ప్రశ్నోత్తరాలు

How to understand the words 'God rested on the seventh day'? (Genesis 2:2)

 ముందుగా దేవుడి గురించి బైబిల్లో ఏం రాయబడిందో చూడండి.

యెషయా 40:28
నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.

ఈ మాటల ప్రకారం నిత్యుడైన బైబిలు దేవుడు అలయడు, సొమ్మసిల్లడు. మరి ఆయన ఏడవ దినాన ఎందుకు విశ్రమించినట్టు? దీని భావమేంటో ఆ మాటలు రాయబడిన సందర్భంలోనే ఉంది చూడండి.

ఆదికాండము 2:1-3
"ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను". దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా "సంపూర్తిచేసి", తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించినట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.

ఈ మాటల ప్రకారం, ఏడవరోజు దేవుడు విశ్రమించెను అంటే, ఆయన ఆరురోజుల్లో ఏ సృష్టిని చేయాలనుకున్నాడో దానిని పూర్తి చేసి ఏడవరోజు ఎలాంటి నూతన సృష్టీ చేయకుండా ఉన్నాడని అర్థం. అంతే తప్ప అలసిపోయి విశ్రాంతి తీసుకున్నాడని కాదు. ఏడవ దినం కూడా ఆయన అంతకుముందు ఆరురోజులూ చేసిన సృష్టిని నిర్వహిస్తూనే ఉన్నాడు‌ (హెబ్రీ 1:3). ఉదాహరణకు ఆ ఏడవరోజు భూమిపై విత్తనాలు మొలకెత్తడం, ఇవన్నీ ఆయన చేసిన సృష్టి నుండి ప్రతిసృష్టి జరిగేలా నిర్వహించడమే.

1కోరింథీయులకు 15:38
అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు.

కాబట్టి బైబిలు దేవుడేమీ ఏడవ దినాన అలసిపోయి విశ్రమించలేదు‌. ఆయన ఆరు రోజుల్లో ఈ సృష్టిని చేయాలి అనుకున్నాడు. అది ఆ ఆరుదినాల్లోనూ పూర్తిచేసి ఏడవరోజు నూతనసృష్టి ఏమీ చెయ్యకుండా విశ్రమించాడు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.