలతలు కొలమానాలు ఉంటాయని భావం కాదు.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.